దువ్వాడ రాజీనామా.. జగన్ ఆదేశం?
posted on Aug 13, 2024 @ 10:23PM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి వ్యవహారం గత ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్టాలో సంచలనంగా మారిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. బుధ లేదా గురువారం నాడు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో దువ్వాడ శ్రీనివాస్ వున్నట్టు విశ్వసనీయవర్గాల భోగట్టా.
అధికారంలో వుండగా వైసీపీ మంత్రుల భాగోతాలు, ప్రభుత్వం పోయాక విజయసాయిరెడ్డి - శాంతి ఘటన, తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ ఘటన, కాకినాడ నుంచి ద్వారంపూడి రాసలీలలు, మరోవైపు సజ్జల రాసలీలలు.. ఇలా వరుస ఘటనలతో ఉక్కిరి బిక్కిరి అయిన జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ని బయటకి తరమడం ద్వారా పార్టీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే... వైసీపీ నాయకులు వరుసగా లైంగిక నేరాల్లో ఇరుక్కుంటూ వుండటంతో మన పార్టీకి ఇదేమి ఖర్మ అంటూ వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.