ఎన్టీఆర్ 'రామయ్య... 'యూట్యూబ్ రికార్డ్..!!

      ప్రస్తుతం తెలుగు సినిమాల హీరోల కన్ను యూట్యూబ్ పై కూడా పడింది. టాలీవుడ్ బడా హీరోల సినిమాల టిజర్లు, సాంగ్స్ యూట్యూబ్ లో ఎంతమంది చూసారో అన్నదాన్ని కూడా రికార్డుగా చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్య'  చిత్రంలోని ఒక పాట టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా పాట ను రెండు రోజుల్లో 637,772 వ్యూస్ వచ్చాయి. దీనిని ఇప్పుడు రికార్డ్ గా చెబుతున్నారు. ఈ సినిమా ఆడియో ను ఈ నెల 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'లో ఎన్టీఆర్‌, సమంత జంటగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకుడు.

అంత సీన్‌ ఉందా..?

      గతంలో చాలా  సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రమ్య శ్రీ ఇప్పుడు దర్శక నిర్మాత గా మారి తానే ప్రదాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించింది. అయితే చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూస్తున్న ఈ సినిమాపై ఆస్కార్ ఆశలు పెట్టుకుందిట రమ్య శ్రీ..     చాలా సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తూనే కాసత్ ఎరోటిక్ సీన్స్‌తో కూడా అందరికి గుర్తుండి పోయిన బోల్డ్ యాక్ట్రస్‌ రమ్యశ్రీ. ఏ గ్రేడ్ సీన్స్‌కే పరిమితం అవుతుందనుకున్న  ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ మీదే ఆశపడుతుంది. ఇన్నాళ్లు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన రమ్య ఇప్పుడు తొలిసారిగా ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. అంతేకాదు ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాద్యతలు కూడా తానే నిర్వహిస్తుంది.     కథ మీద ఉన్న నమ్మకంతో అన్ని బాద్యతలు తానే నిర్వహిస్తున్నా అంటున్న రమ్య త్వరలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఇంకా రిలీజ్ కాని ఈ సినిమాపై రమ్య భారీ ఆశలే పెట్టుకుంది. ఓ మల్లి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రమ్య శ్రీ గిరిజన యువతిగా నటిస్తుంది. పర్ఫామెన్స్‌కు ఎంతో స్కోప్ ఉన్న క్యారెక్టర్లో రమ్య తనలోని టాలెంట్ అంతా చూపించిందట.     తన నటన మీద నమ్మకమో లేక సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్సో గాని ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశపెట్టుకుంది రమ్యశ్రీ. భారీ ఫాలోయింగ్ పెద్ద దర్శకుల సినిమాలే ఆస్కార్ రేసులో నిలబడలేక పోతుంటే తన సినిమా కు ఆస్కార్ వస్తుందనటంపై అందరూ నవ్వుకుంటున్నారు. ఆస్కార్ దాకా ఎందుకు కాని కనీసం తెలుగు లో నంది అవార్డు అయిన వస్తుందొ లేదో అని సెటైర్స్ వేస్తున్నారట.

కాజల్‌ కాదంటోంది

  వరుస సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ రేంజ్ అందుకున్న అందాల భామ ఇప్పుడు తెలుగు సినిమాను పట్టించుకోవటంలేదు. తనకు వరుస అవకాశాలతో పాటు భారీ స్టార్ స్టేటస్ అందించిన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు నో అంటుందీ ముద్దుగుమ్మ కాజల్‌. లక్ష్మి కళ్యాణం తో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి అందాల భామ కాజల్. ‘మగధీర ’ సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకున్న ఈ భామ తరువాత టాప్ రేంజ్ లో దూసుకుపోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తనకు  ఇంతటి రేంజ్  తెచ్చి పెట్టిన టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తుంది కాజల్ అగర్వాల్. బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక్కడ సినిమాలు కాదంటుంది.  తెలుగుకు నో చెప్పుతున్న ఈ అమ్మడు కోలీవుడ్ లో మాత్రం సినిమాలు అంగీకరిస్తుంది. తనకు స్టార్ స్టేటస్ ఇచ్చిన టాలీవుడ్ని కాదని కోలీవుడ్ సినిమాలు చేయటం ఏంటని అడిగితే ఇక్కడ అడిగినంత పేమెంట్ ఇవ్వటం లేదని నిర్మొహమాటంగా చెప్తుందిట కాజల్. బాలీవుడ్ లో మాత్రం ఎంత అడిగితే అంత ఇస్తున్నారని చెబుతుంది. అంతేకాదు డబ్బుల కోసం కోలీవుడ్లో ఎలాంటి స్టార్ స్టేటస్లేని తన కంటే జూనియర్ అయిన ఉదయ నిధి స్టాలిస్ సరసన కూడా హీరోయిన్గా ఒప్పేసుకుంది.టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలతో సంప్రదించినా దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ అడుగుతుందట. దీంతో గడప దాకా వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెల్లిపోతున్నాయట. ఇప్పటికే పవన్, రామ్ చరణ్, బాలక్రిష్ణ, నాగ చైతన్య లాంటి స్టార్ సినిమాల కాదన్న కాజల్ కు ఇక తెలుగులో అవకాశాలు రావడం కూడా కష్టం అవటున్నారు సినీ విశ్లేషకులు.

భీమవరం బుల్లోడి సరసన ఎస్తర్‌

     తెలుగులో కొత్త హీరోయిన్లకు మంచి ఆదరణ లభిస్తుంది. తొలి సినిమా కాస్త సక్సెస్ అయితే చాలు ఇక ఆఫర్లు వరుస బెడుతున్నాయి.  ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో అందాల భామ చేరిపోయింది. కొత్త వారితో సంచలనా సృష్టించే తేజ డైరెక్షన్‌లో పరిచయం అయిన ఆ బ్యూటి ఎస్తర్‌.     తెలుగు లో కొత్తగా వస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.తెలుగు ప్రేక్షకుల హృదయం చాలా విశాలమైనది కాబట్టి ఎంతమంది వచ్చిన వారిలో టాలెంట్ ఉంటే చాలు వారిని ఒక ఎత్తుకు తీసుకెళ్తారు సినీ అభిమానులు .ఇప్పుడు ఆ క్యాడర్ లోనే వచ్చిన ముద్దుగుమ్మ ఎస్తేర్.     పేరు విచిత్రంగా ఉన్నా తన యాక్టింగ్‌తొ పాటుతో అందరిని కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు తన అభినయంతో కూడా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయనమాట.     ఇప్పటికే వెయ్యి అబద్దాలు సినిమాలో నటిస్తున్న ఎస్తర్ తేజ మార్క్ యాక్టింగ్ స్కూల్ నుండి వచ్చింది కాబట్టి ఇక యాక్టింగ్ విషయంలో ఫుల్ ట్రైన్ అయిఉంటుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.     వేయి అబద్దాలు సినిమాలో ఎస్తర్ యాక్టింగ్ చూసిన సురేష్‌బాబు త్వరలో ఆయన నిర్మిస్తున్న భీవమరం బుల్లోడు సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారట. తొలి సినిమా సక్సెస్‌తోనే సునీల్ సరసన హీరోయిన్‌గా సెలక్ట్ అయిన ఈ భామ ముందు ముందు మరిన్ని ఆఫర్‌తొ బిజీ కానుందట.

బందిపోటును సిద్దం చేస్తున్నాడు

  చిన్న సినిమా అంటే బూతు సినిమా అనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్న ఈ రోజుల్లో చిన్న సినిమాను కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకరు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇటీవలే అంతుకు ముందు ఆతరువాత సినిమాతో కూల్‌ హిట్‌ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గ్రహణం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహనకృష్ణ తరువాత అష్టాచెమ్మా సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను కూడా అందుకున్నాడు. తరువాత చేసిన గోల్కొండా హైస్కూల్‌ సినిమా మరో మంచి హిట్‌ అందుకున్న మోహన్‌కృష్ణ కాస్త గ్యాప్ తీసుకొని అంతకు ముందు ఆతరువాత సినిమాతో యువత మనోభావాలను వెండితెర మీద ఆవిష్కరించాడు.ఇప్పుడు మరోసారి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇన్నాళ్లు ఫామ్‌లో ఉన్న స్టార్‌ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయని ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఇప్పుడు అల్లరి నరేష్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్థుతం రవిబాబుతో సినిమా డైరెక్షన్‌లో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న నరేష్‌ ఆ సినిమా తరువాత మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో రూపొందే సినిమాలో నటించనున్నాడు. బందిపోటు పేరుతో తెరకెక్కనున్న ఈసినిమా నరేష్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ సెన్సిబుల్‌ టచ్‌ కూడా ఉంటుందంటున్నారు.

500 కోట్లు కొల్లగొట్టింది

  బాలీవుడ్‌ హాట్‌ బ్యూటి దీపిక పదుకునే సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది అంతా  ఒక్క హిట్‌ కూడా లేక ఉసూరు మన్న ఈ లాంగ్‌ లెగ్స్‌ బ్యూటి ఈ ఏడాది మాత్రం ఏ రేంజ్‌ హవా చూపించింది ఏకంగా తన సినిమాలతో 500 కోట్ల వసూళ్లను కలెక్ట్‌ చేయనుంది.  ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అంతే కాదు ఈ ఏడాది ఈ అమ్మడు నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ 200 కోట్లకు పైగా లైక్ట్‌ చేయగా, యే జవానీ హై దివానీ సినిమా 190 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు రేస్‌ 2 కూడా 100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకోవడంతో ఇప్పటికే ఒకే ఏడాది 500 కోట్లు కలెక్ట్‌ చేసిన హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది దీపిక. దీనికి తోడు ఈ అమ్మడు నటించిన రామ్‌లీలా కూడా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుండటంతో తన రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఇన్నాళ్లు కత్రినా, కరీనాలు మాత్రమే స్టార్‌లు అనుకునే బాలీవుడ్‌ జనాలతో తన జపం చేయిస్తుంది దీపిక.

క్రిష్‌ 3కి కోటిన్నర వ్యూస్‌

  మాములు గా ఓ సినిమాకు యుట్యూబ్‌లో వచ్చిన వ్యూస్‌ను బట్టి ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ను డిసైడ్‌ చేస్తారు ట్రేడ్‌ పండితులు. అయితే ఇన్నాళ్లు 5 లక్షలు, 10 లక్షలు లాంటి నెంబర్లతో ఫాలోయింగ్‌ ప్రూవ్‌ చేసుకున్న ఇండియన్‌ ఇండస్ట్రీకి కొత్త బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేశాడు హృతిక్‌. హృతిక్‌ హీరోగా వస్తున్న క్రిష్‌ 3 సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఉన్న ఈ ట్రైలర్‌కు విపరీలమైన రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఈసినిమాకు 5 , 10 లక్షల్‌ వ్యూస్‌ కాదు ఏకంగా కొటిన్నర వ్యూస్‌ వచ్చాయి. హృతిక్‌ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో వివేక్‌ ఒబరాయ్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నాడు. మరే ఇండియన్‌ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్‌ రాకపోవటం విశేషం. హృతిక్‌ మరోసారి సూపర్‌ హీరోగా నటిస్తున్న ఈసినిమా ఈ దీపావళి కానుకగా ప్రేక్షకులు ముందుకు రావగానికి రెడీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హాలీవుడ్‌ సినిమాలకు కూడా కొత్త బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేస్తుందంటున్నారు విశ్లేషకులు.

హీరోగా మారుతున్న సంగీత కెర‌టం

  తెలుగు సినిమా సంగీతాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన యువ సంగీత త‌రంగం దేవీ శ్రీ ప్రసాద్‌. దేవి అనే డివొష‌న‌ల్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయినా ఎక్కువ‌గా యూత్ ఫుల్ మూవీస్‌తో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవి. అంతేకాదు త‌న ప్రతి సినిమాలోను హుషారెత్తించే ఐటంసాంగ్ పెట్టే దేవి అలాంటి సాంగ్‌తో బాలీవుడ్ కండ‌ల వీరున్ని కూడా బుట్టలో ప‌డేశాడు. అయితే దేవీ శ్రీ మ్యూజిక‌ల్ జ‌ర్నీనికాసేపు ప‌క్కన పెడితే ఇప్పుడు ఈ టాలీవుడ్ సెల‌బ్రిటీ కొత్త అవ‌తారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు త‌న మ్యూజిక్‌తో ప‌ర్ఫామెన్స్‌ల‌తో ఇర‌గ‌దీసిన దేవి ఇప్పుడు హీరోగా మార‌నున్నాడ‌ట‌. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్న స‌రైన క‌థ దొర‌క‌క దేవి త‌న సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని పోస్ట్‌పోన్ చేస్తూ వ‌స్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు దేవీ శ్రీ తెరంగేట్రానికి రంగం సిద్దమ‌యింది. దేవినీ హీరోగా ఇండట్రడ్యూస్ చేయ‌బోయే డైరెక్టర్ కూడా ఎవ‌రో కాదు త‌న సినిమాల‌కు వ‌రుస‌గా దేవితోనే మ్యూజిక్ చేయించిన సుకుమారే దేవిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇప్పటికే క‌థ రాయ‌డం మొద‌లు పెట్టిన సుక్కు వీలైన త్వర‌లో ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకొచ్చే ఆలొచ‌న‌లో ఉన్నాడ‌ట‌. మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సెష‌న్ సృష్టించిన దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

రిలీజ్‌కు రెడీ అవుతున్న విక్రమ‌సింహా

  ఎన్నో రోజులుగా ర‌జ‌నీకాంత్ అభిమానులు వేయిక‌ళ్లతో ఎదురు చూస్తున్న కొచ్చాడియ‌న్ సినిమా తెలుగు వ‌ర్షన్ డ‌బ్బింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావ‌ళి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నారు. ఫ‌స్ట్ టైం ఓ ఇండియ‌న్ సినిమాకు అవ‌తార్ రేంజ్ గ్రాఫిక్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌జ‌నీ క‌ళ్లు చెదిరే సాహ‌సాలు చేయ‌నున్నాడు. చాలా భాగం మోష‌న్ క్యాప్చర్ టెక్నాల‌జీతో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో కూడా విడుద‌ల చేస్తున్నారు. అంతేకాదు జ‌పాన్‌లో ర‌జనీకి ఉన్న క్రేజ్‌తో జ‌ప‌నీస్‌లోకి కూడా ఈ సినిమాను అనువ‌దిస్తున్నారు. ర‌జ‌నీ కుమార్తే సౌంద‌ర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు క‌థ, స్క్రీన్‌ప్లే ప్రముఖ ద‌ర్శకుడు కెయ‌స్ ర‌వికుమార్ అందించారు. ఎఆర్ రెహ‌మాన్ సంగీతం సినిమాకు అద‌న‌పు ఆక‌ర్షణ‌గా నిల‌వ‌నుంది. తమిళ్‌లో కొచ్చాడియ‌న్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈసినిమాకు తెలుగు విక్రమ సింహా అనే పేరును ఫైన‌ల్ చేశారు.

దూసుకెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

  గ‌తంలో సినిమా స‌క్సెస్‌ను ఎన్ని రోజులు ఆడింది అన్న దానిని బ‌ట్టి డిసైడ్ చేసేవారు, త‌రువ‌త ఎన్ని సెంట‌ర్స్‌లో ఆడింది అన్న దానిని బ‌ట్టి డిసైడ్ చేసేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఏ సినిమా అయినా ఎన్ని రోజులు ఎన్ని సెంట‌ర్స్‌లో ఆడింది అన్నది మ్యాట‌ర్‌ కాదు ఎంత కటెక్ట్ చేసింది అన్న దానిని బ‌ట్టే సినిమా స‌క్సెస్ ను డిసైడ్ చేస్తున్నారు. అయితే అందులో కూడా ఇప్పుడు రేంజ్‌మారిపొయింది. మాటూలుగా రీజిన‌ల్ సినిమా అయితే 50 కోట్లుఏ క‌లెక్ట్ చేస్తే అది భారీ స‌క్సెస్ సాదించిన‌ట్టే. ఇత హిందీ సినిమా భారీ హిట్ అనిపించుకోవాలంటే మాత్రం 100 కోట్ల మార్క్ దాటాల్సిందే. అదే ప్రస్థుతం స‌క్సెస్‌కు కొల‌మానంగా మారిపోయింది. అయితే ఇలాంటి పాత రికార్డుల‌న్నింటిని చెరిపేశాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌. త‌న లేటెస్ట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా విజ‌య‌వంతంగా ప్రద‌ర్శించబ‌డుతుండ‌టంతో ఆ సినిమా పాత రికార్డుల‌న్నింటిని చెరిపేస్తుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా క‌లెక్ట్ చేసిన ఈ సినిమా స‌రికొత్త టార్గెట్‌ను బాలీవుడ్‌కి సెట్ చేసింది. మ‌రోసారి షారూఖ్ స్టామినాను నిరూపించింది.

సింగం పాటందుకుంది

  తెలుగు తో పాటు అన్ని భాష‌ల హీరోలు ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తుతున్నారు. అదే సింగర్ అవ‌తారం. గ‌తంలో కూడా చాలా మంది స్టార్‌లు ఇలాంటి ప్రయోగాలు చేసిన ఇటీవ‌ల మాత్రం ఈ ట్రెండ్ బాగా క‌నిపిస్తుంది. స్టార్ స్టేట‌స్ అందుకున్న స్టార్‌లందరు అడ‌పా ద‌డ‌పా గొంతు స‌వ‌రిస్తూనే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్‌లంద‌రూ పాటేసుకోగా యంగ్ జ‌న‌రేష‌న్ హీరోలు కూడా మేమేం త‌క్కువ కాదంటూ గ‌ళ‌మెత్తారు. ఎన్టీఆర్, మ‌నోజ్‌, సిద్దార్ద్ లాంటి హీరోలు సినిమాల్లో పాడుతుంటే రామ్‌చ‌ర‌ణ్ మాత్రం చాన్నాల్ల కిందే ఓ పొలిటిక‌ల్ సాంగ్ పాడేశాడు. అయితే ఈ ట్రెండ్ త‌మిళ్‌లో పెద్దగా లేక‌పోయినా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ మాత్రం ఎప్పుడో త‌న‌లోని సింగింగ్ టాలెంట్‌ను చూపించాడు. త‌రువాత ఆదే స్థాయిలో యంగ్ హీరొ శింభు కూడా వ‌రుస పాట‌ల‌తో ఇర‌గ‌దీస్తున్నాడు. అంతే కాదు ఈ మ‌ధ్యే సూప‌ర్‌స్టార్ ర‌జనీ కూడా ఓ పాట పాడేశాడు. దీంతో రేసులో తాను ఎక్కడ వెనుక ప‌డ‌తా అనుకున్నాడేమోగాని సూర్య కూడా  పాట పాడేశాడు. అయితే సినిమా కోసం మాత్రం కాదు తాను యాక్ట్ చేస్తున్న ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం తొలి సారిగా త‌న గ‌ళం విప్పాడు సూర్య. ఇదే ఊపులో త్వ‌ర‌లో సినిమాలో కూడా పాట‌లు పాడేస్తాడేమో చూడాలి.

మంచు లక్ష్మీ కొత్త బిజినెస్‌

      నటిగా, నిర్మాతగా, టివి హోస్ట్‌గా అనేక రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ వారసురాలు ఇప్పుడు సరికొత్త బిజినెస్లోకి దిగింది.. నటిగా, నిర్మాతగా గుర్తింపు వచ్చినా.. కాసులు రాలక పోవటంతో ఇప్పుడు డబ్బులు సంపాందించే పనిలో పడిందట మంచు లక్ష్మీ ప్రసన్న, మోహన్‌బాబు నట వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన ఈభామ అనతి కాలంలోనే మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.     తండ్రి తగ్గ కూతురిగా మంచి నటిగా డిఫరెంట్ రోల్స్లో మెప్పించిన లక్ష్మీ వరుస అవకాశాలను అందుకోవటంలో మాత్రం వెనుకపడింది. దీంతో నటనతో పాటు నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పట్టింది లక్ష్మీ ప్రసన్న.     అయితే నిర్మాతగా మారినా లక్ష్మీ ప్రసన్నకు సక్సెస్ మాత్రం దక్కలేదు. గుండెల్లో గొదారి, ఊ కొడతార ఉలిక్కి పడతారా లాంటి సినిమాలను నిర్మించిన లక్ష్మీ అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ మాత్రం కాలేకపోయింది.     అయితే ఇవేవి కలిసి రావనుకున్న లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు తనకున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌తో పాటు యూట్యూబ్‌లో తనకున  ఎకౌంట్స్‌లో యాడ్స్ పోస్ట్ చేయటం స్టార్ట్ చేసింది లక్ష్మీ..     ఇక సినిమా రంగం మనకు కలిసి రాదని డిసైడ్ అయ్యిందో ఏమో గాని యాడ్ బిజినెస్లోకి ఎంటర్అయింది.. మరి ఈ రంగం అయినా ఈ అమ్మడికి కలిసోస్తుందో లేదో చూడాలి..

మల్లికా స్వయంవరం

  మరో అందాల తార స్వయంవరం ద్వారా తన వరున్ని ఎంపిక చేసుకోవాలడానిక రెడీ అవుతుంది. గతంలో రాఖీసావంత్ లాంటి వాళ్లు ఇలాంటి ప్రయోగం చేసిన అది అంతగా సక్సెస్ అవ్వలేదు.. అయిన ఇప్పుడు మరోసారి ఓ బాలీవుడ్ బేర్ బ్యూటి అదే సాహసానికి రెడీ అవుతుంది. ఇన్నాళ్లు సినిమాలు సంచలనాలతో వార్తల్లో ఉన్న హాట్ బ్యూటి మళ్లికా శెరావత్. తన అంత అభినయంతో పాటు అడపాదడపా వివాదాలతో కూడా ఈ అమ్మడు అభిమానులకు దగ్గరవుతూ ఉండేది.. అయితే ఇప్పుడు అలాంటి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లబోతుంది మళ్లిక. ఇన్నాళ్లు తన అందాల విందుతో కుర్రకారు మతులు పోగొట్టిన మళ్లిక త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఈ విషయంలో కూడా తన స్టైల్ ఆఫ్ పబ్లిసిటీకి ట్రై చేస్తుంది ఈ బ్యూటి. తన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కోసం త్వరలో గాలింపు ప్రారంభిస్తోంది. అందుకోసం ఓ స్వయం వరాన్ని నిర్వహించాలనుకుంటుందట మళ్లి,. గతంలో రాఖీసాంవత్ కూడా ఇలాగే తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంది. అయితే మూళ్లన్నలకే ఆ బందం తెగిపోయిందనుకోండి. అయితే మళ్లిక మాత్రం ‘ది బ్యాచెలరెట్ ఇండియా’ ‘మేరే ఖయాలోంకీ మల్లిక’ అనే  షోలొ తన కలల రాకుమారుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటుంది. ఈ షోలో పాల్గొంటున్న 30మంది అందగాళ్లలో ఒకరిని తన భర్తగా పొందనుంది మళ్లిక.  సినిమాలు లేక ఫారిన్లో టైం పాస్ చూసిన మళ్లిక ఈ మద్య ఇండియాకు వచ్చింది. త్వరలోనే ఈ రియాల్టీషో షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతుంది.. ఈ కార్యక్రమాన్ని లైఫ్ ఒకె చానల్ ప్రసార్ చేయనుందట. మరి మల్లిక స్వయంవరం ఫలించి ఈ అందాలరాశికి తగ్గ వరుడు దొరుకుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

ర‌వితేజ నా దేవుడు

  షాక్ లాంటి భారీ డిజాస్టర్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మిర‌ప‌కాయ్ లాంటి స‌క్సెస్ ఫుల్ సినిమాతో డైరెక్టర్‌గా నిల‌దొక్కుకున్నాడు ద‌ర్శకుడు హరీష్ శంక‌ర్‌. అందుకే వ‌రుస‌గా త‌న‌కు రెండు సినిమాలు ఇచ్చిన ఆదుకున్న మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌నే త‌న‌కు దేవుడంటున్నాడు హరీష్ అంతేకాదు తాను ఎంత పెద్ద డైరెక్టర్ అయిన ర‌వితేజ‌తో సినిమా చేయ‌డానికే ఇంట్రస్ట్ చూపిస్తానంటూ స్వామి భ‌క్తి చూపిస్తున్నాడు. మిర‌ప‌కాయ్ సినిమా త‌రువాత గ‌బ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బ‌స్టర్ సినిమాతో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు హ‌రీష్.. ఈ లైన్‌లోనే ప్రస్థుతం ఎన్టీఆర్ హీరోగా రామ‌య్య వ‌స్తావ‌య్యా అంటూ ఓ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నాడు. దీని త‌రువాత ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా క‌మిట్ అయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లోనే ర‌వితేజ హీరోగా ఓ సినిమా చేయ‌డానిక ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంక‌ర్‌.. ప్రస్థుతం ర‌వితేజ‌ కెరీర్‌కు ఓ భారీ హిట్ అవ‌స‌ర్ ఉండ‌టంతో ఆ హిట్ త‌నే ఇవ్వాల‌నుకుంటున్నాడు హరీష్ శంక‌ర్‌. త‌న‌కు లైఫ్ ఇచ్చిన ర‌వితేజ‌కు ఓ బ్లాక్‌బ‌స్టర్ హిట్ ఇచ్చి ఋణం తీర్చుకోవాల‌నుకుంటున్నాడు.ఇప్పటికే ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కు త‌గ్గ ప‌వ‌ర్‌ఫుల్ క‌థ రెడీ చేసుకున్న హ‌రీష్ శంక‌ర్ ర‌వితేజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఫ్లాప్ డైరెక్టర్ తో సునీల్ సాహసం

          కామెడియన్‌గా ఎంటరై హీరోగా మారిన నటుడు సునీల్‌, కామెడియన్‌ సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ హీరో, స్టార్‌గా ఎదగటానిక తెగ కష్టపడిపోతున్నాడు. అయితే ఈ క్రమంలో సునీల్‌ ఇప్పుడో భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు.         ఫ్యామిలీ ప్యాక్‌ నుంచి సిక్స్‌ ప్యాక్‌ రేంజ్‌ కే కాదు కామెడియన్‌ నుంచి మంచి హీరోగా ఎదిగిన నటుడు సునీల్‌.. డిఫరెంట్‌ ఢిక్షన్‌తో పాటు మంచి టైమింగ్‌ ఉన్న సునీల్‌ కామెడియన్‌గానే కాదు హీరోగా కూడా మంచి సక్సెస్‌లను అందుకున్నాడు..          అయితే హీరోగా చేస్తున్న సునీల్‌ను తన పాత వాసనలు మాత్రం వదిలి పెట్టడం లేదు. సిక్స్‌ప్యాక్‌తో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నా డైరెక్టర్‌లు మాత్రం కామెడీ కథలతోనే సునీల్‌ దగ్గరికి వస్తున్నారు. అందుకే వరసుగా అలాంటి సినిమాలే చేస్తూ వస్తున్నాడు.         అయితే ఇప్పుడు ఆ మూస నుంచి బయటికి రావడం కోసం ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు సునీల్‌. షోడో లాంటి భారీ డిజాస్టర్‌ ఇచ్చిన మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడట.         మెహర్‌ రమేష్‌ కెరీర్‌లో ఇంత వరకు ఒక్క సక్సెస్‌ కూడా లేదు.. తన డైరెక్షన్‌లో వచ్చిన బిల్లా కాస్త పర్వాలేదని పించినా అది రీమేక్‌ సినిమా కావడంతో ఆ క్రెడిట్‌ కూడా మెహర్‌కు దక్కలేదు. దానికి తోడు రీసెంట్‌గా షోడో ఫ్లాప్‌తో మెహర్‌రమేష్‌ సినిమా అంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారు.         సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్న ప్రమోషన్‌ హీరో బిల్డప్‌ విషయంలో మెహర్‌ రమేష్‌ టాప్‌ అనే చెప్పాలి.. అందుకే అతని డైరెక్షన్‌లో సినిమా చేస్తే మాస్‌ ఇమేజ్‌ మూట కట్టుకోవచ్చని ఆశపడుతున్నాడు సునీల్‌..         మరి సునీల్‌ సాహసం వర్క్‌ అవుట్‌ అవుతుందో లేక కథ అడ్డం తిరుగుతుందో చూడాలి..

తమిళ మార్కెట్ మీద కన్నేసిన భాయ్

            ఇన్నాళ్లు పరభాష సినిమాల దాడితో తెలుగు సినిమా కుదేలవుతుందని బాధ పడిన మన తెలుగు హీరోలు, వాటిని ఆపలేకసపోవడంతో వీళ్లు కూడా ఇతర భాషల మీద కాన్సన్‌ ట్రేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్‌ హీరోస్‌ ఈ లిస్ట్‌లో ముందు ఉండగా ఇప్పుడు ఓ సీనియర్‌ స్టార్‌ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరబోతున్నాడు.         వయసుతో సంభందం లేకుండా ఇప్పటికీ టాలీవుడ్‌ మన్మధుడిగా మంచి ఫామ్‌లో ఉన్న హీరో నాగార్జున. తన జనరేషన్‌ హీరోలందూ అడపదడపా సినిమాలు చేస్తూయ స్పీడు తగ్గించినా… నాగ్‌ మాత్రం ఇంకా ఫుల్‌ ఫామ్‌లో సినిమాలు చేస్తున్నాడు.         అయితే హీరోగా టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉన్ననాగ్‌ యంగ్‌ హీరోలకు మాత్రం టఫ్‌ కాంఫిటీషన్‌ ఇవ్వలేకపోతున్నాడు. దానికి కారణం సరైన మార్కెట్‌ లేకపోవటమే. అందుకే ఇప్పుడు నాగార్జున పరభాషా మార్కెట్ల మీద కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు.         ఇప్పటికే అల్లు అర్జున్‌ రామ్‌చరన్‌లాంటి స్టార్లకు ఇతర భాషల్లో మంచి మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా బన్నీ అయితే మళయాలంలో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఇక రామ్‌చరణ్‌ సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా పట్టుకోసం తెగ కష్టపడిపోతున్నాడు.         దీంతో ఇక రేస్‌లో నిలబడాలంటే నాగ్‌కు కూడా అదర్‌ లాంగ్వేజస్‌ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తన లేటెస్ట్‌ మూవీ భాయ్‌ని తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఒకేసారి రిలీజ్‌ చేయాలనుకుంటున్నాడట నాగ్‌..         మరి ఈ ప్రయోగంతో నాగ్‌ కుర్రహీరోలకు కూడా సవాళ్ల విసురుతాడేమో చూడాలి.

ఫ్లాపుల్లోనూ అదే బలుపు

          చాలా రోజులుగా ఒక్క హిట్‌ లేని ఓ స్టార్‌ హీరో ఈ మద్యే సక్సెస్‌ కొట్టాడు.. లేక లేక వచ్చిన హిట్టే అయినా ఆ హీరో గారు మాత్రం అదంతా తన సక్సెసే అని తెగ పొంగిపోతున్నాడట.. అంతేకాదు తన రెమ్యునరేషన్‌  కూడా ఒక్కసారిగా పెంచేశాడట..         టాలీవుడ్‌లో గాడ్‌ ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం సక్సెస్‌ అవ్వడం కుదరదు అనుకుంటున్న టైంలో.. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్టామినాతోనే హీరోగా ఎదిగిన నటుడు మాస్‌ మహారాజ్‌ రవితేజ.         నెగెటివ్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ నుంచి హీరోగా మారిన రవితేజ తరువాత స్టార్‌ హీరోగా మారాక కూడా వరస సినిమాలతో సత్తా చాటాడు.అ యితే గత కొంత కాలంగా ఈ హీరోగారికి టైం ఏం అంత బాగున్నట్టుగా లేదు. చేసిన ప్రతి సినిఆమ బకెట్‌ తన్నేయటంతో ఫ్లాఫ్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు రవితేజ.         వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న రవితేజ తరువాత ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్‌ మాత్రం సాదించలేకపోయాడు. అయితే చివరకు బలుపు రూపంలో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు రవితేజ.         అయితే ఈ సక్సెస్‌తో రవితేజ రేంజ్‌ బాగా పెరిగిపోయిందన్న టాక్‌ వినిపిస్తుంది. చాలా రోజుల తరువాత వచ్చిన ఒక్క హిట్‌ తోనే రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడు రవితేజ           అసలు ప్లాపుల్లో ఉన్న హీరో దానికి తోడు భారీ రెమ్యునరేషన్‌ దీంతో ఇప్పుడు రవితేజతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదట. కాని రవితేజ మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో చాలా స్ట్రీక్ట్‌గా ఉంటున్నాడని టాక్‌.         దీంతో బలుపు రిలీజ్‌ అయి ఇన్ని రోజులు అవుతున్న రవితేజ ఇంతవరకు ఏ సినిమా కమిట్‌ అవ్వలేదు మరి ఇప్పుడైన తన రూట్‌ మార్చుకుంటాడో లేదో చూడాలి

తండ్రి లైంగిక కోరిక తీర్చాలన్నాడు: నటి శిరీష

      హీరోయిన్ సాయి శిరీష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన నటి సాయి శిరీష సోమవారం టీవి ఛానెల్ లో ప్రత్యక్షమయ్యింది. లైంగిక కోరిక తీర్చాలని తన సవతి తండ్రి వేదిస్తున్నాడని, అందుకే తాను ఇంటి నుంచి పారిపోయానని హీరోయిన్ శిరీష ఆరోపించింది.   తన తల్లి..సవతి తండ్రి పై ఆధారపడి బతుకుతోందని, అందువల్లే తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని తన బాధను బయటపెట్టింది. తన తల్లి ఇంట్లో లేని సమయాలు చూసి తన లైంగిక కోరిక తీర్చాలని సవతి తండ్రి ఒత్తిడి పెడుతూ వచ్చాడని..లేకుంటే తీవ్ర పరిణామాలు౦టాయని హెచ్చరించడని చెప్పింది.   ''లవ్ ఎటాక్'' సినిమాలో నటిస్తున్న సాయి శిరీష గత కొన్ని రోజుల నుండి కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎక్కడుందన్న విషయం పోలీసులకు తెలియడం లేదు. టీవికిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆమె ఎక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.    

అభిమానులకు బాలకృష్ణ వివాహ ఆహ్వానం

      ప్రముఖ నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.   'నా చిన్నకుమార్తె తేజస్విని వివాహానికి నా అభిమాన సంఘాల సభ్యులంతా రావాలి' అని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ ప్రకటననే వ్యక్తిగత ఆహ్వానంగా పరిగణించి అభిమాన సంఘాల సభ్యులంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించాలి'' అని కోరారు. తేజస్విని కుటుంబంతో పాటు అటు వరుడు భరత్ కుటుంబం కూడా సామాజికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కాబట్టి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది.