అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఈ సారి చర్చిలో
posted on Sep 29, 2025 10:08AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిషిగాన్ లోని గ్రాండ్ బ్లాంక్ లో ఆదివారం (సెప్టెంబర్ 28)న ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కారులో నేరుగా చర్చిలోకి దూసుకొచ్చి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో తొమ్మండుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పులలో నిందితుడు కూడా హతమయ్యాడు. కాగా దుండగులు కాల్పులు జరిపిన అనంతరం చర్చికి నిప్పుపెట్టాడు. దీంతో చర్చిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు.