ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దుకూడు

 

ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సహా నలుగురిపై న్యాయ విచారణకు ఏసీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓ లను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ అనుమతి కొరకై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందుకు  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, గవర్నర్ అనుమతి అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

ఫార్ములా ఈ కారు రేస్ లో అవకతవకలు జరిగి నట్లుగా సమాచారం రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై తొమ్మిది నెలల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ తో పాటు అర్వింద్ కుమార్ ను కూడా విచారించి వారి స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ కారు రేస్  స్పాన్సర్షిప్  చేసిన సంస్థల నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి  రూ. 44 కోట్ల రూపాయల ఎలక్షన్ బ్రాండ్స్ లాభం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

ఈ విధంగా  క్విడ్ ప్రో కో  జరిగినట్టుగా  ఏసిబి అధికారులు నిర్ధారించారు. ఏసీబీ అధికారులు 9 నెలల పాటు ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి  నివేదిక సమర్పించారు. గత కేబినేట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో 19 డిసెంబర్‌ 2024న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ.54.88 కోట్లకుపైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu