వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కద్దు.. యూట్యూబర్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
posted on Oct 16, 2025 5:16PM

యూట్యూబర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యూస్ కోసం చిన్నారుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి వీడియోలు చేస్తే సహించేది లేదని హచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యూస్, లైక్ లతో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చిన్నారుల భవిష్య త్తును పణంగా పెట్టడం సమంజసం కాదంటూ పోస్టు చేశారు. చిన్నారులతో అసభ్యకర మైన కంటెంట్ చేస్తూ సభ్య సమా జానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయాలంటూ హితబోధ చేశారు. అందుకు భిన్నంగా చిన్నారులతో అసభ్య కంటెంట్ వీడియోలు చేసి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి చిన్నారు ల యువతను పెడ దోవ పట్టించొద్దని హెచ్చరించారు. . అటువంటి వీడియోలు బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, చట్ట రీత్యా నేరం కూడా అని పేర్కొన్న ఆయన ఇటువంటివి పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు.
మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి వారిపై తక్షణమే వీటిని తొలగించకుంటే.. లేదంటే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే భవిష్యత్ లో ఎవరైనా సరే ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
సోషల్ మీడియాలో ఇలాంటి వీడి యోలపై స్థానిక పోలీసులతో సమాచారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోస్టల్ cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచి.. సానుకూల వాతావరణం కల్పించి సరైన పద్ధతిలో విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.