ప్రభుత్వ ఉద్యోగాలకూ ఐటీ అర్హత.. పదోన్నతులకు పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు ఐటీపై అవగాహన అర్హతగా మార్చనుంది. పదోన్నతి పొందాలంటే ఆన్ లైన్, ఆప్ లైన్ లలో అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి తీరాల్సిందే. అంటే ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వోద్యోగులు పదోన్నతి పొందాలంటే.. తమ అర్హతలు అప్ గ్రేడ్ చేసుకోవలసిందే.

అంతే కాదు కొత్తగా ఉద్యోగాల నియామకాలలోనూ ఐటీ స్కిల్స్ ను కనీస అర్హతగా పరిగణించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పారు. ఉద్యోగాలలో చేరిన తరువాత వారికి శిక్షణ ఇవ్వడం కంటే ముందుగానే వారికి ఐటీపై కనీస అవగాహన తప్పని సరి చేయడం బెటరని ఆయన  అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu