ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా సంబరాలు.. ఎందుకంటే?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో దాయాది దేశాన్ని టీమ్ ఇండియా మూడు సార్లు మట్టి కరిపించింది. కాగా ఈ టోర్నీ మొత్తం పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కనీస క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించకుండా పాకిస్థాన్ జట్టు,  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ వ్యవహరించిన   తీరు పట్ల క్రీడా పండితులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్ అయితే.. పాక్ జట్టు గెలవడం మరిచిపోయిందన్నారు. 

అదలా ఉంచితే ఇండియాపై ఒక్క టోర్నీలోనే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన పాకిస్థాన్.. ఫైనల్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ప్రజంటేషన్ సెర్మనీలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ రన్నరప్ గా నిలిచినందుకు అందించిన చెక్ ను తీసుకున్న వెంటనే పక్కకు విసిరేశాడు.  అంతకు ముందు మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ సెర్మనీకి చాలా చాలా జాప్యం జరిగింది. ఇందుకు కారణం పాకిస్థాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ చేతుల మీదుగా ఆసియా కప్ టోర్నీ విజేతలకు ట్రోఫీ అందజేయాలని ఐసీపీ తీసుకున్న నిర్ణయం.

అయితే భారత్. పాకిస్థాన్ జట్ల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని విషయాన్ని ప్రస్తావిస్తూ టీమ్ ఇండియా పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేమని నిర్వాహకులకు ముందుగానే తెలియజేసింది. ఈ విషయమై చర్చోపచర్చలు జరగడంతో ప్రజంటేషన్ సెర్మనీకి మ్యాచ్ పూర్తియిన తరువాత గంటకు పైగా సమయం పట్టింది. చివరకు ప్రజంటేషన్ సెర్మనీకి పీసీబీ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వేదికమీదకు వచ్చారు.  

సరే దీనికి ప్రతిగా భారత్ కూడా దీటుగా స్పందించింది. పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. దీంతో ఆయన అలిగారు. ట్రోఫీతో సహా వేదికపై నుంచి వెళ్లిపోయారు. అయినా టీమ్ ఇండియా ఖాతరు చేయలేదు. ట్రోఫీ చేతులో లేకుండానే సంబరాలు చేసుకుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu