నిమజ్జనానికి సర్వం సిద్ధం : సీపీ ఆనంద్

 

 

హైదరాబాద్‌లో  రేపు జరగబోయే గణేష్ నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.. అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని సిపి అన్నారు... ఈ నిమజ్జనం సమయంలో మొత్తం 30 వేల మంది పోలీసులు షిఫ్ట్ లో ఉన్నారు. 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. అదనంగా 250 సీసీ కెమెరాలు కొన్నాం. ఆరు డ్రోన్స్ తో గణేష్ నిమజ్జనం పర్యవేక్షిస్తామని సిపి అన్నారు. 40 గంటల పాటు వినా యకుని నిమజ్జనం సాగబోతుంది. రేపు ఒక ట్యాంక్ బండ్ లోనే 50వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. 

నిన్న చత్రినాకలో ఓ ఘటన జరిగింది. విగ్రహం ఎత్తుగా ఉండడం వల్ల కరెంటు వైర్ కు తగలకుండా ఉండేలా సుమారు 6 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది... అయితే ఎత్తుగా ఉండే వినాయకులను తీసుకువచ్చే సమయంలో కరెంటు వైర్లను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే లకు అనుమతి లేదు. గత సంవ త్సరం డీజే కారణం గా చాలామంది చనిపోయారు. డిజే వైబ్రేషన్స్ వల్ల యువకుల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా డీజే వద్దంటే ఒప్పుకుంది. ఇందులో మతం అనే అంశమే లేదు. పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తు న్నామని సిపి అన్నారు... ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అయి పోయేలా చూస్తా మని అన్నారు.... సౌత్ జోన్ విగ్రహాల తరలింపు మాకు అత్యంత ప్రాధాన్యత... ప్రతి ఒక్కరు నిదానంగా గణేష్ నిమజ్జనం చేసి... సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్ విజ్ఞప్తి చేశారు....మరోవైపు మైట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్థరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu