యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఈడీ నోటీసులు
posted on Sep 16, 2025 4:49PM

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు సినీ నటుడు సోనూ సూద్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.
యువరాజ్ సింగ్ తరచుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అతడిని ఈనెల 22న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ ేసింది. అలాగే ఇదే విషయంలో మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను సెప్టెంబర్ 23న విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలువురు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు విచారణలో నిర్ధారించుకున్న ఈడీ ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ లను విచారించిన సంగతి తెలిసిందే. అలాగు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులను కూడా ఈడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో విచారించింది.