వినేశ్ ఫోగట్ ఓ పోరాట కెరటం

భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్  ఓ పోరాట కెరటం. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా పోరాడిన ఫోగట్ పై అనర్హత వేటు దురదృష్టకరం. ఫైనల్ పోరు వరకూ ఆమె పోరాడిన తీరు అనన్య సామాన్యం.  అయితే ఫైనల్స్ కు ముందు కేవలం వంద గ్రాముల అధిక బరువు వినేశ్ స్వర్ణ ఆశలను  ఛిద్రం చేసింది.   వినేశ్ ఫోగట్ ఆటను ఆరాధించే కోట్లాది మంది హృదయాలు బరువెక్కాయి. అనర్హత వేటుతో తీవ్ర మనోవేదనకు గురైన వినేశ్ ఫోగట్  రెజ్లింగ్ క్రీడకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు.  అసలు ఫోగట్ అనర్హత వేటు వెనుక రాజకీయం ఉందా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలలో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా గత ఏడాది జరిగిన పోరాటంలో ఫోగట్ క్రియా శీలంగా పాల్గొన్నారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషన్ మహిళా రెజ్లర్లతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ రెజ్లర్లు అప్పట్లో పెద్ద  ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి విదితమే. అప్పట్లో  వినేశ్ ఫోగట్   సహచర రెజ్లర్లతో కలిసి వినేశ్ ఫోగట్ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకాన్ని చవి చూశారు.  అరెస్టు కూడా అయ్యారు. ఒక దశలో తనకు సర్కార్ ఇచ్చిన ఖేల్ రత్న అవార్డును కూడా వినేశ్ ఫోగట్ వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమెను నానా మాటలు అనడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో   ట్రోల్ చేశారు.  ఈ నేపథ్యంలోనే వినేష్ ఫోగట్ పై సరిగ్గా ఫైనల్ పోరుకు ముందు అనర్హత వేటు పడటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  ఎందుకంటే ఫైనల్  పోరు కోసం రింగ్‌లోకి దిగడానికి కొన్ని గంటల ముందు ఆమె బరువు  వంద గ్రాములు ఎక్కువ ఉన్న సంగతి తెలిసింది.  దీంతో అధిక బరువును తగ్గించుకోవడానికి వినేశ్ నానా పాట్లు పడింది.   తిండి మానేసింది. నీళ్లూ ముట్టలేదు. జట్టు కత్తిరించుకుంది. రాత్రంతా మెలకువగానే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో వంద  గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం కావాలని ఒలింపిక్స్ అధికారులను  బతిమిలాడింది. ప్రాధేయపడింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫైనల్ పోరుకు ముందు రోజు జరిగిన  పోటీలో ఆమె నిర్దిష్టబరుతోనే ఉంది.  డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకి పై సాధికర విజయం సాధించిన వినేశ్ ఫోగట్‌. క్వార్టర్స్ లో ఉక్రెయిన్‌కు చెందిన ఓక్సానా లివాచ్ పై విజయం సాధించింది. సెమీస్‌లో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్‌మన్‌ను ఓడించింది. వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్ కు  ఇక స్వర్ణం ఖాయమనుకుంటున్న దశలో   యాభై కిలోల బరువు పోటీకి వంద గ్రాములు ఎక్కువగా ఉందంటూ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు.  ఫోగట్ తన రెజ్లింగ్ కేరీర్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. భారత క్రీడారంగంపై తన సంతకం శాశ్వతం చేసుకుంది.  కామన్వెల్త్ గేమ్స్ లో అనేక సార్లు దేశానికి స్వర్ణాలు తెచ్చిపెట్టింది. 2014, 2018 అలాగే 2022 కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి ఫోగట్‌  స్వర్ణ పతక విజేతగా నిలిచింది. కామన్వెల్త్ , ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌ గా వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్ లో రెండు కాంస్యం పతకాలు సాధించింది. అయితే ఒలింపిక్స్ లో  స్వర్ణం సాధించాలన్న ఆశ మాత్రం నెరవేరలేదు.  ఇంతకు ముందు ఆమె రెండుసార్లు ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లర్ గా పాల్గొన్నది. 2016 లో 48 కిలోల క్యాటగరీలోనూ 2020 లో 53 కిలోల క్యాటగిరీలోనూ పాల్గొన్న వినేశ్ ఫోగట్ ఈ సారి 50 కిలోల విభాగంలో పాల్గొన్నారు.   మొత్తం మీద ఒలింపిక్ స్వర్ణం లక్ష్యం సాధించలేకపోయినా.. యావద్దేశం అభిమానాన్ని, మద్దతులూ వినేశ్ ఫోగట్ సొంతం చేసుకున్నారు.  సెమీస్ లో నిర్దుష్ట బరువుతోనే పోటీ పడి విజయం సాధించినందున బ్రాంజ్ మెడల్ కు తాను అర్హురాలినే నంటూ  ఆమె క్రీడా కోర్టులో చేసుకున్న అప్పీలుపై శుక్రవారం తీర్పు రానుంది. ఆ తీర్పు అనుకూలంగా వస్తే భారత్ తరఫున రెజ్లింగ్ లో పతకం సాధించిన క్రీడాకారిణిగా ఫోగట్ నిలుస్తుంది. భారత్ పతకాల సంఖ్య మరొకటి పెరుగుతుంది. మొత్తం మీద భారత్ రెజ్లింగ్ లో ఫోగట్ ప్రస్థానం ఒక చెరగని సంతకం అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. 

కిరణ్ కుమార్ రెడ్డి  బాటలో రేవంత్ ? 

ప్రకృతిని అడ్డుకుంటే అది వినాశనానికి దారి తీస్తుంది. పంచభూతాలను డిస్ట్రబ్ చేస్తే అది జన జీవనాన్నే అస్త్యవ్యస్తం చేస్తుంది. చెరువులను కబ్జా చేస్తే వరదలు రావడం సహజమే. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే చెరువులను పరిరక్షించాలి. కానీ మన పాలకులు వోట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం మామూలే. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ వోటు బ్యాంకు రాజకీయాలను  పాలకులు ప్రోత్సహిస్తున్నారు.  ఉమ్మడి  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను రూపొందించింది. బహదూర్ పురా నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు హిందువులు అయినప్పటికీ ప్రతీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. బిజెపి , మజ్లిస్ మధ్య నువ్వానేనా అన్నట్లు ఎన్నికలు జరిగేవి. కానీ మజ్లిస్ చెప్పు చేతల్లో ఉండే కాంగ్రె స్ పార్టీ ప్రభుత్వం బహదూర్ పురా నియోజకవర్గాన్ని పునర్విభజించింది. ఈ పునర్ విభజనలో మెజార్టీ హిందువుల వోట్లు చీలిపోయే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకరించారు. ఇప్పుడు అక్కడ పోటీ ఎవరూ లేకపోవడంతో మజ్లిస్ గెలుస్తూ వస్తోంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు.  మజ్లిస్ పట్ల  రోశయ్య మెతకవైఖరితో ఉన్నప్పటికీ  కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారు. మహావీర్ హాస్పిటల్ లీజుకు ఇవ్వాలని మజ్లిస్ పెట్టుకున్న వినతిని కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అప్పటికే అస్రా హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్స్ విజయవంతంగా నడుపుతున్న ఓవైసీ బ్రదర్స్ కన్ను మహావీర్ హాస్పిటల్ మీద పడింది. లీజుకు ఇవ్వడడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ  చేసిన వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.  భాగ్య లక్ష్మి అమ్మవారిని దూషించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువుల పని పడతానని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా హిందువులు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి కేసులు నమోదు చేశారు.   విద్వేష ప్రసంగం చేసినందుకు గాను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కూడా   కేసు నమోదు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఈ కేసుల్లో చార్జ్ షీట్ నమోదు చేసి ఓవైసీ బ్రదర్స్ ను కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు పంపారు. ఈ కేసుల పర్యవ్యసానంగా మజ్లిస్ పార్టీ కేంద్రంలో యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన మజ్లిస్ పార్టీ తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దత్తుగా నిలిచింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దత్తు వహించే మజ్లిస్ తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచిన మజ్లిస్ కు మళ్లీ ఆశాభంగమైంది. అక్రమకట్టడాలను కూల్చి వేసే ప్రక్రియ పాతబస్తీ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను నేలకూల్చింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువు భూమిలో అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. ఎంఐఎం ఇలాఖాలో అక్రమకట్టడాలను కూల్చివేస్తున్నందుకు బహదూర్ ఎమ్మెల్యే ముబీన్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముబీన్ ను అదుపులోకి తీసుకుంది. కొత్తగా చార్జ్ తీసుకున్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ దూకుడు పెంచడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. 

వేణు స్వామి భార్యకి పిచ్చెక్కిందా?

ఇంతకాలం జ్యోతిషం పేరుతో సెలబ్రిటీల మీద ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేసిన వేణు స్వామి ఛాప్టర్ క్లోజ్ అయ్యే దశలో వుంది. ఈ నేపథ్యంలో వేణు స్వామి భార్య, వీణ విద్వాసురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీవాణికి పిచ్చిగానీ ఎక్కిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. గత రెండు రోజులుగా శ్రీవాణి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. తన భర్తకి అనుకూలంగా, మీడియాకి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. మీడియా వాళ్ళు అలా చేస్తారు.. ఇలా చేస్తారు.. వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. కానీ నా భర్తని మాత్రం ఎందుకిలా ట్రోల్ చేస్తారు అంటూ సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. అక్కడతో ఆగకుండా ఏ నాగచైతన్య, శోభిత ధూళిపాళ మీద కామెంట్లు చేసినందుకు వేణు స్వామి సమాజంలో తరిగిపోనంత అపకీర్తిని పోగుచేసుకున్నాడో, ఆ జంట గురించి కూడా శ్రావణి వెటకారం కామెంట్లు చేస్తున్నారు. మీకు ఎంగేజ్‌మెంట్ జరిగింది కదా.. నాకు గిఫ్ట్ ఇవ్వండి అంటూ నాగ చైతన్యని ఉద్దేశించి వీడియో పెట్టారు. ఆమె చేస్తున్న కామెంట్లు ఎంత ఫూలిష్‌గా వున్నాయో చెప్పడానికి వీల్లేనట్టుగా వుంది. ఇంతకాలం ‘వీణ శ్రీవాణి’గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీవాణి గత రెండు రోజులుగా వ్యవహరిస్తున్న తీరును చూసి ఆమెని అభిమానించేవారే తీవ్రంగా విమర్శిస్తున్నారు. శ్రీవాణికి పిచ్చిగానీ ఎక్కిందేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నీ మొగుడేమో ఆ జంట నాశనం అయిపోతుందని జోస్యం చెబుతాడు.. నువ్వేమో గిఫ్టు కావాలని అడుగుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందా అని కామెంట్లు పెడుతున్నారు. వేణు స్వామి అనే పోరంబోకు సెలబ్రిటీల జీవితాల మీద అడ్డమైన కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఆ దరిద్రుడికి శ్రీవాణి భార్య అని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఎవరైనా సరే వేణు స్వామిని ట్రోల్ చేశారే తప్ప.. శ్రీవాణిని ఏనాడూ పల్లెత్తు మాట అన్న దాఖలాలు లేవు. ఒక వీణ కళాకారిణిగా ఆమె అంటే చాలామందికి గౌరవం వుంది. భర్త వేస్టుగాడుకానీ, భార్య మాత్రం చాలా ఉత్తమురాలు.. ఆ మహాతల్లి అదృష్టమే ఈ దరిద్రుడిని కాపాడుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వుండేవి. అలాంటి శ్రీవాణి ఒక్కసారిగా ఇలా అదుపుతప్పి మాట్లాడ్డం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదో మాటవరసకి అనడం కాదుగానీ, నిజంగానే శ్రీవాణి మానసిక పరిస్థితి మీద పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచీ శ్రీవాణికి తన భర్త సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్లు చేయడం, జ్యోతిషం చెప్పడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆమె వేణు స్వామిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఇది కంట్రోల్ అయ్యే శాల్తీ కాదు కదా.. అందుకే ‘ట్రోల్’ అవుతున్నాడు. ఆ ట్రోలింగ్ శ్రీవాణికి మొదటి నుంచి ఇబ్బంది కలిగిస్తూనే వుంది. ఇంట్లోంచి బయటకి అడుగు వేయాలన్నా ఇబ్బందిపడే పరిస్థితికి ఆమె చేరుకున్నారు. ఆమె బంధువులు, పరిచయస్తులు కూడా శ్రీవాణికి వున్న వీణ ప్రావీణ్యం గురించి మాట్లాడకుండా, వేణు స్వామి నిర్వాకాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ వుండటం కూడా ఆమెని చాలా బాధకి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో వేణు స్వామి జనం దృష్టిలో మరీ చులకన అయిపోవడం, ముఖ్యంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట మీద జోస్యం చెప్పిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వేణు స్వామిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ శ్రీవాణి మీద ప్రభావం చూపించి, ఆమె ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ పోరంబోకు వేణు స్వామి ఏ గంగలో కలిసినా ఎవరికీ ఎలాంటి బాధలేదు. కానీ, శ్రీవాణి లాంటి అమ్మాయి కూడా ఇలా పద్దతి తప్పి వ్యవహరించడం బాగాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయ్యో జగనన్నా.. నీకెంత కష్టం వచ్చింది జగనన్నా...!

బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే విమానం బయల్దేరడానికి సిద్ధంగా వుంది. విమానంలోని ఎకానమీ క్లాస్ అప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మొత్తం విమానంలో చివరి వరసలో రెండు సీట్లు మాత్రం ఖాళీగా వున్నాయి. ఇంతలో ఒక జంట విమానంలోకి ప్రవేశించింది. అతను పొట్టిగా వున్నాడు. ఆమె సన్నగా వుంది. అతని ముఖంలో ‘ఏంటో.. నా జీవితం ఇలా అయిపోయింది’ అనే ఎక్స్.ప్రెషన్. ఆమె ముఖంలో ‘అంతా నా ఖర్మ’ అనే ఎక్స్.ప్రెషన్. వాళ్ళిద్దరూ విమానం చివర్లో వున్న తమ సీట్ల వైపు నడుస్తున్నారు. వాళ్ళని చూసిన విమానంలోని ప్రయాణికులకు ‘వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే..’ అనే సందేహం కలిగింది. ప్రయాణికులలో కొంతమందికి వాళ్ళెవరో వెంటనే వెలిగింది. మరికొంతమందికి కొద్ది క్షణాల తర్వాత వెలిగింది. వాళ్ళెవరో కాదు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు. అంతే, ఆ విషయం అర్థం కాగానే అందరూ షాకైపోయారు. ఆ జంట ప్రయాణికుల మధ్యలోంచి తమ సీట్లను వెతుక్కుంటూ వెళ్ళి, చివరి వరుసలో వున్న తమ సీట్లలో కూర్చున్నారు. అప్పటికే ఎలర్ట్ అయిపోయిన జనం జగన్ దంపతులను ఫొటోలు తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ హడావిడిని చూసి వైఎస్ భారతి ఇబ్బందికరంగా ముఖం పెట్టుకుంటే, జగన్ మాత్రం తనదైన ‘షిక్కటి షిరునవ్వుతో’ కూర్చున్నాడు. జగన్‌ దంపతులను ఈ పరిస్థితుల్లో జగన్ భజన బ్యాచ్ చూస్తే వాళ్ళ మనసులు ఎలా ఘోషిస్తాయంటే.... ‘‘అయ్యో జగనన్నా.. నీకు ఎంత కష్టం వచ్చింది జగనన్నా.. అయ్యో వదినమ్మా.. నీకు ఎంత కష్టం వచ్చింది వదినమ్మా.. ప్రజల సొమ్ముతో ఎలాంటి విమానాల్లో తిరిగిన జంట మీది.. గంటకి పది లక్షల రూపాయల ఖర్చుతో ఎడాపెడా విమానాల్లో తిరిగిన మీరా.. ఇలా మామూలు విమానంలో చివరి సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నది.. హయ్యో.. విధి ఎంత బలీయమైనది.. జనం సొమ్ముతో ఎప్పుడు విమానం ఎక్కినా మహారాజు, మహారాణిలా ప్రయాణం చేసేవారే... ఇప్పుడేంటి ఇలా విమానం వెనుక సీట్లలో వలస వెళ్తున్న వరద బాధితుల్లా ప్రయాణిస్తున్నారు.. విమానంలో ఈ  అవమానమేంటి జగనన్నా.. 2004 నుండి 2024 వరకు మీరు కొట్టేసిన  డబ్బుతో ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి  విమానాలు వెయ్యి కొనగలిగిన శక్తి వుండి కూడా... సైకిల్ టైర్ పంక్చర్‌ వేయించుకోవడానికి కూడా పైసలు లేవు అన్న ఫేసులతో  ఎకానమి క్లాస్‌తో ప్రయాణం చేస్తున్నారా... ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు వాడిన జగనన్నేనా ఈయన.. అడుగు బయటపెడితే పరదాల వెనుకే వున్న జగనన్నేనా ఈయన.. అయ్యో.. ఇంకా భూకంపం రాలేదేంటి.. సముద్రాలు పొంగిపోలేదేంటి.. అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదేంటి?’’

విద్యాశాఖలో సమూల మార్పులు!

విద్యాశాఖలో సమూల మార్పులు దిశగా తెలుగుదేశం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఉత్తమ ఫలితాల సాధనే  లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చుచేస్తోందనీ, ఇందుకు తగ్గట్టుగా  ఫలితాలు కనిపించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలని  ఆదేశించారు. మారుతున్న కాలానికి అగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మార్పుల కోసం విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 -20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయనీ, ప్రచార ఆర్భాటంపై కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని చెప్పారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదన్న చంద్రబాబు ఈ విషయంలో కఠినంగా ఉండాలని  ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని,  విద్యార్థుల 100 శాతం ఎన్రోల్మెంట్ జరగాలని, గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ ఉండాలని సూచించారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అక్కౌంట్ రిజిస్ట్రీ)   ద్వారా ప్రతి విద్యార్ధికి ఐడీ ఇవ్వాలని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ లు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారన్న సమాచారంపై వారందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఉన్నాయని, వాటిని సద్వినయోగం చేసుకుని పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 117పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.  గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని… పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తంచేస్తూ… డ్రాపౌట్స్ అడ్డుకట్టపై దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సిఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నామని….ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ది చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని అన్నారు.  ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు, సంస్కరణల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఒక క్లాసుకు ఒక టీచర్ అనే విధానం అమలుచేస్తున్నామని తెలిపారు. టీచర్లపై అనవసరపు ఒత్తిడి తేవడం వల్ల ఉపయోగం ఉండదని… అందుకే ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గించామని వివరించారు. ఇదే సమయంలో విద్యార్థులకు బోధన, నాణ్యత, సేవల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగం నిపుణులతో మాట్లాడి విద్యా శాఖలో నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు.  అంతకు ముందు అధికారులు రాష్ట్ర విద్యాశాఖలో ప్రస్తుత పరిస్థితిని ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  

రాష్ట్రంలో 100 ఇండస్ట్రియల్ పార్కులు!

రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న వాటిపై పరిశీలన చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఏరియా ఆధారిత ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఇ శాఖలపై సచివాలయంలో సీఎం మంగళవారం (ఆగస్టు 13) సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నపారిశ్రామికాభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఒ  కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.   గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.   రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల అభివృద్ధికి  మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, దేశంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. దేశంలో రెండవ అతిపెద్ద సముద్రతీర ప్రాంతాన్నికలిగి ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు మరిన్ని పోర్టులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.   ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల నిర్మాణం జరగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయనీ,  ఆదిశగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ పోర్టుల ఏర్పాటుకై మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిథి పదవి వరించేదెవరిని?

ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్రమంత్రి, కేంద్ర మంత్రి, స్పీకర్ తర్వాత కీలకమైన పదవి ఏదైనా ఉందంటే అది  ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి మాత్రమే. వాస్తవానికి  సీఎంలు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆయన వెన్నంటి ఉండటం, కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్ల వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. అంతకు మించి ఆ పదవిలో ఉన్న వారికి పెద్ద పనేం ఉండదు.   కానీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే కూటమికి తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకమైనది కావడం, అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి కారణంగా  ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిథి పదవికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. దాంతో సహజంగానే ఆ పదవి కోసం పోటీ పడుతున్న తెలుగుదేశం ఆశావహుల సంఖ్యా అధికంగా ఉంది. ఒక్క తెలుగుదేశం నేతలే కాదు.. తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ  బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అలాగే ఉండి ఎమ్మెల్యే ర ఘురామకృష్ణం రాజు కూడా ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిథి పదవిని ఆశిస్తున్నారు. వీరిరువురూ కాకుండా ఇంకా పలువురు  తెలుగుదేశం సీనియర్లు కూడా ఈ పదవి కోసం రేసులో ఉన్నారు.  మాజీ ఎంపి కనకమేడల రవీందర్ , మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు,  గుంటూరు మాజీ ఎంపి గల్లా జయదేవ్ లు కూడా రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని చంద్రబాబు ఆ పదవికి ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

తెలుగుదేశం నేత, మాజీ సర్పంచ్ దారుణ హత్య

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జగన్ కారుస్తున్నది మొసలి కన్నీరేనని మరో సారి రుజువైంది. హత్యలు, దాడులు అన్నీ తమ పార్టీ వారే చేస్తుంటే.. అధికార పార్టీ వారు దాడులకు పాల్పడుతున్నారంటూ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా జగన్ ప్రచారం ఉందనడానికి కర్నూలు జిల్లాలో  జరిగిన తెలుగుదేశం నాయకుడు, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసుల హత్య తాజా ఉదాహరణగా నిలుస్తుంది.   పత్తికొండ మండలం హోసూరులో  తెలుగుదేశం నేత,  మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు వైసీపీ  మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.  బహిర్భూమికి వెళ్లిన ఆయనపై వైసీపీ మూకలు దాడి చేసి కంట్లో కారం కొట్టి దారుణంగా హత్య చేశాయి.  ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం తరఫున కీలకంగా పని చేసినందుకే వాకిటి శ్రీనివాసులును వైసీపీ గూండాలు  అతి కిరాతకంగా హతమార్చాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో తిరస్కారానికి గురైనా జగన్ అండ్ కో కు బుద్ధి రాలేదనీ, ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగాని తనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.  

వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు.. నెక్ట్స్ జైలుకెళ్లేది వాళ్లేనా!

వైసీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఎప్పుడు ఎవ‌రు జైలు ఊచలు లెక్క‌పెట్టాల్సి వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న వారిలో నెల‌కొంది.  తాజాగా మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.  నేడో రేపో చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో జోగి ర‌మేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.   తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీ కోసం పోలీసుల‌ వేట కొన‌సాగుతోంది. మొత్తానికి వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. ఎలాంటి హ‌డావిడి లేకుండా చ‌ట్ట‌ ప్ర‌కారం వీరి అరెస్టుల విష‌యంలో ప్ర‌భుత్వం ముందుకెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. తెలుగుదేశం కూటమి  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు అయ్యింది. ఈ స్వ‌ల్ప కాలంలో సీఎం చంద్ర‌బాబ నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు సైతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల అరెస్టుల వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌లు స‌మ‌ర్ధిస్తున్నారు. వైసీపీ హ‌యాంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి వాళ్లను జైళ్ల‌కు పంపించేందుకే అధిక ప్రాధాన్య‌త‌ ఇచ్చారు. ఈ క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడునుసైతం అక్ర‌మంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. వైసీపీ ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన ప్ర‌తి ఒక్క‌రిపై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం,  జైళ్ల‌కు పంపించ‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింది. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా వైసీపీ నేత‌లు ఇష్ట‌ారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  చంద్ర‌బాబు స‌తీమ‌ణిని అసెంబ్లీ వేదిక‌గా అవ‌మానించారు.  క‌క్ష‌పూరిత పాల‌న‌తో పాటు రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి లేక‌పోవ‌టంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాల‌కు వైసీపీని ప‌రిమితం చేసి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు త‌న అపార పాల‌నా అనుభ‌వంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఐదేళ్ల కాలంలో అదుపు త‌ప్పిన శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. త‌ద్వారా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకొచ్చేలా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేశారు. దీంతో చంద్ర‌బాబు రెండు నెల‌ల పాల‌న ప‌ట్ల అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల‌పై క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, రాష్ట్ర అభివృద్ధే త‌మ మొద‌టి ప్రాధాన్య‌తగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, లోకేశ్ ముందుకెళ్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను స‌ముదాయిస్తూ రాష్ట్రంలో ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం మంచిత‌నాన్ని సాకుగా తీసుకొని ప‌లువురు వైసీపీ నేత‌లు ఇంకా అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్నట్లుగా  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగుతున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను చంపేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో  తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా త‌మ‌పై వైసీపీ నేత‌లు దాడులు కొన‌సాగుతున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారిని సముదాయిస్తూనే  రెచ్చిపోతున్న వైసీపీ నేత‌ల‌పై కొర‌ఢా ఝుళిపిస్తున్నారు. అదే సమయంలో  గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు, భూదందాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌ను చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున భూక‌బ్జాల‌కు పాల్ప‌డినట్లు ఆరోప‌ణ‌లుఉన్న‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ప్ర‌భుత్వం దృష్టిసారించింది. ప్ర‌భుత్వం ఆదేశాల‌తో అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  వంద‌లాది ఎక‌రాల భూముల‌ను పెద్దిరెడ్డి క‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని అధికారుల విచార‌ణ‌లో తేలింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో పెద్దిరెడ్డి అరెస్టు ఖాయ‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మ‌రోవైపు చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో జోగి ర‌మేశ్ పై ఇప్ప‌టికే కేసు న‌మోదైంది. ఆయ‌న్ను త్వ‌ర‌లోనే విచారించి అరెస్టు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ జోగి రమేష్ కు కోర్టులో ఊరట లభించలేదు. అలాగే గన్నవరం తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ కోసం పోలీసుల వేట కొన‌సాగుతోంది.  తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విష‌యంలో జోగిర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.  వీరి త‌రువాత ఎవ‌ర‌నే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. కొడాలి నాని, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తోపాటు ప‌లువురు వైసీపీ నేత‌లు త్వ‌ర‌లో అరెస్టు అవ్వ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ వర్గాలే అంటున్నారు. దీంతో  ఎవరు ఎప్పుడు అరెస్టవుతారా అన్న భయం వైసీపీ నేతలలో వ్యక్తం అవుతోంది.  

కాంగ్రెస్ వైపు జ‌గ‌న్ చూపు.. ష‌ర్మిళ‌ గేమ్‌ప్లాన్ షురూ !

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూట‌మితో జ‌త క‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో తీవ్ర ఇబ్బందులు పడిన  ఏపీ జనం తెలుగుదేశం కూట‌మికి భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రెండు నెల‌ల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. మ‌రో వైపు అధికారంలోఉన్న స‌మయంలో పెద్ద ఎత్తున భూముల క‌బ్జాలు, అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. పూర్తిస్థాయిలో ఆధారాలు సేక‌రించి చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేందుకు పోలీస్ ఉన్న‌తాధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు ఒక్కొక్కరుగా జైలు కెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూ దందా వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లో ఆయ‌న అరెస్ట్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు అగ్రి గోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో త్వ‌ర‌లో జోగి ర‌మేశ్, టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులోవ‌ల్ల‌భ‌నేని వంశీ.. ఇలా ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌లు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న‌పై పదకొండు కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జ‌రుగుతోంది. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణం రాజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ.. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వంలోనూ భాగ‌స్వామిగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు నాయుడు కీల‌కంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విష‌యంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మ‌రోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక్కొక్క‌రుగా జ‌గ‌న్ కు దూర‌మ‌వుతున్నారు  అధికారం కోల్పోయిన త‌రువాత అన్నివైపుల నుంచి ముప్పు త‌రుముకొస్తుండ‌టంతో జ‌గ‌న్ అల‌ర్ట్ అవుతున్నారు. ఎన్డీయే కూట‌మి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవ‌డంతో ఇండియా కూట‌మిలో చేరితే కాస్త‌యినా జాతీయ పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది‌. ఈ క్ర‌మంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం శివ‌కుమార్ ద్వారా ఇండియా కూట‌మిలో భాగ‌స్వామి అయ్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు  సాగిస్తున్నార‌ని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయ‌న త‌ర‌చూ బెంగ‌ళూరు వెళ్తున్నార‌ు‌. ఇటీవ‌ల బెంగ‌ళూరు వెళ్లిన స‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో జ‌గ‌న్ భేటీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.   వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జ‌గ‌న్ రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు స‌మాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయ‌డం కాకుండా ఇండియా కూట‌మిలో చేర‌తామ‌ని రాహుల్ తో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని సూచ‌న చేసిన‌ట్లు స‌మాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోర్కెలు కోరగా, రాహుల్ గాంధీ వాటికి నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి, ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్ తో అన్నట్టు సమాచారం.   స‌మ‌యం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాహుల్ సూచించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండ‌టంలో ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల అల‌ర్ట్ అయ్యారు.   ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న మార్పుల‌కు అనుగుణంగా భవిష్యత్ ను అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు‌. కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల తీరుతో ఇప్ప‌టికే ఓ వ‌ర్గం అసంతృప్తితో ఉన్న‌ట్ల తెలుస్తోంది. వారికి చెక్ పెట్ట‌డంతో పాటు.. ఒక‌వేళ జ‌గ‌న్   కాంగ్రెస్ పార్టీతో జత‌ క‌లిసినా, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇబ్బందులు తలెత్త‌కుండా పార్టీలో త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేయడంపై ఆమె దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌, జిల్లా స్థాయి క‌మిటీల్లో త‌న‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ష‌ర్మిల ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నారు‌. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.. ఆసమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసీసీ నేతలకు ఆ సందర్భంగా షర్మిల పెద్ద జాబితానే సమర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపరిచారని స‌మాచారం. త‌న అనుకూల వ‌ర్గానికి పార్టీ ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో త‌న ప‌ట్టు చేజారిపోకుండా ష‌ర్మిల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

దువ్వాడ రాజీనామా.. జగన్ ఆదేశం?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి వ్యవహారం గత ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్టాలో సంచలనంగా మారిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్  వైసీపీ  పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. బుధ లేదా గురువారం నాడు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో దువ్వాడ శ్రీనివాస్ వున్నట్టు విశ్వసనీయవర్గాల భోగట్టా.  అధికారంలో వుండగా వైసీపీ మంత్రుల భాగోతాలు, ప్రభుత్వం పోయాక విజయసాయిరెడ్డి - శాంతి ఘటన, తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ ఘటన, కాకినాడ నుంచి ద్వారంపూడి రాసలీలలు, మరోవైపు సజ్జల రాసలీలలు.. ఇలా వరుస ఘటనలతో ఉక్కిరి బిక్కిరి అయిన జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ని బయటకి తరమడం ద్వారా పార్టీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే... వైసీపీ నాయకులు వరుసగా లైంగిక నేరాల్లో ఇరుక్కుంటూ వుండటంతో మన పార్టీకి ఇదేమి ఖర్మ అంటూ వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

వినేష్ ఫొగాట్ కేసు.. 16న తీర్పు!

వినేష్ ఫొగాట్ కేసులో తీర్పు వాయిదా పడింది. ఆగస్టు 16వ తేదీన తీర్పు వెలువరించనున్నట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) ప్రకటించింది. వంద గ్రాముల బరువు ఎక్కువ వున్నందుకు పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని రెజ్లర్ వినేష్ ఫొగాట్ సవాలు చేసింది. ఈ వ్యవహారంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ని వినేష్ ఫొగాట్ ఆశ్రయించింది. సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. కానీ ఈసారి ‘కాస్’ న్యాయమూర్తులు తీర్పు గడువును పలుసార్లు పొడిగించారు. మంగళవారం నాడు కూడా కాసేపట్లో తీర్పు వస్తుందని అందరూ భావిస్తూ వుండగా, ‘కాస్’ ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ఆ కాల్స్ చచ్చినట్టు ఆపండి!

మనం ఏదో పనిలో వుంటాం. లేదా ఏ వెహికల్ మీదో ప్రయాణం చేస్తూ వుంటాం. ఇంతలో సెల్ మోగుతుంది. ఏదో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తూ వుంటుంది. ఏ ఇంపార్టెంట్ ఫోనో అనుకుని మనం లిఫ్ట్ చేస్తాం. హలో అంటాం. అవతల నుంచి నీ హలో ఎవడిక్కావాలన్నట్టు ఏదో రికార్డెడ్ మెసేజ్ వినిపిస్తూ వుంటుంది. లోన్ ఇస్తామనో... రియల్ ఎస్టేట్ అనో మెసేజ్ వినిపిస్తూ వుంటుంది. మనకి ఫోన్ నేలకేసి కొట్టాలన్న ఆవేశం వచ్చినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ వుంటాం. ఇలాంటి కాల్స్.ని టెలీకాం సంస్థలు తక్షణం చచ్చినట్టు ఆపి తీరాల్సిందేనని టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసింది. అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ల నుంచి ప్రమోషన్ కాల్స్, ప్రీ రికార్డెడ్ కాల్స్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్.ని తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ టెలీకాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్ మీద వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఏ టెలీకాం కంపెనీ అయినా ఈ తరహా కాల్స్.కి అనుమతి ఇస్తే ఆ సంస్థకు రెండేళ్ళపాటు యాక్సెస్ నిలిపివేయడంతోపాటు, ఆ సంస్థను రెండేళ్ళపాటు బ్లాక్ లిస్టులో పెడతామని ట్రాయ్ హెచ్చరించింది. 

దువ్వాడకి జగన్ వార్నింగ్!

దువ్వాడ శ్రీనివాస్‌తో ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రచ్చ రచ్చ అయిన తర్వాత, దువ్వాడ వారితో ‘అడల్ట్రీ’ చేస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం డ్రామాకి తెర తీశారు. సేఫ్టీగా వుండే కారులో రోడ్డు మీదకి వచ్చింది. ఎదురుగా కనిపించిన కారుని తన కారుతో ఢీకొట్టింది. తాను ఊహించినట్టుగానే గాయాలేవీ లేకుండా సేఫ్‌గా బయటపడింది. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత నాకు ట్రీట్‌మెంట్ వద్దు.. నన్ను చచ్చిపోనివ్వండి అని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలుకుంది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూ మొత్తాన్నీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేయడానికి తీవ్రంగా ప్రయత్నించి ఫెయిలైంది. ఒక రోజు గడిచాక, చక్కగా మేకప్ చేసుకుని, ఆస్పత్రి బెడ్ మీద నుంచే తెలుగు సమాజానికి ఒక సందేశాన్ని పంపింది. ఆ సందేశంలో దివ్వెల మాధురి ఏం చెప్పిందంటే, ‘‘కోట్ల రూపాయల డబ్బును చూశాను.. చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే వుంటుందని నమ్మాను. కానీ మనుషుల్లో మోసమే వుంటుందని తెలుసుకున్నాను. అందుకే ఇలా నలిగిపోయాను’’... అదీ విషయం. మహా జాదూ అయిన దివ్వెల మాధురిలో ఈ నిర్వేదం ఎందుకో తెలుసా? తనకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో వున్నప్పటికీ, తన ‘అడల్ట్రీ’ దువ్వాడ శ్రీనివాస్ ఆస్పత్రికి రాలేదు.. తనని పరామర్శించలేదు. నిన్ను చూడాలని వుంది అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఆస్పత్రికి రావడం మాత్రం కుదరదు అని చెప్పేశాడు. దాంతో దువ్వాడ శ్రీనివాస్‌ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి దివ్వెల మాధురి ఈ రకంగా ఎమోషనల్ సందేశాన్ని సమాజానికి అందించింది. తాను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించిన మాధురి ఆస్పత్రిలో వుంటే దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఆస్పత్రికి రాలేదు. ఏ దివ్వెల మాధురి కోసమైతే భార్యని, కూతుళ్ళని వదులుకున్నాడో.. ఆ దివ్వెల మాధురి పాపం ఆ రకంగా దీనంగా వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఎందుకు ఆమె దగ్గరకి వచ్చి ఓదార్చకుండా వున్నాడు? వాళ్ళ నాయకుడు జగన్ అవసరం లేకపోయినా ఓదార్చడానికి రెడీ అయిపోతాడే... మరి ఈయన తనకు అవసరం వున్న మనిషి ‘ఆపద’లో వుంటే కనీసం పరామర్శకు కూడా ఎందుకు వెళ్ళలేదు.. ఇంట్లో కూర్చుని మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. మాధురి దగ్గరకి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నాడే తప్ప, ఇంట్లోంచి అడుగు బయటకి ఎందుకు వేయడం లేదు? దీనికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోంచి బయటకి వస్తే, ఆయన భార్య వాణి, కుమార్తెలు శ్రీనివాస్ ఇప్పుడు నివాసం వుంటున్న ఇంటిని తమ అధీనంలోకి తెచ్చుకుని శ్రీనివాస్‌ని రోడ్డు మీద నిలబెడతారన్న భయం. ఇంకోటి ఏమిటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్వెల మాధురి దగ్గరకి వెళ్ళడానికి వీల్లేదంటూ జగన్ నుంచి వచ్చిన సీరియస్ వార్నింగ్. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రచ్చ రంబోలా అయిపోగానే జగన్ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కి వర్తమానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక నువ్వు దివ్వెల మాధురితో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకూడదనేది ఆ వర్తమానం సారాశం. మీ ఇద్దరి వల్ల పార్టీ పరువు (ఇంకా ఏదో ఉన్నట్టే) సర్వనాశనం అయిపోతోంది కాబట్టి, ఆమెతో నువ్వు తెగతెంపులు చేసుకోవాల్సిందే. నీకు మాధురి కావాలని ఫిక్సయితే పార్టీని వదిలిపెట్టు అని జగన్ తన వర్తమానంలో స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్ళలేక, ఇంట్లో వుండలేక కుమిలిపోతున్నారు. ఇక్కడేమో ఆస్పత్రిలో దివ్వెల మాధురి ఎమోషనల్ డైలాగులతో వీడియోలు చేసుకుంటూ తన ‘అడల్ట్రీ’ రాక కోసం వేచి చూస్తోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఒక సినిమా పాట గుర్తొస్తోంది.. ‘‘పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తన చేసిన బొమ్మలతో తలపడతాడు’’.

తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు 

తెలంగాణ హాస్టళ్ల పై ఎసీబీ తనిఖీలు చేసింది.   విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపడం, రికార్డుల్లో అవకతవకలు చేయడం సహా తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. తెల్లవారుజామునే హాస్టళ్లకు చేరుకుని విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో అధికారులు దాడులు చేస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఎంతమంది.. రికార్డులో ఎంతమంది ఉన్నట్లు చూపిస్తున్నారనే లెక్కలు సరిచూస్తున్నారు. వారికి పెడుతున్న ఆహారాన్ని స్వయంగా పరీక్షించి చూశారు. మంగళవారం సాయంత్రం వరకూ ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, వివిధ సదుపాయాలకు హాస్టల్ నిర్వాహకులు గండికొడుతున్నారని, తప్పుడు బిల్లులతో కాజేస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.

అయ్యా కొడుకులకి అండర్‌స్టాండింగ్ లేనట్టుంది!

ఆత్రంగా అవినీతి చేయడం తప్ప అయ్యా కొడుకులు జోగి రమేష్, జోగి రాజీవ్ మధ్య సరైన అండర్‌స్టాండింగ్ లేనట్టుంది. పాపాలు పండి దొరికిపోయినప్పుడు తోడుదొంగలు ఇద్దరూ ఒకేమాట చెప్పాలన్న కనీస పరిజ్ఞానం వీళ్ళకి లేనట్టుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేష్ పుత్రరత్నం జోగి రాజీవ్‌ని పోలీసులు అరెస్టు చేసినప్పడు జోగి రమేష్ ఆవేశంగా రోడ్డు మీదకి వచ్చి ‘‘అటాచ్‌మెంట్‌‌లో వున్న భూములని ఎవరైనా కొంటారా?’’ అని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ వైసీపీ వాళ్ళ బుద్ధులు తెలియనివాళ్ళు ఎవరైనా జోగి రమేష్ ఆవేశం చూశారంటే, తండ్రికొడుకులిద్దరూ అమాయక చక్రవర్తులు అని పొరపడే అవకాశం వుంటుంది. కానీ, వీళ్ళ జాతకం అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అలా అపోహ పడే అవకాశం లేదులెండి. రోడ్డు మీద తండ్రి ఇలా ఆవేశంగా ప్రశ్నించాడా? పోలీసుల కస్టడీలో వున్న జోగి రాజీవ్ తన దగ్గరకి వచ్చిన మీడియా ప్రతినిధులతో ‘‘అందరూ కొన్నట్టే మేమూ కొన్నాం... ఇందుతో తప్పేంటి’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. జోగి రమేష్ తన కొడుక్కి అవినీతి ఎలా చేయాలో నేర్పించాడుగానీ, దొరికిపోయినప్పుడు ఎలా మాట్లాడాలో చిలక పలుకుల్లాగా నేర్పించినట్టు లేడు. అసలింతకీ ఏంటీ అగ్రిగోల్డ్ భూ కబ్జా భాగోతం? సింపుల్‌గా చెప్పాలంటే, అగ్రిగోల్డ్ స్కామ్‌కి సంబంధించిన భూమి సర్వే నంబర్ 87. ఈ సర్వే నంబర్లో భూమి అటాచ్‌మెంట్‌లో వుంది కాబట్టి దీనిని ఎవరూ కొనడానికి వీల్లేదు. మన జోగి రమేష్ ఏం చేశాడంటే, 87 సర్వే నంబర్ పక్కనే వున్న, ఎలాంటి వివాదాలు లేని 88 సర్వే నంబర్లో  భూమిని కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సర్వే నంబర్ తప్పు పడిందంటూ 88వ నంబర్ని 87వ నంబర్‌గా మార్చుకున్నాడు. ఈ రకంగా అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారు. కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని జోగి రమేష్ బినామీ అయిన వైసీపీ కార్పొరేటర్‌కి అమ్మేశారు. ఇంత జరిగింది!

మళ్లీ వలసలు షురూ!.. బీఆర్ఎస్ కు ఇక దబిడి దిబిడే.. విపక్ష హోదా హుళక్కే!?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్ధితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు కార్యకర్తలతో మమేకమౌతో, అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ చురుకుగా కనిపిస్తున్నా, అధినేత క్రియాశీలంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వలసలకు పార్టీ తలుపులు బార్లా తీశారో.. ఇంచుమించు అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వారి రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డిమాండ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందిదేగా అంటూ జనం కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ సాధించగలిగేది పెద్దగా ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో కోర్టులు నిర్దేశించజాలవు. దీంతో  అనర్హత వేటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు.  గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోందన్న భావన విపక్షాలలో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం ఆరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు తెలంగాణ రాజకీయాలలో మరోసారి సెగపుట్టించాయి.రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మళ్లీ వలసల జోరు పెరుగుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారనీ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగా రాగానే ఈ వలసలు ఉంటాయని బీఆర్ఓస్ వర్గాలే చెబుతున్నాయి.  వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోవడం వెనుక నీవునేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చిన్న రివెంజ్ ఉన్నప్పటికీ ..అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దానం నాగేందర్ తో మొదలై ఇప్పటి వరకూ విడతల వారీగా ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో పదహారు మంది అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా  పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగా పావులు కదిపారు. అయితే కారణాలేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి  దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో అరడజను మంది కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు.  మరో పదిమందిపైనా రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టనున్నట్లు చెబుతున్నారు.  అయితే అలా వచ్చి చేరేవారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక రార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

దానం నాగేందర్ కు బిగ్ షాక్, కేసు నమోదు  

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం గోడ దూకడు వ్యవహారంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో నిరసన వ్యక్తమౌతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు  సంబంధించి పార్కు గోడను దానం అనుచరులు కూల్చివేశారు. దానం సమక్షంలోనే ఈ కూల్చివేత జరిగిందని అధికారులు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానంపై కేసు నమోదు చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది. కూల్చివేత వల్ల 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తనపై కేసు నమోదు చేయించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని దానం నాగేందర్ అంటున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలు అని, అధికారులు వస్తుంటారు వెళుతుంటారు నేను లోకల్ అని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. నందగిరి హిల్స్ లోని పార్కు గోడను దానం కూల్చివేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నందిగిరి హిల్స్ వద్ద ఉన్న పార్కు గోడను ఎమ్మెల్యే, అతని అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్  ఇన్‌ఛార్జ్ వి పాపయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ అనతి కాలంలోనే  కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా  ఎదిగారు. మూడు పర్యాయాలు  ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. . 2004లో మాత్రం నాగేందర్   కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జంప్ అయ్యారు ఆతర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రయ్యారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దానం బిఆర్ఎస్ లో చేరి మంత్రిగా కొనసాగారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ వేవ్ లో తిరిగి మాతృసంస్థ అయిన కాంగ్రెస్ లో చేరడం  వివాదాస్పదమైంది. పైగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ పోలీస్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.