మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు

ఆపరేషన్‌ కగార్‌ మావోయిస్టు పార్టీకి తేరుకోలేని దెబ్బ కొట్టింది. కొడుతోంది. అర్ధ శతాబ్దపు చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్, లీడర్ కకావిలకమౌతోంది.  వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన కీలక నేతలు లొంగు బాట పడుతున్నారు.  ఒకరి తర్వాత ఒకరుగా  మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో లొంగిపోయారు.  రో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న లొంగుబాట పట్టారు.  తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్  దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్ర‌భాత్‌ అలియాస్ బీపీ లొంగిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్..   అనారోగ్య సమస్యలతో పోలీసులకు లొంగిపోయినట్లు చెబుతున్నారు.   ఇక మావోయిస్టుగా బండి ప్రకాష్ ప్రస్థానం చూస్తే..

బండి ప్ర‌కాష్‌ మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రి గ్రామానికి చెందిన వారు. ఆయ‌న తండ్రి రామారావు  సింగ‌రేణి కార్మికుడే. ప్రకాష్ 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో   నిందితుడు కావడంతో పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్ సబ్ జైలు త‌ర‌లించారు. అయితే మావోయిస్టు నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి ప్రకాష్ సబ్ జైలు నుంచి తప్పించు కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.  అప్ప‌టి నుంచి బండి ప్రకాష్ అజ్ఞాతంలోనే గ‌డిపారు. ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా బండి ప్రకాష్ పేరు వినిపించేది.   పలుమార్లు ఆయన ఎన్ కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టు పార్టీ బండి ప్రకాష్ కు   సింగరేణి కార్మిక సమాఖ్య పునరుద్ధరణ బాధ్యతను అప్పగించింది. దీంతో ఆయన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)   పునరుద్దరించడం కోసం రిక్రూట్ మెంట్ సైతం చేపట్టారు.  పోలీసుల ఎన్ కౌంటర్ల కారణంగా ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అయితే మంచిర్యాల జిల్లా లో జరుగు తున్న పరిణామాలపై సికాస పేరుతో లేఖలు విడుదల చేయడం ద్వారా ఆయన సికాస ఉనికిని కాపాడారని అంటారు. 

ఇక పోతే వైఎస్  రాజశేఖరరెడ్డి  హయాం లో మావోయిస్టుల తో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బండి ప్రకాష్ ప్రకాష్ అధ్యక్షత వహించాడు. అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాష్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. 
ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి కార్మిక స‌మాఖ్య ఒక వెలుగు వెలిగింది. సింగ‌రేణిలో కార్మికులు ఎన్నో హ‌క్కులు సాధించ‌డంలో బండి ప్ర‌కాష్ ది కీల‌క‌పాత్ర‌.   దాదాపు 41 ఏళ్ల కిందట అజ్ణాతంలోకి వెళ్లిన బండి ప్రకాష్ పై   పై తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. బండిప్రకాష్    పేర్లతో

Online Jyotish
Tone Academy
KidsOne Telugu