గుజరాత్‌లో రోప్‌వే తెగి ఆరుగురు మృతి

 

గుజరాత్‌లోని పావ్‌గఢ్‌లో ఘోరప్రమాదం జరిగింది. రోప్ వే తెగి ఆరుగురు మృతి చెందారు. ప్రసిద్ధ శక్తిపీఠం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కార్మికులు సామాగ్రిని తరలిస్తుండగా రోప్‌వే తాడు తెగిపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కాగా.. ఆ ప్రాంతంలో కాళీదేవి ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి యాత్రికులు చేరుకోవాలంటే 2000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే కేబుల్ కార్లను ఉపయోగించుకోవాలి. శనివారం రోప్ వే రూట్ ను వాడేందుకు ప్రతికూల వాతావరణం ఉండటంతో ఉదయం నుంచి మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ రోప్ వే రూట్ వాడకంలో ఉండి ఉంటే.. భక్తులు ప్రమాదంలో చిక్కుకునే వారని, మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందని స్ధానికులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu