కడప కార్పొరేషన్ తెలుగుదేశం వశం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో తెలుగుదేశం జెండా ఎగరేసింది. కడప కార్పొరేషన్ తెలుగుదేశం వశమవ్వడం ఖాయమైంది.  గ‌త   కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ కడప పీఠం దక్కించుకుంది.  ఆ పార్టీకి చెందిన సురేష్ బాబును మేయర్ గా ఎంపకయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైంది. అధికారం కోల్పోయింది.

దీంతో మేయర్ పీఠాన్ని అడ్డుపెట్టుకుని  సురేష్ బాబు చేసిన అక్ర‌మాలపై  టీడీపీ కార్పొరేట‌ర్లు  చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగింది.  కార్పొరేష‌న్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నుల‌ను బినామీల రూపంలో త‌న కుటుంబానికి చెందిన కాంట్రాక్టు  సంస్థ‌ల‌కు సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన మాట వాస్తవమేనని తేలింది. దీంతో మేయర్ పదవి నుంచి సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది. అయితే త‌న‌ను మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డాన్నిసవాల్ చేస్తూ సురేష్ బాబు కోర్టుకు వెళ్లారు. అదలా ఉంటే.. కొత్త మేయర్ ఎన్నికకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ మేరకు గురువారం (డిసెంబర్ 11) మేయర్ ఎన్నిక జరగనుంది.  

దీంతో మళ్లీ సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. తన తొలగింపుపై దాఖలు చేసుకున్న  పిటిషన్ విచారణలో ఉండగానే కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేశారు. ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికకు ఇచ్చిన నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. దంతో మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కడప మేయర్ పదవి తెలుగుదేశం పార్టీకి పక్కా అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీంతో కడప చరిత్రలో తొలి సారిగా కడప మేయర్ పీఠం తెలుగుదేశం దక్కించుకోనుంది. ఇప్పటికే జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. కడపలో వైసీపీ ప్రభ మసకబారిందనడానికి ఈ పరాజయాలే నిదర్శనమంటున్నారు పరిశీలకులు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu