ఉదయం అవార్డ్.. సాయంత్రం సస్పెండ్! రాసలీలల ఎస్ఐ కథ పెద్దదే?
posted on Aug 3, 2021 @ 9:02PM
తెలంగాణలో సంచలనం రేపిన , పోలీసు శాఖలో ప్రకంపనలు స్పష్టించిన మహిళా దళిత ట్రైనీపై లైగింక వేధింపుల కేసులో ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ వేటు పడింది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని.. మహబూబాబాద్ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయడం సంచలం రేపింది. సోమవారం రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధించారు. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని ఉత్తమ పనితీరుకు గాను అవార్డు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఉదయమే జిల్లా ఎస్పీకి అతనికి అవార్డు అందించారు.