అత్తారింటికి దారేది టీజర్ సరికొత్త రికార్డ్
posted on Jul 16, 2013 @ 8:18PM
మెగాభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’ టీజర్ విడుదలయింది. ఊహించిన దానికంటే అది చాలా అద్భుతంగా ఉండటంతో మెగాభిమానుల ఆనందానికి అంతే లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ తన స్టైల్లో పలికిన “వీడు ఆరడుగుల బులెట్...వీడు దైర్యం విసిరిన రాకెట్” డైలాగ్ కి వారుఆనందంతో కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వెరయిటీగా, మంచి కలర్ ఫుల్ గా చాలా బాగుంది.
యూ ట్యూబ్ లో టీజర్ విడుదలయిన గంటలోనే అనేకవేల హిట్స్ రావడమే అది పవర్ స్టార్ అభిమానులకు ఎంతగా నచ్చేసిందో తెలియజెపుతోంది. కేవలం 38గంటలలో 4,68,564 మంది దానిని వీక్షిస్తే, 10,119 లైక్స్, మరియు 4724 కామెంట్స్ దానికి వచ్చాయి. ఇది తెలుగు చిత్ర సీమలో మరో సరికొత్త రికార్డని నిర్మాత బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తెలిపారు. టీజర్ను అంతగా ఆదరించిన ప్రజలకి, మెగాభిమానులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఆడియో రిలీజ్ మరియు వచ్చేనెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భామలు సమంత మరియు ప్రణీతలు హీరోయిన్ లుగా నటించారు. పవర్ ఫుల్ డైలాగులకి పెట్టింది పేరయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కధ నందించి, దర్శకత్వం చేసారు. యువతరాన్ని ఉర్రూతలూగించే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు. వీటిని ప్రసిద్ద ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ రూపొందించారు. ఈ సినిమాను బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రవేట్ లిమిటడ్ బ్యానర్ పై నిర్మించగా, దానిని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పిస్తోంది.
కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రవీందర్.