అమితాబ్‌ పుట్టినరోజు కానుకగా త్రీడిలో షోలే

  అమితాబ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ దిగ్గజం, వరల్డ్‌ సినిమాలో ఓ ఐకాన్‌ కాని అమితాబ్‌ ఈ రేంజ్‌కు రావటానికి తొలి బీజం పడింది మాత్రం షోలే సినిమాతోనే.. అందుకే ఈ సినిమాకు బాలీవుడ్‌ చరిత్రలో ఓ ప్ర్తత్యేక స్థానం ఉంది.. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమితాబ్‌, ధర్మేంద్ర హీరోలుగా అంజాద్‌ ఖాన్‌ విలన్‌గా తెరకెక్కిన ఈసినిమాను ఇప్పుడు త్రీడిలో రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్‌. ఇప్పటికే అందుకు సంభందించిన వర్క్‌ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకు రావాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే మొగల్‌ ఈ అజమ్‌ లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలను కలర్‌ చేసిన భారీ రెస్పాన్స్‌ రావడంతో ఇప్పుడు అదే దారిలో కలర్‌ సినిమాలను 3డిలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకలో భాగంగానే అమితాబ్‌కు యాక్షన్‌ హీరో ఇమేజ్‌ తీసుకు వచ్చిన షోలే సినిమాను 3డి ఫార్మాట్‌లోకి మారుస్తున్నారు. త్రిడీ పనులు..ముంబయ్ మాయా డిజిటల్ స్టూడియోలో..శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అక్టోబర్‌ 11న అమితాబ్‌ 71వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నున్నారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన షోలేను ఇప్పుడు 3డిలో కి మార్చడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా తమకు ఈ సినిమా ఘనవిజయం సాదిస్తుందన్న నమ్మకం ఉందన్నారు 3డి వర్క్స్‌ చేస్తున్న ఆర్టిస్ట్‌లు.

ముర‌గ‌దాస్ సింప్లిసిటీ

గ‌జిని, స్టాలిన్‌, తుపాకీ ఈ సినిమాల పేరు చెప్తే చాలు అవి తెర‌కెక్కించిన డైరెక్టర్ రేంజ్ ఏంటో తెలియ‌డానికి.. మ‌రి ఇతంటి బ్లాక్ బ‌స్టర్ హిట్స్ అందించిన ఆ డైరెక్టర్ రేంజ్ ఎలా ఉండాలి. అత‌ని మెయిన్‌టెనెన్స్ ఎలా ఉండాలి.. కాని అలాంటి ఆడంబ‌రాల‌కు నేను దూరం అంటున్నాడు క్రియేటివ్ జీనియ‌స్ ముర‌గ‌దాస్‌.. గ‌జిని సినిమాతో ద‌క్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల‌ను కూడా ఆక‌ట్టుకున్న ముర‌గ‌దాస్ ప్రస్థుతం త‌ను త‌మిళ్‌తో తెర‌కెక్కించిన తుపాకి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. గ‌తంలో ముర‌గ‌దాస్ బాలీవుడ్‌లో రీమేక్ చేసిన గ‌జిని సినిమా రికార్డు క‌లెక్షన్లు వ‌సూలు చేయ‌టంతో ఇప్పుడు ఈ సినిమా మీద కూడా భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే తుపాకీ రీమేక్ కోసం ముంబైలో ఉంటున్న ముర‌గదాస్‌కు ఓ కాస్ట్లీ ఫైవ్ స్టార్ హోట‌ల్లో బ‌స ఏర్పాటు చేశాడు స‌ద‌రు చిత్ర నిర్మాత‌.. అయితే ఇటీవ‌ల ఆ హోట‌ల్ బిల్స్ పే చేసిన నిర్మాత అవాక్కయ్యాడ‌ట‌. ఎందుకంటే ఈ బిల్స్ ముర‌గ‌దాస్ భోజ‌నానికి సంబందిన బిల్స్ ఒక్కటి కూడా లేద‌ట‌.. ఎప్పుడు సందేశ‌త్మక చిత్రాల‌ను తెర‌కెక్కించే ముర‌గ‌దాస్ నిజ జీవితంలో కూడా అదే లైఫ్ స్టైల్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. త‌న ఖ‌ర్చులు నిర్మాత‌కు భారం కాకుడ‌ద‌ని భావించిన ముర‌గ‌దాస్ రోజూ త‌న‌కు ఇచ్చిన ఫైవ్‌స్టార్ హోట‌ల్ భోజ‌నం కాకుండా బ‌య‌టికి వెళ్లి ప‌క్కనే ఉన్న చిన్న హోట‌ల్‌లో భోజ‌నం చేసి వ‌చ్చేవాడ‌ట‌.. ఏందుక‌లా అని అడిగిన నిర్మాత‌కు నేను తినే సౌత్ ఫుడ్‌కు ఇంత ఖ‌ర్చు ఎందుకు ఆ చిన్న హోట‌ల్ స‌రిపోతుందిలే అన్నాడ‌ట‌.. అది విన్న నిర్మాత‌కు నోట మాట‌రాలేదు.. తెర మీద హీరోల‌ను త‌యారు చేసే ముర‌గ‌దాస్ నిజ‌జీవితంలో తానే ఓహీరో అనిపించుకున్నాడు.

మహేష్ '1' నేనొక్కడినే టీజర్ కి రికార్డ్ వ్యూస్

      టాలీవుడ్ లో మహేష్ బాబు హంగామా కొనసాగుతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న మహేష్, దూకుడు సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజున విడుదలైన ’1′ సినిమా టిజర్ కి రికార్డ్ స్థాయిలో క్లిక్స్ వచ్చాయి. మూడు రోజుల్లో ఏకంగా పదిలక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఎంతో ఆనందంగా ఉన్నారు.   ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ చిత్రం రెండో టీజర్‌ కూడా కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధంచేస్తున్నారు. కృతి సనన్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు.

ఐటమ్ గర్ల్ గా ఐష్

బాలీవుడ్ తో పాటు యావత్ భారతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉంది. భారతీయుల అందాల రాశి ఐశ్వర్య రాయ్ మళ్లీ వెండితెర మీద తళుక్కుమననుంది. ప్రెగ్నెన్సీ తరువాత సినిమాలకు దూరం అయిన ఐష్ దాదాపు కొద్ది సంత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంది. అయితే ఆర్యాధ్య పుట్టిన దగ్గర నుంచి ఐష్ రీ ఎంట్రీ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కాని ఇంతవరకు ఒక్క సినిమా కూడా సెట్స్ వరకు రాలేదు. అయితే త్వరలో ఐష్ ఓ సినిమాలో నటించనుందన్న మాట బాగా వినిపిస్తుంది. అది కూడా ఓ ఐటమ్ సాంగ్ లో అనటం అభిమానులు మరింతగా ఉబ్బి తబ్బిబ్బలవుతున్నారు. ప్రముఖ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే 'రామ్ లీలా' సినిమాలో ఐటెం సాంగు చేయడానికి ఐశ్వర్య  అంగీకరించిందట. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈసినిమాకు ఐష్ అందాలు మరింత ప్లస్ అవుతాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి రీఎంట్రీ ఐష్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

రాకుమారుడి పుట్టిన రోజు

      రాజకుమారుడిగా ముద్దుగా కనిపించినా , మురారిగా పక్కింటి అబ్బాయిలా అనిపించినా … ఒక్కడుగా సింపుల్ గా మెప్పించినా .. పోకిరిగా మాస్ డైలాగులు చెప్పినా … కాస్త దూకుడుగా టక్కరిదొంగలా కనిపించినా అతడు నిజం గా … టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ ఖలేజా ఉన్న బిజినెస్ మెన్….. సూపర్ స్టార్ మహేషే. రాజకుమారుడు, యువరాజు, వంశీ,  మురారి …. సినిమాలు మహేష్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు ్పఫఉ్ఫ్పప్క్రక్కత్త్లర దగ్గర చేస్తే .. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మహేష్ కు  .. మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి తెలుగు తెరపై తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. మహేష్ హిట్ కొట్టిన ప్రతి సారి ఇండస్ట్రీ రికార్డుల బద్దలయ్యాయి.. ఆ కలెక్షన్ల ప్రభంజనంలో పాత రికార్డులన్ని చెరిగిపోయాయి. 2006లో పూరి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన … టాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్  పోకిరి. ఈ సినిమా మహేష్ కెరీర్‌కు ఫుల్ మైలేజీని ఇవ్వడమే  కాదు.. టాలీవుడ్‌ స్క్రీన్‌ మీద సరికొత్త ట్రెండ్‌ను నాందిపలికింది. మహేష్‌ కెరీర్‌ను కూడా పోకిరికి ముందు పోకిరి తరువాత అనే రేంజ్‌ సక్సెస్‌ సాదించింది ఈ సినిమా. ఇక తరువాత అడపదడపా ఫెయిల్యూర్స్‌ ఎదురైనా  మహేస్‌ స్టామినా మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఓ రిజినల్‌ లాంగ్వేజ్‌ హీరో నేషనల్‌ లెవల్‌లో ఎంత క్రేజ్‌ సాదించగలడో ప్రూవ్‌ చేసి చూపించాడు ప్రిన్స్‌. ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో బాలీవుడ్‌ స్టార్స్‌ను కూడా వెనక్కు నెట్టి ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్‌మేన్‌గా ఎదిగాడు మహేష్‌. దూకుడు, బిజినెస్‌మేన్‌ లాంటి కమర్షియల్‌ మాస్‌ సక్సెలతో పాటు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ సినిమాతో కూడా భారీ విజయం అందుకున్నాడు. ప్రస్థుతం వన్‌ నేనొక్కడినే అంటూ వస్తున్న మహేష్‌ మరో ఇండస్ట్రీ రికార్డ్‌ మీద కన్నేశాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ నట వారసత్వాన్నే ఆస్తిగా అందుకున్న మహేష్‌బాబు తండ్రి నుంచి సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ను కూడా అందుకొని ఆ క్రేజ్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఇలా తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్‌బాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంధర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.

‘అత్తారింటికి దారేది’ మళ్ళీ వాయిదా

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది ’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే ఈనెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సివుంది. కాని ఆతరువాత దీనిని ఈనెల 9కి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఈ సినిమా వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను త్వరలో ప్రొడ్యూసర్ ఖరారు చేస్తారని సమాచారం. కేంద్రం తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన చేయడంతో ఇప్పుడు సీమాంద్ర ప్రాంతం నుండి విభజన సెగ తగులుతుంది. సమైక్య ఉద్యమం నడుస్తున్నవేళ సినిమాను విడుదల చేస్తే నష్టాలు చవిచూడాల్సిన పరిస్ధితి వస్తుందని, అలాగే సీమాంధ్ర జేఏసీ నుండి మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేయడం అంత సేఫ్ కాదని భావించే ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య విలన్ గా జగపతిబాబు

      టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. ఈ మధ్య కాలంలో ఆయనకి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. తాజా సమాచారం ప్రకారం జగపతిబాబు కి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర జగపతి బాబుకు అయితే కరెక్టుగా సూటవుతుందని భావించి బోయపాటి ఆయనకు పాత్ర గురించి చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడని సమాచారం. అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న జగపతి బాబుకు ఈ అవకాశం రావడంతో తెగ సంతోషపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఆ డైరెక్టర్‌ని కూడా ఎన్టీఆర్ ప‌ట్టేశాడు

  ఎన్టీఆర్ ట్రెండ్ మార్చాడు.. ఇన్నాళ్లు భారీ స‌క్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్స్‌తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ సినిమా చేస్తున్న డైరెక్టర్‌కి చాన్స్ ఇస్తున్నాడు. టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ద‌ర్శకులు ఎవ‌రో ఎంచుకొని వారితో సినిమా చేసే ఎన్టీఆర్ ఇప్పుడు సుకుమార్‌కు చాన్స్ ఇస్తున్నాడు. సుకుమార్ ప్రస్థుతం మ‌హేష్‌బాబు హీరోగా వ‌న్ నేనొక్కడినే అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా మ‌హేష్ స్లో పాల‌సీకి, సుకుమార్ ప‌ర్ఫెక్షన్ తోడై మ‌రింత ఆల‌స్యం అవుతుంది. అయితే మేకింగ్ సంగ‌తి ఎలా ఉన్న ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో సినిమా మీద కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా సుకుమార్ ఢైరెక్షన్లో చేయ‌నున్నాడ‌ట‌. ఇప్పటికే సుకుమార్ లైన్ విన్న ఎన్టీఆర్ సూప‌ర్‌గా ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. దీంతో ప్రస్తుతం త‌ను చేస్తున్న రామ‌య్య వ‌స్తావ‌య్యా, ర‌భ‌స చిత్రాలు పూర్తవ‌గానే సుకుమార్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. బివియ‌స్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈసినిమాకు సంభందించిన మ‌రిన్ని విష‌యాలు త్వర‌లో వెల్లడించ‌నున్నారు.

ఎవ‌డు రిలీజ్ ఇప్పట్లో లేన‌ట్టేనా..?

  రామ్‌చ‌ర‌ణ్ సినిమాల రిలీజ్ విష‌యంలో సందిగ్ధత ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎప్పటి నుంచో రిలీజ్ విష‌యంలో మీన‌మేషాలు లెక్కపెడుతున్న జంజీర్, తుఫాన్ సినిమాల రిలీజ్ డేట్‌లు ఇంకా ఎనౌన్స్ కాలేదు. ఇప్పటికే వాయిదా ప‌డిన ఎవ‌డు రిలీజ్ మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ గ‌త నెల 31నే ఎవ‌డు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చితితో ఎవ‌డు సినిమా రిలీజ్‌ను మూడు వారాల పాటు వాయిదా వేశారు. అంత‌కు ముందు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ వాయిదా వేసేది లేద‌ని చెప్పిన దిల్‌రాజు స‌మైఖ్య సెగ‌ల నేప‌ధ్యంలో వెనుక త‌గ్గక త‌ప్పలేదు. అయితే ఇప్పుడు మ‌రో సారి ఎవ‌డు సినిమా వాయిదా వేయాల‌ని అనుకుంటున్నార‌ట చిత్రయూనిట్‌. ఇప్పటికే నెల రోజులు పాటు వాయిదా పడ్డ ఈ సినిమా మ‌రోసారి వాయిద ప‌డ‌టం సినిమా రిజ‌ల్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు విశ్లేష‌కులు. ఈ నెల 21న ఎవ‌డు సినిమా రిలీజ్ చేయాల‌ని భావించినా వ‌చ్చే సెప్టెంబ‌ర్ 9 న రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్ ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ అవుతున్న జంజీర్ సినిమా రిలీజ్ కూడా ఉండ‌టంతో ఇప్పుడు ఎవ‌డు సినిమాను మ‌రోసారి వాయిదా వేయాలి అనుకుంటున్నార‌ట‌. రెండు సినిమాల‌కు కనీసం నెల గ్యాప్ అయినా ఉండేలా చూసుకోవాల‌నుకుంటున్న చెర్రీ ఇక జంజీర్ త‌రువాతే ఎవ‌డు రిలీజ్ చేయ‌డం బెట‌ర్ అని భావిస్తున్నాడ‌ట‌. అందుకే ఎవ‌డు సినిమాను ఏకంగా అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని బావిస్తున్నాడ‌ట‌. చెర్రీ ప్లానింగ్ మాట ఎలా ఉన్నా ఈ దెబ్బకు దిల్‌రాజు దిమ్మ తిర‌గ‌టం మాత్రం కాయం అంటున్నారు విశ్లేష‌కులు.

సల్మాన్‌కూ వీసా ప్రాబ్లమ్‌

      భారతీయులకు విదేశి విమానాశ్రయాల్లో అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంనే పూర్తిగా చెక్‌ చేసి అవమానించిన తెల్లదొరలు. తరువాత కేవలం పేరులో ఖాన్‌ ఉన్న పాపానికి షారూఖ్‌ను గంటల పాటు విమానాశ్రయంలో ఆపేశారు. అప్పట్లో ఈ విషయాలపై తీవ్రదూమారమే చెలరేగింది.   ఇప్పుడు మరోసారి ఇలాంటి సంగటనే మరో బాలీవుడ్‌ స్టార్‌కు ఎదురైంది. చాలా రోజులుగా కేసులతో సతమత మవుతున్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ సమస్య ఎదురైంది. జింకల వేటకు సంభందించిన చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న సల్మాన్‌ ఖాన్‌. ఇప్పుడు ఆ కేసు వల్లే బ్రిటన్‌ వేళ్లే అవకాశం కూడా కోల్పోయాడు. కేసు విషయంలో హియరింగ్‌లకు హాజరవుతున్న సల్మాన్‌ కేసుకు సంబందించిన వివరాలను పూర్తిగా ఎంబసీకి సమర్పించనీ కారణంగా బ్రిటన్‌ అధికారులు సల్మాన్‌కు విసా నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్ సల్లూ భాయ్ అభిమానులు బ్రిటీష్‌ అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు.

పవన్‌తో దిల్‌రాజు సినిమా

      చాలా రోజులుగా ఓస్టార్‌ హీరో డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్న దిల్‌రాజుకి ఇన్నాళ్లకు ఆ చాన్స్‌ వచ్చింది. గతంలో ఎన్నో సార్లు ఆ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నించిన వర్క్‌ అవుట్‌ కాకపోవటంతో తన సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ మాత్రమే చేస్తున్నాడు.   టాలీవుడ్‌ లక్కీ నిర్మాతగా క్రేజ్‌ తెచ్చకున్న యంగ్‌ పొడ్యూసర్‌ దిల్‌రాజు. నిర్మాతగా మారిన పదేళ్ల కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు దిల్‌ రాజు. కాని ఇంతవరకు పవన్‌ కళ్యాణ్‌తో మాత్రం సినిమా చేయలేదు.         అయితే ఇన్నాళ్లకు ఆ చాన్స్‌ కొట్టేశాడు దిల్‌రాజు. గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనే పవన్‌ను తీసుకోవాలని అనుకున్న పవన్‌ మాత్రం ఒప్పుకోలేదు.. ఇప్పుడు మాత్రం పవన్‌ హీరోగా దిల్‌రాజు ఓ సినిమా చేస్తున్నాడు..         బృందావనం లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా అందించిన వంశీపైడిపల్లి పవన్‌ కళ్యాణ్‌ కోసం ఓ కథ రెడీ చేశాడట. ఇప్పటికే పవన్‌కు కధ కూడా వినిపించిన వంశీ దిల్‌రాజు నిర్మాతగా ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.         ప్రస్థుతం రామచరన్‌ హీరోగా నటించిన ఎవడు సినిమా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్న వంశీ పైడిపల్లి ఆసినిమా రిలీజ్‌ తరువాత పవన్‌ హీరోగా చేయబోయే సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయనున్నాడు.         వరుసగా బ్లాక్ బస్టర్‌లు ఇస్తున్న దిల్‌రాజు బ్యానర్‌లో పవన్‌ లాంటి భారీ కలెక్షన్‌ స్టామినా ఉన్న హీరో నటిస్తే ఆ సినిమా సరికొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్‌.       

నేను బతికే ఉన్నా..చావలేదు: కనక

      అలనాటి నటి దేవిక కూతురు కనక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిందని మంగళవారం వార్తలు వచ్చాయి.ఐతే ఈ సందిగ్ధత కొనసాగుతుండగానే ఓ ఛానెల్ కనక ఇంటికి వెళ్లింది. అక్కడ కనక ప్రత్యక్షమైంది. తాను బతికే ఉన్నానని, తనకెలాంటి అనారోగ్యం లేదని ఆమె వివరణ ఇవ్వడంతో అవాక్కవడం మీడియా ప్రతినిధి వంతైంది. తమిళం, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో 60కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో చివరగా రాజేంద్రప్రసాద్ తో ‘వాలుజడ తోలుబెల్టు’ సినిమా చేసింది. తాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నానని..త్వరలో మళ్ళీ సినిమాలో నటిస్తానని..ఆఫర్లు కూడా వస్తున్నాయని కనక పేర్కొంది.

‘కలిసి ఉంటే కలదు సుఖం' అంటున్న నితిన్, దిల్ రాజు

      నితిన్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా పరిచయమైన రాజు...ఆ సినిమా విజయం తరువాత ‘దిల్ రాజు' గా ఇండస్ట్రీ లో ఫేమస్ అయినా సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నితిన్ తో దిల్ రాజు మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కు ‘కలిసి ఉంటే కలదు సుఖం' అనే టైటిల్ ను కూడా సెలెక్ట్ చేశారు. రొమాన్స్ అండ్ కామెడీతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆతరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్' సినిమా చేయడానికి అ౦గీకరించాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం..హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం నిర్మిస్తున్నాడు. ఆయన నిర్మించిన 'ఎవడు' వచ్చే నెలలో విడుదలకు రెడీగా ఉంది. 

పవన్ కళ్యాణ్ కు భయపడలేదు: దిల్ రాజు

      రామ్ చరణ్ కొత్త సినిమా ‘ఎవడు’ను పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి భయపడి వాయిదా వేయలేదని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఈ నెల 31న విడుదల కావాల్సిన ఈ సినిమా మూడు వారాలు వాయిదా వేసి ఆగస్టు 21న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.   పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఆగస్టు 7న విడుదలవుతున్న నేపథ్యంలోనే ‘ఎవడు’ను వాయిదా వేశారని వార్తలొచ్చిన నేపథ్యంలో దిల్ రాజు స్పందించాడు. ‘‘పవన్ కు భయపడే రామ్ చరణ్ వెనక్కి తగ్గాడు అనడం సరికాదు. కళ్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. నాకు తెలిసీ అత్తారింటికి దారేది, ఎవడు సినిమాలు రెండూ పెద్ద హిట్టయ్యేవే. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏమిటో తెలుస్తుంది’’ దిల్ రాజు అన్నాడు. పవన్ కళ్యాణ్, చరణ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నాకే ‘ఎవడు’ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారని దిల్ రాజు చెప్పాడు.

'ఎవడు' రిలీజ్ వాయిదా?

      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా రిలీజ్ పై సస్పెన్స్ నెలకొనివుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలయ్యే వారంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ సినిమా రిలీజ్ ను నిర్మాత దిల్ రాజు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.   కాంగ్రెస్ తెలంగాణ పై ఏ నిర్ణయం తీసుకున్న ఏదో ఒక ప్రాంతంలో వివాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్ల పై పడకుండా ఉండడానికి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ పెట్టనున్నట్లు సమాచారం.

అతనితో కోరికను తీర్చుకున్న సమంత

      టాలీవుడ్ బ్యూటీ సమంత హైదరాబాద్ లో తన కోరికను తీర్చుకుందట. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా చెప్పింది. ఇంతకీ సమంత కోరిక తీర్చింది ఎవరో తెలుసా? ఇంకెవరు ఆమె అసిస్టెంటే. అసలు సంగతి ఏమిటంటే... సమంతకీ హైదరాబాద్ రోడ్లపై బైక్ తో చక్కర్లు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక వుందట. అయితే సెలబ్రిటీలకు, ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వీరు బయట కనిపిస్తే ఇక అంతే. దీంతో సమంత తన అసిస్టెంటే తో కలిసి తన కోర్కెను తీర్చుకొని పుల్ ఎంజాయ్ చేసినట్లు చెప్పింది. ఆర్యతో కలిసి ఈ మధ్య ఒకరోజు అంతా హైదరాబాదు వీధుల్లో ఝామ్మంటూ బైక్ మీద తిరిగానని చెబుతుంది. ఈ చల్లని వాతావరణంలో ఆర్యా బైక్ మీద కూర్చుని భాగ్యనగరం వీధుల్లో అలా అలా వెళ్లిపోతుంటే హాయిగా వుందని సమంతా ట్విట్ చేసింది. ప్రస్తుతం సమంత నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది.

నాగచైతన్య ‘గుండె..గల్లంతయ్యిందే ’

      అక్కినేని నాగచైతన్య త్వరలో హిట్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. నితిన్ కి ‘గుండె జారి గల్లంతయ్యిందే ’ లాంటి సూపర్ హిట్ సినిమానిచ్చిన డైరెక్టర్ విజయకుమార్ కొండాతో నాగచైతన్య జతకట్టబోతున్నాడు. ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించబోతున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'ఎవడు' సెన్సార్: పెద్దలకు మాత్రమే

        మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ లేటెస్ట్ మూవీ 'ఎవడు' ఈ నెల 31 వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, శ్రుతి అందాలను ఎక్కువగా అరబోయడంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీచేసారు.   రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ స్పెషల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది.