పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ మణికంఠ

 

చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఎస్పీ  వి.ఎన్. మణికంఠ చందోలు సందర్శించి, శిక్షణా కేంద్రంలోని వివిధ సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖకు కొత్త శక్తిని అందించబోయే రిక్రూట్ల శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలలో తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

 మొదటగా ఎస్పీ  బ్యారక్స్ విభాగాన్ని పరిశీలించారు. రిక్రూట్లు నివసించే వసతి గదులు పరిశుభ్రంగా, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు. మంచాలు, మెత్తలు, దుప్పట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. తరువాత బాత్రూములు, టాయిలెట్లు పరిశీలించి, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు.

 డైనింగ్ హాల్ పరిశీలనలో ఎస్పీ ఒకేసారి వందలాది మంది భోజనం చేయగల సదుపాయం ఉందో లేదో తనిఖీ చేశారు. రిక్రూట్ల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడంపై అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు.

 తరువాత కిచెన్ బ్లాక్‌ను పూర్తిగా పరిశీలించారు. ఫ్రిజ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా, వంట పాత్రలు శుభ్రంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. తాగునీటి సదుపాయం సమృద్ధిగా ఉండాలని, నీటిని శుద్ధి చేసి అందించాలని ఆదేశించారు. కిచెన్ వెనుకభాగం పరిశీలించి, చెత్త నిల్వ కాకుండా వ్యర్థాలను సరైన విధంగా పారబోసే విధానం అమలు చేయాలని సూచించారు.

అదే విధంగా, రిక్రూట్ల ఆరోగ్యం దృష్ట్యా వైద్య బృందం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. శిక్షణా కేంద్రంలో సీసీ కెమెరా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. MTO చంద్రశేఖర్ మరియు డి.టి.సి. సిబ్బంది పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu