పేదల తలరాతను మార్చేది చదువు ఒక్కటే : సీఎం రేవంత్‌

 

తెలంగాణ రాష్ట్రానికి నూతన విద్యా విధానం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లో శిల్పకళా వేదికలో గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. ప్త్రెవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటె నాణ్యమైన విద్యా అందిస్తామని ప్రతిజ్ఞ చెేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. గత పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీచర్ల నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయంలో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్‌.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 

‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్‌ పాయిజన్‌ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. విద్యలో మనం ప్రపంచంతోనే పోటీ పడేలా పాఠశాలను తీర్చిదిద్దాలని సూచించారు. 

95 శాతం మంది మంచి టీచర్లు ఉంటే 5 శాతం మంది చెడ్డవాళ్ల ఉంటారని వాళ్ల వల్లే మొత్తం శాఖకు పేరు వస్తుందన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu