లిక్కర్ షాప్ కి హారతి.. మందు బాబు జోరిది..
posted on Jun 19, 2021 9:09AM
మందు బాబులం. మేము మందు బాబులం .మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరేయ్ కళ్ళు తగి గంతేస్తాం. సారా తగి చిందేస్తాము మందంత దిగేదాకా లోకలేయ్ పాలిస్తాం. తాగుబోతానంటే ఎందుకంత చులకన. తాగి వాగేది పాచి నిజం గణకణ. హేయ్ ముందు వెనక లేదని ఈ మందు లేని సర్కారే బందన్న..ఈ పాట చాలా ఫేమస్.. అలాగే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ మందు బాబుల గురించి చెప్పిన మాటలు కూడా వంద శాతం కరెక్ట్.. మందు కోసం నైట్ పిచ్చి కుక్కలా తిరగడం వేరు. అలాగే మద్యం షాప్ ఓపెన్ కాకముందుకే లైన్ లో కర్చీఫ్ వేసి నిలబడడం చూశాం..కానీ తాజాగా ఓ మందు బాబు వైన్ షాప్ కి హారతి ఇచ్చాడు.. అందరికంటే ముందే వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు.. చేసే పని మీద, భార్య పిల్లల మీద అంట ప్రేమ ఉంటుందో లేదో గానీ మందు మీద మాత్రం అంతటి ప్రేమను చూపించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులను హావాక్కు చేశాడు..
కరోనా వైరస్ నేపథ్యంలో తమిళనాడులో మద్యం విక్రయాలను నిలిపేశారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 27 జిల్లాల్లో లిక్కర్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మమేసుకోండని పేర్కొంది. దీంతో మందుబాబుల ఆనందానికి అవథుల్లేవు. కోడి కూయడానికి ముందుగానే లిక్కర్ షాపుల ముందు క్యూకట్టారు. మధురైలో ఓ వ్యక్తి.. లిక్కర్ షాప్ అలా ఓపెన్ చేయగానే ఇంట్లో దేవుడికి దన్నం పెడతాడో లేదో తెలియదు గానీ.. మద్యం బాటిళ్లకు మాత్రం పూజలు చేస్తున్నాడు. అంతేకాదండోయ్.. లిక్కర్ షాపు ఏకంగా హారతిచ్చి మరీ మద్యం కొనుగోలు చేశాడు. అతడి చేష్టలు చూసిన జనాలు.. ‘‘ఓరి వీడి వేషాలో..’’ అనుకుంటూ నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘బాబు బాగా మందును మిస్సయినట్లున్నాడు. చాలా ఆనందంగా ఫీలవ్వుతున్నాడు’’ అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ‘‘ఆస్కార్ అవార్డు పొందినప్పుడు కూడా ఇంత ఆనందం కలగదేమో’’ అని మరొకరు అంటున్నారు. మరి, ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్ వేసేయండి మరి.