'అత్తారింటికి దారేది' పైరసీ: పవన్ అభిమానుల ఆగ్రహం

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ కాకముందే బయటకి లీక్ అవడంతో ఆయన అభిమానులు షాక్ గురిచేసింది. దీనికి కారకులైన వారిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఓ సీడీ షాపుపై దాడి సీడీలనూ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా విజయవాడ నగరంలోని అనుమానిత సీడీ షాపులపై దాడి చేసి కంప్యూటర్లు, లాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.     ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతూ...పవర్ స్టార్ దెబ్బ తీయడానికే కావాలని ఈ సినిమాను ఎవరో బయటకు లీక్ చేశారని ఆరోపించారు. ఎలాంటి ఎన్ని కుట్రలు చేసిన పవర్ స్టార్ ని ఎవరూ తోక్కలేరని అభిమానులు అన్నారు. పవర్ స్టార్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా పెడనలో 'అత్తారింటికి దారేది'  పైరసీ సీడీ మార్కెట్లో లభ్యమయిన విషయం తెలిసిందే. 

నితిన్ కోరిక తీర్చిన దర్శకుడు...?

  నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "హార్ట్ ఎటాక్" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే నితిన్ నటించిన "ఇష్క్", "గుండె జారి గల్లంతయ్యిందే" చిత్రాలతో తనకు హిట్ ను అందించిన నిత్యా మీనన్ ను కూడా ఈ చిత్రంలో తీసుకోవాలని నితిన్ మొదటి నుండి పూరిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా నితిన్ కోరికను పూరి ఒప్పుకొని, నిత్యాను కుడా ఈ చిత్రంలో ఎంపిక చేసుకున్నారట. నిత్యా కూడా వెంటనే ఒప్పెసుకుందని తెలిసింది. కానీ ఈ చిత్రంలో నిత్య పాత్ర ఏమిటనేది సినిమా విడుదలయ్యేవరకు సీక్రెట్ గా ఉంచనున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.

వందేళ్ల సినిమా వేడుకలో తెలుగువారికి అవమానం

      భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకలో సాయంత్రం ప్రముఖనటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి చాలా ఉద్వేగంగా మాట్లాడారు.    ''ఎంతో గౌరవంగా, పద్దతిగా జరుపుకోవలసిన ఈ వేడుకను ఇలా ఐటెం సాంగ్స్‌తో చాలా చీప్‌గా నిర్వహిస్తున్నారు. ఇది చూడటానికి వందేళ్ళ వేడుకలా లేదు... ఇదేదో సినిమా ఆడియో వేడుకలా వుంది. ఈ వేడుకలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె. విశ్వనాద్, రాఘవేంద్రరావు, రామానాయుడు వంటి చిత్ర ప్రముఖులు ఎందరో వుండగా వారికి కాకుండా తమిళ దర్శకుడు బాలచందర్‌కు అగ్రస్థానం ఇచ్చి సన్మానించటం నిజంగా మన దౌర్భాగ్యం. బాలచందర్ గొప్ప మేధావే కానీ...మనవారిని కూడా మనం గౌరవించుకునే సంస్కారం మనకు వుండాలి కదా'' అంటూ ఆవేశంగా ప్రసంగించారు. అయితే ఆయన అన్న మాటలకు ఖంగుతిన్న అక్కడే ఉన్న దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ వెంటనే వేదికపైకి వచ్చి, నారాయణమూర్తి చేతిలో వున్న మైకు లాగేసుకుని, ఆయనకు మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బలవంతంగా కిందికి పంపేశారు.

ప‌వ‌న్‌తో సినిమా చేస్తా

  ఇన్నాళ్లు చిన్న సినిమాల‌తో సెన్సేష‌న్ సృష్టించిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఇన్నాళ్లు బూతును మాత్రమే న‌మ్ముకొని సినిమాలు చేసిన మారుతి ఈ మ‌ధ్యే ట్రెండ్ మార్చి కాస్త క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్నాడు. త‌న‌కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయితే లేవు గాని డ్రీమ్ హీరో ఉన్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. అత‌ను ఒప్పుకుంటే అవ‌కాశం ఇస్తే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌నుంద‌ని ప్రక‌టించాడు. అయితే రామ్‌గోపాల్ వ‌ర్మ లాంటి స్టార్ డైరెక్టర్లే ప‌వ‌న్ సినిమా చేయలేమని తేల్చేస్తుంటే, మారుతి మాత్రం అవ‌కాశం ఇస్తే ప‌వ‌న్‌తో స‌క్సెస్ ఫుల్ సినిమా చేస్తానంటున్నాడు. మ‌రి మారుతికి ప‌వ‌న్ డేట్స్ ఇస్తాడా.. చూడాలి మ‌రి

హాలీవుడ్‌లో ఆర్‌పి సినిమా

  శ్రీను వాసంతి ల‌క్ష్మీ, బ్రోక‌ర్ సినిమాల‌తో న‌టునిగా ద‌ర్శకునిగా కూడా మంచి పేరుతెచ్చుకున్న సంగీత ద‌ర్శకుడు ఆర్ పి ప‌ట్నాయ‌క్‌. తెలుగుతో సంగీత ద‌ర్శక‌త్వంతో పాటు న‌టునిగా, ద‌ర్శకునిగా కూడా ఘ‌న విజ‌యాలు సాదించిన ఆర్‌పి ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆర్ పి హాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఎమీ షూటింగ్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుంది. టిపి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకం పై ప్రసాద్ కూనిశెట్టి, ర‌మేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ సినిమాల‌లా థియేట‌ర్లలో రిలీజ్ చేయ‌కుండా విఓడి ద్వారా విడుద‌ల చేయనున్నారు. అక్టోబ‌ర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను వీడియో ఆన్ డిమాండ్ ద్వారా ఇంట‌ర్‌నెట్‌లొ రిలీజ్ చేస్తున్నారు. ద‌ర్శక నిర్మాత‌లు త‌ప్ప మిగ‌తా అంతా హాలీవుడ్ వారే ప‌ని చేసిన ఈ సినిమా అమీష్ తెగ‌కు సంభందించిన క‌థ‌. మాన‌వ స‌మాజానికి దూరంగా బ‌తికే ఈ తెగ‌కు సంబందించిన ఎమి అనే అమ్మాయి జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను సినిమాగా తెర‌కెక్కించారు ఆర్ పి ప‌ట్నాయ‌క్‌. టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్న ఆర్‌పి హాలీవుడ్ ప్రేక్షకుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

మహేష్ "ఆగడు"కు ముహూర్తం ఖరారు

  మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రం"ఆగడు". ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 16న ముహూర్తం షాట్‌తో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని"దూకుడు"ని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడని తెలిసింది. మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

బాలకృష్ణకు రెండో భామ దొరికింది

  బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "లెజెండ్" అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే సోనాల్ చౌహాన్ ను ఎంపిక కాగా, మరో హీరోయిన్ గా రాధికా ఆప్టే ను ఎంపిక చేసారు. "రక్తచరిత్ర", "ధోని" వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలోనే "లెజెండ్" చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నటసామ్రాట్‌ పుట్టినరోజు

      తెలుగు సినీ రంగంలో పరిచయాలే అక్కర్లేని ఒకే ఒక పేరు...అక్కినేని నాగేశ్వరరావు. 90 వసంతాల ఈ దసరాబుల్లోడు..తన 75 ఏళ్ల నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ నిత్య వసంతుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నటసామ్రాట్‌ సినీ గమనాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..   1940లో ధర్మపత్ని చిత్రంతో తెరంగేట్రం చేశారు..ఏ‍యన్‌ఆర్. ఆయన 1944లో విడుదలైన `శ్రీ సీతారామజననం` చిత్రంతో కథానాయకుడిగా మారారు. దాదాపు 260 చిత్రాలలో మనల్ని అలరించిన ఆయన ఇంకా నటిస్తూనే ఉండటం మన అదృష్టమనే చెప్పాలి. ఇటీవల ఆయన బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం చిత్రంలో వాల్మీకి పాత్ర పోషించగా, అక్కినేని మూడు తరాలు కలిసి చేస్తున్న మనం సినిమాలో నటిస్తున్నారు. ఏయన్ఆర్ సినిమాలు ...వసంతానికి కేరాఫ్ అడ్రస్సుల్లా అనిపిస్తాయి. ఆయన డైలాగ్స్, ఎక్స్‌ ప్రెషన్స్, స్టెప్స్ ...అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన ప్రతీ చిత్రం మనసును మంత్రిస్తుంది. ఒక దేవదాసు...ఒక ప్రేమాభిషేకం ..ఇలా చెప్పుకుంటూ పోతే అక్కినేని నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి....ఉంటాయి. ఎవరినైనా ప్రేమించాలంటే ..ఏయన్‌ఆర్ సినిమాలు చూడాలి...ప్రేమలో విజేత కావాలనుకుంటే ...అక్కినేని చిత్రాలే చూడాలి. ..ప్రేమలో ఓడాలన్నా...అక్కినేని సినిమాలే వాచ్ చేయాలి. ...ఎందుకంటే తెలుగు సినిమా ప్రేమ గురువు మన ఏయన్‌ఆర్. వెండితెరకు బంగారు మెరుగులు దిద్దిన మహానటుడు ఏయన్‌ఆర్. ఆయన నడిచే ఒక నటవిశ్వరూపం. ప్రతీ పాత్ర పోషణలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ..ఇన్నాళ్ల నట ప్రస్థానంలో ఆయన ప్రతీ నిమిషం పాటించే క్రమ శిక్షణ ..వృత్తిపరమైన ప్రేమ...ఆయన్ను మహోన్నత సినీ శిఖరంలా నిలబెట్టాయి. పద్మవిభూషణ్‌తో ఆయన అవార్డుల పరంపర ఆగదు...అది నిరంతర ప్రవాహంలా అలా సాగుతూ ఇంకా ఎన్నో విశిష్ఠ పురస్కారాలను అక్కినేనికి అందిస్తుంది.   అక్కినేని సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని...గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని ..నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని జీవిస్తూనే ఉంటారు. నటుడిగా...నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఒక నటుడిగా ఎదిగి..ఒక మనిషిగా ఒదిగి...ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు...అక్కినేని. రొమాంటిక్ కింగ్...ట్రాజెడీ కింగ్ ..నట సమ్రాట్‌ ..ఇలా ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి. 1980లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని...దానికి ముందే పద్మశ్రీ...ఆ తర్వాత పద్మభూషణ్ ..అటు తర్వాత దాదా ఫాల్కే... పద్మవిభూషణ్ ..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ అవార్డును అందుకున్నారు...మన అక్కినేని, 90 ఏళ్ల వయసులో కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తున్న అక్కినేని మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగువన్‌ తరుపున మరోసారి ఆ నటసామ్రాట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

"మనం" ఫస్ట్ లుక్

  అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న చిత్రం "మనం". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతంకు పైగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. చిన్న పిల్లాడి వేషంలో అక్కినేని నాగేశ్వరరావు, పెద్దాయన వయసులో నాగచైతన్యలు కనిపిస్తుండగా, నాగార్జున క్లాస్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ, చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆట, పాటలకు సిద్ధమైన రామయ్యా

  యంగ్ టైగర్ ఎన్టీఅర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. యూత్ కు కిక్కేకించే పాత్రలో అదరగొట్టడానికి వస్తున్నా ఈ చిత్రంలో ఎన్టీఅర్ సరసన సమంత, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సూపర్ హిట్టయ్యింది. ఎన్టీఅర్ అభిమానులకు ఇదో పెద్ద పండగలా మారనున్న ఈ చిత్రంపై రోజు రోజుకి ఆశలు రెట్టింపు అవుతున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.

కండిషన్లు పెట్టి లొల్లి చేస్తుందట...!

  ఎన్‌.టి.ఆర్‌. హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రభస".సమంత హీరోయిన్. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళీ నటి నజ్రియాను ఎంపిక చేశారు. అయితే ఇటీవలే ఈ అమ్మడిపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. అయితే ఈ అమ్మడు షూటింగ్‌లో మాత్రం పలు కండిషన్లు పెడుతుందట. తనను ఎక్స్‌పోజింగ్‌ చేసినట్లుగా చూపించినా అంగీకరించననీ, క్లోజ్‌ షాట్స్‌లో నడుము, బొడ్డు వంటి వాటిని చూపించకూడదని షరతులు పెడుతూ యూనిట్ సభ్యులను ముప్పుతిప్పలు పెడుతుందట. మరి ఈ చిత్రం పూర్తయ్యే సరికి ఇంకా ఎలాంటి రభస చేస్తుందో ఈ అమ్మడు అని యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆటోనగర్‌ నిర్మాతతొ చైతు

  తడాఖ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన నాగాచైతన్య ప్రస్థుతం అక్కినేని ఫ్యామిలీ చేస్తున్న మల్టీ స్టారర్‌ మూవీ మనం సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తప్ప ఇంతవరకు సోలో హీరోగా ఒక్క సినిమా కూడా స్టార్ట్‌ చేయలేదు చైతు. అయితే ఇప్పుడు ఓ రిస్కీ  ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడట ఈ యంగ్ హీరో. ఢమరుకం, అటోనగర్‌ సూర్య సినిమాల రిలీజ్‌ విషయంలో చాలా డిలే చేసిన వెంకట్‌ నిర్మాతగా మరో సినిమా ఓకే చేశాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఢమరుకం సినిమాను ఆలస్యంగా రిలీజ్‌ చేయడంతో పాటు అటోనగర్‌ సూర్యను ఇంతవరకు రిలీజ్‌ చేయని అదే నిర్మాతతో చైతు మరో సినిమా ఎలా ఓకె చేశాడాని ఆశ్చర్యపోతున్నారు. యువత, సోలో లాంటి కూల్‌ హిట్స్‌ అందించిన పరుశురాం డైరెక్షన్‌లో నాగచైతన్య శూన్యం అనే సినిమాలో నటించనున్నాడట. అయితే ఈసినిమాను ఆర్‌ ఆర్‌ మూవీమూకర్స్‌ బ్యానర్‌పై కాకుండా కేవలం వెంకట్‌ మాత్రమే సొంతంగా నిర్మించనున్నడాట. ఏది ఏమైనా వరుసగా అక్కినేని ఫ్యామిలీకి రెండు షాక్‌లు ఇచ్చిన నిర్మాతతో చైతు మరో సినిమా ఒప్పుకోవటం పెద్ద సాహసమే.

స్పీడు పెంచిన రవితేజ

  ఇన్నాళ్లు ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఇప్పుడ స్పీడు పెంచాడు. బలుపు సక్సెస్‌తో జోరు మీదున్న రవితేజ ఇప్పుడ వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు స్క్రీప్ట్‌ విషయంలో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటున్నాడు రవితేజ. బలుపు సినిమా తరువాత కాస్త గ్యాప్‌ తీసుకున్న మాస్‌ మహారాజ్‌ ఇప్పుడిప్పుడే సినిమాలు ఒకే చేస్తున్నాడు. బలుపు సినిమాకు కథ రచయిత అయిన బాబి డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాను ఒకే చేశాడు. వైవియస్‌ చౌదరి నిర్మిస్తున్న ఈసినిమా ఈ నెలఖరునుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. దీనితో పాటు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత బండ్లగణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ఈ సినిమాకు వీరభద్రం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్థుతం నాగార్జునతో భాయ్‌ సినిమా చేస్తున్న వీరభద్రంతో రవితేజ కోసం ఓ మంచి  మాస్‌ మాసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్జెక్ట్‌ రెడీ చేశాడు. భాయ్‌ సినిమా పూర్తి కాగానే ఈసినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారు. అంతే కాదు ఈ రెండు సినిమాలతో పాటు భీమినేని శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో కూడా ఓ  సినిమాకు ఓకె చెప్పాడు ఈ మాస్‌ మహారాజ్‌. సుడిగాడు సక్సెస్‌తో మంచి జోరుమీదున్న భీమినేని గతంలో రవితేజతో దోంగోడు లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని అందించాడు. ప్రస్థుతం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్న రవితేజ తన కెరీర్‌ను ఎంతవరకు కరెక్ట్‌ గా ప్లాన్‌ చేసుకుంటాడో చూడాలి.

బాల‌య్యతో ఆదిత్య 999

  బాల‌కృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ఆదిత్యా 369 సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎవ‌రూ ఊమించ‌ని విధంగా హాలీవుఢ్ స్థాయిలో టైమిష‌న్ కాన్సెప్ట్ తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్ హిట్ సాదించిన సినిమా ఆదిత్య 369. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట చిత్రయూనిట్‌. అయితే ఈసినిమాకు ఇప్పుడడు సీక్వల్ రెడీ చేస్తున్నారు ద‌ర్శకుడు సింగీతం శ్రీనివాస్‌. ఇప్పటి జ‌న‌రేష‌న్కు తగ్గటుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు త‌న మార్క్ ఉండేలా సినిమా స్క్రీప్ట్ రెడీచేస్తున్నారు సింగీతం. ప్రస్థుతం వెల్‌కం ఒబామా సినిమా కంప్లీట్ చేసిన సింగీతం వ‌చ్చే ఏడాది ఆదిత్య 369కు సీక్వల్‌ను సెట్స్ మీద‌కు తీసుకురాన్నారు. ఆదిత్య 369లో హీరోగా న‌టించిన బాల‌కృష్ణ ఈ సినిమాలో కూడా హీరోగా న‌టించ‌నున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆదిత్య 999 అనే టైటిల్‌ను కూడా క‌న్ఫార్మ్ చేశార‌ట‌. అయితే ప్రస్థుతం క‌మ‌ర్షియ‌ల్ మాయ‌లో ప‌డిన సినీవ‌ర్గాలు సినిమాలను మాన‌వీయ విలువ‌ల‌కు దూరంగా తెర‌కెక్కిస్తున్నార‌న్న సింగితం త‌న సినిమాల్లో మాత్రం ప్రేమానురాగాల‌తో పాటు మాన‌వీయ విలువ‌ల‌కు కూడా పెద్ద పీట వేస్తాన‌ని చెప్పారు.

పెళ్లి అయితేనేం..?

  క‌రీనా క‌పూర్ బాలీవుడ్ సినీ అభిమానులకు ఆరాధ్య దేవ‌త‌. వ‌రుస స‌క్సెస్ బాలీవుడ్ టాప్ క్వీన్‌గా ఓ వెలుగు వెలుగిన టాప్ హీరోయిన్‌. అయితే పెళ్లి చేసుకొని త‌న అభిమానుల ఆశ‌ల మీద నీళ్లు చల్లేసిన ఈ హాట్ ఇప్పుడు మ‌ళ్లీ త‌న ఫ్యాన్స్ కోసం ఓ హాట్ ఆఫ‌ర్ ఇస్తుంది. పెళ్లి తో త‌న ప్రొఫ‌ష‌న‌ల్ లైఫ్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండ‌ద‌ని తేల్చి చెప్పిన క‌రీనా, ఇప్పుడు కూడా స్క్రీన్ డిమాండ్ చేస్తే త‌ను హాట్ సీన్లకు రెడీ అని ప్రక‌టించేసింది. అయితే ఇన్నాళ్లు ఆంటీ అయిన క‌రీనాకు హాట్ ఆఫ‌ర్స్ ఎలా ఇవ్వాల‌ని స‌త‌మ‌త‌మ‌వుతున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు వెల్ కం చెప్పేసింది క‌రీనా. సత్యాగ్రహ సినిమాలో తాను లిప్‌లాక్ సీన్‌కు అంగీక‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం వేరే ఉంద‌న్న క‌రీనా, అది ఓ సోష‌ల్ ఎవేర్‌నెస్ మూవీ అందుకే ఆ సినిమాకు ఆ సీన్ అవ‌స‌రం లేద‌ని తాను భావించానని నిజంగా స్క్రీప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ చేయ‌డానికైనా తాను రెడీ అని చెప్పేసింది. ఈ స్టేట్‌మెంట్‌తో మరోసారి క‌రీనా శ‌ఖం స్టార్ట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

అడివి శేష్ 'కిస్' మూవీకి సూపర్ రెస్పాన్స్

      పంజా సినిమాలో నెగిటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్....'కిస్' మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తానే హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు, రచయిత కూడా శేషే కావడం విశేషం. అడివి శేష్ స్క్రీన్ ప్రేజన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. నటుడుగా మాత్రం ఈ సినిమాలో మంచి మార్కులే వేయించుకున్నాడు.   ఈ చిత్రానికి హైలైట్ మాత్రం ప్రియా బెనర్జీ. ఆమె అందచందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో ఆమె చాలా బాగా చేసింది. భరత్ రెడ్డి నెగిటివ్ రోల్ లో ఓకే అనిపించాడు. షఫీ కామెడీ బాగుంది. అమెరికాలోని (శాన్‌ ఫ్రాన్సిస్కో) లో చిత్రీకరించిన విజువల్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా కోసం ఖర్చుకు వెనుకడానందుకు నిర్మాత సాయి కిరణ్ అడివిని ప్రశంసించాలి. సంగీతం, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫైనల్ గా అడవి శేషు తనను తాను మాస్ హీరోగా చూపించేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి.