హైదరాబాద్ లో  డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లు పట్టుబడ్డారని చెప్పారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పేర్కొన్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.4.34 కోట్లు ఉంటుందని వివరించారు. ఈమేరకు ఎస్‌వోటీ పోలీసులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్ వోటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్ స్మగ్లర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు రాజస్థాన్ కు చెందిన వారని తెలిపారు.

ఎట్ హోం లో జగన్ ఎక్కడా కనిపించలేదేం?

పంద్రాగస్టు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ గురువారం సాయంత్రం తన నివాసమైన రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ పురస్కార గ్రహీతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం గైర్హాజరయ్యారు. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. అయినా జగన్ హాజరు కాకపోవడానికి కారణాలేమిటన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ గైర్హాజరుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించకుండా డుమ్మా కొట్టడానికి కారణం ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల హాజరు కావడమేనని అంటున్నారు. వీరిరువురినీ ఫేస్ చేసే ధైర్యం లేకే జగన్ ఎట్ హోం కార్యక్రమానికి ముఖం చాటేశారన్నది పరిశీలకుల విశ్లేషణ్. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే   ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు నారా లోకేష్‌, సిఎస్ నీరబ్ కుమార్, డిజిపి ద్వారకా తిరుమల రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్‌ ఠాకూర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అదే విధంగా రాష్టర  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు  హాజరయ్యారు. అహ్లాదపూర్వక వాతావరణం జరిగిన ఈ విందుకు హాజరైన వారంతా ఎలాంటి అరమరికలూ లేకుండా  పరస్పరం పలకరించుకొని మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్ద వైఎస్ షర్మిలని ఆప్యాయంగా పలకరించారు.   ఈ కార్యక్రమం సుమారు గంటసేపు సాగింది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ విందుకు కనీసం ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా లేని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరయ్యారు. ఈ విందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిందో, వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఇచ్చిందో కాదు. ఏటా పంద్రాగస్టు నాడు సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందు.  పార్టీలూ, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ హాజరవ్వడం విధాయకం. అయితే అటువంటి సంప్రదాయలు, ఆనవాయితీలను పట్టించుకోకుండా జగన్ గైర్హాజర్ కావడం ద్వారా తనను తాను తగ్గించుకున్నారు. తనను తాను అగౌరవ పరుచుకున్నారు. జగన్ తీరు చూస్తుంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తో సరిపడటం లేదంటూ కేసీఆర్ కూడా ఎట్ హోంను బహిష్కరించేవారు.  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించకపోవడంలో జగన్, కేసీఆర్ లు దొందూదొందేనని పరిశీలకులు అంటున్నారు. తమ తీరుద్వారా అదే నిజమని వీరిరువురూ పదే పదే రుజువు చేస్తున్నారు. 

ఇస్రో ప్రయోగం విజయవంతం

వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది.  ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.  చంద్రబాబు అభినందనలు: ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందన్న సీఎం, ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

విలీనం కాదు పొత్తే!?

బీఆర్ఎస్, బీజేపీ బంధం తొలి నుంచీ కూడా పలు అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉంది. 2023 ఎన్నికలకు ముందు ఉప్పు, నిప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గట్టి బాండ్ ఉందన్న ఆరోపణలు వినిపించాయి. విమర్శల పర్వం అంతా  ఎలక్షన్ స్ట్రాటజీయేననీ, కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే ఇరు పార్టీలూ ప్రధాన ప్రత్యర్థులుగా ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నమేననీ అప్పట్లో పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను అధికారంలో ఉండగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ  దేశ వ్యాప్తంగా పర్యటనలు జరిపిన సంరద్భంగా కూడా ఆయన కలిసిన రాజకీయ పార్టీల నేతలెవరయ్యా అంటూ వారంతా బీజేపీ వ్యతిరేక పర్టీలకు చెందిన వారే. అంటే కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉన్నవారే. దీంతో అప్పట్లోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్షపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైకి తీవ్రమైన బీజేపీ వ్యతిరేకత ప్రదర్శిస్తూ.. లోలోపల కేసీఆర్ చేసిందంతా ఆ పార్టీకి అనుకూలమైన పనులేనని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అలా చేయడం ద్వారా మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకుండా కాపాడుకునేందుకేనని వారు అప్పట్లో పేర్కొన్నారు. వాస్తవంగా అప్పట్లో అంటే ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యే వరకూ కవిత అరెస్టు కాలేదు.  ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయడానికి పార్టీని  బీజేపీలో విలీనం చేసి రక్షణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చాలా గట్టిగా ఖండించారు.  అదే సమయంలో విలీనం కాదు పొత్తు అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.   గత ఏడాది చివరిలో  తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పారాజయం పాలై బీఆర్ఎస్ గద్దె దిగింది. ఆ తరువాత ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో  బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో చెప్పిన భాష్యమే బీఆర్ఎస్, బీజేపీల రహస్య బంధాన్ని బట్టబయలు చేసింది. సార్వత్రిక ఎన్నికలలో  ఏ కూటమిలోనూ లేని పార్టీలను జనం ఆదరించలేదని తమ పార్టీ జీరో పెర్ఫార్మెన్స్ కు కారణంగా కేటీఆర్ భాష్యం చేప్పారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలగడం అసాధ్యమని వారు బాహాటంగానే చెబుతున్నారు.  నేతలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్ లో  బీజేపీతో కలిసి పని చేస్తామని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు.   ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతున్న  సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. అలాగే త్వరలో రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీల మధ్య పరస్పర సహకారం ఇరు పార్టీలకూ అవసరం. ఈ కారణంగానే విలీనం లేదంటూనే పొత్త తథ్యమన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేవినేని అవినాష్ దుబాయ్‌కి జంప్ ప్లాన్... అడ్డుకున్న పోలీసులు!

లోకేష్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేయకముందే వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ లాగూలు తడిచిపోతున్నాయి. పుట్టగానే పువ్వు పరిమళించినట్టు తక్కువ వయసులోనే రకరకాల క్రిమినల్ వేషాలు నేర్చుకున్న వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నాయకుల పాపాలు పండుతూ వుండటంతో దేవినేని అవినాష్ ఫారిన్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే దేవినేని అవినాష్ ప్లాన్‌ను మంగళగిరి పోలీసులు పటాపంచలు చేశారు. గురువారం రాత్రం హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించాడు. దాంతో  శంషాబాద్ విమానాశ్రయం అధికారులు  మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. దేవినేని అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు చెప్పారు. దాంతో దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని విమానాశ్రయం అధికారులు చెప్పారు. ఇక చేసేదేమీ లేక దేవినేని అవినాష్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా వున్నవారి మీద పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

తెలంగాణ మహిళలను దారుణంగా అవమానించిన కేటీఆర్!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడతారో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఆయన అహంకారం కూడా ఒక కారణం అనే విషయం అందరికీ తెలుసు.. ఒక్క కేటీఆర్‌కి తప్ప! ఇంత జరిగినా తనకు ఎంతమాత్రం అహంకారం లేదని చాలా అహంకారంతో కూడిన వాయిస్‌తో కేటీఆర్ చెబుతూ వుంటారు. ఇంత జరిగినా తన శైలిని మార్చుకోకుండా అహంకారపు మాటలు మాట్లాడుతూ వుంటారు. ఇంతకాలం ఆంధ్రావాళ్ళ మీద, కాంగ్రెస్, బీజీపీల మీద తన అహంకారం చూపించిన కేటీఆర్ ఇప్పుడు తన అహంకారాన్ని ఏకంగా తెలంగాణ మహిళల మీద ప్రదర్శించారు. తెలంగాణ మహిళలను చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడారు. కేటీఆర్ తీరు పట్ల తెలంగాణ మహిళాలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్యూ ఎక్కడివరకూ వెళ్ళిందంటే, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. రాష్ట్రంలోని మహిళల నుంచి ఈ నిర్ణయానికి మద్దతు లభిస్తోంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించడం పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం సహజం. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు ప్రయాణిస్తూనే కుట్లు, అల్లికల వంటి పనులు చేసుకోవడం అడపాదడపా కనిపిస్తోంది. ఇది తెలంగాణ మహిళలు బస్సులను ఎంత ఓన్ చేసుకున్నారన్నదానికి నిదర్శనం. ఇది సంతోషపడాల్సిన విషయమే తప్ప, ఇష్యూ చేయాల్సిన అంశం కాదు. అయితే ఈ విషయం కేటీఆర్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కుట్లు, అల్లికలు చేసుకుంటున్నారని, అల్లం వెల్లుల్లి ఒలుచుకుంటున్నారని దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. దానికి రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మహిళలు అల్లం వెల్లుల్లి ఒలుచుకుంటే, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.  అప్పుడు కేటీఆర్‌లోంచి అసలైన ఒరిజినల్ అహంకారం బయటకి వచ్చింది. ‘‘బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనడం లేదు. అవసరమైతే బ్రేక్ డ్యాన్స్.లు కూడా వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఈ అహంకారపూరిత వ్యాఖ్యల మీద తెలంగాణలో మహిళాలోకం భగ్గుమంటోంది. ఈ అహంకార ధోరణినే కేటీఆర్ తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. కొంతమంది మహిళలైతే, ఇలా అహంకార పూరితంగా మాట్లాడితే, ఇలా తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణలో తిరగనివ్వం.. తెలంగాణ నుంచి తరిమికొడతాం అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే మేం.. మేం అంటే తెలంగాణ అని డబ్బా కొట్టుకున్న కేసీఆర్ కుటుంబానికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది? కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. తెలంగాణ మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకంగా వున్నట్టు మహిళా కమిషన్ అభిప్రాయపడింది. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ మహిళలను కించపరిచేలా వున్నాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ళ శారద ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తాను తెలంగాణ మహిళల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీసిందని అర్థం చేసుకున్న కేటీఆర్ తాను తప్పు మాట్లాడానని ఒప్పుకోకుండా తెలివిగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెళ్ళను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ ఎక్స్.లో ఒక పోస్టు పెట్టారు. అయితే, అంతా అయిపోయిన తర్వాత ప్రకటిస్తున్న ఇలాంటి వినయాలు తెలంగాణ మహిళల ఆగ్రహాగ్నిని చల్లార్చే పరిస్థితి కనిపించడం లేదు.

వడ్డీకు ఇవ్వడం,  తీసుకోవడం, ఇప్పించడం మహాపాపం

తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది.అప్పట్లో హైదరాబాద్ మహానగరంలో  నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఫసల్ బాబా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.  ఐటిలో బిటెక్ చేసినప్పటికీ ఉద్యోగం దొరక లేదు. ఉద్యోగం లేనప్పటికీ మేనరిక సంబంధం రావడంతో పెళ్లి అయితే చేశారు పెద్దలు. ఒక బాబు పుట్టాడు. ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా చేయాలని భార్య తరపు బంధువులు ఒత్తిడి పెట్టారు. చేసేదేమి లేక ఫసల్ బాబా నూటికి ఐదుపర్సెంటేజి క్రింద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ప్రతీనెలా ఠంచనుగా కట్టకపోతే వడ్డీ రేటు మారుతుందరి ఫైనాన్సియర్ కటువుగానే చెప్పాడు. సరేనన్నాడు ఫసల్ బాబా.  కొడుకు బర్త్ డే అని అందరికీ ఇన్విటేషన్స్ అయితే ఇచ్చాడు ఫసల్ బాబా. సాయంత్రం బర్త్ డే సెలబ్రేషన్స్ కు అందరూ సిద్దమయ్యారు.  ఆరిఫ్ ప్రముఖ దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. వృత్తి జర్నలిజం. ప్రవృత్తి తక్రీర్ (ప్రవచనాలు) ఇవ్వడం.  మసీదుల్లో అయితే శుక్రవారం, పండగ రోజుల్లో తక్రీర్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతమైతే ఒక తక్రీర్ చెప్పడానికి మౌలానాలు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. ఆరిఫ్  మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తక్రీర్ లు చెప్పేవాడు. అదొక సామాజిక బాధ్యతగా భావించేవాడు. అది ధర్మ కార్యంగా భావించేవాడు.  ఫసల్ బాబా బర్త్ డే వేడుకలకు తీసుకెళ్లడానికి కొందరు యువకులు ఆరిఫ్ దగ్గరికి వచ్చారు.  యువకులు:  ఆరిఫ్ బయ్ సాల్ గిరాకు వెళ్దామా అన్నారు. ఆరిఫ్: అవునూ ఫసల్ బాబా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. యువకులు: ఎక్కడా చేయడం లేదుబయ్  ఆరిఫ్: ఫిర్ పైసా కహాంసే లాయా యువకులు. ఫైనాన్స్ పే ఆరిఫ్: అయితే నేను రాను. సూద్ కే పైసాసే ఖాయేతే బీ అజమ్ నహీ హోతా. హలాల్ కే పైసా హజమ్ హోతా..యేతో హరామ్ కా పైసా హై. వో ఖానా జహర్ బన్ తా  ఆరిఫ్ :   సూద్ పే  పైసా లేనే వాలా.. సూద్ పే  పైసా దేనేవాలా.  సూద్ పే  పైసా దిలానే వాలా.. తీనో డేంజర్ హై.. బచ్చో కా ఖేల్ హై క్యా.. సూద్ పే అల్లా జంగ్ కరేగా... మేరే ప్యారే బాయ్.. అల్లా కే వాస్తే మత్ కరో... అల్లా మదత్ నై కరేగా.. సూద్ కా పైసే సే  బచ్చీయోంకీ షాదీ కర్నా హరామ్ హై.. హమ్ ఖుదా కే ఖిలాఫ్ జాకే కామియాబ్ నహీ హో సక్తే మేరే భాయ్.. బ్యాంక్ సే లోన్ లేనా జాహెజ్ హై.. మగర్ ఫైనాన్సర్ సే  లేనా మనా హై..  వడ్డీల ప్రస్తావన వచ్చినప్పుడు ఆరిఫ్ తక్రీర్ ఇలా సాగేది.  హైదరాబాద్ జర్నలిస్టులకు ఆరిఫ్ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. ఆరిఫ్ విలక్షణమైన వ్యక్తి. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని బలంగా నమ్మే జర్నలిస్ట్  ఆరిఫ్   90 దశకం ఆరంభంలోనే ఆరిఫుద్దీన్ అహ్మద్ అనే జర్నలిస్ట్ ఆంధ్రప్రభ హైద్రాబాద్ ఎడిషన్ లో చేరాడు. అప్పటికే దాసరినారాయణరావు ఉదయం తెలుగు దినపత్రికలో  రిపోర్టర్ గా అనుభవం గడించిన ఆరిఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండేవి. రాజస్థాన్ కు చెందిన రామ్ నాథ్ గోయంకా యాజమాన్యంలో వస్తున్న ప్రచురణల్లో తెలుగు ఎడిషన్ ఆంధ్రప్రభ,  ఇంగ్లీషులో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దోమలగూడ నుంచి ప్రచురణ అయ్యేవి. కన్నడప్రభ మాత్రం బెంగుళూరు నుంచి వచ్చేది. నైతిక విలువలు, వ‌ృత్తి ప్రమాణాలు పాటించే పత్రికగా మార్కెట్లో పేరుండేది. వామపక్షభావజామున్న జర్నలిస్ట్ లు ఉదయం వంటి పత్రికల్లో చేరితే రైటిస్ట్ భావజాలమున్న జర్నలిస్ట్ లకు మాత్రం ఆంధ్రప్రభ వేదికయ్యేది. ఈనాడు, ఉదయం పత్రికల్లో సెంట్రల్ డెస్క్ అనుభవం గడించిన శంకరనారాయణ వంటి లబ్ద ప్రతిష్టులు ఆంధ్ర ప్రభలో ఫన్ గన్ కాలమిస్ట్ గా చేరిపోయారు. హస్యం, వ్యగ్యం ఉండే ఈ ఫీచర్ కు  చాలా కాలం జీవం పోసింది శంకరనారాయణ మాత్రమే. హాస్యావధానాలతో తెలుగు ప్రజలను పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించే  శంకరనారాయణకు  ఫోర్త్ ఎస్టేట్ అయిన  మీడియాలో విశేష గౌరవం ఉండేది. ఆరిఫ్ సెటైరికల్ గా చెప్పడాన్ని ఆయన పకపకానవ్వేవారు.  అంతకుముందు ఉదయం పత్రికలో ఆరిఫ్, శంకరనారాయణ కల్సి పని చేయడం వల్ల ఇద్దరి వేవ్ లెంగ్త్  బాగా  కలిసింది. ఆరిఫ్ లో ఉండే హైదరాబాద్ యాక్సెంట్ సెటైర్ వల్ల సీనియర పాత్రికేయులు పలువురు దగ్గరయ్యారు. ఆరిఫ్ చెప్పే హస్యోక్తులు వారిని ఆకర్షిచేవి. ఆంధ్రప్రభ డిప్యూటి ఎడిటర్  ఎంవిఆర్ శాస్త్రి, ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ దేవులపల్లి అమర్ వంటి  కాకలు తీరిన జర్నలిస్ట్ లకు  కూడా ఆరిఫ్ అంటే ఎంతో ఇష్టపడేవారు. పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రీ , గవర్నమెంట్ ఆఫీస్ లో చప్రాసి నమస్తే చేయకపోతే ఆ వ్యక్తి ఈ సొసైటీకి పనికి రాడు అనే ఆరిఫ్ వాదన. మనుషుల తీరు తెన్నులను బాగా స్టడీ చేసే వాడు.    ఆరిఫ్ కు తెలుగు భాషా ప్రావీణ్యం పెద్దగా లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సిద్దహస్తులు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు రాస్తూ పాలకుల మెడలు వంచి పని చేయించేవాడు. ప్రతీముస్లిం  తన జీవిత కాలంలో మక్కా వెళ్లాలని ఇస్లాం చెబుతుంది. మహమ్బద్ ప్రవక్త జన్మించిన ప్రదేశాన్ని చూడాల్సిందే నని నిర్ణయించుకున్న ఆరిఫ్ తన కష్టార్జితంతో చిన్న తనంలోనే మక్కా సందర్శించాడు.ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న ఆరిఫ్ ఇస్లాం మార్గదర్శకాలను అనుసరించేవాడు. ప్రతీ రోజూ ఐదుసార్లు నమాజ్ పక్కా చేసే వాడు. ఓ పక్క వృత్తి ప్రమాణాలు పాటిస్తూనే ఇస్లాం పునాదుల మీద నిలబడే వ్యక్తిగా ఆరిఫ్ పేరు గడించాడు.  జర్నలిస్ట్ గా సమాజానికి ఆరిఫ్ చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సమయమది. ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ కూడా ఆరిఫ్ ను పేరు పెట్టే పిలిచేంతగా గుర్తింపు సంపాదించాడు. ఆ రోజుల్లో ఆరిఫ్ తక్రీర్ విని మారిపోయిన వారు ఉన్నారు.  వారు చెడు వ్యసనాలకు దూరమయ్యే వారు. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆరిఫ్ తక్రీర్ ఉపయోగపడేది.  వడ్డీలు తీసుకోవడం, వడ్డీలకు ఇవ్వడాన్ని  ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. వడ్డీలకు ఇప్పించేవారిని కూడా ఆరిఫ్ అంతే దూరంగా పెట్టేవారు. వారిని  కాఫీర్ అంటారని చెప్పేవాడు. కాఫీర్ అంటే దేవుడుని నమ్మని వారని అర్థం.   స్వంత ఇంటి కోసం ఎవరైనా  స్థలాలు కొనుగోలు చేసే సమయంలో తమ వద్ద ఉన్నబంగారాన్నిఅమ్మేసి  కొనుగోలు చేయాలని ఆరిఫ్ సూచనచేసే వాడు.వడ్డీలకు తెచ్చి కొనుగోలు చేయొద్దనేవాడు.  రామ్ నాథ్ గోయంకె నుంచి ఆంధ్ర ప్రభ మేనేజ్మెంట్ మారడంతో ఆరిఫ్ ఉద్యోగం కోల్పోయాడు. ఇదే సమయంలో  ఆంధ్రప్రదేశ్ లో హిందుజా సంస్థ ఇన్ కేబుల్ టీవీ ప్రసారాలు  చేస్తోంది. ఎపి ఫ్రాంచైజ్ తీసుకున్న ఆర్వీఆర్ చౌదరి తన సంస్థలో క్రైంబ్యూరో చీఫ్ ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం కోసం కనీసం అప్లికేషన్  కూడాపెట్టుకోలేదు.  ఆరిఫ్ జర్నలిజంలో చేసిన సేవలను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించారు   ఆర్వీఆర్ చౌదరి. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి తన తక్రీర్ మాత్రం ఆపడం లేదు ఆరిఫ్ .  -బదనపల్లి శ్రీనివాసాచారి 

కాళేశ్వరంపై విచారణ స్పీడప్.. హైదరాబాద్ లోనే జస్టిస్ పినాకి చంద్రఘోష్ మకాం!

కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాకరంగా చెప్పుకుంటుంటే... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు అవకతవకల, అవినీతి మయం అని ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో నే కాళేశ్వరం ఎత్తిపోతలలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ ను వేసింది. ఆ విచారణ కమిషన్ కాళేశ్వరం విచారణకు వేగవంతం చేసింది. ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘఘోష్ శుక్రవారం (ఆగస్టు 16) హైదరాబాద్ చేరుకున్నారు. విచారణను స్పీడప్ చేసే ఉద్దేశంతో ఆయన రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు.  అంతే కాకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ నివేదికను పదే పదే కోరినా ఇవ్వకుండా జాప్యం చేయడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(వీ అండ్‌ ఈ) డైరెక్టర్‌ జనరల్‌తో పాటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై నివేదిక ఇవ్వనందుకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్‌కు కూడా  సమన్లు జారీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆయా సంస్థలు నివేదికలు అందించాలని ఇప్పటికే పలు దఫాలుగా  కోరినా ఫలితం లేకపోవడంతో   వారిని పిలిపించి విచారించాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. అలాగే విచారణలో భాగంగా అఫిడవిట్లు దాఖలు చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారులతో పాటు సర్వీసులో ఉన్న సీనియర్‌ ఐఏఎస్ లను  క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే ప్రక్రియను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బావిస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై కూడా దృష్టి సారించనుంది.  మూడు ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌ కాంట్రాక్టర్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే.

పిఠాపురంలో అపోలో హాస్పిటల్

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పవన్ కల్యాణ్ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. తనకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కనీవినీ ఎరుగని అభివృద్ధిని అందించి కృతజ్ణతలు తెలుపుకుంటానని ప్రకటించిన ఆయన ఆ దిశగా తొలి అడుగు వేశారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  తనకు అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ అర్థవంతమైన రీతిలో కృతజ్ణతలు తెలుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిఠాపురంకు త్వరలో అత్యంత ప్రతిష్ఠాకరమైన మల్టీ స్పెషాలిటీస్ చెయిల్ ఆస్పత్రి అపోలో హాస్పిటల్  రానున్నది.   చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామి నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవణం స్వామి నాయుడు పవన్ కల్యాణ్ వాగ్దానం చేసిన విధంగా పిఠాపురంలో అపోలో ఆస్పత్రిని ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. ఇందు కోసం ఇప్పటికే  రామ్ చరణ్ , ఉపాసనలు పిఠాపురంలో పదెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అపోలా హాస్పిటల్ కు ఉపాసన చైర్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అపోలో హాస్పిటల్స్ అన్న వార్త సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. పిఠాపురం ప్రజల కోసం మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రిని తీసుకువస్తున్న పవన్ కల్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురంలో  అపోలో ఆస్పత్రికి సంబంధించిన మరింత అధికారిక సమాచారం త్వరలో  అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.   ఎన్నికల ప్రచారంలో బాగంగా నటుడు వరుణ్ తేజ్ పిఠాపురం తమ కుటుంబానికి కొత్త సొంత ఊరు అని ప్రకటించిన సంగతి విదితమే.  అలాగే పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ పిఠాపురాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తాయని వాగ్డానం చేశారు.  అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పిఠాపురంలో అపోలో ఆస్పత్రి ఏర్పాటు వారు చెప్పిన అభివృద్ధిలో తొలి అడుగుగా భావించవచ్చు.  

భక్తులతో పోటెత్తిన తిరుమల కొండ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు తిరుమల కొండకు పోటెత్తారు. శుక్రవారం ఉదయం ( ఆగస్టు 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా పడుతోంది. శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా గురువారం (ఆగస్టు 15)  శ్రీవారిని మొత్తం 76 వేల 695 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 395 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది.   

పేదలకు పట్టెడన్నంపై రాజకీయమా..! ఛీ.. మీ బతుకు చెడ!

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తోంది. మరోవైపు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పేదలకు రూ. 5కే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పూటకు రూ.5 చొప్పున రోజుకు రూ. 15కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు దంపతులు తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలివ్వండి.. సేవాభావంతో దాతలు ముందుకు రండి అని ప్రజలకు పిలుపు ఇచ్చారు.  2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారి దివంతగ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభించారు. దీంతో వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చిన పల్లె వాసులుకు, పట్టణంలో వివిధ పనుల చేసుకుంటూ జీవనం సాగించే పేదలకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. రోజుకు వేలాది మంది అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన అల్పాహారం, భోజనంతో కడుపు నింపుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అన్న క్యాంటీన్లు మంచిపేరు తీసుకొచ్చాయి. చంద్రబాబు మంచి ఆలోచన పట్ల పేద, మధ్య తరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 2019లో  తెలుగుదేశం అధికారం కోల్పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లపై కుట్రపూరితంగా వ్యవహరించారు. పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందించే క్యాంటీన్లపైనా తన ప్రతాపం చూపాడు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను పూర్తిగా తొలగించేశాడు. దీంతో జగన్ నిర్ణయంపై తెలుగుదేశం శ్రేణులే కాదు, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పలు ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలే సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లు నిర్వహించారు. వాటిపైనా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. సొంత ఖర్చులతోనైనా అన్న క్యాంటీన్లు నిర్వహించడానికి వీళ్లేదని వాటిని బంద్ చేయించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది.  కూటమి ప్రభుత్వంలో పున: ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సతీమణి నారా భువనేశ్వరి  రూ. కోటి విరాళం ప్రకటించారు. స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస రాజు రూ. కోటి విరాళం ప్రకటించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి రూ. 50లక్షలు విరాళం ప్రకటించారు. టీడీపీ యువనేత దండమూడి చౌదరి రూ.5,07,779లు విరాళం అందజేశారు. ఏటా ఆగస్టులో ఈ మొత్తాన్ని ఐదేళ్ల పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. వీరితో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారులు అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేతలు సైతం అన్న క్యాంటీన్లకు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు సన్నద్ధమయ్యారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అధికారం కోల్పోయి 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్లుగా అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా మేము పేదలకు మంచి చేయడానికి వ్యతిరేకం అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అన్న క్యాంటీన్లపై వైసీపీ నేత అంబటి రాంబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టడంతో పాటు చంద్రబాబు చేసిన సూపర్‌ సిక్స్‌ వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్న క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారంటూ అంబటి వ్యాఖ్యానించడం వైసీపీ నేతల నీచ బుద్ధిని తెలియజేస్తోంది. అంతేకాదు.. కేవలం పబ్లిసిటీ కోసమే అన్న క్యాంటీన్లు పెడుతున్నారని వైసీపీ నేతలు అనడంతో వీరు అసలు ప్రజా ప్రతినిధులేనా అని ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వైసీపీ   హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభించి ప్రజలకు పట్టెడన్న పెడుతుంటే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అన్న క్యాంటీన్ల రంగుపైనా వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం చూస్తుంటే వీళ్లను ఎంత త్వరగా తరిమి కొడితే రాష్ట్రం అంత త్వరగా బాగుపడుతుందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి అన్న క్యాంటీన్లకు పసుపు రంగుతోపాటు, ఎరుపు రంగు, బూడిద రంగు, వైట్ కలర్ ఇలా ఐదు రంగులు ఉన్నాయి.   దీనిని కూడా వైసీపీ నేతలు రద్దాంతం చేయాలని చూస్తూ జనం చేత ఛీకొట్టించుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో పంచాయతీ భవనాలకు పూర్తిగా వైసీపీ రంగులు వేశారు.  అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టుకు వెళ్లడంతో.. వైసీపీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు పెట్టింది. దీంతో వైసీపీ కలర్ తోపాటు మూడు రంగులు వేశారు. కానీ తెలుగుదేశం  కోర్టు సూచనలను పాటిస్తూ   అన్న క్యాంటీన్ భవనాలకు ఐదు రంగులు వేసింది. కానీ, వైసీపీ నేతలు మాత్రం క్యాంటీన్ భవనాలకు ఎల్లో కలర్ ఎక్కువగా వేశారంటూ వాదన చేయడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్న సమయంలో పేద వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలు.. కూటమి ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంటే విమర్శలు చేస్తుండటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తే రాబోయే కాలంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పేద, బడుగు వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

కోల్ కతా ఆస్పత్రిలో నిర్భయ కంటే దారుణం.. వాడో మృగం!..

కోల్ కతా ఆస్పత్రిలో  హత్యాచారానికి గురైన పీజీ ట్రైనీ వైద్యురాలి అటాప్సీ నివేదికలో దారుణమైన విషయాలు వెల్లడైనాయి. వాడు మనిషి కాదు మానవ రూపంలో ఉన్న మృగం అని ఆ అటాప్సీ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలో విషయాలు ప్రస్తావించడం సబబు కాకపోయినా ఆ దారుణాన్ని చెప్పక తప్పదు. కేవలం అత్యాచారం చేసి చంపడం కాదు.దారుణంగా చిత్రవధ చేసి చంపడం ఘోరం. అదీ ఆస్పత్రిలో హత్యాచారం చేయడం ఘోరాతిఘోరం.ఈ సంఘటనతో మహిళలకు రక్షణ ఎక్కడ అనే ప్రశ్న తలెత్తుతుంది. తెల్లవారేవరకూ వైద్యురాలిపై జరిగిన దారుణం ఎవరికీ తెలియదు.ఆ రోజు రాత్రి ఆమె ఆసుపత్రి సెమినార్ హాలులోకి చదువుకుని ఆపై నిద్రపోయింది. ఆసమయంలో ఆ నరరూప రాక్షసుడు సంజయ్ రాయ్ అటువైపు వచ్చి ఆమెను చిత్రవధ చేసి అత్యాచారం చేసాడు. అతను  నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురు అతనిని భరించలేక వదిలిపోయారు.నాలుగో భార్య కేన్సర్ తో మృతి చెందిందని సమాచారం, ఇతను బీహార్ కు చెందినవాడు. ఇక్కడ పోలీసు సంక్షేమ శాఖ లో వాలంటీర్ గా పని చేస్తున్నాడు. ఆమె అరిస్తే దొరికిపోతానని గోడకేసి గట్టిగా అదిమి గొంతు పట్టుకున్నాడు. తలను గోడకేసి కొట్టాడు. ముఖం, కళ్లు కూడా దెబ్బతిన్నాయి, .మెడ విరిగింది. అలాగే శరీరంలోని అన్ని భాగాల లోంచి రక్తస్రావం అయింది. ప్రైవేటు పార్ట్స్ నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. ఇంకా దారుణమేమంటే చనిపోయిన తరువాత కూడా అత్యాచారం చేసినట్లు నివేదికలో వెల్లడయ్యింది. అలాగే మృతురాలి శరీరంపై అధిక మొత్తంలో వీర్యం ఉండడం వల్ల ఇది సామూహిక అత్యాచారం గా అనుమానిస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారం అనంతరం ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత రక్తమరకలు ఉన్న దుస్తులు నీళ్ల లో పిండినట్లు తెలిసింది. బూట్ల మీద రక్తం మరకలు కనిపించాయి. అతను బ్లూటూత్ హెడ్ సెట్ హత్యాస్థలం వద్ద వదిలివేయడం వల్ల పట్టుబడ్డాడు. రాయ్ అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ అవకాశం కోసం వేచి చూసి కాటు వేసాడని భావిస్తున్నారు. అందరూ తిరిగే ఆసుపత్రిలోనే ఇలాంటి దారుణం సంఘటన జరగడం ఆందోళన కలుగుతున్నది. 

మువ్వన్నెల జాతీయ జెండా ఎర్రకోటపై మొదటిసారి ఎగిరింది ఆగస్టు పదహారు!

శుభకర్ మేడసాని, జర్నలిస్ట్  భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు... ఆ వేడుకలకు దూరంగా  మహాత్మ గాంధీ ఏం చేస్తున్నారు? మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?  భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా విడుస్తా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం 'ట్రిస్ట్ విత్ డెస్టినీ'ని ఆగస్టు 14 అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ప్రసంగించారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా శ్రద్ధగా ఆలకించింది. కానీ గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు. ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది. ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది. మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?  విధితో కలయిక ఆసన్నమైందని 1947 ఆగస్టు 15వ తేదీకి కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తోంది. కానీ ఆ రోజు ఆగమనం కోసం నిరీక్షణ , చుట్టూ అలముకున్న సంతోషంలో ఏదో లోటు ఉంది. శతాబ్దాల తర్వాత బ్రిటిష్ పాలన, బానిసత్వం భారతదేశానికి అంతం కానున్నాయి. అయినా, స్వాతంత్ర్య సంబరం ఊహించినంతగా ఆవరించిలేదు. దానికి కారణం విభజన విషాదం. విద్వేషాగ్ని కూడా దానిని బూడిదగా దహించివేయలేకపోయింది. ఈ విషాదాన్ని సజీవంగా ఉంచిన అగ్ని అది. అధికార బదలాయింపు కొందరికి కాస్త ఊరటనిచ్చింది. కానీ అటువంటి వారిలో గాంధీ లేరు. ఎన్నో సత్యాన్వేషణలతో ప్రయోగాలు చేసి, 78 ఏళ్ల వయసులో ఉన్న గాంధీ ఆలోచన మునుపటికన్నా ఎక్కువగా బలపడింది. కానీ ఆయన శరీరం శక్తికోల్పోయింది. ఆయన సంకల్ప బలానికి సరితూగటంలో శరీరం విఫలమవుతోంది. తనకు ఎదురవుతున్న భీకర సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న గాంధీ దీనిని అంగీకరించలేకపోయారు. 1947 ఆగస్టుకు కొన్ని నెలల ముందు నుంచీ 1948 జనవరి వరకూ ఆయన తరచుగా పర్యటనలు చేసింది అందుకే. ఎక్కడ అల్లర్లు జరిగితే అక్కడి ప్రజల బాధలు, విషాదాలను పంచుకోవటానికి గాంధీ వెళ్లేవారు. విద్వేషాగ్ని కీలలను ప్రార్థనలు, సందేశాల ద్వారా చల్లార్చేందుకు ప్రయత్నించేవారు. భవిష్యత్తులో సాన్నిహిత్యం కొనసాగించటానికి మార్గాలను సూచించేందుకు ప్రయత్నించారు. ఆర్ యస్ యస్ మతమౌఢ్యం, ఆర్ యస్ యస్ ఉన్మాదం నుంచి మానవతా మార్గం చూపటానికి తన మనసు లోతుల్లోనుంచి కృషిచేశారు. ఆయన రావాలని ఆకాంక్షించిన ప్రదేశాలన్నిటికీ, ఆయనను చూడాలనుకున్న క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరినీ గాంధీ చేరుకోలేకపోయారు. ఒక చోట ఉంటూ ఇతర ప్రాంతాలకు శాంతి సందేశాన్ని, దూతను పంపేవారు. పరిస్థితులు మరింత ఎక్కువగా సంక్లిష్టంగా మారుతున్నాయి. అవిభాజ్య భారతదేశం విస్తృతి కూడా చాలా విస్తారమైనది. కరాచీ ప్రభావం బిహార్‌లో కనిపించింది. నౌఖోలీ ప్రభావం కలకత్తా మీద కనిపించింది. విధ్వంసం చాలా ప్రాంతాల్లో కనిపించింది. విద్వేషాగ్ని ప్రతి చోటా ప్రజ్వరిల్లుతూ ఉండింది. ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. విద్వేషాగ్నిని విస్తరించే వారు, దాని నుంచి ప్రయోజనం పొందేవారు ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. ఎందుకంటే వారి ఆకాంక్షలు ఇతరుల ఆకాంక్షలకన్నా భిన్నమైనవి. హిందువులు లేదా ముస్లింలు లేదా సిక్కులు ఎవరి ఊచకోత జరిగినా.. గాంధీకి అది తన సొంత శరీర భాగాలను దహనం చేయటం లాంటిది. దీనిని ఆయన తన వైఫల్యంగా పరిగణించారు. అది ఆయన కలలకు వ్యతిరేకమైనది. ఆయను కుంగదీసింది. ’వామనుడి’ లాగా అవిభాజ్య భారతదేశాన్ని గాంధీ రెండు మూడు అంగల్లో కొలవాలనుకున్నారు కానీ కొలవలేకపోయారు. అది ఆయన విధి. విషాదభరిత విధి. ఆగస్టు పదిహేనో తేదీ అర్థరాత్రి భారతదేశపు విధిని రూపొందించటంలో దిల్లీ తలమునకలైవుంది. అప్పటికి మూడు దశాబ్దాలుగా స్వతంత్ర సంగ్రామం విధానాన్ని, సంకల్పాన్ని, నాయకత్వాన్ని నిర్ణయించే మహాత్మా గాంధీ తన వారసులైన భావి దేశపు నిర్మాతలను ఆశీర్వదించటానికి అప్పుడక్కడ లేరు. 1947 ఆగస్టు 26న ముస్లింల పండుగ ఈద్-ఉల్-ఫితర్ నాడు కలకత్తా మైదానంలో ప్రార్థనా సమావేశంలో గాంధీ ప్రసంగం వినటానికి లక్ష మంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు ఆయన దిల్లీ సరిహద్దులకు మైళ్ల దూరంలో కలకత్తా లోని ‘హైదరీ మహల్’లో ఉన్నారు. మైనారిటీ హిందువులు దారుణ ఊచకోతకు గురైన నౌఖోలీలో పర్యటించటానికి ఆయన వెళ్లారు. ఆయన కలకత్తాలో రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మైనారిటీ ముస్లింలు ఫిర్యాదు చేస్తున్నారు. నౌఖోలీలో విద్వేష జ్వాలలను నివారించటానికి కలకత్తాలో అగ్నిని చల్లార్చాల్సిన అవసరం ఉందని గాంధీ భావించారు. కలకత్తాలో ముస్లింలకు భద్రతలేకుండా వదిలేస్తే, నౌఖోలీలోని హిందువులను ఎలా రక్షించగలనని ఆయన భావించారు. ఇక్కడ మైనారిటీలను పరిరక్షించాల్సిన బాధ్యత తనదని గాంధీ భావించారు. అది నౌఖోలీలోని మైనారిటీల హక్కులను పరిరక్షించటానికి ఆయనకు నైతిక మద్దతును కూడగట్టింది. కలకత్తాలో ఘోరకలి అనదగ్గ ప్రాంతంలో ఉండాలని గాంధీ కోరుకున్నారు. ఒక ముస్లిం వితంతువుకు చెందిన ‘హైదరీ మహల్’ అందుకు తగిన స్థలం. అది హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతం. సమీపంలో మియా బాగాన్ అనే బలహీన వర్గానికి చెందిన ముస్లింల ఆవాస ప్రాంతముంది. అది కాలువకు అవతల ఉంటుంది. మియా బాగాన్‌లో ఎంతగా విధ్వంసం సృష్టించారంటే.. తమ దైన్యం గురించి చెప్పటానికి ఏ ఒక్కరూ అక్కడ లేకుండాపోయారు. ఈ ‘హైదరీ మహల్’లో బస చేయటానికి గాంధీ ఒక షరతుతో ఒప్పుకున్నారు. సుహ్రావర్దీ కూడా అక్కడ ఉండాలన్నది ఆయన షరతు. అప్పటికి ఏడాది కిందట తన ‘ప్రత్యక్ష చర్య’తో వందలాది మంది హిందువులను చంపి, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన సుహ్రావర్దీ . హిందువుల పట్ల ద్వేషానికి అపకీర్తి పొందిన సుహ్రావర్దీ తన నేరాన్ని అంగీకరించి, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయటానికి అక్కడికి రావటానికి అంగీకరించారు. గాంధీ మరో షరతు పెట్టారు: కలకత్తాలోని ముస్లిం లీగ్ నేతల్లో అతివాదులు నౌఖోలీలోని తమ ‘జనాని’కి వైర్ సందేశం పంపి, అక్కడి హిందువులను రక్షించేలా చేయటం, అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పేలా చేసేందుకు తమ కార్యకర్తలను పంపించటం. గాంధీ షరతులకు అంగీకరించారు. కలకత్తా జనం తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొనసాగించారు. కానీ ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు చెందిన యువతలో భ్రమలు అలాగే ఉండిపోయాయి. వారు గాంధీని కేవలం ముస్లింల సమర్థకుడిగా మాత్రమే భావించారు. హిందువులు కష్టాల్లో ఉన్నపుడు ఎందుకు రాలేదని, హిందువులు పారిపోతున్న ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని వారు ఆయనను ప్రశ్నించేవారు. గాంధీని ‘హిందువుల శత్రువు’ అని వారు అభివర్ణించారు. పుట్టుకలో, ఆచారంలో, జీవనశైలిలో, నమ్మికలో, విశ్వాసంలో పూర్తిగా హిందువు అయిన ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణ ఇది. !  దీనికి స్పందిస్తూ గాంధీ కూడా అదే చెప్పారు. గాంధీని హిందువుల శత్రువుగా ఆరోపించటం తీవ్రంగా బాధించేది. ఆగస్టు పదిహేనును గాంధీ ఒక ’గొప్ప ఘటన’గా పరిగణించేవారు.  ఉపవాసం, ప్రార్థనలు, పశ్చాత్తాపంతో ఆహ్వానించాలని ఆయన తన అనుచరులకు చెప్పారు. ఆయన స్వయంగా ఆ మహా పర్వ దినానికి అదే రీతిలో స్వాగతం పలికారు. కలకత్తాలో గాంధీ విజయవంతమయ్యారు. శాంతియుత వాతావరణం అక్కడ విస్తరించటం మొదలైంది. మహాత్ముడి ఆదర్శాల ప్రభావం సైనిక శక్తి కన్నా బలమైనది. అందుకే.. చివరి వైశ్రాయ్, మొదటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ వైర్ సందేశంలో ఆయనకు ఇలా అభినందనలు తెలిపారు: ‘‘పంజాబ్‌లో మనకు యాభై ఐదు వేల మంది సైనికులున్నారు. కానీ అల్లర్లు అదుపుకాలేదు. బెంగాల్‌లో మన సైన్యానికి చెందని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ సంపూర్ణ శాంతి నెలకొంది.’’ నౌఖోలీకి వెళ్లటానికి ముందు కలకత్తాలో కొన్ని రోజులు ఉండాలని గాంధీ భావించారు. కానీ ఆయన నెల రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. తుపాకీమందు గుట్ట మీద ఉండి ఒక్క అగ్గిరవ్వ తగిలితే విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న ఆ నగరం గాంధీని వెళ్లనివ్వలేదు. ఆ తుపాకీమందు మండే స్వభావాన్ని గాంధీ ధ్వంసం చేశారు. అగ్గిరవ్వ కూడా ఆరిపోయింది. నాటికి కేవలం ఏడాది కిందట హిందువులను తీవ్రంగా వ్యతిరేకించిన సుహ్రావర్దీ ఇప్పుడు ఒక కొత్త ఆదర్శం. ఆయన ప్రతిజ్ఞను చూసి జనం ఆశ్చర్యపోయారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందూ యువత కూడా పాశ్చాత్తాప పడింది. దిల్లీ గాంధీని పిలుస్తోంది. వేడుక వాతావరణం నిరర్థకమైంది. ఇప్పుడు దిల్లీకి గాంధీ అవసరముంది. దిల్లీ మరోసారి కలకత్తా జనంతో నిండిపోయింది. దిల్లీ మహాత్ముడి కోసం నైరాశ్యంతో నిరీక్షిస్తోంది. గాంధీ సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం దిల్లీ చేరుకున్నారు. బేలూరు నుంచి రైలులో వచ్చారు. చిరపరిచితమైన ఈ సెప్టెంబర్ ఉదయం ఆనందదాయకమైన ఉదయం కాదని గాంధీ తెలుసుకున్నారు. అన్నిచోట్లా స్మశాన నిశబద్దం ఆవరించివుంది. అన్ని మర్యాదలకూ బీటలు పడ్డాయి. రైల్వే స్టేషన్‌లో గాంధీని ఆహ్వానించటానికి సర్దార్ పటేల్ వచ్చారు. కానీ ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. పోరాటంలో కష్ట కాలంలోనూ సంతోషంగా కనిపించే అదే సర్దార్‌ ముఖంలో ఇప్పుడు నిస్పృహ కనిపించింది. వస్తారని అనుకున్న ఇతర ఆర్ యస్ యస్ పెద్దమనుషులు రైల్వే స్టేషన్ వద్ద కనిపించలేదు. గాంధీ ఆందోళనకు ఇది చాలు. సర్దార్ కారులో కూర్చుంటూ మౌనం వీడారు ఐదు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. దిల్లీ ఇప్పుడు శవాల నగరంగా మారింది. గాంధీని ఆయనకు ప్రియమైన వాల్మీకి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లలేదు. బిర్లా భవన్‌లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. కారు అక్కడికి చేరుకోగానే ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారు. అది కాకతాళీయం కాదు. ఆయన ముఖ రూపం మారిపోయింది. ఒక్క నెల రోజుల సమయంలోనే ఆయన ముఖంలో ముడతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ‘బాపు’ అంటూ గుక్కతిప్పుకోకుండా అంతా చెప్పారు. లూటీ, ఊచకోత, కర్ఫ్యూ.. అన్ని వివరాలూ తెలియజేశారు. ఆహారపదార్థాలు అందుబాటులో లేవు, సాధారణ పౌరుడి దీనస్థితి, పాకిస్తాన్‌ను తన పౌరులను రక్షించుకోవాలని తను ఆ దేశానికి ఎలా చెప్పగలరు? హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరికీ సేవ చేస్తుండే డాక్టర్ జోషి అనే ప్రఖ్యాత సర్జన్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఒక ముస్లిం ఇంటి నుంచి తుపాకీతో కాల్చారు. గాంధీ ప్రతి రోజూ తన మనోభావాలను ప్రార్థనా సమావేశంలో చెప్పేవారు. అది రేడియోలో ప్రసారమయ్యేది. బహుశా ఈ ప్రయత్నాలు సరిపోలేదు. పాకిస్తాన్ నుంచి వస్తున్న హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గలేదు. ఈ జనం రక్తానికి బదులుగా రక్తం కావాలంటున్నారు. గాంధీ మాటలు వారికి రుచించలేదు. ఈ మనిషి పాకిస్తాన్ మీద నైతిక ఒత్తిడి తెస్తున్నారన్నది కూడా వారు చూడలేకపోయారు. తన పౌరులకు భద్రత కల్పిస్తానన్న జిన్నా హామీని ఆయనకు గుర్తుచేశారు. భారతదేశానికి కూడా దాని హామీని గాంధీ గుర్తుచేస్తున్నారు. ఆ హామీని నెరవేర్చటంలో నైతిక బలం పెరగటాన్ని గాంధీ చూసేవారు. ఆయన ప్రతి రోజూ ప్రణాళిక రచించేవారు. వాటిని అమలు చేసేవారు. జనవరి వణికించే చలి వచ్చింది. భారత్ కానీ, పాకిస్తాన్ కానీ తమ విశ్వాసాలను ఉల్లంఘించాయని గాంధీ భావించలేదు. యాభై ఐదు కోట్ల రూపాయలను విశ్వాస అనుసంధానంగా ఆయన పరిగణించారు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడేందుకు ఎవరికైనా ఎదురు వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. చివరికి తనను తానే వ్యతిరేకించటానికి కూడా. గాంధీ అదే స్ఫూర్తి నుంచి నైతిక బలం పొందేవారు. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ వెళ్లాలనేది ఆయన ప్రణాళిక. జిన్నాను, ఆయన ప్రభుత్వాన్ని అంతకుమించి పరిగణించలేదు. శాంతి నెలకొల్పుకోవటమనే ఆలోచన ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు నచ్చలేదు. గాంధీ నిరాహారదీక్షలో స్వీయ-సత్యసంధతను వీరు చూడలేదు. ప్రపంచం గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నట్లు అనిపించినప్పుడు..   ఆర్ యస్ యస్ వారు ‘గాంధీ ముర్దాబాద్’ అని నినాదాలు చేసేవారు. ఆధ్యాత్మిక స్వచ్ఛతతో పవిత్రంగా విలసిల్లినటువంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనను.. నాథూరాం గాడ్సేకు చెందిన సైద్ధాంతిక శాఖ ఆర్ యస్ యస్ ,  బిజెపి ఎన్నడూ అర్థం చేసుకోజాలవు. బాపు మమ్మల్ని క్షమించు..!  మహాత్మా గాంధీ హత్య అమానుష పాపానికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఆనాడు ఉపప్రధానిగా, హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ,గాంధీ హత్యకు నిరసనగా RSSను ,నిషేధించాలని1949లో తన ప్రసంగంలో మత ప్రాతిపదికన రాజకీయాలు , హిందూ రాజ్ అనేది ఒక వెర్రి భావన అని ఈసడించారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రభుత్వ రాజ్యవ్యవస్థ మనుగడకు ప్రమాదకరం అన్నారు .ఈ వాతావరణం అంతిమంగా గాంధీజీని బలిగొన్నది ,గాంధీ హత్య గురించి తెలియగానే ఆర్ఎస్ఎస్ ,ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.దేశానికి తీరని నష్టం గాంధీజీ హత్య! ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినా! నిషేధాన్ని ఎత్తివేయడానికి కారణం ఆర్ఎస్ఎస్ నుంచి లిఖితపూర్వక వాగ్దానం. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ప్రమేయం పెట్టుకోకూడదు అది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అని పటేల్ పట్టుబడితే దాన్ని ఆర్ఎస్ఎస్ లిఖితపూర్వకంగా అంగీకరించినందున  1949 జూలై 11న ఆర్ యస్ యస్ పై నిషేదాన్ని తొలగించారు! మనసు కలసివేసే సంఘటన ! గుండెలు పగిలిపోయే వేదన !  మనలో చాలా మందికి గాంధీపై లేదా కాంగ్రేస్ పార్టీ పై అయిష్టత ఉండి వుండవచ్చు !  భారతదేశ స్వాతంత్రం తరువాత అధికారంలోకి వచ్చిన * “రాజకీయ పార్టీ కాంగ్రెస్ “ కు గాంధీకి సంబంధం  లేదు !  స్వాతంత్రం సిద్దించటానికి కాంగ్రెస్ అనే గొడుగు క్రిందకు యావత్ దేశం వచ్చి పోరాడింది ! ఒక్క ఆర్ యస్ యస్ !  Congress is an alternative name for a large national or international conference . కాంగ్రెస్ పదానికి అర్థం జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశానికి ప్రత్యామ్నాయ పదం ! కనీసం ఆ పదానికి అర్థం తెలియకుండా మనలో చాలా మంది ఒకనాటి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు ! ఆనాటి కాంగ్రెస్ అంటే మన మందరం అంటే దేశం మొత్తం !జాతి మొత్తం ! ఒక్క ఆర్ యస్ యస్ తప్ప !  డా. BR అంబేత్కర్ కూడా కాంగ్రెస్ లో భాగమే . ఆతరువాత ఏర్పడ్డ తొలి స్వాతంత్ర భారత ప్రభుత్యంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి హిందు కోడ్ బిల్లుకు ప్రాణం పోసాడు డా.అంబేత్కర్ . ఏంటి ఈ హిందూ కోడ్ బిల్ ? the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoptions and Maintenance Act. హిందూ కుంటుంబాల క్షేమం కోసం హిందు వివాహా చట్టం విడాకులు /భరణం / పునర్వివాహం , పిల్లలు , సంరక్షణ, ఆస్తులు , హక్కులు , దత్తత మొదలగు అంశాలు . ఆనాడు ఈ ఆర్ యస్ యస్ మూక ఏం చేసిందో తెలుసా! ఇండియా గేట్ వద్ద ఆనాటి  హిందూ కోడ్ బిల్  చట్టం ప్రతులను తగలబెట్టి అంబేత్కర్ ను నాటి కాంగ్రేస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టారు . ఆర్ యస్ యస్  అంటే మనువాద అధర్మ భావజాలం పునాదులపై నిర్మించిన రాకాశి కోరల విష వలయం . భర్త చనిపోతే అదే చితి మంటలో బలవంతంగా తోసేసిన భావజాలం ! ఆమంటలు తట్టుకోలేక చితినుండి బయటపడే ప్రయత్నం చేస్తే ! చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో ఆమెను బయటకు రాకుండా విచక్షాణా రహితంగా గొడ్డును బాదినట్టు బాదేవారు ఈ దారుణాన్ని బ్రిటీష్ పాలకుడు సర్ చార్లెస్ నేపియర్ తీవ్రంగా వ్యతిరేకించి చట్టం తెచ్చాడు . against the practice of sati ; Sir Charles Napier ordered to hang to death any Hindu priest who presided over a widow burning. ఈ వికృత తంతులో పాల్గొన్న పూజారిని చచ్చెవరకు ఉరితీయండి అనేది ఉత్తర్వులు . ఇదే అంశం మీద అభ్యుదయ బ్రాంహ్మణ కులానికి చెందిన మహానీయుడు రాజా రామ్ మోహన్ రాయ్ చితి మంటల్లో ఆడబిడ్డలు కాలిపోకుండా దేశవ్యాప్త ఉద్యమం నడిపారు. ఇక ఆ తరువాతి కాలంలో కాల్చడం ప్రక్కన పెట్టి భర్త చనిపోతే గుండు కొట్టించి తెల్లచీర కట్టించి బ్రతికినంత కాలం ఇతరుల కంట పడకుండా దాక్కుని బ్రతకాలి ! దాన్ని బద్దలు కొట్టాడు అంబేత్కర్ . ఈ రోజు హిందూ స్త్రీలు / పిల్లలు / పురుషులు హక్కులు అనుభవిస్తున్నారంటే కారణం నాటి కాంగ్రేస్ ప్రభుత్యం తొలిన్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ కావడం విశేషం.  మనువాద ఆర్ యస్ యస్  భావజాల  కుల వ్యవస్థ ! వేల సంవత్సరాల అసమానతలు , అకృత్యాలు , కులాల పుట్టుకకు కారకులు ఈ  మనువాద ఆర్ యస్ యస్  భావజాలం కారణంగా ఈ దేశం  నిత్యం తగలబడుతునే ఉంది ! ఇది ఆరని ఖర్చిచ్చు ! ఆర్ యస్ యస్  బ్రిటీష్ బూట్లు ఎలా నాకింది ! ?ఎందుకు నాకింది ! ?స్వతంత్ర పోరాటాన్ని అణచటానికి పొట్టి కాకి నిక్కర్లు వేసుకుని బ్రిటీష్ మోరల్ పోలీస్ గా ఉద్యమకారులపై విరుచుకు పడటం ! బ్రిటీష్ స్వాతంత్రం ఇచ్చె సమయంలో 565 Princely states రాజ సంస్థానాలు  బ్రిటిష్ తొత్తులుగా ఉండేవారు ! వీరి సంస్థానాలను ఇండియలో కలపొద్దు అని ఆర్ యస్ యస్  ఎందుకు కుతంత్రం చేసింది ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం .  అన్నిటికంటే కృరమైన భావజాలం విభజన !  ఈ దేశం రెండు ముక్కలు అవ్వటానికి కారకులు ఎవరో తెలుసా ! ఇంకెవరు ! వేర్పాటు వాద ఛాందస మూఢ భావాజం వారసులు . ఆర్ యస్ యస్ చాంధస మనువాద భావజాలం అదే చాంధస మత  మౌడ్యం మహ్మద్ జిన్నాను విభజనకు ఆనాడు దేశాన్ని మంటల్లోకి తోసింది ! ముందుండి నడిపించింది . ఈ అతివాద భావజాలమే లక్షలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. . నేటి ఆధునిక హిందుస్తాన్ చరిత్ర చూస్తూనే ఉన్నాం ! నేటి కాంగ్రెస్ పార్టీని విమర్శించటం / పొగడటం మీ ప్రాధమిక హక్కు ! మీకు ప్రాధమిక హక్కులు కల్పించే పరిస్థితి నాటి గాంధీ సారధ్యం వహించిన కాంగ్రేస్ తోనే సాధ్యం అయ్యింది అని గుర్తుంచుకోండి ! తొలి తరం కాంగ్రెస్ పెద్దలు తమ సర్వస్వం దేశానికి ధారపోసారు ! ప్రాణాలు సైతం అర్పించారు ! ఇప్పుడు ఆమహానీయుల వారసులు ఎక్కడున్నారు ? ఏంచేస్తున్నారు మనకు పట్టదు . చివరగా ఒక మాట  గాంధీని గాంధీతత్వాన్ని విమర్శించడం అంటే మనం అరువు తెచ్చుకున్న అజ్ఞానం కారణం అని అర్ధం.  ఆర్ యస్ యస్ / బిజెపి అంతలా ఎందుకు గాంధీని విమర్శిస్తుంది అంటే గాంధీ తత్వం ఆర్ యస్ యస్ భావజాలనికి పూర్తి వ్యతిరేకమైనది అనేగా అర్థం! సత్యం కూడా అదే గాంధీ ఔనత్యం మనకంటే బయటవారే ఎక్కువ అర్ధం చేసుకున్నారు .  " మహాత్మా మిమల్ని చంపుకోవడం! మీ రక్తంతో ఈ నేల తడవడం కంటే మహా పాపం ఉంటుందా ..! మహాత్మా మమ్ములను క్షమించు అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు మహాత్మా గాంధీ జీవితంతో పాటు మరణం కూడా ఎప్పటికప్పుడు చరిత్ర కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రత్యేకించి ఆరెస్సెస్ బిజెపి సాగించే వ్వ్యక్తిత్వ హననం,విధాన హననం వంటి ముప్పేట ముష్కర వ్యూహాలదే పైచేయి అవుతున్న నేటి తరుణంలో  జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీని నేటి పాలకులు చీపురు పుల్లకు సరిపెట్టారు. హంతకులే రొమ్ము విరుచుకుని తిరగటం అన్నది మధ్యయుగాల  సంస్కృతిలో తప్ప ఆధునిక సంస్కృతిలో కనిపించని లక్షణం.కానీ ఉన్నావో మొదలు హథ్రస్‌ , మణిపూర్ వరకూ నిందితులంతా పాలకపక్షం పంచన చేరి సన్మానాలందు కుంటున్నారు.ఈ ఒరవడి గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించటంతోనే మొదలైంది. హంతకులు ఛాతీ విరుచుకుని నడవటమే వీరత్వమన్న బిజెపి  సంఘ పరివారం సైద్ధాంతిక నేపథ్యమే దీనికి పునాది. ఈ పునాదులు దశాబ్దాలుగా అంత కంతకూ బలోపేతం అవుతూ వస్తున్నాయి. అందుకే పార్లమెంట్‌లో గాంధీ విగ్రహానికి ఎదురుగా గాంధీ హత్యకు ప్రేరేపించిన సనాతన వైదిక బ్రాహ్మణ మతదేశం స్థాపించాలనే  భావజాలానికి ఆది గురువైన సావర్కార్‌ విగ్రహం నిలబెట్టి గాంధీ విలువలనే కాదు. ఆధునిక భారతదేశం గురించి గాంధీ కన్న కలలను ప్రశ్నిస్తోంది. జీవిత కాలంలో గాంధీ పాటించిన విలువలు, సాగించిన ఉద్యమాలు, సాధించిన విజయాలు, కన్న కలలు, నిర్మించతల పెట్టిన జాతి నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆయన మరణంపై అంశాలను ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేయటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. దేశ స్వాతంత్య్రానికీ స్వావలంబనకూ చేటుతెచ్చే విధానాలను,విదేశీ,స్వదేశీ కార్పొరేట్లకు దేశసంపద ను దోచిపెట్టే విధానాలను అమలు చేస్తున్నారు.వీటిని ప్రజలందరూ ప్రతిఘటించేందుకు ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వ,మనువాద సనాతన ధర్మం పేరుతో   రాజకీయాలు ముందుకొచ్చాయి.వాటిని సమర్ధించుకోవడానికే నిజమైన జాతీయోద్యమానికి, దాని నాయకులకు మసిపూసి,చరిత్రనువక్రీకరించి,గాడ్సేలను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు.తమ దేశద్రోహాన్ని బూటకపు హిందూత్వ జాతీయవాదంతో కప్పిపుచ్చు కుంటున్నారు. 

స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై బుధవారం (ఆగస్టు 14) సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు.   ఐటి కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయనీ, వాటిని  రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రయ్నతాలు చేయాలన్నారు.   విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఇతర విద్యా సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న స్టార్టప్ లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ, టెస్టింగ్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.  పౌర సేవల కోసం యాప్   రూపకల్పన చేయాలన్నారు.    పలు రకాల పౌర సేవలను అందించే విషయంలో   లాజికల్ కన్క్లూజన్ కు రావాలన్న ధ్యేయంతో ముందుకు సాగాలని సూచించారు.  రాష్ట్రంలో సైబర్ సెక్యురిటీకి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.   రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు  రాష్ట్ర మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ అండ్ ఆర్టీజిఎస్ శాఖ మంత్రి నారా లోకేశ్  చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ విధానంలో ప్రజల సమస్యలను స్ట్రీమ్ లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐటి-ఎలక్ట్రానిక్స్ రంగంలో మెరుగైన అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు.  

వినేశ్ ఫొగాట్ కేసు.. అప్పీల్ తిరస్కరణ!

ఇండియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్.లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్ చేసిన అప్పీల్‌ని ‘కాస్’ కొట్టేసింది. ఫైనల్‌కి చేరిన తర్వాత అనర్హత వినేశ్‌పై వేటు వేయడంతో తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ తన అప్పీల్లో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ‘కాస్’ అడాక్ డివిజన్ బుధవారం తీర్పు వెల్లడించింది. ఫొగాట్ చేసిన అప్పీల్‌ని ‘కాస్’ తిరస్కరించిందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. "యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) విధించిన అనర్హత వేటును సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ని కాస్ తిరస్కరించడం దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది. రజత పతకం ఇవ్వాలని వినేశ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ కాస్ ఆగస్టు 14న తీర్పును ఇచ్చింది" అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్.లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అదనంగా బరువు ఉందని వినేశ్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడంతోపాటు 50 కిలోల ఫైనల్లో ఓడిన లోపెజ్ (క్యూబా)తో కలిపి తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీలు చేసిన విషయం తెలిసిందే.

అన్న క్యాంటీన్లకు భువనేశ్వరి కోటి విరాళం!

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్ల కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది స్వర్గీయ ఎన్టీఆర్ నినాదమని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతో విరాళం అందించినట్లు పేర్కొన్నారు. ఐదు రూపాయలకే కడుపు నింపడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అని, పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి భువనేశ్వరి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనది అన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.

స్వాతంత్య్ర దినోత్సవం.. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం!

పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున  తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో 2019 జూన్‌ నెల ముందువరకు పేదలకు మూడు పూటలా  కడుపు నింపిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మూసేసింది. ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా శిథిలావస్థకి తీసుకెళ్ళింది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్‌లు ఏ పాపం చేశాయి? అవసరమైతే పేరు మార్చుకుని కొనసాగించండి అంటూ  ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించినా జగన్ రాతిగుండె కరగలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లను నిర్వహించే ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తూ, పేదల ఆకలి తీర్చారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అన్న క్యాంటిన్‌లు పునఃప్రారంభిస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. తొలివిడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటిన్లను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ అన్న క్యాంటీన్లన్నీ సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి.