కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
posted on Sep 9, 2025 5:46PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల తెలంగాణలో భారీ వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదకను నిర్మాలా సీతారామన్‌కు అందజేశారు.
విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన తెలంగాణకు వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చలు జరిపారు.సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.