ఈటల.. ఆత్మగౌరవ పోరాటమిదేనా? తొలి రోజే ఇంత అవమానమా!

ఆత్మగౌరవం దెబ్బ తిందని..క్యాంప్ మారిస్తే అక్కడ ఆత్మ ఏమోగాని.. గౌరవం అస్సలు దక్కలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈటల రాజేందర్ ఆత్మగౌరవ పోరాటానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలిందనిపిస్తోంది. రెడీమేడ్ నేతలను తెచ్చుకుని కూర బాగా వండే బిజెపి నేతలు.. వారిని నేతలుగా కాకుండా.. ఒక పనిముట్టులా వాడుతున్నట్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనుభవాలతో అర్ధమవుతూనే ఉంది. ఇప్పుడు ఈటలను కూడా తెలంగాణలో తమకు హైప్ తెచ్చుకోవడం కోసమే తప్ప.. ఈటలకు న్యాయం చేయాలనే దయ, కరుణ ఏమీ బిజెపికి లేవు. ఎందుకంటే ఫోటోలో చూస్తుంటే అసలు మార్కింగ్ లేకపోతే ఈటల రాజేందర్ కనపడనే కనపడరు.అందుకు ఆయన హైట్ కారణం కాదు.. అక్కడున్న బిజెపి నేతల హెడ్ వెయిట్ కారణం. నడ్డా, బండి సంజయ్, రఘునందన్, రమేష్ రాథోడ్ లాంటివారు ఆ ఫోటోలో కనపడుతున్నారు. వీరందరి కంటే ఏ విషయంలోనూ ఈటల రాజేందర్ తక్కువ కాదు. ఒక విధంగా ఎక్కువే అని చెప్పుకోవాలి. అలాంటి ఈటల రాజేందర్ ను పక్కకు పెట్టేసి.. వీరంతా జేపీనడ్డాతో ఫోటో దిగటం అంటేనే అక్కడ ఈటలకు దక్కిన గౌరవం ఏంటో..? ఆత్మగౌరవ పోరాటం ఏంటో మరి? ఇదే కాదు.. అసలు ఈటల చేరిక.. ఆయన లెవెల్ కు మోదీ కాకపోయినా అమిత్ షాలో లెవెల్ లో జరగాలి.  పోనీ ఆయన లేడనుకున్నాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనైనా జరగాలి. వీరెవరూ లేకుండా కేవలం ఒక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో ఈటలను చేర్చుకోవడం ఏంటనేది ఎవరికీ అర్ధం కావాలి. ఈటలకు, ఆయన వెంట వెళ్లినవారికి అది అవమానంగా అనిపించినా.. దిగమింగుకుని సర్దుకుపోయినట్లున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు రేపు హుజూరాబాద్ లో గెలిస్తే సరే..ఓడిపోతే ఈటలను పట్టించుకుంటారా అనే అనుమానాలొస్తున్నాయి. ఒక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అది కూడా టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఒక కీలక నేతగా ఉన్న ఈటల... ఒక జాతీయ పార్టీలోకి వెళ్లేసరికి ఆయనకున్న విలువను తగ్గించుకున్నారో.. పెంచుకున్నారో అర్ధం కాని పరిస్ధితి కనపడుతోంది. కేసీఆర్ విలువ ఇవ్వలేదని.. అవమానించారని ఫీలయిన ఈటల రాజేందర్ మరి ఈ తాజా అవమానాల పట్ల ఎలా ఫీలయ్యారో.. అప్పుడే తెలియదు మనకు. టీఆర్ఎస్ లో అవమానాల గురించి ఏళ్ల తర్వాత చెప్పుకొచ్చిన రాజేంద్రుడు..వీటి గురించి ఎప్పటికో చెబుతారో మరి. ఇక ఈ ఫోటోలను గులాబీ దళం ఓ రేంజ్ లో వాడుకుంటుందనడంలో సందేహమే లేదు. ఆత్మగౌరవ నినాదానికి కౌంటర్ గా ఈ ఫోటోలనే వారు ప్రయోగిస్తారు.. ఆఖరికి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా

కమలం చేతిలో గులాబీ బాస్ చిట్టా! ఈటల అలా నరుక్కొస్తున్నారా... 

అహం అనేది ప్రమాదకరం.. అదే మన శత్రువు కూడా. అది మనలను వెనకా ముందు చూడకుండా రెచ్చగొట్టేస్తుంది. మనం కూడా రెచ్చిపోతాం. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటాం. వాటి పర్యవసానాలు ఎదురయ్యాకే మళ్లీ ఆలోచనలో పడతాం. కాని అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోతుంది. ఇప్పుడు కేసీఆర్ ఈటల వ్యవహారంలో అదే జరిగిందా.. అనే అనుమానం వస్తోంది.24 గంటల్లో తొక్కేశారు.. మరుసటి రోజే తీసేయకుండానే బయటకు పంపించేశారు. కబ్జా ముద్ర వేసేశారు.. కేసులు పెట్టేశారు.. కమిటీలు వేశారు..నివేదికలు తెప్పించేశారు. తన మాట వినకుండా.. తనను పరోక్షంగా విమర్శిస్తూ మంత్రి పదవి అనుభవిస్తున్న ఈటలపై కేసీఆర్ భగ్గుమన్నారు. లోలోపల ఆగ్రహంతో ఉన్నా..కొన్నాళ్లు ఓపిక పట్టారు. చివరకు అది బరస్ట్ అయింది. వెంటనే వ్యూహం రెడీ అయిపోయింది.. ఈటలను బయటకు పంపేయడానికి. చకచకా పావులు కదిపారు.. పని పూర్తి చేశారు. వారి అంచనా ప్రకారం..ఈటల కాంగ్రెస్ లోకి వెళ్లాలి.. లేదా సొంత పార్టీ పెట్టాలి. ఎందుకంటే వారి సమాచారం ప్రకారం ఈటల రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరరెడ్డి తదితరులతో టచ్ లో ఉన్నాడు. టచ్ లోకి వెళ్లాకే సెటైర్లు విసిరాడు. వారు ఊహించనది ఏంటంటే.. ఈటల బిజెపిలోకి వెళతాడని..అదే ఇప్పుడు వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈటల రాజేందర్ ఐదేళ్లు ఆర్ధిక మంత్రిగా పని చేశాడు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా చేశాడు. ఎంత వన్ సైడు నిర్ణయాలు తీసుకున్నా..కేసీఆర్ వ్యూహమేంటో.. ఎవరి కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటారోననేది తెలియకుండా ఉండదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వ్యవహారాలు జరిగాయి...ఎవరికి ఎలాంటి ఫేవర్స్ చేశారో ఆర్ధికమంత్రికి తెలియకుండా ఉండదు కదా..రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా..ఈటల కుండే సమాచారం ఈటలకు ఉండదా? ఇప్పుడు ఈటల ఆ గుట్టు కమలం ముంగిట విప్పితే ఏంటి పరిస్ధితి? అవన్నీఅడ్డం పెట్టుకుని బిజెపి బ్లాక్ మెయిల్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడీ ఆలోచనలే గులాబీ శిబిరంలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. లేటెస్టుగా లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఇంటిపైనా..ఆయన కంపెనీ మధుకాన్ ఆఫీసుపైనా ఈడీ దాడులు నిర్వహించింది. బ్యాంకులకు వెయ్యి కోట్లకు పైనే రుణాలు కావాలని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరి.. ఖమ్మంలో ఎంపీగా గెలిచారు. దీని కోసం గులాబీకోటలో భారీగానే సమర్పించుకున్నారని వినికిడి. ఈ ఒక్క ఎపిసోడ్ ఈటల ప్రమాదంపై అంచనాలను మరింత పెంచేస్తుండటంతో.. గులాబీ సేన తల పట్టుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ లో గెలవడం తర్వాత...ఇప్పుడు పార్టీ, ప్రభుత్వంలోని గుట్టుమట్లు.. పార్టీకి సహకరిస్తోన్న బిగ్ షాట్స్.. వారు తీసుకుంటున్న ఫేవర్స్ ఇవన్నీ లిస్టు రాసి కమలం చేతికి ఇచ్చాడంటే... వారు ఒక్కొక్కరిని బెదిరించి, కన్విన్స్ చేసి లాగేసుకుంటుంది బిజెపి. ఈ విద్యలో కమలనాథులు ఆరితేరిపోయారు కూడా. అందుకే బిజెపిలోకి ఇంకా అనేకమంది నాయకులు రాబోతున్నట్లు ప్రకటించడం వెనక అసలు ధీమా ఇదేనేమో. ఇంత ప్రస్థానం నడిపించి.. ఈటల విషయంలో ఇంత చిన్న లాజిక్ కేసీఆర్ సాబ్ ఎలా మిస్సయ్యారో మరి.

జగన్ రెడ్డి సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ.. సంగం కేసులో ఏసీబీ పిటిషన్ కొట్టివేత

జగన్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకే రోజు రెండు కేసుల్లో వైసీపీ సర్కార్ కు షాక్ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ కేసులో ప్రభుత్వం నియామకాన్ని కొట్టివేయగా... సంగం డెయిరీ కేసులో ఏసీబీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీలో సెర్చ్ వారెంట్ రీకాల్ చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ స్పెషల్ కోర్టు కొట్టి వేసింది. సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని కొట్టివేస్తూ ఏసీబీ స్పెషల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  గతంలో సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.  సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  ఇక మే 29న సంగం డెయిరీ పాలక వర్గ సమావేశం విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించారు. కర్ఫ్యూ, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఈ సమావేశం నిర్వహించారని పటమట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కిశోర్‌ కుమార్‌ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర, సిరిమల్లెల రాజేంద్రప్రసాద్‌, గోపాలకృష్ణతోపాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు అయింది. కాగా, సమావేశంలో తాము 12 మంది మాత్రమే పాల్గొన్నామని సంగం డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.

కేసీఆర్ క‌మాల్ 'కియా'.. జ‌గ‌న్‌రెడ్డి 'ఢ‌మాల్' కియా..

కియా మోటార్స్‌. ప్ర‌పంచ‌స్థాయి కార్ల కంపెనీ సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీని వెతుక్కుంటూ వ‌చ్చింది. ప‌క్క రాష్ట్రాలు వేసిన రాయితీ బిస్కెట్ల‌కు ఆశ‌ప‌డ‌కుండా.. ఏరికోరి మ‌రీ అనంత‌పురంలోనే కంపెనీ పెట్టింది. చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని న‌మ్మి.. వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టింది. అత్యంత వేగంగా ఫ్యాక్ట‌రీ నిర్మించి.. వేలాది మంది స్థానికుల‌కు ఉపాధి క‌ల్పించి.. కార్ల‌ ఉత్ప‌త్తి ప్రారంభించి.. చంద్ర‌బాబు చేతుల మీదుగానే ఫ‌స్ట్‌ గేర్ మార్చింది కియా మోటార్స్‌. ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా కియా కార్లే క‌నిపిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఏ రోడ్డులో వెళ్లినా.. కియా కారు హార‌న్ మీకు హాయ్ చెబుతుంది. ఆ కారును చూసి ఇది మ‌న అనంత‌పురంలో త‌యారైన కారేనంటూ ఆంధ్రులు గ‌ర్వ‌ప‌డుతుంటారు. కియా కారును చూపిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబును గుర్తుకు తెచ్చుకుంటుంటారు.  ప్ర‌భుత్వం మార‌డంతో.. కియా కారు వైభ‌వమూ మ‌స‌క‌బారిపోతోంది. స్థానిక వైసీపీ ఎంపీ గోరండ్ల మాధ‌వ్‌.. కియా యాజ‌మాన్యాన్ని బ‌హిరంగంగానే హెచ్చ‌రించిన దృశ్యాలు ఇంకా అంద‌రి క‌ళ్ల‌ల్లో క‌ద‌లాడుతూనే ఉన్నాయి. కియా కంపెనీ ముందు ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేయ‌డం వైసీపీ నేత‌ల‌కే చెల్లింది. అంత‌ర్జాతీయ కార్ల కంపెనీని అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. వెళ్ల‌గొట్ట‌డానికి కుట్ర‌లు చేసిన ఘ‌న‌త ప్ర‌స్తుత ప్ర‌భుత్వానిదేన‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. కియా కార్ల‌కు ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ల‌భించ‌కున్నా.. నాణ్య‌త‌నే న‌మ్ముకొని మ‌నుగ‌డ సాగిస్తోంది కియా మోటార్స్‌. ఇలాంటి సంద‌ర్భంలో తెలంగాణ ప్ర‌భుత్వం లేటెస్ట్‌గా ల‌గ్జ‌రీ 32 కియా కార్ల‌ను కొనుగోలు చేయ‌డంతో.. మేడ్ ఇన్ ఏపీ.. కియా కార్ల ప్ర‌స్తావ‌న మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది. సాటి తెలుగు రాష్ట్రం కియా కార్ల‌ను కొని.. త‌మ వంతు ప్రోత్సాహం ఇస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆమాత్రం సాయం కూడా చేయ‌దా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మేమీ కాక‌పోవ‌చ్చు. బ‌హుషా క‌మిష‌న్ల కోసం ప‌క్క‌న పెట్టేశారేమో అనే అనుమానాలూ వినిపిస్తుండ‌టం విచిత్ర‌మేమీ కాదు. ఏపీలో కియా మోటార్స్‌ ప్ర‌భుత్వ నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతుంటే.. తెలంగాణ‌లో ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ల‌గ్జ‌రీ కార్ల పోక‌డ‌లు ఎందుకంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు ఫార్చ్యున‌ర్ వెహికిల్స్ వాడుతుండ‌గా.. తాజాగా, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల కోసం.. ఒక్కోటి 24 ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే.. 32 కియా కార్లు కొన‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ దుబారాపై జ‌నాలు మండిప‌డుతున్నారు. పాత లెక్క‌ల‌న్నీ త‌వ్విపోస్తున్నారు.  2014లో తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పాటైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఏకంగా 20,104 కొత్త కార్లు కొనుగోలు చేసిన ఘ‌న‌త కేసీఆర్ స‌ర్కారుది. ఓవైపు ఖ‌జానాలో డ‌బ్బులు లేక ప్ర‌భుత్వ భూముల‌నే అమ్మ‌కానికి పెడితే.. ఇలా ల‌క్ష‌లు, కోట్లు పెట్టి.. వాహ‌నాలు కొన‌డానికి పైస‌లు ఎందుకు వేస్ట్ చేస్తున్నార‌నే వారూ ఎక్కువే. దొర.. పోక‌డ‌లు పోతున్నారంటూ త‌ప్పుబ‌డుతున్నారు.  సీఎం కేసీఆర్​ కాన్వాయి.. ఖరీదైన ల్యాండ్​ క్రూయిజర్లుతో గ్రాండ్‌గా ఉంటుంది. మంత్రుల కాన్వాయిలో ఫార్చూనర్లు ర‌య్ ర‌య్ మంటాయి. ఇక‌, 2014లోనే పోలీసు డిపార్టుమెంటు కోసం 271 కోట్ల‌తో 4,433 ఇన్నోవా కార్లను కొన్నారు. ఆ త‌ర్వాత మున్సిపాలిటీల కోసం వంద‌ల సంఖ్య‌లో కొత్త‌గా చెత్త వాహ‌నాలు కొనుగోలు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాట‌య్యాక‌.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఒక్కోటి 40 ల‌క్ష‌ల ఖ‌రీదైన‌ ఫార్చూనర్​ కార్లను కొనిచ్చారు. ఇరిగేషన్​ శాఖ సీఈలకు ఆరు ఇన్నోవాలు, రెండు టయోటా ఇతియాస్​ వాహనాలను కేటాయించారు. 28 సర్కిళ్లలో సూపరింటెండెంట్​ ఇంజినీర్ల కోసం 28 మహింద్రా బోలేరో, 8 టయోటా ఇతియాస్​ కార్లు తీసుకున్నారు. గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు ఇంజినీర్ల కోసం రెండు ఇన్నోవా, ఒక బోలేరో, రెండు టయోటా ఇతియాస్​ కార్లు కొనుగోలు చేశారు. 32 మంది జిల్లా పరిషత్​ ఛైర్మన్ల కోస‌మూ ఫార్చూనర్​ కార్లను కొనుగోలు చేసింది. ఇక‌, రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శులకు హోండా సిటీ, టొయోటా కామ్రీ, కొరోల్లా, స్కోడా కార్లు ఉన్నాయి. తాజాగా, అడిష‌న‌ల్ కలెక్ట‌ర్ల కోసం కొత్త ల‌గ్జ‌రీ కియా కార్లు కొన‌డం కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణం అవుతోంది. ఢిల్లీస్థాయిలో పని చేసే కేంద్ర ప్రభుత్వ అధికారులు జాయింట్​ సెక్రెటరీ స్థాయిలో వినియోగించే కార్లతో పోలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాడుతున్న కార్లు రెండింతలు ఖరీదైనవని అంటున్నారు.  క‌రోనా కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా దెబ్బ‌తిన‌డం.. అప్పుల కోసం ఎఫ్ఆర్ఎమ్‌బీ ప‌రిమితి 5 శాతానికి పెంచాలంటూ ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు కేంద్రానికి లేఖ రాయ‌డాన్ని బ‌ట్టి చూస్తే.. పైస‌ల తిప్ప‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం అవుతోంది. మ‌రి, ఇలాంటి క‌రోనా క‌ష్ట కాలంలో అంత ఖ‌రీదైన కార్ల‌ను ఇప్ప‌టికిప్పుడు అర్జెంట్‌గా కొనాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందో కేసీఆర్‌కే తెలియాలి. ప‌ల్లెప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించే అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు ల‌గ్జ‌రీ కార్లు వేసుకొని ద‌ర్జాగా గ్రామాల బాట ప‌డితే.. ధ‌నిక రాష్ట్రం అంటే.. బంగారు తెలంగాణ అంటే.. ఇదేన‌ని ప్ర‌జ‌లు భ్ర‌మ‌ప‌డ‌తార‌ని కాబోలు ఇదంతా...! అంతేనా, కేసీఆర్ గారూ..?

అతనికి 38  మంది భార్యలు, 89 మంది పిల్లలు.. 33 మందు  మనవళ్లు, మనవరాళ్లు 

రాముడికి సీత ఒక్కటే పెళ్ళాం. కలియుగ దేవుడు శ్రీ వెంకన్న స్వామికి ఇద్దరు భార్యలు, శివుడికి ఇద్దరు భార్యలు, శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు, ఇక మనుషుల విషయానికి వస్తే పెళ్లి విషయంలో కొంత మంది రాముడిని ఫాలో అయితే ఇంకొందరు, వెంకన్న శివుడ్ని ఫాలో అయ్యి ఇద్దరు పెళ్లాలను చేసుకుంటారు.. ఇంకొంత మంది వాళ్ళు సంఖ్యను బ్రేక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.. అలాగే శ్రీకిష్ణుడిని సంఖ్యను బ్రేక్ చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. శ్రీ కృష్ణుడి సంఖ్యను బ్రేక్ చేయడం అంటే 9 మందిని పెళ్లిచేసుకోవడం కాదు.. 16 మందిని పెళ్లి చేసుకోవడం కాదు ఇతను ఏకంగా  38 మందిని పెళ్లి చేసుకున్నారు. ఒక్క పెళ్ళని పెళ్లి చేసుకుని దాని పోరు పడడం కష్టం అనుకుంటే ఇంత మందిని ఎలా మెయింటేన్ చేశాడో మహానుభావుడు అని అనుకుంటున్నారా..? ఆ విషయాలు తెలియాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి.. సరే ఆ విషయం వదిలేస్తే పెళ్ళాలు అంతమంది ఉంటే మరి పిల్లలు ఇంకెంత మంది ఉంటారు అని అనుకుంటున్నారా..? 89  ఉన్నారు. 33 మందు  మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అంటే దాదాపు అతని మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీ 160 మంది ఉన్నారు. అంతే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు పొందింది ఆ కుటుంబం, వారు ఉన్న ఊరు  పర్యాటక ప్రాంతంగానూ మారింది. తాజాగా ఆ ఇంటి పెద్ద ఆదివారం కన్నుమూశారు.  వివరాలు ఇలా ఉన్నాయి.  అది మిజోరాం రాష్ట్రము. బక్తావంగ్ త్లాంగ్‌నమ్ గ్రామం అతని పేరు  జియోన చనా. అతని  వయసు  76 సంవత్సరాలు.  మిజోరాంలోని మధ్య సెర్‌చిప్ జిల్లా బక్తావంగ్ త్లాంగ్‌నమ్‌ గ్రామానికి చెందిన జియోన చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. చనా మృతిపై మిజోరం ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరాంతంగ భారమైన హృదయంతో సంతాపం తెలిపారు. ‘మీ కుటుంబం కారణంగానే రాష్ట్రంలో పెద్ద పర్యాటక కేంద్రంగా మీ గ్రామం ఉండేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు. డయాబెటిస్‌, బీపీలతో బాధపడుతున్న జియోన మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. స్వగ్రామం బక్తావంగ్‌ త్లాంగ్‌నామ్‌లోని చనాస్‌ వర్గానికి ఈయనే పెద్ద. జులై 21, 1945లో జన్మించిన జియోన పదిహేడేళ్ల వయసులో తొలి వివాహం చేసుకున్నారు. మొదటి భార్య జతియంగ్ ఆయన కంటే మూడేళ్లు పెద్దది కావడం విశేషం. వంద గదులున్న నాలుగంతస్తుల భవనంలో ఈ కుటుంబం నివసిస్తోంది. విశ్రాంత గదులు వేరైనా అందరికీ వంటగది ఒక్కటే. జియోన పడకగదికి దగ్గరలోని డార్మెటరీలో ఆయన భార్యలు ఉండేవారు. కుటుంబ పోషణకు సరిపడా ఆర్థిక వనరులున్నా బయటి నుంచి కూడా విరాళాలు అందేవి. ‘నా మతాన్ని విస్తరించే క్రమంలో నేను వివాహం చేసుకోవడానికి అమెరికా కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ఒకప్పుడు చనా చెప్పేవారు. కాగా, ఓ ఇంటర్వ్యూలో చనా కుమారులు మాట్లాడుతూ.. తమ తాత ముత్తాలకు కూడా చాలా మంది భార్యలు ఉండేవారని అన్నారు. పేద మహిళలను చూసి పెళ్లిచేసుకోనేవారని తెలిపారు. కాగా, చనా కుటుంబం వల్ల బక్తావంగ్ త్లాంగ్‌నమ్ మిజోరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. అయ్యో పాపం ఆయన ఆత్మకు శాంతి కలుగ వలెను అని, వారి కుటుంబ సభ్యుల కు ధైర్యం రావాలని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను  

బీజేపీకి సీఎం జగన్ సరెండర్! రఘురామ కేసులో అమిత్ షా సైలెంట్..

కేంద్రంలో చేర‌డం.. మంత్రి పద‌వులు చేప‌ట్ట‌డం కానే కాద‌ట‌. పోల‌వ‌రం నిధుల ప్ర‌స్తావ‌నే రాలేద‌ట‌. మూడు రాజ‌ధానుల అంశ‌మూ చ‌ర్చించ‌లేద‌ట‌. జ‌స్ట్ 2 పాయింట్ ఎజెండాతో కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షాను క‌లిశార‌ట సీఎం జ‌గ‌న్‌రెడ్డి. త‌న‌పై ఉన్న సీబీఐ కేసులు.. ర‌ఘురామ ఎపిసోడ్‌.. ఈ రెండు అంశాలపైనే గంట‌కు పైగా మీటింగ్ జ‌రిగింద‌ట‌. లోప‌లంతా ద‌బిడి దిబిదేన‌ట‌.. కాస్త ఆల‌స్యంగా ఢిల్లీ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన ప‌క్కా స‌మాచారం ఇది.  అమిత్‌షా ముందు పూర్తి స్థాయిలో స‌రెండ‌ర్ అయ్యార‌ట జ‌గ‌న్‌రెడ్డి. త‌న‌ను సీబీఐ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేయండి.. మీరు ఏది చెబితే అది చేస్తా.. మీరు ఏది రైట్ అంటే అదే రైట్ అంటానంటూ కాళ్ల‌బేరానికి వ‌చ్చార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి, ప్ర‌శాంత్ కిశోర్ మ‌ధ్య ర‌హ‌స్య మంత‌నాలు, ఎన్డీయే కూట‌మివైపు స‌మాలోచ‌న‌ల గురించి త‌మ ద‌గ్గ‌ర స‌మాచారం ఉందంటూ అమిత్‌షా జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌శ్నించడంతో మ‌నోడు ఒక్క‌సారిగా షాక్ తిన్నాడ‌ట‌. ఒక్క‌సారిగా అవాక్క‌యి, అంత‌లోనే తేరుకొని.. అలాంటిదేమీ లేద‌ని.. తాను బీజేపీకే మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని ఘంటాప‌థంగా చెప్పుకొచ్చార‌ని తెలుస్తోంది. ఎన్డీయే కూట‌మికే త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు అని అమిత్‌షాకు తేల్చి చెప్పార‌ట సీఎం జ‌గ‌న్‌రెడ్డి. అమిత్‌షా ముందు క్విడ్ ప్రోకో ప్ర‌తిపాద‌న తీసుకొచ్చార‌ట‌. మేం మీకు అన్ని ర‌కాలుగా పూర్తి మ‌ద్ద‌తుగా ఉంటాం.. మీరు మాకు కేసుల విష‌యంలో స‌హ‌క‌రించండంటూ డీల్ ప్ర‌పోజ్ చేశార‌ట‌. ప్ర‌త్యేక హోదా.. పోల‌వ‌రం నిధులు, విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో ఎప్ప‌టిలానే మౌనంగా ఉంటాం.. అందుకు ప్ర‌తిఫ‌లంగా సీబీఐ కేసుల దూకుడు త‌గ్గించాల‌ని, త‌న‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన ర‌ఘురామ‌ను సైడ్ చేసేందుకు కేంద్ర మ‌ద్ద‌తు కావాల‌ని అమిత్‌షాను జ‌గ‌న్‌రెడ్డి వేడుకున్నార‌ని అంటున్నారు. అయితే, ఎప్ప‌టిలా కాకుండా ఈసారి అటునుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. సీబీఐ కేసుల విష‌యం వ‌ర‌కు అయితే ఓకే అని అమిత్‌షా అన్న‌ట్టు స‌మాచారం. అయితే, ఎంపీ ర‌ఘురామ విష‌యంలో మాత్రం అమిత్‌షా నుంచి ఎలాంటి హామీ ద‌క్క‌లేద‌ట‌. ర‌ఘురామ త‌న కాలి గాయాల ఫోటోల‌తో స‌హా దేశంలోని ఎంపీలు, సీఎంలు అంద‌రికీ ఇప్ప‌టికే లేఖ‌లు రాశార‌ని.. ఇప్పుడది కేంద్రం కోర్టులో లేద‌ని.. ర‌ఘురామ‌తో ఏపీ ప్ర‌భుత్వం ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించారో యావ‌త్ దేశానికి తెలిసిపోయింద‌ని.. ఓపెన్‌గా ఇంత డ్యామేజ్ జ‌రిగిపోయాక‌.. ఇప్పుడు తామేమీ చేయ‌లేమ‌న్న‌ట్టు అమిత్‌షా చేతులెత్తేశార‌ని తెలుస్తోంది. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌న్న‌ట్టుగా అమిత్‌షా మాట్లాడార‌ని అంటున్నారు.  క‌నీసం త‌మ పార్టీ ఫిర్యాదు మేర‌కైనా.. ర‌ఘురామ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంపై స్పీక‌ర్‌ వేటు వేసేలా హెల్ప్ చేయాల‌ని జ‌గ‌న్‌రెడ్డి మ‌రోసారి అమిత్‌షాను రిక్వెస్ట్ చేశార‌ట‌. అయితే, ర‌ఘురామ‌కు స్పీక‌ర్ ఓం బిర్లాతో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని.. ర‌ఘురామ‌కు వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల్లో ఉన్న 50 మందికి పైగా క్ష‌త్రియ వ‌ర్గ ఎంపీలు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని.. అనేక‌మంది బీజేపీ క్ష‌త్రియ ఎంపీలు సైతం ర‌ఘురామకు స‌పోర్ట్‌గా త‌మ‌పై ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని.. ఇప్ప‌టికే బాగా డ్యామేజ్ జ‌రిగిపోయింద‌ని.. ఈ విష‌యంలో తామేమీ చేయ‌లేమ‌ని.. అమిత్‌షా స్ప‌ష్టం చేశార‌ని తెలుస్తోంది. జ‌ర‌గ‌బోవు ప‌రిణామాల‌ను పార్ల‌మెంట్‌లోనే తేల్చుకోవాల‌ని జ‌గ‌న్‌రెడ్డికి సూచించార‌ట అమిత్‌షా.  ఎంపీ ర‌ఘురామ ఎపిసోడ్‌లో ఏకంగా కేంద్ర‌మే హ్యాండ్స‌ప్ అన‌డంతో జ‌గ‌న్‌రెడ్డి తీవ్ర నిరాశ‌, నిస్పృహ‌లతో ఉన్నార‌ని అంటున్నారు.

జగన్ కు జబర్దస్త్ ఝలక్.. రాక్షసులే బెటరన్న అశోక్ 

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని తెలిపారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందన్నారు చంద్రబాబు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు.  ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుతో తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైందని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. తాను ట్రస్టు చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, అక్రమాలు నిజంగానే జరిగుంటే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. తనపై కక్షతో మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులను పలు ఇబ్బందులకు గురిచేశారని, ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని ఆరోపించారు. ఆఖరికి మూగజీవాలను కూడా హింసించారని, రాక్షసులు కూడా ఇలా చేసివుండరని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. తీర్పు ఉత్తర్వులు అందాక మిగతా వివరాలు అందిస్తానని అశోక గజపతి రాజు తెలిపారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిసి తాజా పరిణామాలను నివేదించారు. అనంతరం మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్ కు వెళతామని చెప్పారు. తాము ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగానే ముందుకు వెళతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

లారీ డ్రైవర్ గా .. 24 ఏళ్ళ ఆమ్మాయి..  

వంటింటికే ఆడవాళ్లు అనేది ఒకప్పటి మాటలు.. నేటి సమాజం లో అన్ని రంగాల్లో మగాళ్ల తో పాటు మగువలు కూడా ఉండుంటున్నారు.. ఒక్కటేమిటి ఇందుగలడందులేటని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే కలరు మహిళలు. హైదరాబాద్ లో పొట్టకూటి కోసం, పిల్లల చదువులకోసం ఆటో లను నడిపిన ఆడవాళ్ళని చూశాం. బస్సు డ్రైవర్స్ గా పనిచేసిన ఆడవాళ్లను కూడా చూశాం.. తాజాగా ఒక 24 ఏళ్ళ అమ్మాయి లారీ డ్రైవర్ గా పనిచేస్తుంది.. డ్రైవింగ్ చేయడం ఎంతో ఇష్టమైన పని అంటుంది. లారీ డ్రైవింగ్ మగాళ్లే కాదు, తానూ చేయగలనని నిరూపిస్తోంది ఆమె పేరు దెలిషా డేవిస్.. చదివింది ఎంకామ్. ఇప్పుడు లారీ డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకుంది. 300 కిలోమీటర్ల పాటు అలుపు సొలుపు లేకుండా డ్రైవింగ్ చేస్తూ, వృత్తిని ఎంతో ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాము అనుకున్నది చేసే ఇప్పటితరం అమ్మాయిలకు అచ్చమైన ప్రతినిధిలా కనిపించే దెలిషాకు డ్రైవింగ్ అంటే ప్రాణం అని చెపుతుంది. ఆమె డ్రైవర్ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి..? ఎలాంటి ప్రరిస్థితులు ఆమెను డ్రైవెర్జ్ స్థిరపడేలా చేశాయో తెలుసుకుందాం..  ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది. ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు షాక్ కేర్ గురయ్యారు. సార్, ఓ చిన్న అమ్మాయి ట్యాంకరు లారీ నడుపుతోంది అంటూ తమ పై అధికారులకు సమాచారం అందించారు. ఆపై, దెలిషా డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్), ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు. తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ఆవాహనం చేసుకుంది శ్రద్దగా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్ ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. తండ్రి ప్రోత్సాహం వల్లే తాను లారీ డ్రైవర్ గా కొనసాగుతున్నానని, ఆయన వెన్నుతట్టకపోతే తాను డ్రైవింగ్ నేర్చుకుని ఉండేదాన్ని కాదని దెలిషా చెబుతోంది. తాను చదువును నిర్లక్ష్యం చేయలేదనీ, సాయంకాలం క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని, ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతోంది దెలిషా. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.   ఇదండీ మగాళ్లే కాదు మహిళలు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలరు.. అందుకని ఎప్పటి నుండి ఐన ఎవరైతే ఇంట్లో గానీ.. ఆఫీస్ లో గానీ మహిళలను చిన్న చూపు చూస్తూ సమాన గౌరవం ఎవ్వరో ఇప్పటి నుండి అయినా మహిళలను గౌరవించండి.. వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారని గుర్తించండి..మహిళా దినోత్సవం రోజు ఒక్క రోజే కాదు రోజు వాళ్ళను గౌరవించాడు.. మీరు గౌరవిచకపోయిన పర్లేదు గాడి చిన్నచూపు మాత్రం చూడకండి..   

ఢిల్లీలో ఈటల తుస్సుమన్నారా? గులాబీకి అస్త్రం దొరికినట్టేనా...

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్  కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన చేరిక అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు బాగా హడావుడి చేశారు. ఆయన చేరిక సెన్సెషన్ అవుతుందన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ఈటల రాజేందర్ కూడా అలాగే వ్యవహరించారు. తన చేరిక ఆషామాషీ వ్యవహారం కాదన్నట్లుగా షో చేశారు. తనతో కలిసి వచ్చే నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.  తెలంగాణ బీజేపీ నేతలతో పాటు ఈటల అనుచరుల హంగామా ఓ రేంజ్ లో ఉంటే.. హస్తినలో సీన్ మాత్రం మరోలా కనిపించింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక కార్యక్రమం ఎవరూ ఊహించినంత సింపుల్ గా జరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం... కనీసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా కూడా జరగలేదు. ఒడిషాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఈటల రాజేందర్. ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో కీలక నేత కూడా కాదు. అలాంటి నేత సమక్షంలో రాజేందర్ బీజేపీలో చేరడమే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, ఆర్టీసీ యూనియన్‌ లీడర్‌ అశ్వత్థామరెడ్డి, గండ్ర నళిని, అందె బాబయ్య తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు ఢిల్లీలో జరిగిన ఈటల రాజేందర్ చేరిక కార్యక్రమం ఆయన అనుచరులను కూడా నిరాశకు గురి చేసిందని తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ నేతలైతే పండగ చేసుకుంటున్నారు. ఆత్మగౌరవం అంటూ గొప్పగా చెప్పుకునే ఈటల రాజేందర్ కు తొలి రోజే ఢిల్లీలో బీజేపీ అంటే ఏంటో తెలిసొచ్చేలా జరిగిందని అంటున్నారు. జేపీ నడ్డా కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో జాయినింగ్ కార్యక్రమం జరిగిందంటేనే.. ఈటలకు బీజేపీ హైకమాండ్ ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలుస్తుందని అంటున్నారు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో రాజేందర్ తాకట్టు పెట్టారని మరికొందరు చెబుతున్నారు. ఈటల చేరికపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తోంది గులాబీ సోషల్ మీడియా టీమ్. ఇదేనా రాజేందర్ తమరి ఆత్మగౌరమంటూ సెటైర్లు వేస్తున్నారు.  ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళుతున్నప్పుడు కూడా జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరతారని చెప్పారు. నడ్డా అపాయింట్ మెంట్ కూడా ఖరారైందన్నారు. కాని చేరిక కార్యక్రమానికి జేపీ నడ్డా రాకపోవడం బీజేపీ నేతల్లోనూ నిరాశ కల్గిస్తోంది. జేపీ నడ్డా ఢిల్లీలోనే ఉండి కూడా ఈటల రాజేందర్ చేరిక సమయంలో లేకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను బీజేపీ హైకమాండ్ మామూలు లీడర్ గానే చూస్తుందా అన్న అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటారని భావిస్తే.. ఈటల వెళ్లి బీజేపీలో చేరి బలహీనమయ్యారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 

కడ్తాల్ లో రేవ్ పార్టీ..

నేటి యువత వారం అంత కష్టపడ్డామా వీకెండ్ వస్తే మందు చిందు వేస్తూ  ఎంజాయ్ చేశామా .. అనేదే ఈ యువత రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఎంజాయ్,  ఫ్రీడమ్, ఆలౌన్ గా ఉండమే పరిపూర్ణమైన జీవితం అని అనుకుంటున్నారు. వారి ఎంజాయ్ పక్కన పెడితే వాళ్ళ ఎంజాయ్ వల్ల ఎంత మంది డిస్ట్రబ్ అవుతున్నారు అనేది వాళ్లకు పట్టడం లేదు.   హైదరాబాద్ కి సరిగ్గా 49 దూరంలో శ్రీశైలం హైవే మీద ఉన్న గ్రామం అది.. ఆ గ్రామం పేరు కడ్తాల్‌. రాజధాని సిటీకి దగ్గర ఉండడం వల్ల హైదరాబాద్ ప్రభావం బాగానే ఉందని చెప్పలి. ఇక యువతీయువకుల విషయానికి వస్తే.. జల్సాలకు అలవాటు పడ్డారు.. హైదరాబాద్ లో అయితే వీకెండ్స్ వస్తే చాలు పబ్బులల్లో పండగలు స్టార్ట్ అవుతాయి.. వీకెండ్ పార్టీస్ కాకుండా అప్పుడప్పుడు రేవ్ పార్టీలు జరుగుతుంటాయి.. ఈ మధ్య కాలం లో ఎంఐఎం పార్టీ నాయకుడి రేవ్ పార్టీ కూడా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ విషయం మారిపోక ముందుకే మరో రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది.   తాజాగా కడ్తాల్ లో కొంత మంది రేవ్ పార్టీ నిర్వహించారు.. ఆ పార్టీ స్థానికులతో  కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ నిర్వహించుకుంటున్నా పదిహేను జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్ లో మందు వేసి చిందులు వేశారు. హైదరాబాద్ కు చెందిన 30 మంది యువతీ యువకులు పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా రేవ్ పార్టీ పై దాడి చేశారు. అందర్నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ సంబంధించిన వారంతా ఉన్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. రాత్రి మద్యం సేవిస్తూ, డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ చిందులు వేస్తూ, డాన్సులు చేశారు. ఎస్‌వోటీ పోలీసులు, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్‌పై రాత్రి 11.30 గంటలకు దాడులు నిర్వహించారు. నిర్వాహకుల్లో ఒకరైన వరుణ్‌గౌడ్‌ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ఏ-1, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్‌ అలీఖాన్‌ ఏ-2, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌ ఏ-3, పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అయితే ఈ పార్టీ బర్త్‌డే పార్టీ అని చెబుతున్నా... అలా ఏ మాత్రం లేదని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో... రేవ్ పార్టీకి మించి ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఇది పరిస్థితి నేటి యువత రేవ్ లు అని కేవులు అని ఎంజాయ్ చేయడం తప్పితే.. భవిష్యత్తు మీద బాధ్యతగా లేరని కడ్తాల్ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.. ఎంజాయ్ అంటే పర్సనల్ విషయం అని ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఇలా బయటికి వచ్చి రేవ్ పార్టీలు చేస్తే వాళ్ళను చూసి గ్రామాల్లో ఉన్న యువత కూడా తప్పుదోవ పట్టే  అవకాశాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు..   

జగన్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్.. మానస ట్రస్టీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజే..

జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మానస ట్రస్టీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంచయిత నియామక జీవోను కొట్టేసింది. అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై కీలక ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను కొట్టివేసింది. సింహాచల వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు అశోక్ గజపతి రాజు  చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేసింది.  సంచ‌యిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.  2020 మార్చిలో మాన్సాస్‌, సింహాచ‌ల ట్ర‌స్టులకు ఛైర్ ప‌ర్స‌న్‌గా సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును రాష్ట్ర ప్ర‌భుత్వం నియమించింది. అప్ప‌టి వ‌ర‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజును తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడం వ‌ల్ల వ‌య‌స్సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని.. సంచ‌యిత నియామకంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు అప్ప‌ట్లో హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టుల ఛైర్మ‌న్‌ను నియ‌మించింద‌ని ఆయ‌న న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించి. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా తిరిగి నియ‌మించాల‌ని ఆదేశించింది.  

వరుడి ఆలస్యం.. వదువుకు నచ్చలేదు.. అందుకే ఇలా చేసింది.. 

అది పచ్చని పందిరి.. ఇంటి నిండా తోరణాలు. పంచభూతాలు, వేదమంత్రాలు  బంధువుల  సమక్షంలో పెళ్లి జరిగింది.. రిసెప్క్షన్ మొదలైయింది. ఆ తర్వాత వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. పెళ్లి కూతురు అలా చేయడంతో ఒక్కసారిగా అక్కడ వచ్చినవారంతా నోటిమీద వేలు వేసుకుని షాక్ తిన్నారు.. ఇంతకీ ఆ పెళ్ళిలో ఏం జరిగింది..? ఎందుకు పెళ్లి కూతురికి కోపం వచ్చిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే మరింకెందుకు ఆలస్యం.. తెలుసుకుందాం పదండి. ప్రతి మనిషి లైఫ్ లో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో వివాహాలకు ఒక ప్రత్యేకత , విశిష్టత ఉంది.. మన సంప్రదాయం పై  ప్రపంచమంతా ఒక గౌరవం ఉంది. పెళ్ళిలో సాంప్రదాయిక ఆచారాలకు ఇందులో చాలా గౌరవం ఇస్తారు. పెళ్లి జరిగాక రిసెప్షన్లో నవదంపతులు అందరూ నోరు తీపి చేయడం ఆనవాయితీ.. ఈ సందర్భంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కు స్వీట్ నోట్లో పెట్టేందుకు ముందుకు వచ్చింది.. ఆ సమయంలో ఓ పెళ్లి కొడుక్కి ఉన్న అనుమానమే లేదా జల్సా సినిమాలో ఇలియానా పదినిమిషాలు లేట్ చేసే అలవాటు ఉన్నటు  నిజంగానే పెళ్లికొడుక్కి కూడా అలాంటి జబ్బు ఏమైనా ఉందొ లేదో తెలియదు గానీ అలా ఆలస్యం చేయడం వదువుకు అసహనం కట్టలు తెంచుకునేలా చేసింది. వధువుకు కోపమొచ్చింది..ఒక్కసారిగా చేతిలో ఉన్న స్వీట్ తీసుకుని పక్కకు విసిరికొట్టింది. ఎవరైనా చూస్తే యమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వాళ్ళ పెళ్ళికి వచ్చినవారంతా షాక్ అయ్యారు.  సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలను  చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడానికి చూస్తుంటారు. అయితే  ఇలాంటి సంఘటనలపై కొన్నిసార్లు ప్రశంసలు కురుస్తుంటాయి. మరి కొన్నిసార్లు వారు ఎగతాళిగా మారుతాయి. అలాంటి ఒక వీడియో ఇటీవలి రోజుల్లో కనిపించింది. ఇది చూసిన తరువాత, వధువు వివాహం బలవంతంగా జరుగుతోందని మీరు కూడా అనుకోవలసి వస్తుంది. మరి ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందంటారు.. ఆ సహనం నశిస్తే దాని తళుకు రిజల్ట్ ఇలాగే ఉంటుంది అనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం..   

ఏపీలో ఆలయ  భూములు మాయం! కబ్జాదారులెవరు జగన్ రెడ్డి? 

“దేవాలయాలను, దేవాలయ భూములను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయశాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. దేవాలయాలకు సంబందించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటాం. అంతే కాని,  దేవాలయాల భూములను  విక్రయించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం దేవాలయ భూములను  అన్యులకు  దారాదత్తం చేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఆక్రమణలు జరగకుండా పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో దేవాలయాలలో 40 వేల సీసీ కెమారాలను అమర్చడం జరిగింది.” కొద్ది రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస విలేకరుల సమావేశంలో ఇచ్చిన వివరణ ఇది.  అయితే  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రాష్ట్రం  దేవుడికే రక్షణ లేకుండా పోయింది. అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాల ద్వంస రచన యధేచ్చగా సాగుతోంది. మరో వంక దేవుని ఆస్తులకు, దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వట్టిగా ఆరోపణలు చేయడం కాకుండా గట్టి ఆధారాలను చూపుతున్నాయి. అయినా ప్రభుత్వం, ఏవో సాకులు చూపి, అడ్డదారులలో దేవాలయాల భూములను అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. కొంతకాలం క్రితం,తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములను, ఇతర ఆస్తులను విక్రయించడానికి, బ్రహ్మాండ ప్రణాళికను సిద్దం చేసింది.  ఒక్క రాష్ట్రంలోనే కాకుండా, దేశం మొత్తం దేశంలో ఉన్న వందల వేల కోట్ల రూపాయల విలువచేసే  భూములు, ఇతర ఆస్తులను విక్రయించేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం తీసుకుంది. అయితే  పాలకమండలి నిర్ణయంపై భక్తులతోపాటు పలు పార్టీల నాయకులు, సంఘాలు ఆందోళన చేపట్టాయి.  భక్తులు ఇచ్చిన ఆస్తులు ఎలా అమ్ముతారంటూ రాజకీయ పార్టీలు, ధార్మిక  సంస్థలు ధ్వజమెత్తాయి. పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెంకన్న స్వామికి భక్తులు సమర్పించిన కానుకలను  'నిరర్థక ఆస్తులు' గా పేర్కొనడం పై దుమారం చెలరేగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే'నని ధ్వజమెత్తారు. ఆస్తుల వేలం నిర్ణయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో , వివిధ రూపాల్లో ఉద్యమం జరిగింది. ఇక చేసేది లేక మొదటికే మోసం వస్తుందని గ్రహించి ప్రభుత్వం అప్పటికి వెనకడుగు వేసింది. టీటీడీ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. కానీ, అదను కోసం ఎదురు చూస్తోంది.  ప్రభుత్వం తీరు ఇలా ఉంటే, గేదె చేనులో మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎక్కడ దేవుని భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి పోతున్నారని, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు  ఆరోపిస్తున్నాయి. విపక్షాల ఆరోపణలను నిజం చేస్తూ, మంత్రాలయంలో మూడు కోట్ల రూపాయల విలువైన ఆంజనేయస్వామి మాన్యంపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నేశారు. వంద మంది ఆ భూముల్లో బండలు పాతేశారు. సుమారు ఆరు ఎకరాలు ఆక్రమించేశారు. అంతే కాదు,తమ పార్టీ నాయకుల ఆదేశంతోనే భూములను అక్రమించుకున్నామని, గొప్పలు పోయారు. ఇక సింహాచలం భూముల వ్యవహారం అయితే చెప్పనే అక్కరలేదు, ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణల సమస్య దశాబ్ధాలుగా అపరిష్కృతంగానే ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ప్రచార అస్త్రంగా ఉపయోగపడుతోందే కానీ, దేవునికి న్యాయం జరగడం లేదు. సింహాచలం దేవస్థానానికి విజయనగరం రాజులు 14 వేల ఎకరాలను దానంగా ఇచ్చారు. అందులో సింహాచలం ఆలయం చుట్టూ ఉండే 500 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి.ఈ భూములపై కన్నేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, అనేక అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల భూములు పెద్ద ఎత్తున అక్రమణకు గురయ్యాయి. తాజాగా లెక్కల ప్రకారం, అధికారికంగానే  దాదాపు లక్ష ఎకరాల దేవాలయాల భూమి అన్యాక్రాంతమైంది. పక్కా లెక్కలు తీస్తే అంతకు ఇంకెన్ని రెట్ల భూమి అన్యాక్రాంతం అయిందో తెలుస్తుంది. అలాగే వ్యాపారాల కోసం లీజుకు, వ్యవసాయం కోసం కౌలుకి భూములను తీసుకున్న వారు సైతం గడువు ముగిసినా వాటిని తిరిగి అప్పగించడం లేదు. ఈ నేపధ్యంలో ఆలయాల వారిగా రికార్డులను సిద్ధం చేసి, ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి...ఆ భూములను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని వస్తామని,  సింహాచలంతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాదాయ భూముల వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాత రికార్డును రీప్లే చేసారు.అయితే ఈ క్రమబద్దీకరణ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా...., సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.దేవాలయాల భూములను క్రమబద్దీకరించడాన్ని పీఠాధిపతులు సైతం వ్యతిరేకిస్తున్నారు. "ఆలయ మాన్యాలను ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.అంతేకాని...భూములను క్రమబద్దీకరించడం సరైనది కాదు. దేవుడి భూములను పంచే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. ఉన్నత లక్ష్యాలతో దేవాలయాల మనుగడకు, భగవంతుడి కైంకర్యాలకు దానంగా ఇచ్చిన ఆస్తులను ఇతరులకు పంచే హక్కు ప్రభుత్వాలకు లేదు.దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. దేవస్థానాల భూములను ఆక్రమించిన వారే అనుభవించేలా క్రమబద్దీకరించడం...సరైన విధానం కాదు. ఇది దేవుడిని మోసం చేయడమే" అని చినజీయర్‌స్వామి అన్నారు.  ఇటీవల మద్రాస్ హై కోర్టు దేవాలయ భూముల విషయంలో మరో సంచలన తీర్పు నిచ్చింది. దేవ్లయాల భూములను విక్రయించే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం అయినా దాతల అనుమతి లేకుండా దేవాలయాల భూములను ముట్టుకునే అధికారం ప్రభుత్వాలకు లేదని, ఆల్ చేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దేవాలయాల భూములు ఎప్పటికీ దేవాలయాల భూములే, దేవాలయ భూములుగానే ఉంటాయి. ప్రజోపయోగం పేరున దేవాలయాల భూములు  తీసుకోవడం, కుదరదు, అది చట్ట రీత్యా నేరం  అని మద్రాస్ హై కోర్టు, ష్టమైన తీర్పును ఇచ్చింది. నిజానికి, మద్రాస్ తీర్పు కంటే చాలా ఏళ్ల ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కూడా, ఇదే విధమైన తీర్పు నిచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటాయి అనేది, అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ఏపీలో ఉన్నది, మాములు ప్రభుత్వం కాదు,కొత్త దేవుని ప్రభుత్వం. కాబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం పొరుగు రాష్ట్రం హై కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విలువ ఇస్తుందని అనికోవడం, ఆశించడం జస్ట్ వృధా ప్రయాస. ఆ దేవదేవుడిదే దేవాలయ భూముల రక్షణ భారం.

జగన్ బెయిల్ రద్దు కేసు అప్ డేట్.. సీబీఐ కోర్టులో ఏం జరిగిందంటే...

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.  ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు, సీబీఐ కౌంటర్ దాఖలు చేశాయి. రఘురామ  పిటిష‌న్‌ను కొట్టేయాల‌ని సీబీఐ తరపు న్యాయవాదులు కౌంటర్ వేయగా... చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీబీఐ కోరింది. వారిద్దరి కౌంటర్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రిజాయిండ‌ర్ దాఖ‌లు చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ అనేది పిటిషన్ అర్హత సాధించిన తరువాతనే కోర్టు విచారణకు స్వీకరించిందని రఘురామ తరఫు న్యాయవాది అన్నారు.  జగన్ అక్రమాస్తుల కేసులో చాలా మంది అధికారులు  సాక్షులుగా,  నిందితులు ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వారు మంచి స్థాయిలో ఉన్నారని, దీంతో అధికారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల బదిలీలు, నియామకాలు చీఫ్ సెక్రెటరీ చూడాల్సి ఉంటుందని... కానీ ఏపీలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఐఏఎస్ , ఐపీఎస్‌లను ముఖ్యమంత్రే స్వయంగా నియమించేలా జీవో తెచ్చారన్నారు. దీంతో అక్కడ అధికారులను ఎదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.  రఘురామ కృష్ణంరాజుపై 8 కేసులు ఉన్నాయని, ఒకటి సీబీఐ, ఏపీలో 7 కేసులు ఉన్నాయన్నారు. ఒక్క కంప్లైట్‌లో మూడు కేసులు చేర్చారన్నారు. రాఘురామ రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ది పొందడానికి పిటిషన్ వేయలేదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తిపై 11 ఛార్జ్ షీట్‌లు ఉన్నాయని, కాబట్టి ఈ దేశ పౌరుడిగా ఆ కేసులుపై విచారణ చేయాలని కోరే అర్హత రఘురామకు ఉందన్నారు. సాక్షులను ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందని రఘురామ తరఫు న్యాయవాది రిజాయిండర్‌లో పేర్కొన్నారు.  తన కౌంట‌ర్‌లో జ‌గ‌న్ అస‌త్య‌పు ఆరోపణ‌లు చేశార‌ని తెలిపారు రఘురామ రాజు. త‌న‌కు పిటిష‌న్ వేసే అర్హ‌త లేద‌న‌డం అసంబ‌ద్ధ‌మ‌ని తెలిపారు. జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు దెయ్యాలు వేదాలు వ‌ల్లించి‌న‌ట్లు ఉంద‌ని చెప్పారు. రఘురామ రిజాయిండర్ పై వాద‌న‌ల‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సీబీఐ కోర్టు ప్ర‌క‌టించింది. 

అగ్రిగోల్డ్ బాధితుల సంగతేంటీ! జగన్ కు రఘురామ ఐదో లేఖ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై పోరాటం కొనసాగిస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. కొన్ని రోజులుగా రోజుకో సమస్యపై సర్కార్ ను నిలదీస్తున్న రఘురామ... సీఎం జగన్ కు ఐదో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేర‌కు రూ.1,100  కోట్లను వెంట‌నే విడుదల చేయాలని ర‌ఘురామ ఆ లేఖ ద్వారా కోరారు. హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలన్నారు రఘురామ రాజు.  అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని ఎంపీ రఘురామ రాజు చెప్పారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితుల‌ను ఆదుకునేందుకు రూ.1,100 కోట్లు విడుదల చేస్తామని   జగన్ అప్ప‌ట్లో చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇటీవ‌లే ఆయ‌న వ‌రుస‌గా వృద్ధాప్య పింఛ‌న్లు, ఆంధ్రప్ర‌దేశ్‌లో సీపీఎస్‌ విధానం రద్దు, పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్, ఉద్యోగాల క్యాలెండ‌ర్ వంటి అంశాల‌ను ప్ర‌స్తావించి ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలని కోరారు.  

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ దారి తప్పిందా? తప్పించారా?

ముందు గుండెపోటు అన్నారు. గంటల్లోనే కాదు హత్య అన్నారు. అది ప్రత్యర్ధి పార్టీ చేసిన పనేనని మొదలెట్టారు. సిట్ వేస్తే..కాదు సీబీఐ రావాలన్నారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక ఏ సంగతీ తేల్చలేదు. పైగా సీబీఐ వద్దని కోర్టులో కాగితం పెట్టారు. పోలీసులంతా మనోళ్లే.. అయినా బాబాయ్ మర్డర్ ఎవరు చేశారో తేల్చలేకపోయారో తేల్చలేదో తెలియదు గాని..ఇప్పటికీ తేలలేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మాత్రం పెద్దలిస్టు కోర్టుకే ఇచ్చారు..వారి మీద విచారణ చేయాలని. అందులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్ పేర్లు కూడా పెట్టారు.   ఇక డాక్టర్ సునీతారెడ్డి ప్రెస్ మీట్లు పరిశీలిస్తే...ఆమె వైఎస్ అవినాష్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారనే అనుమానం కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. సీబీఐ కూడా స్పీడుగా పని చేయటం లేదని ఆమె విమర్శించారు. ఆ తర్వాత సీబీఐ స్పీడ్ పెరిగింది. కాని ఏ దిశలో పెరిగిందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఎంపీలు, డాక్టర్లను వదిలేసి.. డ్రైవర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను.. ఎవరో వివేకా దగ్గరకు సెటిల్ మెంట్ కోసం వచ్చారంటూ కొందరిని.. విచారిస్తున్నారు.. అది కూడా చాలా స్పీడుగా. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే ట్రోలింగ్ నడుస్తోంది. పెద్దోళ్లను వదిలేసి.. చిన్నోళ్లను తెగ తిప్పుతున్నారేంటని. మొదటి నుంచి జగన్ శిబిరం ప్రచారం చేసినట్లు.. ఏదో వ్యవహారంలో వివేకాతో బెడిసిన వారే ..చంపి ఉంటారన్న యాంగిల్ లోనే విచారణ జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అంటే సునీతారెడ్డి ఆరోపించినట్లు రాజకీయ కోణం విషయాన్ని మాత్రం సీబీఐ పట్టించుకోనట్లే కనపడుతోందని.. అంతే కాదు.. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావించినవారు చనిపోయారు. ఆ మరణాలు కూడా అనుమానాస్పదమని ప్రచారం జరుగుతోంది. అయినా సీబీఐ ఆ విషయం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. అంటే కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకున్నారా... ఆయన కోరిక మేరకు.. ఆయన కోరుకున్న విధంగా సీబీఐ ఎంక్వయిరీ నడుస్తుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  అయితే మరో వాదన ఏంటంటే..సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని.. ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా.. ఎంక్వయిరీ చేస్తున్నారని.. చెప్పుకొస్తున్నారు. ఎటొచ్చీ డాక్టర్ సునీతారెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సాక్ష్యాలు లేకుండా మాయం చేయాలని చూసినవారిని ఎందుకు వదిలేస్తున్నారు? వారిది ఏ తప్పు లేకపోతే సాక్ష్యాధారాలను తుడిచే ప్రయత్నం ఎందుకు చేశారు? అన్నివేట్లు పడి.. భయానకంగా రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూశాక కూడా గుండెపోటు అని ఎలా ప్రకటించారు? సీబీఐ ఈ కోణంలో విచారించిందా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే విచారణ వివరాలు వారు కోర్టులో తప్ప ఎక్కడా చెప్పరు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా.. హైకోర్టుకు గడువు సరిపోదని.. మరింత టైమ్ కావాలని అడిగింది సీబీఐయేనే. మరి ఇప్పుడు డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ దాదాపు వారం రోజులు నడిపించింది. మరి అదనంగా అడిగిన టైమ్ వీటి కోసమేనా? లేక దేని కోసమో అంటూ కామెంట్లు వస్తున్నాయి. చూడాలి మరి..కనీసం మరో మూడు నెలలకైనా ఈ విచారణ తేలుస్తారో లేదో.

కాస్లీ కుక్క.. పట్టుకుంటే పదివేలు.. 

మనుషులు తప్పిపోతే యాడ్ ఇవ్వడం చూశాం .. అలాగే అతని ఆచూకీ చెప్పిన వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం చూశాం.. అయితే మీరు ఎప్పుడైనా కుక్క కోసం రివార్డ్ ప్రకటించడం చూస్తే ఉంటారు.. అయినా అయిన ఇప్పుడు ఉన్న రోజుల్లో అమ్మనాన్న, పెళ్ళాం పిల్లలు, తప్పిపోతే పట్టించుకుంటారో లేదో తెలీదు గానే కుక్కలు తప్పిపోతే తన ప్రాణం పోయినంతాగా ఫీల్ అవుతున్నారు కొంత మంది.. మనుషులకు దూరంగా.. జంతువులకు దగ్గరగా బ్రతుకుతున్నారు చాలా.. అదేంటని అంటే మనుషుల కంటే జంతువులు నిజాయితీగా ఉంటాయి అని మాట్లాడుతుంటారు. ఎవడో ఒక్కడు మోసం చేసినంత మాత్రాన అందరూ మోసం చేస్తారన్న గ్యారెంటీ లేదు కదా.. సరే ఈ విషయాన్నీ పక్కన పెడితే.. అసలు విషయం లోకి వెళ్దాం పదండి.. తాజగా ఓ  జాతికుక్క కిడ్నాప్ నగరంలో సంచలనంగా మారింది. గతనెల 17న కుక్క కిడ్నాప్ అయినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కుక్కను పట్టుకొనే పనిలో పడ్డారు పోలీసులు.   హైదరాబాద్‌లో ఓ జాతి కుక్క కిడ్నప్ తీవ్ర కలకలం రేపుతోంది. పారడైస్ సింథి కాలనీలో రోడ్ పై ఉన్న జాతి కుక్కను ఒక దుండగుడు ఎత్తుకెళ్లారు. గత నెల 17 న బ్లూ కలర్ R15 పై కుక్కను ఎత్తుకెళ్లినట్లు సాక్షి కనుగో అనే యువతి రాంగోపాల్ పెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షి వివిధ జాతి కుక్కలను పెంచుతూ అమ్మకాలు జరుపుతూ ఉంటుంది. కిడ్నాప్‌కు గురైన కుక్క ‘షిహ్ త్జు’ జాతి కి చెందిన రియో అని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్‌లో ఆమె తెలిపింది. మార్కెట్‌లో రియో విలువ సుమారు 45 వేలు డిమాండ్ ఉంటుందని వెల్ల‌డించింది. యువతి ఫిర్యాదు మేరకు పారడైస్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన పోలీసులు గాలింపు చేపట్టారు. 25 రోజులు కావొస్తున్న రియో ఆచూకీ లభించలేదని తెలిసింది. కుక్క ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్ ప్రకటించారు సాక్షి. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని పారడైస్ పరిధిలో ఉన్నా సీసీటీవీ ఫుటేజ్  సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అసలే కరోనా టైం ఖర్చులకు కూడా వెళ్లడం లేదు.. ట్రై చేసి చూడండి.. దొంగ దొరికితే ఆ పది వేలు మీ సొంతం.. పది వేలు అని అంత చీఫ్ గా తీసెయ్యకండి.. పది వేలు అంటే  ఒక నెల జీతం మాకెందుకులే అనుకుంటున్నారు.. ఒక చిన్న   చిన్న కుటుంబం రెండు నెలల ఇంటి ఖర్చులు.. మరింకెందుకు ఆలస్యం అదృష్టాన్ని పరీక్షించుకోండి..      

సీఎం రాబోతున్న వేళ.. వైసీపీ గుప్పిట్లో విశాఖ! ఇక అరాచకమేనా.. 

అధికారం వాళ్ల చేతిలో ఉంది. వారంతా సాయంకాలం సాగర తీరం అంటూ విశాఖ బీచ్ లో సాంగ్స్ పాడుకుంటారు. ప్రతిపక్ష నేతలను మాత్రం రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ చట్టం ఒకవైపే చూస్తుంది. రెండోవైపు చూడదు..చూడాలనుకున్నా కుదరదు. మీకు నమ్మకం లేకపోతే ఏదైనా పోలీస్ తుపాకీ తీసుకుని అధికార పార్టీ వాళ్లవైపు గురిపెట్టి కాల్చండి..బుల్లెట్ రివర్స్ లో వచ్చి మీ బాడీలోకే దిగుతుంది. అంత వన్ సైడుగా వ్యవహారం నడుస్తోంది.  సిస్టమ్ లో లూప్ హోల్స్ వాడుకున్నవాళ్లు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటారు. అధికారంలో పార్టీ మారాక కూడా ఆ విషయంలో అందరూ కలిసే వ్యవహారం చేసుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. మాట విని వాళ్ల వైపు వస్తే ఓకె..లేదంటే ఇక వాడికి టార్చరే. వాడి తాతల నాటి డాక్యుమెంట్లు కూడా తీసి..భూములు లాక్కుంటారు.విశాఖపట్నంలో నడుస్తున్న తతంగం చూస్తుంటే అలాగే ఉంది.  ఉత్తరాంధ్ర అంతా ఒక సామ్రాజ్యంలా... ఆ సామ్రాజ్యానికి అధిపతిలా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నట్లే అక్కడ అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ, ఈ మధ్యే చనిపోయిన సబ్బం హరిని వేధించారు. సడెన్ గా తెల్లారే మున్సిపల్ అధికారులు వచ్చి గోడ పడేయాలని.. అక్రమ కట్టడమని నోటీసులిచ్చారు. ఆయన కోర్టుకు వెళ్లకపోతే పడేసేవాళ్లే. పైగా అదే మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా పని చేశారు సబ్బం హరి. ఆయనకే కొత్త లెక్కలు చెప్పాలని చూశారు అధికారులు. ఇక టీడీపీ నేత భరత్..విశాఖ ఎంపీగా పోటీ చేశారు. గీతం సంస్థల అధినేతగా ఉన్నారు. గీతం సంస్థ ఒక ల్యాండ్ ను అక్రమంగా కలిగి ఉన్నారంటూ.. అక్కడ దాడులు చేశారు. ఆ వ్యవహారం కోర్టులో ఉందని తెలిసినా.. కోర్టును ధిక్కరించినట్లు అవుతుందని తెలిసినా.. అందుకు సాహసించారు అధికారులు. ఆ తెగింపు వైపు వారిని తోసింది విజయసాయిరెడ్డేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లేటెస్టుగా టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్, పల్లా శంకరరావుల భూములపై పడ్డారు. అవి అక్రమమేనని..బహుశా అవి కొన్నివారి తండ్రికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ జాలి కూడా చూపించారు. ఆ విషయం అధికారులకు మాత్రమే ఇప్పుడే తెలిసింది... గతంలో టీడీపీలో ఉన్న అవంతికి కూడా ఇప్పుడే తెలిసింది.  అలా టీడీపీ నేతల్లో మాట వినేవారిని తమవైపు తిప్పుకోవడం.. మాట విననివారి పుట్టు పూర్వోత్తరాలు, ఆస్తిపాస్తుల లెక్కలు అన్నీతెలిసి..ఎక్కడ దొరికితే అక్కడ వేటు వేయడం..ఇదే ఒక ఆపరేషన్ లా విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నడిపిస్తోంది. అంతెందుకు టీడీపీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న భూకబ్జా వ్యవహారంపై సిట్ విచారణ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్లీ విచారించింది. ఆ నివేదిక ఎప్పుడో రెడీ అయినా.. దానిని వాడలేదు. ఇప్పుడు దానిని బయటకు తీస్తున్నారు.  విశాఖ టీడీపీ నేతలందరిపై బ్రహ్మాస్త్రంలా వాడబోతున్నారు. పరిపాలన విశాఖ నుంచి ప్రారంభమయ్యేనాటికి ప్రతి అంగుళం వారి స్వాధీనంలో ఉండాలనేదే టార్గెట్ గా కనపడుతోంది. త్వరలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుంచి అనధికారికంగా పాలన ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నవేళ...టీడీపీ నేతలపై వేధింపులను వేగవంతం చేశారు. తప్పు చేస్తే విచారించి శిక్ష వేయాల్సిందే...అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందే..కాని అవన్నీ కేవలం రాజకీయం కోసమే చేసి..కేవలం ప్రత్యర్ధులను మాత్రమే టార్గెట్ చేస్తే... భవిష్యత్ సమాధానం చెబుతుందనే కామెంట్లు వినపడుతున్నాయి.  

15 వ అంతస్తు నుండి పడి.. వైద్యవిద్యార్ధి మృతి.. కారణం ఇదే..  

వాళ్ళ టైం వస్తే ఎవరైనా చనిపోవసిందే.. కానీ కొన్ని సార్లు మన అజాగ్రత్త కూడా మన ప్రాణాలు తెస్తుంది.. కళ్ళు మోసి తెరిచేలోపు ఏం జరిగిందో అర్థం కాదు. ఈ మధ్య కాలంలో జరిగే రోడ్ ఆక్సిడెంట్ కావచ్చు.. అనుమానాస్పద మరణాలు కావచ్చు.. సమాజంలో ఎక్కువైనాయి తాజాగా ఒక విద్యార్థిని తన జాగ్రత్త వాళ్ళ 15 వ అంతస్తు మీది నుండి కిందపడి చనిపోయింది. అసలు ఆ ఎందుకు చెనిపోయింది..? ఎలా చనిపోయింది ? తన మరణం వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయి తెలుకోవాలంటే ఈ వార్త చదవండి..  ఓపెన్ చేస్తే.. అది కృష్ణా జిల్లా. హనుమాన్‌ జంక్షన్‌. ఈ ప్రాంతానికి చెందిన భాస్కరరాజు భార్య, కూతురు అమూల్యతో కలిసి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలో ఆత్మకూరు పరిధిలో గల మిడ్‌వ్యాలీ సిటీలోని కైలాస్‌ బ్లాక్‌లో 1506 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. భాస్కరరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కూతురికి వివాహమైంది. రెండో కూతురు అమూల్య విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండియర్ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది.. అయితే  శనివారం అర్ధరాత్రి తమ ఫ్లాట్‌ బాల్కనీలో పిట్టగోడపై కూర్చుని చదువుకుంటుంది..  కట్ చేస్తే.. తల్లి దండ్రులు కొద్దీ సేపటికి కూతురు కూర్చున్న వైపు చేశారు. అక్కడ కనిపించలేదు.. ఆ తల్లిదండ్రులు కంగారు పడ్డారు అమూల్య. అమ్యుల్య అని పిలిచారు. పలకలేదు..కంగారు పడ్డారు.. అమూల్య కూర్చున్న చోటుకి వెళ్లి చేశారు.. 15 వ అంతస్తు మీది నుండి చేస్తే .. అమూల్య రక్తపు మారకపు మడుగులో పడి ఉంది.. అప్పటికే  ప్రమాదవశాత్తు కిందకి పడిపోయింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అమూల్య మృతదేహాన్ని శవ పరీక్ష కోసం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.