రెండు మామిడి చెట్లకు.. ముగ్గురు  గార్డులు, 9 కుక్కలు కాపల..

ముగ్గురు గార్డులు, 9 కుక్కలు అంతా సెక్యూరిటీ అంటే  ఎంఎల్ఏ సెక్యూరిటీనో , మంత్రి కోసం, లేదంటే సెలబ్రెటీ కోసమో కాదు, బంగారం షాప్ ముందు అంతకన్నా కాదు.. మామిడి కాయల కోసం ముగ్గురు గార్డులు, 9 కుక్కలను కాపలాపెట్టారు.  అదేంటి మామిడి కాయల కోసం అంతా సెక్యూరిటీ ఏంటని అనుకుంటున్నారా..? అది అంతే మార్కెట్ లో ఆ మామిడి కాయల ధర అలా పలుకుతుంది.. అందుకే అంతా సెక్యూరిటీ ని పెట్టారు. అంతక ముందు కూడా మీరు ఈ వార్త చదివే ఉంటారు తాజాగా అక్కడ సెక్యూరిటీ ని ఆరెంజ్ చేశారు.  అంతే కాదు. ఆ మామిడి కాయలను పసిపిల్లవాడిలా కాపాడుతున్నారు. ఆ మామిడి కాలయాలకు ఎండ నుండి కాపాడ్డానికి కవర్ కట్టారు. నిజంగా మనుషులకంటే ఎక్కువ మామిడికాయలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే .. డబ్బులు ఉంటేనే మనుషులకు విలువ అని మరో సారి రుజువైంది. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌కు చెందిన సంకల్ప్, రాణి పరిహార్ అనే జంట మామిడి చెట్ల కోసం ముగ్గురు గార్డులను, తొమ్మిది కుక్కలను కాపాలాగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ చెట్లకు కాసే మామిడి పండ్ల విలువ అలాంటిది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన మియాజకీ మామిడి పండ్లను అతడు పండిస్తున్నాడు. జపాన్ జాతికి చెందిన ఈ మామిడి పండ్లు మార్కెట్లో కిలో సుమారు మూడు లక్షల వరకు ఉంటుంది. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్ల రుచి, నాణ్యత అద్భుతంగా ఉంటుందట. ప్రస్తుతం ఆ తోటలోని 2 మామిడి చెట్లకు 7 పండ్లు కాస్తున్నాయి. గతేడాది కొందరు సంకల్ప్ తోటలోకి ప్రవేశించి పండ్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఈ సారి వాటి కాపాలా కోసం ముగ్గురు గార్డులను, 9 కుక్కలను ఏర్పాటు చేశాడు.  

ఆరు లక్షల ఉద్యోగాలెక్కడ జగన్ రెడ్డి! ఆర్టీసీలో కొత్తగా ఇచ్చినవెన్ని? 

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిందా? రెండేండ్లలోనే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించిందా ? ఉద్యోగ కల్పనపై ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా  ఉపాధి లభించిందా అన్న ప్రశ్నకు కాదనే జవాబే వస్తుంది. ప్రభుత్వ లెక్కలన్ని తప్పుడు తడకని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కలను  పరిశీలించినప్పుడు వాటిలో తాత్కాలిక సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.   ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా.. గత రెండేళ్లలో ఆరు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. అందులో సుమారు రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలని చెప్పింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రతనిచ్చామని అంటోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన గతంలో ఎప్పుడూ జరగలేదని గొప్పగా ప్రకటించుకుంది. రెండేళ్లలోనే జగన్ హయంలో 6,03,756 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. అంతేకాదు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు కూడా తావు లేకుండా ఈ నియామకాలు చేసినట్టు తెలిపింది.అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాలు కూడా అవినీతి లేకుండా చేశామని చెబుతోంది. దళారీల బెడద లేకుండా వారికి ప్రతీనెలా 1వ తేదీనే వేతనాలు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెబుతోంది. ఏటా రూ.3,600 కోట్లు భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 51,387 మందికి ఉద్యోగ భద్రత కల్పించామని ఘనంగా ప్రకటించింది జగన్ రెడ్డి ప్రభుత్వం.  అయితే ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలపై లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదని తేలింది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటి పరిధిలో రాష్ట్రవ్యాప్తగా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించారు.  ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలని సర్కార్ చెబుతోంది. కానీ  ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్ట్రర్‌లో నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వారికి కేవలం ప్రొబేషనరీ పిరియడ్ పేరుతో ప్రస్తుతం నెలకు రూ. 15 వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. పీఎఫ్ సహా ఇతర సదుపాయాలేమీ అందడం లేదు.దీంతో వీరంతా సర్కార్ ఉద్యోగులు ఎలా అవుతారన్నది ప్రశ్న.  అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2,59,565 మందికి వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.  వారికి అప్కోస్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నా, ఇతర ప్రయోజనాలు మాత్రం లేవు. మొదట కేవలం నెలకు రూ. 5 వేలు మాత్రమే జీతంగా ఇవ్వడంతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ వాలంటీర్లకు లేఖలు  రాశారు. ఫిబ్రవరి 16న రాసిన లేఖలో వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కేవలం వాలంటీర్లు మాత్రమేననే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రే వాలంటీర్లు ఉద్యోగులు కాదని చెప్పగా.. తాజా ప్రకటనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో ఆప్కోస్ ద్వారా 95,212 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారని తేలింది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేస్తామని, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు దానికి భిన్నంగా... గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక రవాణా, రోడ్లు భవనాల శాఖ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు 51,387 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వ ప్రకటనలో ఉంది. కానీ వారంతా ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులే. ప్రభుత్వరంగ సంస్థ కార్పోరేషన్‌లో కూడా వారంతా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న వారే. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నేరుగా ప్రభుత్వ పరం కావడంతో వారు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. కానీ  దానిని కూడా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ప్రస్తావించింది. 6 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వం 50 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని కూడా కలిపేసింది. ఆర్టీసీ సిబ్బందిని కూడా కొత్త ఉద్యోగాల కల్పనలో చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పకుండా.. ఈ దొంగ లెక్కలు ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు కొవిడ్ సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 26,325 మందిని నియమించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయినా అత్యవసర సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా చూపించారు. గత ఏడాది కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న ఉద్యోగులను ఆ తర్వాత తొలగించారు.సెకండ్ వేవ్ సందర్భంగా అదనంగా వైద్యులు సహా అనేక విభాగాల్లో నియామకాలు చేశారు. వీళ్లను ఎంత కాలం కొనసాగిస్తారో తెలియదు. అయినా వీళ్లందరిని కూడా  కొత్త ఉద్యోగుల జాబితాలో జగన్ రెడ్డి ప్రభుత్వం చూపించింది.  

అనంత జిల్లాలో డబుల్ మర్డర్.. మళ్లీ ఫ్యాక్షన్ పడగలో సీమ? 

మొన్న కడప... నిన్న కర్నూల్.. ఇవాళ అనంతపురం జిల్లా... రాయలసీమలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. మూడు జిల్లాల్లో ఆరుగురు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ మళ్లీ పడగ విప్పిందా అన్న ఆందోళన నెలకొంది.అనంతపురం జిల్లాలో మరోసారి వర్గ కక్షలు భగ్గుమన్నాయి.  శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు. భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్, నారాయణప్పలను దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా సమయం కోసం ఎదురు చూస్తున్న  ప్రత్యర్థులు మాటు వేసి ఇద్దరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు.జంట హత్యలతో గ్రామంలో పరిస్థితి నివురు గప్పినా నిప్పులా మారింది.  పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.  కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డిని ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం దారుణంగా చంపేశారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌విత్‌ 149) కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే కడప జిల్లాలోనూ ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు.   

గ్రీన్ జోన్‌గా తిరుమల.. అలిపిరి వరకు  గరుడ వారధి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలను గ్రీన్ జోన్‌గా  ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు  వైవీ సుబ్బారెడ్డి. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని వైవీ చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో రాబోయే ఏడాది కాలంలో 500 ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. జమ్మూలో 62 ఎకరాల్లో నిర్మిస్తున్న టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని చెప్పారు.  వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేధ్యం సమర్పిస్తున్నామని చెప్పారు. గత రెండు నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసిన విషయాన్ని టీటీడీ ఛైర్మెన్  గుర్తు చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ గడువు శనివారంతో ముగియనుండగా.. ఈనెల 20 నుంచి లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదిక మేరకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇకపై నిర్భందం అవసరం లేదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ కూడా ఉండబోదని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కాగా  అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది. తెలంగాణలో మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మొదటి 10 రోజులు నాలుగు గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చి లాక్ డౌన్ అమలు చేశారు. తర్వాత కొన్ని రోజులు సడలింపు పెంచి.. మధ్యాహ్నం 1 గంట వరకు మినహాయింపులు ఇచ్చారు. గత 10 రోజుల నుంచి మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6గంటల (ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట) వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. పగటి పూట్ లాక్ డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తారని భావించారు. కాని కేబెనిట్ సమావేశంలో మాత్రం పూర్తిగా లాక్ డౌన్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  సీఎం కేసీఆర్‌ జూన్ 20 జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ కేబినెట్ లో చర్చకు వచ్చింది. సిద్దిపేట, కామారెడ్డిలో సీఎం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై గ్రామస్తులతో సీఎం చర్చించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి . సాగునీటి అంశాలతోపాటు, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టులపైనా తెలంగాణ క్యాబినెట్లో చర్చ జరిగింది. 

అదునపు కట్నం కోసం భర్త ప్లాన్.. ఏం చేశాడో తెలుసా..?

కరోనా పేరు చెపితే కొందరు బయపడుతుంటే.. ఇంకొందరు మరణిస్తున్నారు. మరికొందరు ఆ కరోనా ని వ్యాపారం చేసుకుంటున్నారు. కరోనా మందుల పేరా బ్లాక్ దందా చేస్తున్నారు.  అంతే కాదు కరోనా ని ఎవడి తోచినట్టు వాడు వాడుకుంటున్నారు. ఇంకొంత మంది ఎలా వాడు కుంటున్నాడో మీరే చూడండి. తాజాగా ఒక వ్యక్తి  భార్యను పుట్టింటికి వెళ్లి ఓ ఆరు లక్షలు తీసుకురమ్మన్నాడు భర్త. దీంతో భార్య అందుకు ఒప్పుకోలేదు. ఆమెను ఇంట్లోనే ఓ గదిలో నిర్బంధించాడు. చుట్టుపక్కల వాళ్లు అడిగితే.. ఆమెకు కరోనా సోకిందని చెప్పాడు. కరోనా వచ్చినప్పుడు వెళ్లి తీసుకురావచ్చుకదా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్.. ఆ ట్విస్ట్ ఏంటో మీరే తెలుసుకోండి..    వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టకు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తీసుకురావాలని భార్యను ఒత్తిడి చేశాడు. దీంతో తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమేనంటూ ఆమె అతడికి చెప్పింది.దీంతో ఆమెను చాలా రోజుల పాటు ఓ గదిలో నిర్బందించాడు. చుట్టుపక్కల వారు భార్య ఏదని అడిగితే.. కరోనా సోకిందని, ఐసొలేషన్‌లో ఉంచానని బుకాయించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఒకరు సనత్‌నగర్‌లోని మెట్రోపాలిటన్‌ న్యాయసేవా విభాగానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో వారు కలగజేసుకుని.. రంగంలోకి దిగి ఇంటికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ఆసుపత్రిలో పరీక్ష చేయించగా.. భార్యకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. అనంతరం ఆమెను పుట్టింటికి పంపారు. ఆ తరువాత పోలీసులకు, కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోర్టు సూచనతో భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎట్టకేలకు అతను.. తప్పును సరిదిద్దుకుని భర్త భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.  

హుజురాబాద్ TRS అభ్యర్థి ఆయనేనా? ఈటలకు గండమేనా?

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక ద్వారా తన పవరేంటో గులాబీ బాస్ కు చూపించాలని కసితో ఉన్నారు మాజీ మంత్రి రాజేందర్. ఈటల చేరికతో జోష్ మీదున్న కమల దళం కూడా హుజురాబాద్ లో జెండా పాతి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే బీజేపీలో చేరిన వెంటనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల. త్వరలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈటల జముల కూడా గ్రామాల్లో తిరుగుతూ అప్పుడే ప్రచారం కూడే చేసేస్తున్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని చూస్తున్న అధికార పార్టీ కూడా .. హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది. మండలానికో మంత్రిని ఇంచార్జ్ గా నియమించింది. కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి.  హుజురాబాద్‌లో రాజేందర్ కు ధీటైన అభ్యర్థి కోసం గులాబీబాస్  భారీ కసరత్తే చేస్తోందని తెలుస్తోంది. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఈటల ఓటమే లక్ష్యంగా అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. పెద్దిరెడ్డి, వకుళాభరణం కృష్ణ మోహన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయంటున్నారు. 2018 ఎన్నికల్లో ఈటల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కూడా కారు పార్టీలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా కేసీఆర్ మరో అభ్యర్థి విషయంలో ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న , రిటైర్డ్ ఐఏఎస్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పురుషోత్తం రెడ్డి గురించి గ్రౌండ్ లెవల్లో సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్ సీల్డ్ కవర్‌ను సీఎంకు పంపించిందని చెబుతున్నారు.  కరీంనగర్ జిల్లాలో జనాల అభిమానం పొందిన మాజీ మంత్రి ముద్దసాది దామోదర్ రెడ్డి సోదరుడే పురుషోత్తం రెడ్డి. గతంలో కమలాపూర్ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ప్రాతినిథ్యం వహించారు  దామోదర్ రెడ్డి. మంత్రి నియోజకవర్గం అభివృద్ధికి కష్టపడ్డారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ప్రస్తుత హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్ని గతంలో ముద్దసాని మంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని చెబుతున్నారు. ముద్దసానిపై నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుందని తెలుస్తోంది. దీంతో ముద్దసారి సింపతి కలిసి వచ్చేలా.. ఆయన కుటుంబంలోని వ్యక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దసాని దామోదర్ రెడ్డి అన్నే పరుషోత్తం రెడ్డి కావడంతో తమకు కలసి వస్తుందనే యోచనలో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారంటున్నారు.  పురుషోత్తం రెడ్డి గతంలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం వీటీడీఏ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్.. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు పురుషోత్తం రెడ్డి.. మహబూబ్ నగర్ కలెక్టర్‌గా పని చేశారు. దీంతో  కేసీఆర్‌కు వ్యక్తిగతంగా కూడా పురుషోత్తం రెడ్డితో మంచి సంబంధాలున్నాయి.  మొదట దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చిందని తెలుస్తోంది. తర్వాత కశ్యప్ పెద్ద నాన్న పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చిందంటున్నారు. 2004లో దామోదర్ రెడ్డిని ఓడించిన రాజేందర్‌పై ముద్దసాని కుటుంబాన్ని పోటీ చేయిస్తే సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అని కూడా తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారట గులాబీ బాస్. ముద్దసారి పురుషోత్తం రెడ్డి బరిలో ఉంటే మాత్రం హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు గట్టి పోటీ తప్పకపోవచ్చని అంటున్నారు. ముద్దసానిపై ఉన్న సానుభూతితో పాటు పురుషోత్తం రెడ్డి ఇమేజ్ తోడైతే.. కారు పార్టీకి కొంత లాభం జరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. 

కాంగ్రెస్ కథ మారదా... కేడర్ కు దిక్కెవరు? 

దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య ముచ్చటగా మూడుకు చేరింది. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్’ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో అధికారంలో కొనసాగుతోంది. మరో రెండు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఝార్ఖండ్’లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం అనే ట్యాగ్ తగిలించుకోవడమే కానీ, అధికార హోదా లేదు. అంటే, అందుకు అవసరమైన (మొత్తం సభ్యుల్లో 10 శాతం) సఖ్యాబలం లేదు. ఇంచుమించుగా  రెండు సంవత్సరాలుగా అధ్యక్షుడు లేని పార్టీగా తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సారధ్యంలో పార్టీ పడుతూ లేస్తూ తంటాలు పడుతోంది.ఇక పార్టీ భవిష్యత్ సారధి, ఆశాకిరణం అనుకున్న రాహుల్ గాంధీ కాడి తన్నేసి, బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించారు. మరోవంక 23 సీనియర్ నాయకులు నాయకత్వ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధిష్టానానికి లేఖాస్త్రం సంధించారు. ఒక విధంగా నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నాయకత్వంపై తిరుబాటు జెండా ఎగరేశారు.  ఇలాంటి పార్టీని, ఇలాంటి నాయకుడిని ముందు పెట్టి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ప్రదాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా  ‘మిషన్ 2024’  కథ నడిపిస్తున్నారు. సరే, అది ఆయనతో అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో పరిస్థితి చూస్తే, కనీసం రెండు రాష్ట్రాలలో పార్టీ, ప్రభుత్వం  సంక్షోభాన్ని ఎదుర్కుంతున్నాయి.  రాజస్థాన్’లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ వర్గాల మధ్య  చాలా కాలంగా సాగుతున్న ఫైట్, పతాక స్థాయికి చేరింది. సుమారు సంవత్సరం క్రితం తిరుగుబాటు జెండా ఎగరేసిన పైలట్, పదవుల పంపకం, మంత్రివర్గంలో తమ వర్గానికి స్థానం కోసం పట్టుపడుతున్నారు. అలాగే, ముఖ్యమంత్రి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని  ఆయన వర్గం ఆరోపిస్తోంది.  మరో వైపు  పైలట్ ఢిల్లీలో కుర్చుని చక్రం తిప్పుతున్నారు. ఉత్తర ప్రదేశ్ యువనేత  జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపధ్యంలో సచిన్ ఢిల్లీ యాత్ర  అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఆయన తమ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇటు ఢిల్లీలో అటు జైపూర్’లో ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. మరో వంక ముఖ్యమంత్రి గేహ్లోట్, అధిష్టానం ఆదేశించినా కొవిడ్’ను అడ్డుపెట్టుకుని మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో కుదరదని కుండ బద్దలు కొట్టారు. మరోవంక ఢిల్లీలో ఉన్నా, సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురిలో ఎవరినీ కలిసేందుకు పైలట్ నో’ అనేశారు.అయినా, అధిష్టానం ఏమీ చేయలేని, నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తోంది. పార్టీ చరిత్రలో ఇలా పార్టీ అధిష్టానాన్ని లెక్కచేయని స్థితి ఎప్పుడూ చూడలేదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వాపోయారు. ఈ పరిణామాలను గమనిస్తే రాజస్తాన్’లో కూడా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ బాటలోనే పయనిస్తోందనిపిస్తోందని అంటున్నారు.   మరో ఏడెనిమిది నెలల్లో ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్’లోనూ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ మంత్రి క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దు వర్గాల మధ్య పచ్చగడ్డి అవసరం లేకుండానే రాజకీయ సెగలు బుసలు కొడుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన  ముగ్గురు సభ్యుల బృందం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ జాతీయ పార్టీ అనే విషయాన్ని మరిచిపోయి, తమ సొంత పార్టీ ప్రభుత్వం నడుపుతున్నారని నివేదికలో పేర్కొంది. అంటే, అధిష్టానవర్గాన్ని లెక్క చేయని ధోరణి పంజాబ్’లోనూ కనిపిస్తోందని కమిటీ చెప్పకనే చెప్పింది. అయినా, అధిష్టానం కెప్టన్  అరేందర్ సింగ్ పై చర్యలు తీసుకునే స్థితిలో లేదు. అటూ ఇటూ అయితే, పార్టీ ప్రతిష్ట మరింత తుడిచిపెట్టుకు పోతుందని అధినాయకత్వంమే భయపడుతోంది. అందుకే  చర్యలు తీసుకునే సాహసం చ్జేయలేక పోతోంది.  అలాగే, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగాఉన్న మహా రాష్ట్రలో శివసేన, ఎన్సీపీ జోడీ ఒక జట్టుగా ఉన్నాయి. ఎన్నికలలో కలిసి పోటీ చేసేందుకు, అధికారాన్ని పంచుకునేందుకు సిద్దమవుతున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా నిలబడింది. మహారాష్ట్ర  పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఇకపై అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అదే విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓకే చేస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగుతానని చెప్పు కొచ్చారు. అయితే, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నపరిణామాలను గమనిస్తే, పటోలే భవిష్యవాణి ఎలా ఉన్నా, ప్రస్తుతం ఉన్న అధికారం కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎన్సీపీ అధినేత్ పవార్ పావులు కడుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్’కు  కష్టాలు తప్పవని అంటున్నారు.  ఇలా అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగజారుతోంది. ఇక అధికారంలో లేని రాష్ట్రాలలో పరిస్థితి గురించి అయితే వేరే చెప్పనే అక్కరలేదు. తెలంగాణలో సాగుతున్న పీసీసీ తమాషానే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో నెలలుగా తెలంగాణ పీసీసీ వ్యవహరం, ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా  సాగుతోంది. చివరకు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఇస్తామన్నా వద్దన్నారు... అదీ పార్టీ పరిస్థితి.

మంత్రి షాకిచ్చిన ఉద్యోగులు.. పోలీసులకు హై టెన్షన్ 

మంత్రికి ఉద్యోగులు సడెన్ గా షాకిచ్చారు. ఒక్కసారిగా దూసుకువచ్చి మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఊహంచని ఘటనతో మంత్రితో పాటు భద్రతా సిబ్బంది ఉలిక్కి పడ్డారు. కారుకు అడ్డంగా వచ్చిన ఉద్యోగులకు లాగి పడేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ  పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు ఈ షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి నిర‌స‌న సెగ త‌లిగింది. హ‌న్మకొండ‌లోని మంత్రి త‌న క్యాంపు కార్యాల‌యం బ‌య‌ట‌కు వ‌స్తున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వ‌చ్చిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కసారిగా ఆందోళ‌న చేప‌ట్టారు. దాదాపు 50 మందికి పైగా ఉన్న ఆందోళ‌న‌కారులు మంత్రి కాన్వాయ్‌కు అడ్డం ప‌డుకున్నారు. మంత్రి ద‌యాక‌ర్‌రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం త‌మ‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని, సంవ‌త్సర‌న్నర కాలంగా విధుల‌కు దూరంగా ఉంచుతూ మ‌మ్మల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ప‌నిలేక, జీతం రాక త‌మ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయంటూ మ‌హిళా ఫీల్డ్ అసిస్టెంట్లు క‌న్నీరు పెట్టుకున్నారు. కుటుంబం గ‌డ‌వ‌కుండా క‌ష్టమ‌వుతోంద‌ని, పిల్లల‌కు స‌రైన తిండి పెట్టే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని విల‌పించారు.  తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప బ‌హుమానం ఇచ్చారంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండిప‌డ్డారు. ఇందుకేనా ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడామని చెప్పారు. దిక్కుమాలిన ప్రభుత్వం రాజ్యమేలుతోందంటూ కొందరు ఉద్యోగులు శాప‌నార్థాలు పెట్టారు. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు లాగేస్తున్నా.. కాన్వాయ్‌కు అడ్డం ప‌డుకున్నారు. దాదాపు అర్ధగంట‌సేపు మంత్రి కారులోనే కూర్చోవాల్సి వ‌చ్చింది. పోలీసులు బ‌ల‌వంతంగా నిర‌స‌న‌కారుల‌ను ఈడ్చేశారు. కొంత‌మందిని బ‌ల‌వంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.ఈ ఘటనతో హన్మకొండలో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.   

మిల్కాసింగ్ గొప్పేంటి! ఆయన సాధించిన రికార్డులేంటి? 

భారత పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.  మిల్కాసింగ్‌కు మే 20 కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత లక్షణాలు ఎక్కువ కావడంతో మే 24న మొహాలిలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జూన్ 3న చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌కు తరలించి ఐసీయూలో అడ్మిట్ చేశారు.  శుక్రవారం రాత్రి ఆయనకు ఒక్కసారిగా జ్వరం పెరగి.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మిల్కా సింగ్. మిల్కా సింగ్ భారతదేశంలో అందరికి తెలిసిన పేరు. ప్రతి తరం అతనికి తెలుసు, అతని వేగం తెలుసు, అతని విజయం తెలుసు. అయినప్పటికీ తన గురించి గర్వపడటానికి ఎందుకో దేశానికి అవకాశాలు ఇవ్వలేదు. అతను ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించలేకపోయాడు కానీ కామన్వెల్త్, ఆసియా క్రీడలలో, అతను అనుభవజ్ఞులందరినీ ఓడించి దేశానికి బంగారు పతకం సాధించారు.తన కెరీర్ లో కేవలం మూడంటే మూడు అతను  రేసులను మాత్రమే కోల్పోయారు మిల్కాసింగ్.  మిల్కాసింగ్ 1932 నవంబర్‌ 20న పాక్‌ పంజాబ్‌లోని గోవింద్‌పురలో జన్మించాడు. ఆయన సిక్కు రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబానికి చెందినవాడు.  భారతదేశాన్ని రెండుగా విభజించిన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చారు మిల్కాసింగ్. అనంతరం భారత సైన్యంలో చేరాడు. ఆర్మీ తరుపునుంచే అథ్లెటిక్స్‌లో పోటీ చేసి, స్టార్ ప్లేయర్‌గా ఎదిగారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.క్రీడలలో భారతదేశానికి తొలి సూపర్ స్టార్లలో మిల్కా సింగ్ కచ్చితంగా ఒకరు. ఆయన 1951లో భారత సైన్యంలో చేరారు. సికింద్రాబాద్‌లో తొమ్మిదేళ్లు శిక్షణ పొందిన మిల్కాసింగ్.. ఆర్మీ నిర్వహించిన పరుగుల పోటీలో ఆరో మిల్కా సింగ్ 1956 మెల్బోర్న్ గేమ్స్‌లో మొట్టమొదటి సారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ టైంలో ఆయన ఎన్నో అనుభవాలను చవిచూశాడు.  1958 వ సంవత్సరం ఆయన జీవితం ఎంతో మలుపు తిరిగింది. జాతీయ క్రీడలలో 200 మీ, 400 మీటర్ల స్ప్రింట్లలో రికార్డులు సృష్టించాడు. అదే సంవత్సరం టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలలో 200 మీ, 400 మీటర్లలో ఆసియా ఛాంపియన్‌గా నిలిచాడు. అలాగే కార్డిఫ్‌లో జరిగిన 1958 కామన్వెల్త్ క్రీడలలో మిల్కా సింగ్ బంగారు పతకం సాధించాడు.దీంతో మిల్కా సింగ్ జాతీయ హీరోగా మారిపోయాడు. కానీ, ఫ్లయింగ్ సిక్కు అనే బిరుదు మాత్రం 1960వ సంవత్సరంలో వచ్చింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లాహోర్లో జరిగిన ఇండో-పాక్ క్రీడా సమావేశానికి భారత అథ్లెట్లను ఆహ్వానించారు. మిల్కా సింగ్ పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పట్టుబట్టడంతో భారత దళానికి నాయకుడిగా పాకిస్తాన్ వెళ్లారు. లాహోర్‌లో, 200 మీటర్ల స్ప్రింట్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆటగాడిగా పేరుగాంచిన పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ ఖలీక్‌పై మిల్కా సింగ్ తలపడాల్సి వచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అంటే సింగ్‌కు నచ్చేది కాదు. దీంతో ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. కానీ రేసు రోజున, ఖలీక్‌ను సులభంగా ఓడించాడు మిల్కాసింగ్. ఒత్తిడిని దరిచేరనీయకుండా పట్టుదలతో ఆడాడు. నాలుగు దశాబ్దాలుగా మిల్కాసింగ్‌ రికార్డు చెక్కు చెదరలేదు. మిల్కాసింగ్‌ను నాటి పాక్‌ ప్రధాని అయూబ్‌ ఖాన్‌  ఫ్లయింగ్‌ సిక్‌గా అభివర్ణించారు. మిల్కా  80 రేసుల్లో పాల్గొని 77 విజయాలు సాధించారు రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా నడుస్తున్నప్పుడు, అతను ముందున్నాడు, కానీ అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడని అతను భావించాడు. చివరికి చేరుకునే ముందు, అతను ఇతర రన్నర్లు ఎక్కడ ఉన్నారో చూడటానికి తిరిగి చూశాడు. ఈ కారణంగా, అతని పేస్, లయ విచ్ఛిన్నమైంది. అతను 45.6 సెకన్లు గడిపాడు, కానీ సెకనులో పదవ వంతు వెనుకబడి నాల్గవ స్థానంలో నిలిచాడు. దీని తరువాత 1962 జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలలో మిల్కా బంగారు పతకం సాధించాడు. మిల్కా సింగ్ ఒకసారి బిబిసితో మాట్లాడుతూ ‘నేను రోమ్ ఒలింపిక్స్‌కు వెళ్ళే ముందు, ప్రపంచవ్యాప్తంగా కనీసం 80 రేసుల్లో పాల్గొన్నాను. అందులో నేను 77 రేసులను గెలుచుకున్నాను, అది నాకు రికార్డు సృష్టించింది. రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో ఎవరైనా గెలిస్తే అది భారతదేశానికి చెందిన మిల్కా సింగ్ అవుతుందని ప్రపంచం అంతా ఎదురుచూసింది. ఇక్కడ మొదటి నలుగురు అథ్లెట్లు ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టారు మరియు మిగిలిన ఇద్దరు అథ్లెట్లు ఒలింపిక్ రికార్డును సమం చేశారు. కానీ చాలా మంది వ్యక్తుల రికార్డును బద్దలు కొట్టడం పెద్ద విషయం అన్నారు. కోల్‌కతాలో జరిగిన 1962 జాతీయ క్రీడల్లో మిల్ఖాను మఖన్ సింగ్ ఘోరంగా ఓడించాడు. ఆరేళ్ల కెరీర్‌లో మఖన్ 12 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సాధించాడు. మిల్ఖా సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు, ‘నేను రేసులో ఎవరికైనా భయపెడితే అది మఖన్ సింగ్. అతను అద్భుతమైన రన్నర్. 1962 జాతీయ క్రీడల నుంచి ఇంత 400 మీటర్ల రేసును నేను చూడలేదు. పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ ఖాలిక్‌ కంటే మఖన్‌ను నేను ఒప్పుకుంటాను అన్నారు.  మిల్కాసింగ్‌ జీవితం ఆధారంగా భాగ్ మిల్కా భాగ్ చిత్రం తెరకెక్కింది. అందులో ఫర్హాన్ అక్తర్ మిల్కాసింగ్ పాత్రను పోషించాడు.

ఇద్దరూ పిచ్చ క్లారిటీతో ఉన్నారు.. ఏపీలో ఏం చేయబోతున్నారు?

సారేమో ప్రత్యేక హోదాపై ఏం చేయలేమంటున్నారు.  వారేమో అమరావతికి నిధులేమీ ఇవ్వలేదంటున్నారు. ఆ ఊసే లేదంటున్నారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ బాగా పెరిగిందా? లవ్ యూ తప్ప అన్నీ చెప్పేసుకుంటన్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. అదేం లేదని రాష్ట్రంలో వాదిస్తున్నారు. ఢిల్లీలో మాత్రం వేరే వినపడుతోంది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ స్టేట్ మెంట్ అదే సౌండ్ తో వచ్చింది. అటు ఢిల్లీలో రాజధానిపై అలాంటి సౌండే వస్తోంది. అందుకే అందరికీ అనుమానమొస్తుంది. వీరిద్దరి బందం బలపడుతుందా అని. ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం. వారికి సంపూర్ణ మెజారిటీ ఉంది. దేవుడు కనికరిస్తే.. ఈ పరిస్ధితులు ఎప్పటికైనా మారితే ఏమన్నా జరగొచ్చు..పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి.. అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న భగవద్గీత వినిపించారు. ఇదే గీత దేవుడు గీసిన గీత అంటూ గెలిచిన వెంటనే ఢిల్లీలో వెళ్లి పెట్టిన ప్రెస్ మీట్లో నూ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా వినిపించారు. ఇక వదిలేశారనే అందరూ నిట్టూర్చారు. కాని తర్వాత కాలంలో అసెంబ్లీలో తీర్మానం..లేఖలు అంటూ ప్రత్యేక హోదాపై హడావుడి చేసినట్లు కనిపించారు. ఇప్పుడు మళ్లీ పిచ్చ క్లారిటీతో చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ ఎందుకిలా చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకహోదాపై చేస్తున్నదేమీ లేదు.. అడుగుతున్నదేమీ లేదు.. అయినా దీనిపై వివరణ ఇచ్చారంటే..ఆ అంశాన్ని ఇక వదిలేశామని..మిమ్మల్ని ఇబ్బందిపెట్టేది లేదని కేంద్రానికి పరోక్షంగా చెప్పడానికే. మరోవైపు ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర హోంశాఖ తాము రాజధాని కోసం నిధులే ఇవ్వలేదని.. కేవలం వెయ్యి కోట్లు గుంటూరు,విజయవాడ అభివృద్ధికి మాత్రమే ఇచ్చామని సమాధానమిచ్చింది. వాస్తవానికి అమరావతికి నిధులు అంటూ స్వయంగా కేంద్ర బడ్జెట్ లోనే రాసి 1500 కోట్లు ఇచ్చారు. అది కూడా ఈ సమాధానపత్రంలో మెన్షన్ కూడా చేయలేదు. అమరావతి అనే పేరు కూడా రాలేదు. అంటే అమరావతి అనే విషయాన్ని వదిలేసినట్లు ఈ వ్యవహారంతో క్లారిటీ వచ్చేస్తోంది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా.. అనే సందేహం కలుగుతోంది. మొన్నటికి మొన్న జగన్ అమిత్ షాతో భేటీ అయినప్పుడు.. తొలిసారిగా బహిరంగంగా మూడు రాజధానులపై సహకారం అందించాలని కోరినట్లు బహిరంగంగా చెప్పారు. అటు నుంచి ఏమీ కన్ ఫామ్ చేయనప్పటికీ...ఇటు నుంచి ఇంత ఓపెన్ గా చెప్పుకోవడం మాత్రం ఇదే.  ఇప్పుడు లేటెస్టుగా సీఎం ప్రకటన చూస్తే... ఆ మీటింగు తర్వాత పరిణామాలకు కొనసాగింపే అనిపిస్తోంది. రేపో మాపో కేంద్రంలో చేరడానికి కూడా ఈ ప్రకటన చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కేంద్రం కోరినట్లు.. ప్రత్యేక హోదాపై ఏదైనా ప్రకటన చేస్తే చేరతామని జగన్ చెప్పినట్లు.. ఆ పార్టీని సమర్ధిస్తున్న ఓ వెబ్ పోర్టల్ లో స్టోరీ రాశారు. ఇప్పుడు సీఎం స్టేట్ మెంట్ ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికేనా అనిపిస్తోంది. ఎటూ ప్రత్యేక హోదా ఇప్పుడిచ్చే అవకాశం లేదు.. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేరాలంటే కేంద్రంలో చేరక తప్పదని రేపు చెబుతారా? రాజధాని వ్యవహారంలో కోర్టులు తప్ప తామేమీ చేయలేమని కేంద్రం కూడా తప్పించుకునే కార్యక్రమం కొనసాగిస్తుందా?ఏమో అదే జరగబోతుందనిపిస్తోంది.

రూ.లక్ష కోట్ల స్కాంకి జగన్ స్కెచ్! వైసీపీ ఎంపీ బినామీ కంపెనీకి సోలార్ ప్లాంట్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ టెండరును జూన్ 17న ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను మళ్లీ రూపొందించాలని ఆదేశించింది. అయితే తాజాగా జగన్ రెడ్డి సర్కార్ పిలిచిన సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. సోలార్ విద్యుత్ టెండర్లలో రూ.లక్ష కోట్ల కుంభకోణానికి సీఎం జగన్ తెరదీశారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ టెండర్లను హైకోర్టు కొట్టివేయడంతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని  చెబుతోంది. పాత నిబంధనలు మొత్తం మార్చేసి తమకు కావలసినప్పుడు టెండర్‌ రేటు పెంచుకోవడానికి.. టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యాలను మార్చుకునేందుకు వెసులుబాట్లు కల్పించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను కూడా పక్కనపెట్టారని పట్టాభి విమర్శించారు. 30 ఏళ్ల పాటు సౌర విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోలుకు అనుమతిస్తూ జీవోలు ఇచ్చారని పట్టాభి చెప్పారు. ఆరు వేల మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినా మరో 50 శాతం సామర్థ్యంతో అదనపు యూనిట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారన్నారు. దీనివల్ల  సుమారు పది వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు భారం రాష్ట్రంపై పడనుందని తెలిపారు. ఈ విద్యుత్‌ కొనుగోలు కోసం రాష్ట్రం ఏటా కనీసం రూ.4 వేల కోట్లు చెల్లించాలి.. అంటే 30 ఏళ్లకు రూ.లక్షా ఇరవై వేల కోట్ల ప్రజా ధనం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.1.90కి పడిపోతే.. ఏపీలో మాత్రం  మాత్రం 60 నుంచి 70 పైసలు అదనంగా చెల్లించేలా టెండర్లు ఖరారు చేయడానికి పథకం రచించారని పట్టాభి ఆరోపించారు.  సోలార్ కరెంట్ ఉత్పత్తిలో ఏ మాత్రం అనుభవం లేని కడప జిల్లాకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ  వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేయడానికి బిడ్డర్‌గా ఎంపికైందని.. ఈ కంపెనీ కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి బినామీ అని పట్టాభి తెలిపారు. టెండర్లు పిలిచిన కంపెనీకి  అసలు అర్హతే లేదన్నారు. టెండర్లు పిలిచిన సంస్థకు నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ లైసెన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఉండాలని, కానీ ఈ టెండర్లను పిలిచిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఏ లైసెన్సూ లేదన్నారు. అప్పటికప్పుడు ఒక కార్పొరేషన్‌ పెట్టేసి దాని పేరుతో టెండర్లు పిలిచారంటేనే నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో తెలుస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కంపెనీలతో పాతికేళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అది మహాపరాధంగా జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని, ఇప్పుడు ఆయన మాత్రం ఏకంగా ఆ వ్యవధిని 30 ఏళ్లకు పెంచేశారని అన్నారు. హైకోర్టు ఈ టెండర్లను కొట్టేయడంతో ప్రభుత్వ పెద్దలంతా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారని పట్టాభి ఎద్దేవా చేశారు.  వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు ఉద్దేశించి... రాష్ట్రంలో పది సౌర విద్యుత్‌ ప్లాంట్లు/పార్కుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈఎల్‌) గతేడాది నవంబరు 31న టెండర్లను ఆహ్వానించింది. ఆ టెండర్‌లోని రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌(ఆర్‌ఎఫ్‌ఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద(పీపీఏ) నిబంధనలు.. కేంద్ర విద్యుత్‌ చట్టం-2003కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(టీపీఆర్‌ఈఎల్‌) ఈ ఏడాది జనవరిలో హైకోర్టును ఆశ్రయించింది. టెండర్‌ను రద్దుచేసి తాజాగా పిలిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. పిటిషనర్‌ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి, న్యాయవాది కిలారు నితిన్‌కృష్ణ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఇంధనశాఖ 2017 ఆగస్టు 3న జారీచేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద నిబంధనలు ఉన్నాయన్నారు. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్‌ చట్టం-2003 కల్పించిన విచారణాధికార పరిధి హక్కులను ఆర్‌ఎఫ్‌ఎస్‌, పీపీఏలో తొలగించారన్నారు. దీంతో పీపీఏపై వివాదాలు తలెత్తితే.. ఏపీఈఆర్‌సీకి బదులు రాష్ట్ర ప్రభుత్వమే వాటిని పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టెండరును రద్దు చేయాలని కోరారు.విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి అనుగుణంగా తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌ రైతుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిందన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిశాక ప్రస్తుతం ఈ దశంలో వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. ఇరువైపు వాదనలూ విన్న హైకోర్టు న్యాయమూర్తి జూన్ 17  తీర్పు వెల్లడించారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో విజేతగా నిలిచిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ను నిలువరిస్తూ.. ఈ ఏడాది జనవరి 7న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  

పెన్షన్ భామ.. టీనేజ్ ప్రేమికుడు  

పడ్డానండి ప్రేమలో మరి.. విడ్డురంగా ఉందిలే మరి.. నిజంగా నిజంగా ఇలా ఈరోజే  తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి విడ్డురంగా ఉందిలే మరి.. అనే పాట మీరు వినే ఉంటారు. ప్రేమ గురించి కవులు, రచయితలు ఎవడి నచ్చినట్లు వాళ్ళు రాసుకున్నారు.ఒకడు ప్రేమ గుడ్డిది అన్నాడు.  మరొకడు  ప్రేమకు కులం, మతం, వర్గం.. ఇలా ఏదీ ఉండదు అని అన్నాడు. ఇంకొకడు  ప్రేమ స్వచ్ఛమైనది అన్నాడు.. మూడో వాడు ప్రేమకు వయసుతో  పనిలేదు అన్నాడు..  ఇంతకీ ఈ ఎలాంటిదో ఏలుసుకుందాం రండి..?  చివరికి ప్రేమకు వయస్సు బేధం కూడా ఉండదు. ఆ విషయాన్నీ వీరిద్దరూ మరో సారి నిరూపించారు. ఇందుకు ఈ జంటే నిదర్శనం. ప్రేమికుని  పేరు క్యురన్. అతని వయసు  23 ఏళ్లు.. ఆ ప్రేమికురాలి పేరు  చెర్లీ ఆమెకు 60 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయస్సు బేధం సుమారు 37 ఏళ్లు. కానీ, వారి మధ్య ఉండే కెమిస్ట్రీని చూస్తే.. కుర్ర ప్రేమికులు కూడా కుళ్లుకుంటారు. లోకం ఏమనుకుంటే మాకేంటీ.. మా ప్రేమ కంటే గొప్పదా ఈ సమాజం అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాకు మాత్రం వీరి ప్రేమ అస్సలు నచ్చడం లేదు. వారి మధ్య వయస్సు వ్యత్యాసమే కారణం. అమెరికాకు చెందిన క్యూరన్ప్రే, చెర్లీ ప్రేమలో మునిగి  స్నానం చేస్తున్నాడు. ఆమెకు ముద్దులు పెడుతూ.. హగ్గులిస్తూ.. అప్పుడపుడు డ్యాన్సులు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా రొమాన్స్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా టిక్‌టాక్ వీడియోలతో ఆ యువ ప్రేమికుడు , ఆ వృద్ధ ప్రేమికురాలు  ఇద్దరూ పిచ్చెక్కిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో చాలామందికి నచ్చడం లేదు. ‘‘అమ్మమ్మతో రొమాన్స్ ఏమిట్రా బాబు’’ అని క్యురన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీ ప్రేమకు కుటుంబం అంగీకరించిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు చెర్లీ స్పందిస్తూ.. ‘‘ఔను మా పెద్దలు ఒప్పుకున్నారు’’ అని తెలిపింది. అంతేకాదు.. తన ప్రియుడు క్యురన్ కంటే పెద్దవాళ్లైన తన పిల్లలు కూడా తమ ప్రేమను అంగీకరించారని పేర్కొంది. అయితే.. నెటిజనులు మాత్రం వారిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ముఖం మీద ముడతలు గురించి చెత్తగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాగా రిచ్ కావడం వల్లే అతడు అంతగా ప్రేమిస్తున్నాడని అంటున్నారు. ఏమిటో ఈ వింత అలవాట్లు ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో ఈ అభివృద్ధి  

అక్టోబ‌ర్‌లోపే మూడో ముప్పు.. మ‌రో రెండేళ్లపాటు క‌రోనా క‌ల్లోలం..!

ఫ‌స్ట్ వేవ్ ఫ‌స‌క్ అనిపించింది. సెకండ్ వేవ్ చంపిపారేస్తోంది. ఇక సీజ‌న్ 3 కూడా ఉంద‌నే వార్త‌లు వ‌ణికిస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ మ‌రెంతో దూరంలో లేద‌ని.. ఈ అక్టోబ‌ర్‌లోనే అల్లాడించబోతోంద‌ని ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల మాట‌. మ‌రో ఏడాది వ‌ర‌కూ కరోనాదే కాల‌మ‌ని.. మామూలు రోజులు ఇప్ప‌ట్లో రావంటూ చావుక‌బురు చ‌ల్ల‌గా చెబుతున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క రాయ్‌ట‌ర్స్ వార్తా సంస్థ నిర్వ‌హించిన పోల్‌లో ప‌లువురు వైద్యులు థ‌ర్డ్‌వేవ్ గురించి త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు. రైట‌ర్స్‌.. జూన్‌ 3 నుంచి 17 మ‌ధ్య 41 మంది ఆరోగ్య రంగ నిపుణులతో ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివ‌రాలు మీ కోసం.... థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు 24 మంది వైద్య నిపుణులు స్పందించారు. ఎక్కువ మంది అక్టోబరు నాటికి థ‌ర్డ్‌ వేవ్‌ వచ్చే ముప్పు ఉందని అంచనా వేశారు. అయితే, కొంద‌రు సైంటిస్టులు ఆగ‌స్టు అంటే.. మ‌రికొంద‌రు సెప్టెంబరులో వస్తుందన్నారు. రెండో వేవ్‌ నియంత్రణతో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ను మరింత స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించగలమని భావిస్తున్నారు. కొంత‌మంది వైద్యులు థర్డ్‌వేవ్‌ మరింత ఘోరంగా ఉంటుందని ఆందోళన వ్య‌క్తం చేయ‌గా.. మ‌రికొంత మంది మాత్రం తీవ్రత దాదాపు సెకండ్‌ వేవ్‌ లాగానే ఉండొచ్చన్నారు.  మూడో వేవ్‌ 18 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదం అనే అనుమానంపై 40 మందిలో 26 మంది అవుననే సమాధానమే ఇచ్చారు. మిగిలిన 14 మంది నిపుణులు మాత్రం పిల్లలకు మూడోవేవ్‌లో అంత పెద్ద ముప్పు ఉండదన్నారు.  భవిష్యత్తులో వచ్చే వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అన్న ప్రశ్నకు 38 మందిలో 25 మంది.. పనిచేస్తాయనే అభిప్రాయపడ్డారు. 34% మంది పనిచేయవన్నారు.  మ‌రో ఏడాది పాటు భారత ప్రజారోగ్యానికి కరోనా ముప్పుగానే ఉంటుందని చెప్పారు. 11 మంది.. కరోనా ముప్పు ఏడాదిలోపే ఉంటుందని అభిప్రాయపడగా, 15 మంది రెండేళ్లలోపు ఉంటుందని, 13 మంది రెండేళ్లకన్నా ఎక్కువగా ఉంటుందని, ఇద్దరేమో.. కరోనా ముప్పు ఎప్పటికీ పోదని అభిప్రాయపడ్డారు. రైట‌ర్స్ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైర‌స్ మ‌నుషులకంటే తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రివ‌ర్త‌నం చెందుతూ.. కొత్త కొత్త వేరియంట్ల‌తో ముందుకొస్తోంది. మందుల నుంచీ ఎస్కేప్ అవుతోంది. మ‌రింత‌గా క‌ణాల్లోకి వ్యాపిస్తూ.. మ‌రింత ఖ‌త‌ర్నాక్‌గా మారుతోంది క‌రోనా. వైర‌స్ ఎంత‌గా డ్రామాలు చేసినా.. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటే అది ఏమీ చేయ‌లేద‌నే విష‌యం మాత్రం మ‌ర‌వొద్దు. మాస్క్‌, శానిటైజ‌ర్ అస్స‌లు మ‌ర‌వొద్దు.

గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా! బీజేపీకి జనసేన గుడ్ బై?

ఎప్పటికప్పుడు క్లోజ్ అయినట్లే కనపడతారు.. ఇష్క్ ప్యార్ అంటూ డ్యూయెట్స్ పాడుకుంటారు. అంతలోనే మళ్లీ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తారు. అవసరమున్నప్పుడు ఆయనని గబ్బర్ సింగ్ అంటారు.. అవసరం లేదనుకుంటే ఫ్లాప్ అయిన గబ్బర్ సింగ్-2 లాగా చూస్తారు. అన్నీ కలిసే చేస్తామంటారు...మళ్లీ ఎవరికి వారు సొంతంగా కథ నడిపించుకుంటారు. ఆయనే మా సీఎం అభ్యర్ధి అంటారు... ఆయనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. వీరిద్దరూ కలిసున్నారో... విడిపోయారో.. ఎప్పుడు కలుస్తారో.. విడిపోతారో అర్ధం కాకుండా.. జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు బిజెపి, జనసేన నేతలు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఒకరిపై ఒకరు తెగ పారబోసుకున్న బిజెపి, జనసేన నేతలు..ఆ ఎన్నికలయిపోగానే.. ఏదో షూటింగ్ ప్యాకప్ అని చెప్పినట్లే చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కరోనా వచ్చిందని కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారంటున్నారు. మరోవైపు ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కాని రాష్ట్రంలో మాత్రం బిజెపి, జనసేనల మధ్య గ్యాప్ పెరిగినట్లే ఉంది.ఏపీలో ధాన్యం కొనుగోళ్లు జరగటం లేదని.. సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ బిజెపి ఆందోళనలు నిర్వహించింది. కాని ఉమ్మడిగానే ఆందోళనలు నిర్వహించాలనుకున్న రెండు పార్టీల నిర్ణయం ఏమైందో తెలియలేదు. పైగా దీని గురించి కనీసం సమాచారం కూడా జనసేన నేతలకు లేదట. దీంతో జనసేన నేతలు కాస్త గుర్రుగానే ఉన్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య ఫోన్ లో నే వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి నేతలు మాత్రం పవన్ అందుబాటులో ఉండటం లేదని..కనీసం నాదెండ్ల మనోహర్ కూడా టచ్ లో లేడని..ఎవరికి చెప్పాలని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. తిరుపతి ఉపఎన్నికలో పవన్ ప్రభావం ఏమీ కనిపించలేదని..వచ్చిన ఓట్లే చెబుతున్నాయని..అలాంటి వారిని నమ్ముకుని ఎలా ముందుకు వెళతామని కొందరు బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం..వచ్చిన ఓట్లన్నీతమవేనని.. అసలు బిజెపి ఓట్లు ఒక్కటి కూడా లేవని..ముందు అడిగినట్లు తమకే అవకాశం ఇచ్చి ఉంటే..వేరేగా ఉండేదని..వాదిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర నేతలు అసలు సమిష్టిగా పని చేయడం లేదని.. ఎవరి ఇంట్రెస్టుకు అనుగుణంగా వారు పని చేస్తున్నారని.. కొందరు వైసీపీకి అనుకూలంగాను.. మరికొందరు టీడీపీకి అనుకూలంగాను ఉంటున్నారని...కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు..నిర్ణయం మేరకు జనసేనతో కలిసి పని చేసేవారు చాలా తక్కువమందే ఉన్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం కలగచేసుకుని..  వారి ఆదేశాలు,నిర్ణయాల మేరకు రాష్ట్ర పార్టీ నేతలు పని చేసేలా చూడాలని జనసేన వర్గాలు కోరుతున్నాయి. అసలు బిజెపి నేతల వైఖరి నచ్చకనే పవన్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే టాక్ కూడా వినపడుతుంది. మరోవైపు జనసేనలోని కొంతమంది ఇప్పుడున్న పరిస్ధితుల్లో బిజెపి ఇమేజ్ తగ్గుతుందని..వైసీపీ హవా కూడా తగ్గుతుందని.. రాబోయే కాలంలో టీడీపీ బలపడే ఛాన్స్ ఉందని..అందుకే టీడీపీతో టచ్ లో ఉండాలని వాదిస్తున్నారంట. ఈ తికమక అయోమయానికి చిరాకు పుట్టే పవన్ సినిమాల వైపు బిజీ అయిపోయారనే కామెంట్లు వినపడుతున్నాయి.

పెళ్లి పీటల మీది నుండి వధువు పరార్..

ఓపెన్ చేస్తే పెళ్లి సందడి జరుగుతుంది. పెళ్లి వాళ్ళు బంధువులను ఆహ్వానిస్తున్నారు. ఒక వైపు బాజాభజంత్రీలు మోగుతున్నాయి. మరో వైపు బాహ్మణుడు వేద మంత్రాలు వల్లిస్తున్నాడు. చిన్న పెద్ద అంతా పెళ్లి వేడుక తిలకిస్తున్నారు. పంచభూతాల సాక్షిగా ఆ ఇద్దరు ఒక్కడి అవుతున్న సమయాన ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లి దండ్రులకు తెలిస్తే ప్రేమించిన వాడి దగ్గరికి వాళ్లమని తెలుగు సినిమా క్లైమాక్స్ లో చెప్పగానే హీరోయిన్ పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు.. ఎవరో ఒకరు వచ్చి ఓ వధువు చెవిలో ఏదో చెప్పగానే ఆ వధువు పెళ్లి మధ్యలోనే పీటల మీద నుంచి లేచి పరుగు అందుకుంది. పెళ్లి కూతురు అలా పరుగెత్తడం చూసి అందరు షాక్ అయ్యారు. ఆ పెళ్లి కూతురి గురించి ఒకొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుందని. కట్ చేస్తే మళ్ళీ కొన్ని గంటల తర్వాత అదే జనం మళ్ళీ షాక్ అయ్యారు.. ఇంత సేపు ఎక్కడిపోయిందని. ఆ అమ్మాయి పెళ్లి పీటల మీది నుండి వెళ్లి పోవడానికి బలమైన కారణమే ఉంది. ఇంతకీ ఆ కారణం ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యమెందుకు పదండి ముందుకు.. పెళ్లి మండపంలో కూర్చున్న వధువు చేవిలో ఆమె బంధువులు ఓ ముఖ్యమైన విషయం చెప్పారు. ఆ మాట వినగానే వధువు  ఆనందానికి అవధుల్లేవు. పెళ్లి జరుగుతుండగానే పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన పరుగులు పెట్టింది. అదేంటీ.. వధువు అలా వెళ్లిపోతోందని అతిథులు ఆశ్చర్యపోయారు. అయితే, బంధువులు అసలు విషయం చెప్పగానే.. అతిథులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేంటీ.. పెళ్లి కూతురు అలా వెళ్లిపోతుంటే అంతా సంతోషం వ్యక్తం చేయడం ఏమిటని మీరు కూడా షాకవుతున్నారా? అయితే, ఆలస్యం చేయకుండా మేటర్‌లోకి వెళ్లిపోదాం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఇక్కడ పంచాయతీ (బీడీసీ) ఎన్నికలు జరిగాయి. ఇందులో జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ కూడా పోటీ చేసింది. 135 వార్డు నుంచి ఆమె బరిలోకి దిగింది. ఆమె పెళ్లి రోజునే ఓట్ల లెక్కింపు కూడా జరిగింది.పూనమ్ శర్మ ఈ సందర్భంగా ఫలితాలు హోరాహోరీగా ఉన్నట్లు బంధువులు చెప్పడంతో.. పెళ్లి మధ్యలోనే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది. ఎట్టకేలకు ఆమె తన ప్రత్యర్థి మీద 31 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరంగా ఊరేగింపు మధ్య పెళ్లి మండపానికి చేరుకుని వరుడితో తాళి కట్టించుకుంది.  

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేస్తారా? నైట్ కర్ఫ్యూనా? 

తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తుంది. మరోవంక రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. క్రియాశీల కేసుల సఖ్య కూడా క్రమక్రమంగా దిగి వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  ఈ నేపధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్’ మరికొంత కాలం పొడిగించాలా లేక సడలించాలా అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఈ అంశాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ అద్యక్షతన శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.  ఈ సమావేశంలో కరోనా పరిస్తితులను చర్చించి,, లాక్ డౌన్ అంక్షల సడలింపు పై  నిర్ణయం తీసుకోవడంతో పాటుగా కల్తీ విత్తనాలు, ఏపీ ప్రాజెక్టులు, నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక, రాజకీయ ప్రాధాన్యతగల హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి మంత్రివర్గ సమావేశానికి ముందే, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో  పరిస్థితిని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు  హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు.  కాగా, సినిమా హాల్స్, పబ్బులు, బార్లు, కల్బ్బులు, వంటి వాటి మూసివేతను కొనసాగిస్తూ, ఇతర కార్యకలాపాలపై ఆంక్షలను పూర్తిగా లేదా సాధ్యమైన మేరకు ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబందిత శాఖలు నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని అధికార  వర్గాల సమాచారం. కరోనా రెండవ దశ కేసుల వివరాలతో పాటుగా మూడవ దశకు సంబదించి అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని  మంత్రి వర్గం ముందుంచాలని, ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.   కరోనా సెకండ్ వేవ్ శాంతించిన, థర్డ్ వేవ్ విషయంలో వినవస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు  జాగ్రత్తలు తీసుకోవడంలో  విఫలమైనాయని, కోర్టులు సైతం అక్షింతలు వేసిన నేపధ్యంలో, థర్డ్ వేవ్ విషయంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు మౌలిక సదుపాయాలు, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నియామకాలు, మొబిలిటీ వంటి వివిధ విషయాలను చర్చించి, తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రి హరీష్ రావు సారధ్యంలో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.  థర్డ్ వేవ్ విషయంలో పనిగట్టుకుని భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కూడా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది. అదే సమయంలో మూడో వేవ్ ‘కు సంబంధించి ప్రజలకు మరింత అవగాహన కలిపించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రచార కార్యక్రమాలను సిద్డంచేస్తునట్లు అధికార వర్గాల సమాచారం. అయితే, కరోనా మహామ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు టీకా వేసుకోవడంతో పాటుగా ఇతరులకు ముఖ్య్మగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరులు, సిబ్బంది, ఇంటి పనివారు, ఇలా ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేందుకు సహకరించాలని, కోరుతున్నారు. అదే విధంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం  పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, అనవసరంగా బయటకు రాకుండా ఎవరికి  వారు స్వీయ నియంత్రణ పాటించడం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.

లిక్కర్ షాప్ కి హారతి.. మందు బాబు జోరిది.. 

మందు బాబులం.  మేము   మందు  బాబులం .మందు  కొడితే  మాకు  మేమే  మహారాజులం. అరేయ్ కళ్ళు  తగి  గంతేస్తాం. సారా  తగి  చిందేస్తాము మందంత  దిగేదాకా  లోకలేయ్   పాలిస్తాం. తాగుబోతానంటే ఎందుకంత  చులకన. తాగి  వాగేది  పాచి  నిజం గణకణ. హేయ్  ముందు  వెనక   లేదని ఈ  మందు  లేని  సర్కారే   బందన్న..ఈ పాట చాలా ఫేమస్.. అలాగే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ మందు బాబుల గురించి చెప్పిన మాటలు కూడా వంద శాతం కరెక్ట్.. మందు కోసం నైట్ పిచ్చి కుక్కలా తిరగడం వేరు. అలాగే మద్యం షాప్ ఓపెన్ కాకముందుకే లైన్ లో కర్చీఫ్ వేసి నిలబడడం చూశాం..కానీ తాజాగా ఓ మందు బాబు వైన్ షాప్ కి హారతి ఇచ్చాడు.. అందరికంటే ముందే వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు.. చేసే పని మీద, భార్య పిల్లల మీద అంట ప్రేమ ఉంటుందో లేదో గానీ మందు మీద మాత్రం అంతటి ప్రేమను చూపించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులను హావాక్కు చేశాడు..  కరోనా వైరస్ నేపథ్యంలో తమిళనాడులో మద్యం విక్రయాలను నిలిపేశారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 27 జిల్లాల్లో లిక్కర్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మమేసుకోండని పేర్కొంది. దీంతో మందుబాబుల ఆనందానికి అవథుల్లేవు. కోడి కూయడానికి ముందుగానే లిక్కర్ షాపుల ముందు క్యూకట్టారు. మధురైలో ఓ వ్యక్తి.. లిక్కర్ షాప్ అలా ఓపెన్ చేయగానే ఇంట్లో దేవుడికి దన్నం పెడతాడో లేదో తెలియదు గానీ.. మద్యం బాటిళ్లకు మాత్రం పూజలు చేస్తున్నాడు. అంతేకాదండోయ్.. లిక్కర్ షాపు ఏకంగా హారతిచ్చి మరీ మద్యం కొనుగోలు చేశాడు. అతడి చేష్టలు చూసిన జనాలు.. ‘‘ఓరి వీడి వేషాలో..’’ అనుకుంటూ నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘బాబు బాగా మందును మిస్సయినట్లున్నాడు. చాలా ఆనందంగా ఫీలవ్వుతున్నాడు’’ అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ‘‘ఆస్కార్ అవార్డు పొందినప్పుడు కూడా ఇంత ఆనందం కలగదేమో’’ అని మరొకరు అంటున్నారు. మరి, ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్ వేసేయండి మరి.  

ఎన్నికల ముందు వార్.. తర్వాత గప్ చుప్! కారు, కమలం నేతలపై డౌట్స్ 

ఎన్నికల సమయంలో, ఆ రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, ఒకరిపై ఒకరు కత్తులు దూస్తారు, మాటల తూటాలు పేలుస్తారు. అయిత, ఎన్నికల క్రతువు ముగియగానే, అన్నీ మరిచి పోతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు, ఆ ముచ్చటే మళ్ళీ ఎత్తరు. అందుకే, తెరాస, బీజేపీ నాయకుల జుగల్ బందీకి అంత ప్రధాన్యత ఇవ్వవలసిన అవసరంలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో మంత్రి కేటీఅర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐ ఆర్ ప్రాజెక్ట్ గురించి మాటలాడని రోజు లేదు. ఈ మూడు అంశాల చుట్టూనే ప్రచారం నడిపించారు. విపక్షాలు నిరుద్యోగ సమస్య, నియమకాలకు సంబంధించిన లెక్కల తప్పుల అంశాన్ని ప్రస్తావించి నప్పుడు, కేటీఆర్ ఇతర నాయకులు ఈ అంశాలను తెరమీదకు తెచ్చారు.  అయితే,  ఎన్నికలు అయిపోయియన్ తర్వాత  మళ్ళీ  వాటి ఊసే లేదు.  ఖాజీపేట కోచ్  ఫ్యాక్టరీకి కాదు అసలు దేశంలో ఎక్కడ కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రపాదన ఏదీ లేదని, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కుండ బద్దలు కొట్టారు, అయినా కేటీఆర్ పెదవి విప్పలేదు. కనీసం పిట్టకూత (ట్వీట్) అయినా చేయలేదు.   ఇక ఇప్పుడు మళ్ళీ,  హుజురాబాద్ ఉపఎన్నికల వేడి పెరుగతున్న నేపధ్యంలో, టీఆర్ఎస్ మళ్లీ తనదైన వ్యూహాన్ని మొదలెట్టింది. ఆపార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ  వైఫల్యాలను తెర మీదకు తెచ్చేందుకు మళ్లీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన  రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో  చెప్పాలని సవాల్ విసిరారు. పాత పాటను పక్కన పెట్టి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఖాజీపేట, బయ్యారం, ఐటీఐఆర్ మరిచిపోయారు. కొత్తగా  ఆత్మనిర్భర్ ప్యాకేజిని పైకి తెచ్చారు.  ఈపథకం వల్ల ఒరిగిందేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు.  ఈ మేరకు ఆయన  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్’కు లేఖ రాశారు. ఈ పథకం    ప్రారంభమై   ఒక సంవత్సరం పైగా కావస్తున్నా.. ఇంతవరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.  కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈపథకం వలన ప్రయోజనం పొంది వారున్నారు, అయితే అందరికీ ప్రయోజనం చేకురిందా, సంక్షోభం పూర్తిగా తొలిగి పోయిందా, అంటే లేదు.. అయితే అదే నిజం అయితే, రాష్ట్ర ప్రభుత్వ్వం స్వయంగా ఆయనే మంత్రిగా ఉన్న పరిశ్రమల శాఖ ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉందని, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు,. ఇంకా విడ్డూరంగా ప్రధానమంత్రి సంవత్సరం క్రితం ప్రకటించిన పథకంలో లోపాలు ఉన్నాయని, మంత్రి ఇప్పుడు గుర్తించారా, అని కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.