కిరణ్ కుమార్ రెడ్డి బాటలో రేవంత్ ?
posted on Aug 14, 2024 @ 1:56PM
ప్రకృతిని అడ్డుకుంటే అది వినాశనానికి దారి తీస్తుంది. పంచభూతాలను డిస్ట్రబ్ చేస్తే అది జన జీవనాన్నే అస్త్యవ్యస్తం చేస్తుంది. చెరువులను కబ్జా చేస్తే వరదలు రావడం సహజమే. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే చెరువులను పరిరక్షించాలి. కానీ మన పాలకులు వోట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం మామూలే. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ వోటు బ్యాంకు రాజకీయాలను పాలకులు ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను రూపొందించింది. బహదూర్ పురా నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు హిందువులు అయినప్పటికీ ప్రతీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. బిజెపి , మజ్లిస్ మధ్య నువ్వానేనా అన్నట్లు ఎన్నికలు జరిగేవి. కానీ మజ్లిస్ చెప్పు చేతల్లో ఉండే కాంగ్రె స్ పార్టీ ప్రభుత్వం బహదూర్ పురా నియోజకవర్గాన్ని పునర్విభజించింది. ఈ పునర్ విభజనలో మెజార్టీ హిందువుల వోట్లు చీలిపోయే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకరించారు. ఇప్పుడు అక్కడ పోటీ ఎవరూ లేకపోవడంతో మజ్లిస్ గెలుస్తూ వస్తోంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. మజ్లిస్ పట్ల రోశయ్య మెతకవైఖరితో ఉన్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారు. మహావీర్ హాస్పిటల్ లీజుకు ఇవ్వాలని మజ్లిస్ పెట్టుకున్న వినతిని కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అప్పటికే అస్రా హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్స్ విజయవంతంగా నడుపుతున్న ఓవైసీ బ్రదర్స్ కన్ను మహావీర్ హాస్పిటల్ మీద పడింది. లీజుకు ఇవ్వడడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. భాగ్య లక్ష్మి అమ్మవారిని దూషించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువుల పని పడతానని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా హిందువులు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి కేసులు నమోదు చేశారు. విద్వేష ప్రసంగం చేసినందుకు గాను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కూడా కేసు నమోదు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఈ కేసుల్లో చార్జ్ షీట్ నమోదు చేసి ఓవైసీ బ్రదర్స్ ను కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు పంపారు. ఈ కేసుల పర్యవ్యసానంగా మజ్లిస్ పార్టీ కేంద్రంలో యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన మజ్లిస్ పార్టీ తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దత్తుగా నిలిచింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దత్తు వహించే మజ్లిస్ తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచిన మజ్లిస్ కు మళ్లీ ఆశాభంగమైంది. అక్రమకట్టడాలను కూల్చి వేసే ప్రక్రియ పాతబస్తీ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను నేలకూల్చింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువు భూమిలో అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. ఎంఐఎం ఇలాఖాలో అక్రమకట్టడాలను కూల్చివేస్తున్నందుకు బహదూర్ ఎమ్మెల్యే ముబీన్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముబీన్ ను అదుపులోకి తీసుకుంది. కొత్తగా చార్జ్ తీసుకున్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ దూకుడు పెంచడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి.