థర్డ్ వేవ్ రమ్మంటే వస్తుంది.. కానీ పొమ్మంటే పోదు
కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి .. చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు కఠిన చర్యలూ తీసుకున్నారు. మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది.
అదే సెకండ్ వేవ్ వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే తెలిసినా, ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కుంభమేళా ఇతర సామూహిక కార్యక్రమాల విషయంలో కట్టు తప్పడంతో కరోనా సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రళయాన్నే సృష్టించింది. అంతా అయి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సమయానికి జరగరాని నష్టం జరిగిపోయింది. మనదేశంలో 2020 జనవరి 3 వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఆగష్టు 3, 2021 నాటికి ఆ సంఖ్య 31,726,507 చేరింది. ఇంతవరకు 4,25,195 మంది కరోనా బాధితులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది సెకండ్ వేవ్’ లో చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతానికి పెరిగింది. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ , అత్యవసర మందులు అందక ఎవరూ చనిపోలేదు. కానీ సెకండ్ వేవ్’ లో మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్, మందుల కొరత కూడా ఒక ప్రధాన కారణం అయింది. ఫస్ట్ వేవ్’లో లేని బ్లాక్, ఎల్లో ఫంగస్ వంటి ప్రాణాంతక ఉప విపత్తులు,కొత్త వేరియంట్స్ సెకండ్ వేవ్ లో పుట్టుకొచ్చాయి. ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతంగానే వుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువ నష్టం కలగచేయడానికి ఇంకా ఎన్ని కారణాలు ఉన్నా, ఉమ్మడి ‘స్వయంకృత’ అపరాధం అన్నిటినీ మించిన మూల కారణం. అదే ప్రధాన ముద్దాయి. ప్రభుత్వాలు తిలాపాపం తలాపిడికెడు పంచుకున్నాయి. ప్రభుత్వాలే కాదు మనం అందరం అందుకు బాధ్యులమే ..
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నట్లుగా మూడోవేవ్ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నిజం, కరోనా థర్డ్ వేవ్ ఈ ఈనెలలో వస్తుందా, మరో నెల ఆగుతుందా, అసలు రాకుండానే పోతుందా, వచ్చినా పెద్దగా ప్రభావం చూపదా, వంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రజల ప్రవర్తనే సమాధానంగా నిలుస్తుంది. వైరస్ వ్యాప్తి తీరు ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. అయితే సెకండ్ వేవ్’లానే థర్డ్ వేవ్ థర్డ్ వేవ్’ ను కూడానిర్లక్ష్యం చేస్తే, థర్డ్ వేవ్’ మహా ప్రళయంగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు. థర్డ్ వేవ్ లో వచ్చేది, ఇప్పటికీ అమెరికా సహా అనేక దేశాల్లో స్థైర్య విహారం చేస్తున్న, డెల్టా వేరియంట్ , ఈ వేరియంట్ వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సో .. థర్డ్ వేవ్ రావాలా వద్దా అనేది ... మన చేతుల్లోనే వుంది .. రమ్మంటే వస్తుంది .. కానీ పొమ్మంటే పోదు... పోయేటప్పుడు వట్టి చేతులతో పోదు ... చిక్కిన ప్రాణాలను చిక్కినట్లు ప్రాణాలను మూట కట్టుకుని పట్టుకు పోతుంది. అందుకే.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వింటున్నారా...
కరోనా ఫస్ట్ వేవ్ చెప్పీ చెప్పకుండా వచ్చింది. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడంతో ఇతర దేశాలతో పోల్చి నప్పుడు మన దేశంలో ముప్పు కొంత తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వాల మాట విన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు పాటించారు.
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి మీడియా ద్వారా మాస్క్ ధరించండి .. భౌతిక దూరం పాటించండి ... చేతులు శుభ్రంగా ఉంచుకోండి .. అని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరం మేరకు కఠిన చర్యలూ తీసుకున్నారు. మరోవంక లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకున్నాయి. అలాగే, స్వచ్చంద సంస్థలు, సామాన్య ప్రజలు ఎవరికి వారు చేతనైన మేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలా, సామాన్య ప్రజల నుంచి ప్రధాని వరకు అందరూ ఒకటిగా భారతీయులు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేశారు. ఇలా సామదానదండోపాయాలు ఉపయోగించడంతో పాటుగా ఉమ్మడి కృషి ఫలితంగా ఫస్ట్ వేవ్ ముప్పును కొంతలో కొంత తగ్గించుకోవడంలో మన దేశం కొంత మేరకు అయినా సఫలమైంది.