పవన్ కళ్యాణ్ కు కూడా అదే ప్రాబ్లమ్
posted on Jul 24, 2013 @ 6:39PM
టాలీవుడ్ లో టైటిల్ వివాదాలు కామన్ అయిపోయాయి.. గతంలో చాలా మంది హీరొల సినిమాలకు తలెత్తిన టైటిల్ సమస్య ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా తప్పడం లేదు.. తాజాగా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నాడు టాలీవుడ్ పవర్ స్టార్..
దాదాపు ఫుష్కర కాలం పాటు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని పవర్ స్టార్ కు ఆ లోటు తీర్చిన సినిమా గబ్బర్ సింగ్. అందుకే ఆ సినిమా రిలీజ్ దగ్గర నుంచి గబ్బర్ సింగ్ సీక్వల్ పై కూడా చాలా వార్తలు వచ్చాయి.అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ గబ్బర్ సింగ్ 2 ను ఎనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తానని ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని చెప్పాడు.. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య..
గబ్బర్ సింగ్ సినిమాతో సౌత్ లో సక్సెస్ సాదించటమే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు పవన్.. దీంతో గబ్బర్ సింగ్ అనే పేరు మీద అన్ని హక్కులు మావేనంటూ షోలే సినిమా నిర్మాతలు గోల చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు గాని అంత సక్సెస్ సాదించినప్పుడు గాని మాట్లాడని షోలో చిత్ర యూనిట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది..
ప్రస్థుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అత్తారింటికి దారేది సినిమా పనిలో ఉన్న పవన్ ఆ సినిమా పూర్తి కాగానే గబ్బర్ సింగ్ సీక్వల్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు.. మరి ఈ లోపు టైటిల్ సమస్య ఓ కొలికి వస్తుందంటున్నారు అభిమానులు..