దువ్వాడకి జగన్ వార్నింగ్!
posted on Aug 13, 2024 @ 4:31PM
దువ్వాడ శ్రీనివాస్‌తో ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రచ్చ రచ్చ అయిన తర్వాత, దువ్వాడ వారితో ‘అడల్ట్రీ’ చేస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం డ్రామాకి తెర తీశారు. సేఫ్టీగా వుండే కారులో రోడ్డు మీదకి వచ్చింది. ఎదురుగా కనిపించిన కారుని తన కారుతో ఢీకొట్టింది. తాను ఊహించినట్టుగానే గాయాలేవీ లేకుండా సేఫ్‌గా బయటపడింది. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత నాకు ట్రీట్‌మెంట్ వద్దు.. నన్ను చచ్చిపోనివ్వండి అని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలుకుంది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూ మొత్తాన్నీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేయడానికి తీవ్రంగా ప్రయత్నించి ఫెయిలైంది. ఒక రోజు గడిచాక, చక్కగా మేకప్ చేసుకుని, ఆస్పత్రి బెడ్ మీద నుంచే తెలుగు సమాజానికి ఒక సందేశాన్ని పంపింది. ఆ సందేశంలో దివ్వెల మాధురి ఏం చెప్పిందంటే, ‘‘కోట్ల రూపాయల డబ్బును చూశాను.. చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే వుంటుందని నమ్మాను. కానీ మనుషుల్లో మోసమే వుంటుందని తెలుసుకున్నాను. అందుకే ఇలా నలిగిపోయాను’’... అదీ విషయం. మహా జాదూ అయిన దివ్వెల మాధురిలో ఈ నిర్వేదం ఎందుకో తెలుసా? తనకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో వున్నప్పటికీ, తన ‘అడల్ట్రీ’ దువ్వాడ శ్రీనివాస్ ఆస్పత్రికి రాలేదు.. తనని పరామర్శించలేదు. నిన్ను చూడాలని వుంది అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఆస్పత్రికి రావడం మాత్రం కుదరదు అని చెప్పేశాడు. దాంతో దువ్వాడ శ్రీనివాస్‌ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి దివ్వెల మాధురి ఈ రకంగా ఎమోషనల్ సందేశాన్ని సమాజానికి అందించింది.
తాను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించిన మాధురి ఆస్పత్రిలో వుంటే దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఆస్పత్రికి రాలేదు. ఏ దివ్వెల మాధురి కోసమైతే భార్యని, కూతుళ్ళని వదులుకున్నాడో.. ఆ దివ్వెల మాధురి పాపం ఆ రకంగా దీనంగా వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఎందుకు ఆమె దగ్గరకి వచ్చి ఓదార్చకుండా వున్నాడు? వాళ్ళ నాయకుడు జగన్ అవసరం లేకపోయినా ఓదార్చడానికి రెడీ అయిపోతాడే... మరి ఈయన తనకు అవసరం వున్న మనిషి ‘ఆపద’లో వుంటే కనీసం పరామర్శకు కూడా ఎందుకు వెళ్ళలేదు.. ఇంట్లో కూర్చుని మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. మాధురి దగ్గరకి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నాడే తప్ప, ఇంట్లోంచి అడుగు బయటకి ఎందుకు వేయడం లేదు?
దీనికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోంచి బయటకి వస్తే, ఆయన భార్య వాణి, కుమార్తెలు శ్రీనివాస్ ఇప్పుడు నివాసం వుంటున్న ఇంటిని తమ అధీనంలోకి తెచ్చుకుని శ్రీనివాస్‌ని రోడ్డు మీద నిలబెడతారన్న భయం. ఇంకోటి ఏమిటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్వెల మాధురి దగ్గరకి వెళ్ళడానికి వీల్లేదంటూ జగన్ నుంచి వచ్చిన సీరియస్ వార్నింగ్.
దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రచ్చ రంబోలా అయిపోగానే జగన్ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కి వర్తమానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక నువ్వు దివ్వెల మాధురితో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోకూడదనేది ఆ వర్తమానం సారాశం. మీ ఇద్దరి వల్ల పార్టీ పరువు (ఇంకా ఏదో ఉన్నట్టే) సర్వనాశనం అయిపోతోంది కాబట్టి, ఆమెతో నువ్వు తెగతెంపులు చేసుకోవాల్సిందే. నీకు మాధురి కావాలని ఫిక్సయితే పార్టీని వదిలిపెట్టు అని జగన్ తన వర్తమానంలో స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో దువ్వాడ శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్ళలేక, ఇంట్లో వుండలేక కుమిలిపోతున్నారు. ఇక్కడేమో ఆస్పత్రిలో దివ్వెల మాధురి ఎమోషనల్ డైలాగులతో వీడియోలు చేసుకుంటూ తన ‘అడల్ట్రీ’ రాక కోసం వేచి చూస్తోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఒక సినిమా పాట గుర్తొస్తోంది.. ‘‘పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తన చేసిన బొమ్మలతో తలపడతాడు’’.