మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టిన నిరసనకారులు
posted on Sep 9, 2025 7:31PM

నేపాల్ మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. చైనా సానుభూతిపరుడైనా ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు.
మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటిని ముట్టడించారు. ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు.