టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్

 

భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి  తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ముందుకు వచ్చింది. ఈ కొత్త ఒప్పందం ద్వారా అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.5 కోట్లు చెల్లించనుంది. 

గతంలో డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. దానితో పోలిస్తే బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం రానుంది. టీమిండియాకు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌లు ఉన్నందున, ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా అపోలో టైర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం లభించనుంది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో కుదిరిన అత్యంత విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu