గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాలు రద్దు : హైకోర్టు

 

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 10న ప్రకటించిన మెయిన్స్ ఫలితాలు ఆధారంగా  జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను కోర్టు రద్దు చేసింది. మళ్లీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఉన్నత న్యాయస్థానం  ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని తెలిపింది. అందులో క్వాలిపై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది. 

ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సంజయ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.

గ్రూప్‌-1 వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జులై 7న న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu