5 లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలి! వివేకా కేసులో జగన్ కు రఘురామ ట్విస్ట్.. 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. అనుమానితులందరిని ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు ప్రశ్నించారు.  తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేసిన ప్రకటనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ప్రకటన ఇచ్చిందని, నిజాలు తెలిపిన వారికి రూ.5 లక్షలు అంటున్నారని చెప్పారు, ఆ లెక్కన సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ కోటి రూపాయల బహుమానం ఇవ్వాలని అన్నారు. "ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారు. మరి వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?" అని రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరుతూ సీబీఐ  శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

జగన్ బాటలో కేసీఆర్.. మద్యం తాగించి ఖజానా నింపేలా స్కెచ్..

ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కొన్ని విషయాల్లో  విబేధాలుంటే ఉండవచ్చును, కానీ, ఆ ఇద్దరి మధ్య చాలా విషయాల్లో సారూప్యాలున్నాయి. కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రెడ్డి ఫాలో అయితే మరికొన్ని విషయాల్లో జగన్ రెడ్డిని కేసీఅర్ ఫాలో అవుతారు. ఇప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మద్యం ఆదాయం పెంచుకునే విషయంలో ఏపీ సీఎంతో  పోటీకి సిద్ధమవుతున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగిపోయింది. ముఖ్యమంత్రి  రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. ఓ వంక అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం, మద్యం మీద వచ్చే ఆదాయంపై అప్పులు తెచ్చుకుంకుంటోంది. అంటే అప్పులు తీరాలంటే జనం చచ్చినట్లు తాగి తీరాలనే విధంగా వ్యవహరిస్తోంది. మరో వంక  ఈ అప్పులు తీరటానికి మరో 25ఏ ళ్ళు పడుతుందని అంటున్నారు. అంటే 25ఏళ్ల వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ఆయన చేసిన అప్పు ఉంటుంది. అలాగే, సంపూర్ణ మద్యం పాలసీ కొనసాగుతుంది.  తెలంగాణ ప్రభుత్వం జగన్ రెడ్డి అంత దుస్సాహసం అయితే చేయడంలేదు కానీ, ప్రజల సంక్షేమం కోసం, లిక్కర్ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేదుకు, రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తోందని ఆబ్కారీ మాటగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుకు, మంచి గిరాకీ ఉన్న ప్రాంతాలను గుర్తుంచాలని అబ్కారీ శాఖను ఆదేశించింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రతి కొత్త మండలంలో కనీసం ఒకటి వంతున, వీలైతే రెండు, మూడు షాపులను ఏర్పాటు చేయాలని, మొత్తంగా కనీసం 150 షాపులు అయినా కొత్తగా తెరిచేలా జాబితా తయారు చేయాలని, అబ్కారీ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.  ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో 2,216 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల లైసెన్స్ గడువు, అక్టోబర్‌‌‌‌ 31తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో నూతన పాలసీ తీసుకు రావాలని రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, షాపుల సంఖ్యను, అదే చేత్తో లైసెన్స్ ఫీజును పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త షాపులకు వేలం పాట ద్వారా లైసెన్స్ మంజూరు చేస్తారు. తద్వారా ప్రభుత్వాని మాంచి కిక్కిచ్చే రేంజిలో ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో 459 మండలాలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా 133 మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం మండలాల సంఖ్య 592కు చేరింది. కొత్తగా ఏర్పడిన మండలాల ప్రజలకు మందు అందుబాటులో లేదనే మాట రాకుండా ప్రభుత్వం ఇటీవల కొత్తగా 159 బార్లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది . ఇప్పుడు అదే  క్రమంలో  మద్యం షాపుల విషయంలోనూ జనం ఇబ్బందులు పడకూడని షాపుల సంక్ష్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైన్  షాపుల లైసెన్స్‌‌‌‌ ఫీజుతోనే ప్రభుత్వానికి  976 కోట్ల రూపాయల  ఆదాయం వచ్చింది. ఇక ఇప్పుడు కొత్తగా 150 మద్యం  షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు అప్లికేషను, లైసెన్స్‌‌‌‌ ఫీజు సవరణలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, అధికారులు అంటున్నారు.  మద్యం అమ్మకాల్లో ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఆవిధంగా ఒక్కజూలై నెలలో ప్రభుత్వ ఖజానాకు చేరిన మద్యం ఆదాయం, ఇంచుమించుగా రూ 1,600 కోట్లకుపైగా ఉంటుందని అధికార లెక్కలు సూచిస్తున్నాయి. ఇక ముందు, అది ఎన్నివేల కోట్లకు చేరుతుందో, ఏమో ..సంక్షేమ పథకాలు కావాలంటే, తప్పదు మరి. ఒకటి కావాలంటే ఒకటి వాడుకోక తప్పదు..

కొండాకే టికెట్ క‌న్ఫామ్‌.. కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఖాయం?

హుజురాబాద్ పోరులో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం వ‌చ్చింది. పోటీకి కొండా సురేఖ పేరు దాదాపు క‌న్ఫామ్ అయింది. నేడోరేపో అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలోని క‌మిటీ కొండా పేరును అధిష్టానానికి పంపించింది. అక్క‌డ గ్రీన్‌సిగ్న‌ల్ ప‌డిన‌ట్టే తెలుస్తోంది. ఇక హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ పేరు వెల్ల‌డించ‌డ‌మే త‌రువాయి. అదే జ‌రిగితే.. ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీకి.. ద‌బిడి దిబిడే. హుజురాబాద్ పోరులో ఇప్పుడు కాంగ్రెస్‌కే అధిక ఆధిక్యం క‌నిపిస్తోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. కొంద‌రు కారులోనే ఉండిపోగా.. మ‌రికొంద‌రు ఈట‌ల వెంట బీజేపీలో చేరిపోయారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అంతే బ‌లంగా ఉంది. కౌశిక్‌రెడ్డి వెంట వెళ్లింది అతి త‌క్కువ మందే. కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఇప్ప‌టికీ అంతే ప‌దిలంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో హ‌స్తం గుర్తుకు 60వేల‌కు పైగా ఓట్లు ప‌డ్డాయి. ఈట‌ల‌కు ల‌క్ష పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. ఆ లెక్క‌న‌.. ఈట‌ల‌కు వ‌చ్చిన ఆ ల‌క్ష ఓట్లనే ఇప్పుడు టీఆర్ఎస్‌, బీజేపీ పంచుకోవాల్సి ఉంటుంది. అంటే.. గ‌త ఓట్ల శాతం ప్ర‌కారం హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌-బీజేపీ-కాంగ్రెస్‌.. మూడు పార్టీల‌కు సుమారు 50వేల ఓట్లు చొప్పున‌ దాదాపు స‌మాన బ‌లం ఉన్న‌ట్టు తెలుతోంది. ఇప్పుడు హుజురాబాద్ బైపోల్‌లో ఆ ఓట్ల త‌రాజు ఏ పార్టీ వైపు మొగ్గుతుందో వారిదో విజ‌యం.  కాంగ్రెస్ రేసులోకి రావ‌డంతో.. ఇప్పుడు పార్టీల కంటే అభ్య‌ర్థులే కీల‌కంగా మారారు. మూడు పార్టీల నుంచి ముగ్గురు హేమాహేమీలు రంగంలో ఉన్నారు. ముగ్గురిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థే కాస్త బ‌ల‌హీనం. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు విద్యార్థి నాయ‌కుడిగా మంచి ఇమేజ్ ఉన్నా.. హుజురాబాద్‌లో ఆయ‌న వెనుక ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని దుస్థితి. గెల్లు బ‌రిలో ఉన్నా.. కేసీఆరే పోటీలో ఉన్న‌ట్టు ప్ర‌చారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తును చూసి ఓటు వేయ‌మంటూ వేడుకుంటోంది. అటు, ఈట‌ల‌+బీజేపీ మాత్రం మాంచి జోరు మీదుంది. ఆ జోరుకు ద‌ళిత బంధుతో బ్రేకులు వేయాల‌నేది కేసీఆర్ ఎత్తుగ‌డ‌. అయితే, అది ఆయ‌న‌కే బూమ‌రాంగ్‌గా మారి మిగ‌తా వ‌ర్గాల‌ను దూరం చేసే ప్ర‌మాదం ఏర్ప‌డింది. హుజురాబాద్‌లో ఇంత రాజ‌కీయ డ్రామా న‌డుస్తుండ‌గా.. కాంగ్రెస్‌+రేవంత్‌రెడ్డి+కొండా టీమ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ అమాంతం మారిపోతున్నాయి.  హుజురాబాద్‌లో బ‌ల‌మైన ఓటు బ్యాంకున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి అంద‌రికీ షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇమేజ్ ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్‌. రేవంత్‌రెడ్డిని చూసి ఓట్లేసే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇక‌, తాజాగా హ‌స్తం పార్టీ అభ్య‌ర్థిగా కొండా సురేఖ పేరు ఖ‌రారు కావ‌డం.. కాంగ్రెస్‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్టైంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో కొండా దంప‌తులు ఫుల్‌స్ట్రాంగ్‌. ఎవ‌రిని ఎలా డీల్ చేయాలో.. కొండా ముర‌ళీకి తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీద‌నే టాక్ ఉంది. న‌యానో, భ‌యానో.. అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో కొండా ముర‌ళీ త‌ర్వాతే ఎవ‌రైనా అని అంటారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల్లో కొండా ఆధిప‌త్యం ఉంది. ఇటు రేవంత్‌రెడ్డి ఇమేజ్‌.. అటు కొండా ప‌వ‌ర్ తోడైతే.. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం ప‌క్కా.  ఇక‌, కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో సోష‌ల్ ఇంజ‌నీరింగ్ సైతం అద్భుతంగా ప‌ని చేస్తుంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో బీసీల సంఖ్యే అధికం. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి.. కొండా ముర‌ళీ మున్నూరుకాపు.. ఆ రెండు వ‌ర్గాల ఓట్లు 70వేలకు పైనే ఉన్నాయి. ఆ సంఖ్య ద‌ళిత ఓటు బ్యాంకుకంటే ఎక్కువే. అందుకే ద‌ళిత‌బంధుతో అసూయ‌గా ఉన్న బీసీ వ‌ర్గాలు టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు. ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం.. కారు పార్టీని దెబ్బ‌కొట్టేలా బీజేపీ+ఈట‌ల కాలు దువ్వుతుండ‌టం.. పిల్లి పోరు పిల్లి పోరు మ‌ధ్య‌లో న‌క్క లాభ‌ప‌డిన‌ట్టు.. హుజురాబాద్ గెలుపును కాంగ్రెస్ ఎగ‌రేసుకుపోయినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదంటున్నారు. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డితో హ‌స్తం శ్రేణులు ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడిక కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో కాంగ్రెస్ జోష్ రెట్టింపు అవుతోంది. ఇక కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని రెండేళ్లుగా ర‌గిలిపోతున్న కొండా దంప‌తులు ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి పోరాడ‌టం ఖాయం. కొండాకు రేవంత్‌రెడ్డి అండాదండా తోడై.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు చుక్కులు చూపించ‌డం కూడా ఖాయం..అంటున్నారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కారు గ‌ల్లంతేనా? టీఆర్ఎస్ మూడోస్థానానికే ప‌రిమిత‌మా?

ఇండియా టుడే స‌ర్వేలో సీఎం కేసీఆర్ ర్యాంక్ ఎంత‌? ట‌క్కున చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎక్క‌డో చివ‌రాఖ‌రికి ప‌డిపోయింది కేసీఆర్ ప‌ర‌ప‌తి. అది జాతీయ స‌ర్వే అనుకున్నా.. తాజాగా లోక‌ల్ సంస్థ లోక‌ల్ యాప్ సైతం ఓ స‌ర్వే చేప‌ట్టింది. అందులో మ‌రింత షాకింగ్ రిజ‌ల్ట్స్‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ప‌క్క‌న‌పెడితే.. క‌నీసం సెకండ్ ప్లేస్‌లో కూడా లేర‌ట‌. ఏకంగా మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌యింద‌ట గులాబీ పార్టీ. మ‌రి, ఫ‌స్ట్‌.. సెకండ్ ఎవ‌ర‌నేగా మీ క్వ‌శ్చ‌న్‌. ఇంకెవ‌రు.. వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లో కాంగ్రెస్‌దే విజ‌య‌మ‌ని తేల్చింది లోక‌ల్ యాప్ స‌ర్వే. అనూహ్యంగా బీజేపీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ముచ్చ‌ట్లు మాత్ర‌మే చెప్పే కేసీఆర్‌.. ముచ్చ‌ట‌గా మూడో స్థానంలో వెన‌క‌బ‌డింది కారు పార్టీ. లోక‌ల్ యాప్ లేటెస్ట్‌ స‌ర్వే.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  లోక‌ల్ యాప్ నిర్వ‌హించిన స‌ర్వేలో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు 40 శాతం మంది ఓటేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని 34 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇక అధికార టీఆర్ఎస్‌కు కేవలం 26 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇదే ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. కారు పార్టీకి మూడో స్థానం రావడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. కొంత‌కాలంగా కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అప్పుడూ అదే కేసీఆర్‌.. ఇప్పుడూ అదే కేసీఆర్‌.. అప్పుడూ అవే ప‌థ‌కాలు.. ఇప్పుడూ అవే ప‌థ‌కాలు.. అప్పుడూ వాళ్లే ఎమ్మెల్యేలు ఇప్పుడూ వాళ్లే  మంత్రులు.. కేసీఆర్‌లో కానీ, ప్ర‌భుత్వంలో కానీ, కేబినెట్‌లో కానీ.. ఎలాంటి మార్పు లేదు.. కానీ, జనం మారిపోయారు.. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. చెప్పిందే చెప్పి.. ఇచ్చిన హామీలే ఇచ్చి.. జ‌నాల‌ను ఎంతో కాలం మ‌భ్య‌పెట్ట‌లేరు. క‌రెంటు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ప్ర‌తీసారీ ఓట్లు ప‌డ‌వు. జ‌నం ఇంకా ఏదో కోరుకుంటున్నారు. త‌మ గోడు వినే నాయ‌కుడికి కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్నారు. గ‌జ్వేల్‌, సిరిసిల్లా, సిద్ధిపేట‌ల‌కే కాదు.. త‌మ‌కూ డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కావాల‌ని నిల‌దీస్తున్నారు. కొత్త పింఛ‌న్లు, కొత్త రేష‌న్‌కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలా జ‌నం కోరిక‌లు వేరు.. కేసీఆర్ ఆశ చూపిస్తున్న‌ది వేరు.. ద‌ళిత బంధుతో కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచుతున్నా.. ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల గాయం ఇంకా మాన‌నేలేదు. ద‌ళితబంధును చూసి.. గిరిజ‌ర‌, బీసీ, మైనార్టీ బంధుల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ ప్ర‌భావం కేసీఆర్‌పై ఆక్రోషంగా మారుతోంది. అందుకే, పులిమీద స్వారీ చేస్తూ.. ఆ పులికే బ‌ల‌య్యేలా ఉంది టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప‌రిస్థితి.  ఇన్నాళ్లూ కేసీఆర్‌కు స‌రైన అల్ట‌ర్‌నేట్ లేకుండే. ఇప్పుడ‌లా కాదు.. రేవంత్‌రెడ్డి రూపంలో జ‌నానికో స‌మ‌ర్థుడైన‌ నాయ‌కుడు దొరికాడు. ప్ర‌జ‌ల్లో రేవంత్ క్రేజ్ ఎలా ఉందంటే.. భారీ వ‌ర్షంలోనూ క‌ద‌ల‌కుండా రేవంత్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా వినేంత అభిమానం ఆయ‌న‌పై. అందుకే, రేవంత్ స‌భ పెడితే.. ల‌క్ష‌కు త‌గ్గ‌ట్లేదు జ‌నం. కాంగ్రెస్‌లో మున‌ప‌టి ఉత్తేజం.. కేడ‌ర్‌లో రెట్టించిన ఉత్సాహం.. లోక‌ల్ స‌ర్వేలోనూ అదే స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్‌కే  విజ‌యావ‌కాశాల‌ని తేల్చేసింది.  కాంగ్రెస్ కాక‌పోతే బీజేపీ. టీఆర్ఎస్ మాత్రం వ‌ద్దే వ‌ద్దు.  అన్న‌ట్టు ఉంది ప‌రిస్థితి. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో క‌మ‌ల‌ద‌ళం దూసుకుపోతోంది. కిష‌న్‌రెడ్డి కేంద్ర‌మంత్రి అయ్యాక కేడ‌ర్‌లో జోష్ పెరిగింది.  దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీలో క‌మ‌ల ప్ర‌భంజ‌నం క‌నిపించింది. ఈట‌ల రాజేంద‌ర్  చేరిక‌తో ఉరిమే ఉత్సాహం నెల‌కొంది. ఇలా కేసీఆర్‌కు అల్ట‌ర్‌నేట్‌గా కాంగ్రెస్‌నో, బీజేపీనో ఎంచుకుంటున్నారు ప్ర‌జ‌లు. అంతేగానీ, గులాబీ పాల‌న త‌మ‌కు వ‌ద్దంటూ స‌ర్వేల్లో తేల్చిచెబుతున్నారు. అందుకే, లోక‌ల్ యాప్ స‌ర్వేలో కారు పార్టీ ఏకంగా మూడోస్థానానికి ప‌డిపోవ‌డం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది.   

షరియా చట్టం అంత భయంకరమా? ఆప్ఘన్లపై ఇక అరాచకలేనా? 

ఒక్క ఆఫ్ఘనిస్థాన్ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాలను కూడా తాలిబాన్లు ఎంతగా ఆందోళనకు  గురిచేస్తోందో చూస్తూనే ఉన్నాం. నిజమే, ప్రపంచాన్ని భయపెడుతోంది, తాలిబాన్లు, వారి అరాచక కృత్యాలే అయినా, తాలిబాన్లను నడిపిస్తోంది, శాసిస్తోంది మాత్రం షరియా చట్టం. తాలిబాన్లు ఎంతగా శాంతివచనాలు వల్లించిన, ఆఫ్ఘన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు వారి పేరు వింటేనే గజగజ వణికి పోతున్నారంటే, అందుకూ కారణం కూడా, తాలిబాన్లు కాదు, వారు అమలు చేసే షరియా చట్టమే. అందుకే ఆఫ్ఘన్ మహిళలను షరియా చట్టం చావును మించిన భయానికి గురిచేస్తోంది. తాలిబాన్లు ఓ వంక ఆఫ్ఘన్ మహిళలకు పనిచేసే హక్కు, ఓ  స్థాయి వరకు విద్యా చదువుకునే హక్కు ఉంటుందని అంటూనే, మహిళల హక్కులకు. స్వేచ్చకు కూడా  షరియా చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ఈ షరియా అనే పదం చెవిన పడగానే, 20 ఏళ్ల క్రితం నాటి  భయానక అనుభవాలను గుర్తు తెచ్చుకుని మహిళలు భయంతో వణికి పోతున్నారు.  అయితే, ఆఫ్ఘన్ ప్రజలను మరీ ముఖ్యంగా మహిళలను ఇంతలా భయానికి గురిచేస్తున్న షరియా చట్టం, అంటే ఏంటి? మన దేశంలోనూ కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను వ్యతిరేకించే లౌకిక వాదులు సమర్ధించే షరియా చట్టం ఏమి చెపుతోంది, అసలేంటి ?  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా షరియా చట్టం అంటే ఏమిటని చూస్తే, ఇది ఇస్లామిక్‌ న్యాయ వ్యవస్థ. ఇందులో ముస్లిం పవిత్ర గంథ్రమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలనేది చట్టం సారాంశం. నిజంగా షరియా అంతటి దుర్మార్గ చట్టమా, ముస్లింలు అందరూ ఆచరించి తీరవలసిన చట్టమా, అంటే అవునని,కాదనే రెండు వాదనలు ఉన్నాయి. షరియా చట్టంలో అంతా చెడే కాదు, మంచి కూడా ఉందని, ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు సహా ముస్లింలందరూ పాటించాల్సిన జీవన నియమావళిగా షరియా నిర్దేశిస్తుందని, ఇస్లాం మత పెద్దలు చెపుతారు. షరియా దేవుని కోరికల ప్రకారం ముస్లింలు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని, ఉత్తమ జీవ మార్గాన్ని చూపుతుందని అంటారు. అయితే తాలుబాన్లు, అనిసరించే షరియాలో మాత్రం మంచి మచ్చుకు అయినా కనిపించదు. తాలిబాన్ల షరియా చీకటి దారుల్లోకి తీసుకుపోతుందని కొందరు వాదిస్తారు. షరియా తాలిబాన్ల వెర్షన్, అందులో శిక్షలే కాదు, శిక్షలను బహిరంగా అమలు చేసే పద్దతి కూడా అంతే అమానుషంగా ఉంటుంది.  తాలిబాన్ షరియా ప్రకారం సంగీతం వింటే తప్పు, వీడియోలు చూస్తే పాపం, రోజు ఐదు సార్లు నమాజు చేయక పొతే నేరం, పురుషులు గడ్డం మీద కత్తి పడితే, ఏకంగా పీకే తెగిపోతుంది. మహిళలైతే బుర్జా, హిజాబ్‌ వంటి దుస్తులు ధరించాలి. వీరు ఈ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే, చిన్నా పెద్ద తేడా లేకుండా బహిరంగంగా కాల్చి/కొట్టి  చంపుతారు. అందుకే ఆఫ్ఘన్ మహిళలు షరియా అంటే చావు కేక విన్నతగా భయపడుతున్నారు.   మరోవైపు పైకి శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, ఇప్పటికే మహిళల పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబూల్‌లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ స్త్రీ అయినా బురఖా ధరించాల్సి ఉంటుంది. వారు తమ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మగ బంధువుతో పాటుగా తీసుకురావాలి.స్త్రీ అడుగుజాడలను ఏ పురుషుడు వినకూడదు కాబట్టి మహిళలకు హైహీల్డ్ బూట్లు అనుమతించారు. బహిరంగంగా బిగ్గరగా మాట్లాడేటప్పుడు ఒక మహిళ వాయిస్ అపరిచితుడికి వినిపించకూడదు.  వార్తాపత్రికలు, పుస్తకాలు, దుకాణాలు లేదా ఇంటిలో ఆడవారి ఫోటోలు తీయడం, చిత్రీకరించడం లేదా ప్రదర్శించడం అనుమతించరు. మహిళలు తమ బాల్కనీలలో కనిపించడానికి అనుమతించరు.ఇలా అడుగడుగునా ఆంక్షలు, గీతదాటితే, షరియా చట్ట పరిధిలో అమానుష శిక్షలు ..షరియా చట్టం ప్రకారం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలు  (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది. దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు.ఇవనే కాదు, నేరం ఏదైనా శిక్షలు మాత్రం ఆలాగే, ఉంటాయి. అందుకే తాలిబాన్లు అన్నా, వారు  అమలు  చేసే షరియా అన్నా ఆఫ్ఘన్ మహిళలు భయంతో వణికిపోతున్నారు.

అవంతి, అంబ‌టివి రాస‌లీల‌లేనా? మిమిక్రీ కుట్ర‌లా? ఏది నిజం?

ట్రింగ్‌..ట్రింగ్‌.. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. ఇటునుంచి కాల్ లిఫ్ట్ చేస్తే.. అటునుంచి మంత్రి గారు వాయిస్ వినిపిస్తుంది. తెలిసిన గొంతే కావ‌డంతో.. చాలా క్యాజువ‌ల్‌గా డిష్క‌స‌న్ సాగుతుంది. బాగున్నావా.. ఎక్క‌డున్నావ్ నుంచి మొద‌లై.. వెంట‌నే అస‌లు మేట‌ర్‌లోకి వ‌చ్చేస్తారు మినిస్ట‌ర్ గారు. క‌ట్ చేస్తే.. మంత్రి గారి ఆడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది. మంత్రి అనే కాదు ఇటీవ‌లే ఎమ్మెల్యే విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఆ ఇద్ద‌రు వైసీపీ నేత‌లు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా మారారు. అందులో ఒక‌రు ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అయితే.. మ‌రొక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఆడియో వైర‌ల్ కాగానే.. ఇక సినిమాటిక్ స్టైల్‌లో డ్రామా మొద‌లైపోతుంది. త‌న వాయిస్ త‌న‌ది కాద‌ని.. ఎవ‌రో మిమిక్రీ చేశార‌ని.. వారిపై కేసులు పెడుతున్నాన‌ని.. క్వైట్ కామ‌న్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇందులో మరింత‌ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. త‌న‌పై గిట్ట‌నివారి కుట్ర అంటే.. మంత్రి అవంతి శ్రీనివాస్ విష‌యంలో మాత్రం వైసీపీ వాళ్లే ఇలా ట్రాప్ చేశార‌నే ఆరోప‌ణ వ‌స్తుండ‌టం ఆస‌క్తిక‌రం.  అంబ‌టి రాంబాబు విష‌యంలో ఆడియోకు సంబంధించిన వీడియో లీక్ అయింది. కాల్ రికార్డ్ చేయ‌కుండా వాట్సాప్ కాల్ చేసిన‌ట్టున్నారు. ఆ వాట్సాప్‌ కాల్ స్పీక‌ర్ ఆన్ చేసి.. వేరే మొబైల్‌తో కాల్ మొత్తం రికార్డు చేశారు. అందులో అంబ‌టి వాయిస్‌.. ఆ మ‌హిళ‌ను మ‌సాజ్‌కు ర‌మ్మ‌న‌టం.. ఆమె వేరే అమ్మాయిని పంపిస్తానన‌టం.. బాగుంటుందా.. అన్నీ చేస్తుందా.. ఇలా ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచింది ఆ సంభాష‌ణ‌. మిమిక్రీనే నిజ‌మైతే.. ఇంత నాచుర‌ల్‌గా భ‌లే చేశారు ఎవ‌రో. మిమిక్రీ కాక‌పోతే.. మ‌నోడు మాంచి క‌ళాకారుడే అన్నట్టు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌న్నారు ఎమ్మెల్యే అంబ‌టి. చేశారో లేదో క్లారిటీ లేదుగానీ.. చేసుంటే వారం గ‌డుస్తున్నా ఇంకా ఆ మిమిక్రీ ఆర్టిస్టును ఎందుకు ప‌ట్టుకోలేక‌పోతున్నారో మ‌రి? ఆ వీడియోలో.. అంబ‌టి ఫోటోతో వాట్సాప్ కాల్ నెంబ‌ర్ చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోవ‌డం పోలీసుల‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. మ‌రి ఇంత ఆల‌స్యం ఎందుకు అవుతుందో.. అంబ‌టికే తెలియాలి అంటున్నారు.  ఇక అంబ‌టి ఎపిసోడ్ జ‌రిగిన వారం వ్య‌వ‌ధిలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు సైతం అలాంటి ఇష్యూలోనే బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. అర‌గంట‌లో పంపించేస్తా.. రా.. అంటూ వాయిస్ ఓ ఉమెన్‌ను ట్రాప్ చేయ‌డం.. ఆమె నేనురానంటూ గ‌తంలో బాగా అల‌వాటు ఉన్న‌ట్టే చొర‌వ‌గా నో చెప్ప‌డం..  చాలా నాచుర‌ల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందా ఫోన్ సంభాష‌ణ‌. మంత్రి అవంతి చెప్పిన‌ట్టు అది కుట్రే అయితే.. ఆ కుట్ర చేసిన డ‌బ్బింగ్ ఆర్టిస్టులకు అభినందించాల్సిందే అంటున్నారు. అంబ‌టి లానే అవంతి సైతం వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇదంతా గిట్ట‌నివారి కుట్ర అని తేల్చేశారు. అయితే, అవంతి శ్రీనివాస్‌కు విశాఖ వైసీపీ నేత‌ల‌తో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయ‌ని.. సొంత‌పార్టీలోనే ఎవ‌రో ఈ కుట్ర చేసి ఉంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అవంతి ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. మంత్రి త‌లుచుకుంటే.. ఆ ఆడియో మిమిక్రీ అయితే.. వారిని ప‌ట్టుకోవ‌డం ఎంత సేపు చెప్పండి. నైజీరియా కేటుగాళ్ల‌నే ప‌ట్టుకుంటున్న పోలీసులు.. ఆఫ్ట్రాల్ ఫేక్ కాల్ క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేక పోతున్నారంటే..... అది ఫేక్ కాద‌నా...? ఇలా అనేక అనుమానాలు.  గ‌తంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పృథ్వీ ఆడియో కూడా ఇలానే వైర‌ల్ అయింది. వెన‌క‌నుంచి ప‌ట్టుకుంటా.. అంటూ తెగ ఫేమ‌స్ అయ్యారు. అప్ప‌ట్లో ఆయ‌న సైతం ఆ వాయిస్ త‌న‌ది కాద‌న్నారు. అయినా, ఆయ‌న ప‌ద‌వి పీకేశారు. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అలానే జ‌రిగింది. మ‌రి, అంబ‌టి, అవంతిల‌పై కూడా వేటు వేస్తారా? ఇలాంటి మిమిక్రీ వ్య‌వ‌హారాలు ఇలానే కొన‌సాగితే.. అది ఎందాకైనా దారి తీయొచ్చు. ఎంపీ ర‌ఘురామ అన్న‌ట్టు.. ముందుముందు ర‌ఘురామ వాయిస్‌, సీఎం జ‌గ‌న్ వాయిస్‌ను సైతం ఇమిటేట్ చేస్తూ ఇలాంటి ఆడియోలు రావొచ్చు. అందుకే, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుల వాయిస్‌తో మిమిక్రీ చేస్తూ.. అస‌భ్య వాయిస్ కాల్స్ చేసిన దుర్మార్గుల‌ను వెంట‌నే ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ‌మే వారి చేతిలో ఉంది ఓ మిమిక్రీ ఆర్టిస్ట్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేదంటే.. ఆ ఆడియో వాయిస్‌లు నిజ‌మేనా..? అవంతి, అంబ‌టిలు ఆ టైపేనా..? అనే అనుమానం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.  ఏపీలో ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. నెల క్రితం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో ఇంకా కొందరు నిందుతులు దొరకలేదు. తాజాగా గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమించలేదనే కోపంతో ఓ కిరాతకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలా మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుండగానే.. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేల రాసలీలల ఆడియో, వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. ప్రజా ప్రతినిధులు ఇలా ఉంటే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. సీఎం జగన్ అసమర్ధత వల్లే ఆ పార్టీ నేతలు దిగజారిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన నేతలపై దర్యాప్తు జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.  

గెలుపే లక్ష్యంగా  రేవంత్ సోషల్ ఇంజనీరింగ్.. సక్సెస్ అవుతారా?   

“తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒంటరిగా దూసుకు పోతారే కానీ, నలుగురినీ కలుపుకు పోరు. అందుకే అయన అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో చిక్కుకు పోతారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు దూరంగా ఉండడానికి కూడా ఈ దూకుడు స్వభావమే కారణం” రేవంత్ పోకడలపై కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తున్న తాజా విశ్లేషణ ఇది.  అయితే ఇది నిజమేనా అంటే, కొంతవరకు నిజం. కొంత కాదు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం నిజం. ఒక విధంగా చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి దూకుడు అవసరం. రేవంత్ రెడ్డి దూకుడు చూపుతున్నారు కాబట్టే, రాష్ట్ర రాజకీయాల్లో ‘రైట్ ఆఫ్’  స్టేజికి చేరుకున్న  హస్తం పార్టీ మళ్ళీ లేచికూర్చుంది. గుర్తింపు తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు కాబట్టే, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు, ఒక్కటి తగ్గకుండా లక్ష మందిని సమీకరించగలిగారు. అఫ్కోర్స్ జన సమీకరణలో సీతక్క పేరు చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది, అనుకోండి అది వేరే విషయం.కానీ, దండోరా సభ సక్సెస్’కు మొదటి అడుగు ఆయన దూకుడులోనే ఉంది. అంత భారీ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేని స్థితి నుంచి, సభను సక్సెస్ స్థితికి తీసుకుపోయారంటే , ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా,  అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. చివరకు, అధికార పార్టీలోనూ దడ పుట్టించింది.   దండోరా సభ దడ పుట్టించింది కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయించారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఎమ్మెల్యేలకు కోటా ఫిక్స్ చేసి,ఏసీ బస్సులు పెట్టి, జన సమీకరణ చేశారు. అయినా, ఇంద్రవెల్లి సభ ముందు హుజూరాబాద్ సభ వెలవెల పోయిందనే చెప్పాలి. నిజమే,జనం వచ్చారు, కానీ, ఇంద్రవెల్లిలో కనిపించిన జోష్ హుజూరాబాద్’ లో కనిపించలేదు. అంతే, కాదు హుజూరాబాద్ సభకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు నిరాశగా వేణి దిరిగారు. కొంతమంది అయితే అధికార పార్టీని తిట్టుకుంటూ వెళ్ళడం కూడా కనిపించింది.   సరే అదలా ఉంటే రేవంత్ రెడ్డికి దూకుడే గానీ, ఆలోచన లేదు అనే వాదనలోనూ పస లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఒక పథకం ప్రకారం సోషల్ ఇంగినీరింగ్’ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రావిర్యాలలో నిర్వహించిన గర్జన సభలో తమ దూకుడు  ప్రసంగంలోనూ, ఇటీవల ఐపీఎస్ కొలువు వదులుకుని,బీఎస్పీలో చేరిన  ప్రవీణ్ కుమార పేరు తీసుకున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రవీణ్ కుమార్ మరో ఆరేళ్ల సర్వీస్’తో పాటు  డీజీపీ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా, ఉన్న అవకాశాలను వదులుకుని దళితుల మేలు కోసం రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. అలాగే, ఉద్యోగంలో కొనసాగుతూ, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలు, వివక్షను భరించలేక, దళిత బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కొలివుకు రాజీనామా చేశారని చెప్పారు.ఇలా ప్రవీణ్ కుమార్’ను ఆకాశానికి ఎత్తేయడం, రేవంత్ రెడ్డి రాజకీయ విజ్ఞత, ముందు చూపుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్;లో బీఎస్పీపీ కలిసి సాగేందుకు, రేవంత్ ముందుగానే కర్చీఫ్ వేశారనీ అంటున్నారు.ఇలా కర్చీఫ్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి, కొత్త సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టారనిఅనే మాట కూడా వినవస్తోంది.  అలాగే ఇటీవల పీసీసీ, మైనారిటీ సెల్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు కార్యక్రమలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి, “కాంగ్రెస్ పార్టీ మీదే, ముస్లిం మైనారిటీలదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే”  అంటూ మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని, గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ తెరాస ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కానీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం పేరు కూడా ప్రస్తావించలేదు.  ఇలా అటు దళితులను,ఇటు ముస్లిం మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రేవంత్ దూకుడులోనూ ఒక ఆలోచన, సోషల్ ఇంగినీరింగ్ వ్యూహం  ఉన్నాయని నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరటానికి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలు, అలాగే, బడుగు బలహీన వర్గాలు పార్టీకి దూరం కావడమే అనేది ఒక చారిత్రక సత్యం. రేవంత్ ప్రస్తుత ప్రయత్నాలను జాగ్రత్తగ గమనిస్తే, ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే రాజకీయ విజ్ఞతను చూపుతున్నారనిపిస్తుంది. దూరమైనా ఒక్కొక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుని ‘సోషల్ ఇంగినీరింగ్’ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం  భావిస్తున్నారు. అయితే, సోషల్ ఇంగినీరింగ్ ప్రయత్నాలలో అయన సక్సెస్ అవుతారా, అంటే అది వేరే విషయం, వేరే చర్చ అంటున్నారు విశ్లేషకులు. 

వైఎస్ వివేకా హంతకులెవరు? ఆచూకీ చెబితే 5 లక్షల నజరానా..

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. రెండున్నర నెలలుగా కడపలోనే మకాం వేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు  శుక్రవారం ఒకరిని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే ఇతడిని పలుమార్లు విచారించారు. శనివారం కూడా మరికొందరిని విచారణకు పిలిచారు.  వైఎస్సార్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీసీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని మొదటిసారిగా విచారణకు పిలిపించారు. మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారుల్ని కలిశారు.. దాదాపు 4 గంటలకుపైగా వారితో భేటీ అయ్యారు. 2019 మార్చి 15 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఏపీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వివేకా కుమార్తే అభ్యర్థనతో హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 2020 జూన్ 9న ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కరోనా కారణంగా కొన్నాళ్లు ఏపీకి నేరుగా వచ్చి విచారణ చేపట్టలేదు. ఇటీవల ఏపీకి వచ్చి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ యాదవ్ అనే పేరు మాత్రమే ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం గాలించారు. 

పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్! అప్పుల భారంతో కష్టాలు... 

గ్రామానికి పెద్ద సర్పంచ్. ఊర్లోని గ్రామస్తుల మంచిచెడులు చూసుకోవాల్సింది ఆయనే. అలాంటి సర్పంచ్ కు కష్టమెస్తే. తెలంగాణలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.  టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. సర్కార్ నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసిన కొందరు సర్పంచ్ లు.. వాటి బిల్లులు రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారని చెబుతున్నారు. దీంతో కొందరు సర్పంచ్ లు గ్రామం కోసం తన సొంత పొలాన్ని అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. మరికొందరు పొట్టకూటి కోసం ఇతర పనులు చేస్తున్నారు.  ఉదయం పూట సర్పంచ్ కుర్చీలో.. రాత్రివేళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కొందరు.  సర్పంచ్ లు  పరిస్థితి, దయనీయతను చూసి గ్రామస్తులు సైతం అయ్యో పాపం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బండి ఇరుసు మల్లేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సర్పంచ్ సీటు ఎస్సీకి రిజర్వు కావడంతో ఎక్కువమంది పోటీలో నిలిచారు. దీంతో ఎస్సీ కులస్తులు, గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులు అందరి పేర్లను రాసి చిటీలు తీయగా ఇరుసు మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గతంలో గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలానే ఉండిపోయాయి. చివరికు సర్పంచ్ అప్పుల పాలై తనకున్న రెండెకరాల్లో అరఎకరం భూమిని అమ్ముకుని అప్పులన్నీ తీర్చేశాడు. టీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లకు గౌరవ వేతనంగా ఇచ్చే ఐదువేల రూపాయలు సైతం నెలనెలా ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో ఆరెపల్లి గ్రామ  సర్పంచ్ ఇరుసు మల్లేష్.. చివరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్‌లో రాత్రి వాచ్‌మెన్ విధుల్లో చేరాడు. ఉదయం పూట సర్పంచ్‌గా గ్రామంలో సేవలందిస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చూసుకుంటున్నాడు. గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ గ్రామంలో కలిసి ఉండేది. 2018 సర్పంచ్ ఎన్నికల్లో ఆరెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం గ్రామ జనాభా 434 కాగా, గ్రామానికి నెలసరి ఎస్ఎఫ్‌సీ నిధులు రూ.37 వేల రూపాయలు జనాభా ప్రాతిపదికన వస్తాయని తెలిపారు. అయితే, గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, నాలుగో విడత పల్లెప్రగతి కోసం చేపట్టే పనులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాటు మంజూరైన కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వడంతోనే సరిపోతోందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో తనకున్న రెండెకరాల పొలంలో అరెకరం పొలం అమ్మేసి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించారు. జిల్లా కలెక్టర్‌కు ఈ విషయంపై విన్నవించగా గ్రామానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్, కార్యదర్శులు పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని సర్పంచ్ వాపోయారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడా గ్రామ పరిస్థితిపై వివరించగా ఆయన కూడా స్పందించలేదు. దీంతో తానే తన పొలం అమ్మేసి బిల్లులు చెల్లించి, కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రుళ్లు సెక్యూరిటీ గార్డు జాబ్ చేస్తున్నట్టు చెప్పారు. 

ఓణం పండుగ విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి? 

ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ. మలయళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు – సెప్టెంబర్) వస్తుంది. మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అంటారు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు. ఓణం ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది.  ఇది కేరళ యొక్క ఆచారములు , సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు , భోజనం , సర్పాకారపు పడవ పందెములు , కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు , ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు.  మగవారు ఒక చొక్కా , ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను , స్త్రీలు ముండు , నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ , రవికె ధరిస్తారు.  ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ , వర్షపు పువ్వుల పండుగ , పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.  చరిత్ర ప్రకారం , మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా , సిరిసంపదలతో ఉన్నారు , ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ , మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి , తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు.  ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు , తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు  కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో , ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది , ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.   ఓణంలో ఆకట్టుకునే మరోక ముఖ్య విశేషం  వల్లంకలి  అనబడే సర్పాకారపు పడవల పందెము , ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ , అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.  ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది , ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు , కయ్యంకలి , అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో , పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి , తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి , పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి. ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు , ఓణం సద్య , అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు , అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు , చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది. దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి. ఓణం సమయంలో , ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు , దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో , ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక , సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి. వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల బోటు రేసు , నెహ్రూ ట్రోఫీ బోటు రేసు ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి , అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు , ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి , దూర ప్రాంతముల నుండి స్త్రీలు , పురుషులు వస్తారు. వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో , కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు.  కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ , ఈనాడు ఈ పండుగను హిందువులు , ముస్లిములు , క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు. ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి. దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు. త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.

సంక్షేమంతో సంక్షోభం.. సీఎం జ‌గ‌న్‌పై వైసీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది.. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారు.. జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ. 2.56 లక్షల కోట్లు అప్పు చేశారు.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచుతున్నారు.. రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసి ప్రభుత్వం చేసే సంక్షేమం ఎల్లకాలం నిలబడదంటూ వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జ‌గ‌న్‌కు హిత‌వు ప‌లికారు.  20వ తేదీ వచ్చినా ఇంకా 20శాతం మందికి వేతనాలు చెల్లించలేదన్నారు. ఉద్యోగులకు పీఎఫ్‌ వేతనాల్లో కోత విధించి ఆ డబ్బులను వాడేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేయకపోగా.. ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల్లో కోత విధిస్తోందని విమర్శించారు. ఆర్థికంగా ఏపీ అస్తమిస్తోంద‌న్నారు. ఉన్న పరిశ్రమలనే వెళ్లగొడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరుగుతుందని రఘురామ నిలదీశారు.   ర‌ఘురామ‌.  ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని జ‌గ‌న్ స‌ర్కారుపై మండిప‌డ్డారు.  సీఎం వస్తేనే సచివాలయానికి మంత్రులు వస్తున్నారని.. అందుకే, ముఖ్య‌మంత్రి జగన్‌ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌.    

లీట‌ర్ పెట్రోల్ రూ.50కే.. బీజేపీ నేత అద్భుత స‌ల‌హా..!

సెంచ‌రీ కొట్టిన పెట్రోల్ ధ‌ర ప్ర‌జ‌ల పైస‌లు పీల్చేస్తోంది. పెరుగుడే కానీ త‌గ్గుడు తెలీద‌న్న‌ట్టు పైపైకి ఎగుస్తోంది. పెట్రోల్ మంట కంటే.. పెట్రోల్ ధ‌ర‌నే ఎక్కువ‌గా మండుతోంది. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల బీజేపీ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తోంది. క‌మ‌ల‌నాథులు ఎక్క‌డ క‌నిపించినా.. పెట్రోల్ రేట్ల‌పైనే విరుచుకుప‌డుతున్నారు జ‌నాలు. తాజాగా, ఓ జ‌ర్న‌లిస్ట్ బీజేపీ నాయ‌కుడిని ఇదే అంశంపై ప్ర‌శ్నించారు. అందుకు ఆ బీజేపీ నేత ఇచ్చిన ఆన్స‌ర్ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. ఆ లీడ‌ర్ నోటిదురుసుపై నెటిజ‌న్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.  మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా బీజేపీ నేత రామ్‌రతన్‌ పాయల్‌ను పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఓ జర్నలిస్టు ప్ర‌శ్నించారు. అంతే, ఆ నాయ‌కుడికి తెగ కోపం వ‌చ్చేసింది. క‌స్సుమంటూ ఆ రిపోర్ట‌ర్‌పై చెల‌రేగిపోయారు. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే... ‘‘అఫ్గానిస్థాన్‌ వెళ్లవయ్యా. అక్కడైతే లీటర్ పెట్రోల్‌ 50 రూపాయలకే దొరుకుతుంది. వెళ్లి అక్కడే పోయించుకుని రా. అక్కడ ఎవరూ పోయించుకోవడం లేదు కూడా. ఇక్కడైతే కనీసం పెట్రోల్‌ పోయించుకునే స్వేచ్ఛ ఉంది’’ అంటూ మండిప‌డ్డారు. అక్క‌డితో ఆగ‌లేదు ఆయ‌న‌.. త‌న వాగ్ధాటిని కంటిన్యూ చేస్తూ....   ‘‘ఇప్పటికే రెండు దశల్లో కరోనా విజృంభణతో దేశం అల్లాడిపోయింది. దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మూడో దశ వస్తుందని కూడా చెబుతున్నారు. ఈ టైమ్‌లో పెట్రోల్‌ గురించి మాట్లాడతావేంటయ్యా!’’ అంటూ ఆ జ‌ర్న‌లిస్ట్‌కు క్లాస్ ఇచ్చారు. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కేంద్రంపై జ‌నాలు భ‌గ్గుమంటుంటే.. ఆ ఫ్ర‌స్టేష‌న్‌ను త‌ట్టుకోలేక క‌మ‌ల‌నాథులు ఇలా ప్ర‌శ్నించే వారిపై ఫైర్ అవుతున్నారు. ఆ సంద‌ర్భంగా ఇలా నోటికొచ్చిన‌ట్టు వాగుతూ.. మ‌రింత విమ‌ర్శ‌ల పాల‌వుతూ.. బీజేపీని మ‌రింత బ‌ద్నామ్ చేస్తున్నారు.  మ‌రో విష‌యం ఏంటంటే.. ఆ బీజేపీ నేత క‌నీసం మాస్కు కూడా పెట్టుకోలేదు. ఆయ‌న చుట్టూ ఉన్న అనుచ‌రులు సైతం మాస్కులు ధ‌రించ‌లేదు. కానీ, ప్రజలెవరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదంటూ ఆ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ బీజేపీ నాయ‌కుడు ఇచ్చిన స్పీచ్‌పై నెటిజ‌న్లు కామెంట్ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు.   

ఏపీలో టీడీపీ.. తెలంగాణలో హస్తానికి అధికారం ! తెలుగు రాష్ట్రాల్లో సర్వే సంచలనం.. 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. తమకు ఎదురు లేదని భావించిన రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికార పార్టీలపై రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతుండగా... విపక్షాల గ్రాఫ్ దూసుకుపోతోంది. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనపై ఓ రేంజ్ లో ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇటీవల జాతీయ స్థాయిలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్, స్టేట్స్ సర్వేల్లోనూ ఇదే ఫలితం వచ్చింది. జగన్ రెడ్డి పాలన బాగుందని కేవలం ఆరు శాతం ప్రజలు మాత్రమే చెప్పారంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇక తెలంగాణలోనూ కేసీఆర్ ది అదే పరిస్థితి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ లోకల్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ సంచలన ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీలపై తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు భంగపాటు తప్పదని తేలింది. ఏపీలో రెండు పార్టీల మధ్యే పోటీ కనిపించగా... తెలంగాణలో మాత్రం త్రిముఖ పోరు సాగనుందని సర్వే ఫలితాలను బట్టి అర్ధమవుతోంది.  ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వెనుకబడిపోగా.. తెలంగాణలో అయితే ప్రస్తుతం పవర్ లో ఉన్న పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం సంచలనంగా కనిపిస్తోంది.  2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 151 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన  స్థానిక ఎన్నికల్లోనూ అధికార పార్టీ భారీ ఆధిక్యాన్ని కనపరిచింది. తిరుపతి ఉప ఎన్నికలో దిమ్మతిరిగే మెజార్టీ సొంతం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త డీలా పడిన ప్రతిపక్ష  టీడీపీ.. ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ అయింది. నిత్యం ఏదో అంశంలో జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఏపీలో సమస్యలు కూడా అలానే ఉన్నాయి. జగన్ పాలన అస్తవ్యస్థంగా ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ ఇమేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. లోకల్ యాప్ సర్వేలోనూ ఇదే స్పష్టమైంది.  రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు టీడీపీకే ఎక్కువ ఓట్లు వేశారు ఏపీ జనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందని 44 శాతం మంది తమ అభిప్రాయం చెప్పగా..  వైసీపీ అధికారంలోకి వస్తుందని 43 శాతం మంది చెప్పారు. బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తుందని 13.05 శాతం మంది యూజర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతానికి పైగా ఓట్లు రాగా టీడీపీ కేవలం 37 శాతం ఓట్లు వచ్చాయి. లోకల్ యాప్ సర్వేలో టీడీపీకి గతంలో కంటే ఏడు శాతం ఓట్లు పెరగగా.. వైసీపీకి ఏడు శాతం ఓట్లు తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో వైసీపీ ఓట్ల శాతం  మరింతగా తగ్గవచ్చని సర్వే నిర్వహించిన ప్రతినిధులు అంచనా వేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నది లోకల్ యాప్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. వరుసగా రెండో సారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు దక్కించుకుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల తర్వాత సీన్ మరింతగా మారిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దీంతో 119 సభ్యులన్న తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు సభ్యులే మిగిలారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కారు పార్టీనే దూసుకుపోయింది. అయితే కొన్ని రోజులుగా మాత్రం సమీకరణలు మారిపోయాయి. కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే విపక్షాలు ఎక్కడ ఆందోళన కార్యక్రమం చేసినా.. సభ పెట్టినా ప్రజలు పోటెత్తుతున్నారు.  లోకల్ యాప్ సర్వేలోనూ కేసీఆర్ సర్కార్ పరిస్థితి దారుణంగా ఉందని స్పష్టమైంది. అధికార పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు తెలంగాణ ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు 40 శాతం మంది ఓటేయగా.. అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తుందని 34 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇక అధికార టీఆర్ఎస్ కు కేవలం 26 శాతం ఓటర్ల మద్దతు మాత్రమే వచ్చింది. ఇదే ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. టీఆర్ఎస్ కు మూడో స్థానం రావడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోందని, కేసీఆర్ వ్యతిరేకులంతా ఆయనతో ర్యాలీ అవుతున్నారని సర్వేలో తేలింది. ఇదే ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ ఆధిక్యం మరింతగా పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇండియా ఎంబసీలో సోదాలు.. అప్ఘన్ లో తాలిబన్ల అరాచకాలు..

రక్తం చుక్క చిందకుండా  కాబూల్ ను కైవసం చేసుకున్నామని, మాటల్లో  శాంతి కపోతాలను ఎగరేసి, ఇక పై తమ పంధా అదే అని నమ్మబలికిన తాలిబాన్లు.. ఇంతలోనే రక్తం రుచి మరిగిన తమ పంధా మారదని నిరూపించుకున్నారు. ఇంతవరకు ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం అధికారికంగా ఏర్పడలేదు. కానీ, ఇంతలోనే అరాచకానికి తెరతీసారు. మర్డర్లు, మాన భంగాలు, బహిరంగ శిక్షలు మాములుగానే మొదలయ్యాయి.   మేము మారిపోయాం, మా మాట నమ్మండి, మా పాలను గుర్తించండి అని ప్రప్రంచ దేశాలను కోరుతున్న తాలిబాన్లు, భారత దేశం సహా వివిద దేశాల రాయబార కార్యాలయాలలోకి చొరబడి సోదాలు చేస్తున్నారు. తాలిబాన్లు అరాచకాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ముందుగానే ఉహించిన వివిద దేశాలలు తమా రాయబార కార్యాలయాలకు తాళాలు వేశాయి. రాయబార కార్యాలయాల సిబ్బంది, స్వదేశాలకు వెళ్ళిపోయారు. ఇదే అదనుగా, ఓ వంక శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్దంగా, భారత దేశం సహా  పలు దేశాల రాయబార కార్యాలయాల తాళాలు పగలగొట్టి లోపల చొరబడి విద్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ విద్వంస, ద్వంస రచనలో భాగంగా, కాంద‌హార్, హెరాత్‌ నగరాల్లోని  భార‌త దౌత్య కార్యాల‌యాలలోకి చొరబడి, గంటల తరబడి సోదాలు చేశారు. తాలిబాన్ల ముట్టడికి ముందు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించింది. ఆదేశంలో పెద్ద ఎత్తున పెతుబడులు పెట్టింది. ఆ కారణంగా కావచ్చు, భారత  రాయబార కార్యాలయాల్లో తాలిబాన్లు పెద్ద ఎత్తున సోదాలు చేసారు.   ఆ త‌ర్వాత బ‌య‌ట పార్క్ చేసి ఉన్నవాహ‌నాల‌ను ఎత్తుకెళ్లారు.దీంతో, తాలిబాన్లు, మారలేదు, మారరు అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. గతంలో నాటో ద‌ళాల‌తో కలిసి పని చేసిన వారో కోసం తాల్బాన్లు జల్లెడ పడుతునంరు. దొరికిన వారిని దొరికినట్లు, కిరాతకంగా ఉరికంబం ఎక్కిస్తున్నారని సమాచారం. శతృశేషం మిగలకుండా చేసేందుక ఇల్లిల్లీ గాలిస్తున్నారు. మహిళలు టార్గెట్’గానూ దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో ఆధారాలతో కూడిన కథనాలు వస్తున్నాయి.  మరోవైపు గురువారం ఆఫ్ఘాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాలిబాన్లు మారణహోమమే   సృష్టించారు. అసదాబాద్‌ నగరంలో కొందరు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో రెచ్చిపోయిన తాలిబన్ మూకలు వారిపై తూటాల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. బుధవారం జలాలాబాద్‌ లో తమకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై కూడా తాలిబన్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో  ముగ్గురు మరణించారు.  ఇదిలా ఉంటే మన దేశంలో అసదుద్దీన్ ఒవైసీ వంటి కొందరు, శాంతి కాముకులు మాత్రం భారత ప్రభుత్వం తాలిబాన్లతో చర్చలు జరపాలని సలహా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, మా దేశానికి తాలిబాన్ల కంటే, దేశీయ తాలిబాన్ల వల్లనే, ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, నెటిజన్లు శాంతి కముకులకు చురకలు అంటిస్తున్నారు

సీబీఐ బోనులో మమతా దీదీ..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ  నాయకులు కార్యకర్తల మధ్య మాటల  యుద్ధం జరిగింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడితో ఎన్నికల యుద్ధం ముగిసింది. కానీ, ఆ వెంటనే రాజకీయ యుద్ధం మొదలైంది. అనూహ్యంగా అద్భుత విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల విజయం తెచ్చి పెట్టిన ఉత్సాహం, ఎన్నికల సందర్భంగా ఎదురైన చిన్నపాటి ఎదురు దెబ్బల తాలూకు అవమానాలను జతచేసి కత్తులు తీశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల పై యుద్దాన్ని ప్రకటించారు.తాలిబాన్ల తరహాలో దాడులకు తల పడ్డారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో సాముహిక మానభంగానికి గురైన ఓ 17 ఏళ్ల బాలిక సహా ఇతర బాధితులు  సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటీషన్ల ప్రకారం, అలాగే రాష్ట్ర హై కోర్టులోదాఖలైన అనేక పిటీషన్ల ప్రకారం గృహ దహనాలు, మానభంగాలు, బహిరంగంగా రాళ్ళతో కొట్టి, చెట్లకు కట్టి చంపడం వంటి భయంకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి, ఎన్నికల అనతరం హింస జరిగిందని, రాజకీయ హత్యలు జరిగాయని, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే ముందుగా అంగీకరించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆమె పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం తరపున నష్ట పరుహారం ప్రకటించారు. కానీ,ఎన్నికల అనంతర హింసపై సీబీఐవిచారణకే, కాదు అసలు ఎలాంటి విచారణకు అంగీకరించలేదు. అంతే కాదు, హింసాత్మక  సంఘటనలు జరిగిన ప్రాంతాలలో పర్యటించిన, బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించలేదు,  , చివరకు గవర్నర్ పర్యటనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటనలను తృణమూల్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కమిషన్ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదులు అందాయి, అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హింస ఒక రొటీన్ వ్యవహారం అన్నట్లుగా మమతా బెనర్జీ, తేలిగ్గా తీసుకున్నారు.  చివరకు తృణమూల్ హింస రచన విషయం రాష్ట్ర హై కోర్టుకు చేరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన నేరాలు, ఘోరలపై సీబీఐ విచారణ జరిపించాలని, కోరుతూ దాఖలైన అనేక పిటీషన్లపై విచారణ జరిపిన కలకత్తా హై కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.  ఇందులో, హత్యలు, మహిళలపై జరిగిన దాడులకు సంబదించిన ఆరోపణలఫై సీబీసి విచారణ జరిపించాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇతర కేసుల విచారణకు న్యాయ స్థానం పశ్చిమ బెంగాల్ క్యాడర్’కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో, ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసింది. గతంలో,  హై కోర్ట్ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతర హింసపై విచారణ జరిపిన జాతీయ మానవహక్కుల సంఘం, సీబీఐ విచారణ సిఫార్సు చేస్తూ జూలై 13న, న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు గురువారం తీర్పు నిచ్చింది.  ఇక అసలు విషయంలోకి వస్తే, రాష్టంలో హింస జరగడం ఒకెత్తు, అయితే, తీర్పులో  న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల అనంతర చెలరేగిన హింస విషయంలో, అసలు విచారణే అవసరం లేదన్నట్లుగా వ్యహరించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చెంప పెట్టులా ఉన్నాయని రాజాకీయ పరిశీలకులు భావిస్తున్నారు. న్యాయమూర్తులు, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ ఐపీ ముఖర్జీ, జస్టిస్ హరీష్ టాండన్, జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ సుబ్రతా తలుక్దార్ టం తీర్పులో, “ హత్య, మానభంగం వంటి హేయమైన నేరాలపై, స్వతంత్ర నేర పరిశోధన సంస్థ, ప్రస్తుత పరిస్థితులలో సీబీఐ, విచారణ అవసరం..అనేక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో కూడా విఫలమైంది. ఇది, విచారణను పక్కదోవ పట్టించే ముందస్తు ప్రణాళికను తెలియచేస్తుంది” అని పేర్కొంది. అందుకే అంతిమ తీర్పు ఎలా  ఉన్నప్పటికీ, హై కోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మింగుడు పడక పోవచ్చును. ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉంది.  ఇంతవరకు అయితే ఆమె హై కోర్టు ఆదేశాలపై మౌనంగానే ఉన్నారు. ఇక ముందు ఎలా స్పందిస్తారు,విచారణ ఏ మలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

రేవంత్‌రెడ్డితో 'కొండా' కిరికిరి.. అందుకు ఓకే అంటేనే హుజురాబాద్‌లో పోటీ!

హుజురాబాద్‌లో గెలుపెవ‌రిది? చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ సాగుతోంద‌క్క‌డ‌. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల ఎపిసోడ్ రంజుగా న‌డుస్తోంది. ఆ ఇద్ద‌రు పోటుగాళ్ల పొట్లాట‌లో మ‌ధ్య‌లో దూరితే.. అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే, కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా ఆల‌స్యం చేస్తోంది. పోటుగాడనుకున్న‌ కౌశిక్‌రెడ్డి.. హ‌స్తానికి హ్యాండిచ్చి కారెక్కేయ‌డంతో కాంగ్రెస్‌కు కేండిడేట్ లేకుండా పోయాడు. అందుకే రేసుగుర్రం కోసం పీసీసీ పెద్ద‌లు వేట మొద‌లుపెట్టారు. కొండా సురేఖ అయితేనే.. రాణిరుద్ర‌మ‌లా హుజురాబాద్‌లొ యుద్ధ చేయ‌గ‌ల‌ర‌ని దాదాపు డిసైడ్ అయ్యారు. అయితే, యుద్దానికి సిద్ధ‌మే, కానీ..... మా కండీష‌న్స్ ఇవి అంటూ అధిష్టానం ముందు కొండా ఫ్యామిలీ కొన్ని కొర్రీలు పెట్టింద‌ని తెలుస్తోంది. వాటికి సైతం పీసీసీ ఓకే అన్న‌ట్టు స‌మాచారం.  అస‌లే.. కొండా దంప‌తులు. కాంగ్రెస్‌కు కొరుకుడుప‌డ‌ని నేత‌లు. పార్టీలో ఉంటార‌నే పేరే గానీ.. ఎప్పుడూ పార్టీని ప‌ట్టించుకున్న పాపాన పోరు. త‌మ ఇలాఖాను తాము పరిపాలించుకుంటారంతే. అక్క‌డ వారు చెప్పిందే చెల్లుబాటు అవుతుంద‌ని అంటారు. ఇలా ఏళ్ల త‌ర‌బ‌డి శాయంపేట‌, ప‌ర‌కాల‌ల‌ను ఏలిన కొండా ఫ్యామిలీ.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరి.. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ‌, ఎమ్మెల్సీగా కొండా ముర‌ళీ గెలిచారు. ఐదేళ్లు వ‌రంగ‌ల్ సిటీలో ఆగ‌మాగం చేశార‌ని చెబుతారు. కాంగ్రెస్ స్టైల్ పాలిటిక్స్ గులాబీ బాస్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఇవ్వ‌లేదు. వెంట‌నే మ‌ళ్లీ హ‌స్తం కండువా క‌ప్పేసుకొని.. వ‌రంగ‌ల్ నుంచి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ప‌ర‌కాల సిఫ్ట్ అయిపోయి.. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీచేసి.. ఓడిపోయారు. ఓట‌మి భారంతో హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకుంటూ.. కాంగ్రెస్‌లో కామ్‌గా ఉండిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావ‌డం.. కొండా సురేఖ ఇంటికెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు కోర‌డంతో.. పార్టీలో మ‌ళ్లీ కొండా డిమాండ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ ప్రాంతంపై కొండా దంప‌తుల‌కు ప‌ట్టు ఉండ‌టంతో.. కాంగ్రెస్ త‌ర‌ఫున కొండా సురేఖ‌ను బ‌రిలోకి దింపాల‌ని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.  ఓట‌మికి బెద‌ర‌ని, భ‌య‌ప‌డ‌ని కొండా దంప‌తులు హుజురాబాద్ స‌వాల్‌ను స్వీక‌రించేందుకు సై అంటున్నారు. కాక‌పోతే వారు కొన్ని కండీష‌న్స్ పెడుతున్నార‌ని అంటున్నారు. గెలిచినా, ఓడినా ఇప్పుడు హుజురాబాద్ బ‌రితో దిగుతాం.. అందుకు ప్ర‌తిఫ‌లంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, భూపాల‌ప‌ల్లి సీట్లు ఇవ్వాలనేది వారి డిమాండ్‌. కొండా సురేఖ‌, కొండా ముర‌ళిల‌తో పాటు వ‌చ్చేసారి వారి కూతురు సుష్మిత సైతం రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకే, త‌మ కుటుంబానికి ఆ మూడు సీట్లు ఇస్తానంటేనే.. ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేసి స‌త్తా చాటుతామ‌ని కిరికిరి పెట్టార‌ట‌. ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పుల విష‌యంలో పీసీసీ సైతం స‌రేన‌న్నా.. భూపాల‌ప‌ల్లి సీటులో మాత్రం కాస్త కాంట్ర‌వ‌ర్సీ వ‌చ్చింద‌ట‌. ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొచ్చిన గండ్రా స‌త్య‌నారాయ‌ణ భూపాల‌ప‌ల్లిలో బ‌ల‌మైన నాయ‌కుడు. ఆయ‌న అక్క‌డి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గండ్ర‌ను కాద‌ని కొండాకు ఇవ్వడం.. అదీకాకుండా ఎంత గెలిచే స‌త్తా ఉన్నా.. ఒకే ఫ్యామిలీకి మూడు సీట్లు ఇవ్వ‌డం కాస్త ఇబ్బందిక‌ర‌మేనంటున్నారు. కొండా దంప‌తులు మాత్రం త‌మ‌కు ఆ మూడు అసెంబ్లీ స్థానాలు ఇస్తానంటేనే.. హుజురాబాద్‌లో పోటీ చేస్తామంటోంది.  హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి, కొండా ముర‌ళి మున్నూరుకాపు కావ‌డంతో.. పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ ఆ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు కాంగ్రెస్‌కే ప‌డుతాయ‌నేది రేవంత్‌రెడ్డి లెక్క‌. పైగా మ‌హిళా అభ్య‌ర్థి. అందుకే, మిగ‌తా పీసీసీ స‌భ్యుల‌ను ఒప్పించి మ‌రీ కొండా కండీష‌న్స్‌కు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ పేరు అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే.. హుజురాబాద్‌లో ట్ర‌యాంగిల్ వార్ రంజుగా సాగ‌డం ఖాయం. 

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్.. తన కల నెరవేరిందన్న సీజేఐ 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో ప్రఖ్యాత కార్యాలయానికి వేదికవుతోంది. అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రం ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఆర్బిట్రేషన్ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణ చ‌రిత్ర‌లోనూ, హైద‌రాబాద్ చ‌రిత్ర లోనూ ఈ రోజు గొప్ప‌దినంగా నిలిచిపోతుంద‌ని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని  సీజేఐ  జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.   3 నెల‌ల స‌మ‌యంలోనే త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌న్నారు.  త‌న క‌ల నిజ‌మ‌య్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీజే హిమా కోహ్లీకి ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జూన్‌లో హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని, ఆ స‌మ‌యంలో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ గురించి చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడిన‌ట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సెంట‌ర్ గురించి అంద‌రికీ తెలిసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న‌ తెలంగాణ చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీని కోరారు.ఈ మీడియేష‌న్ సెంట‌ర్ ను ఎలా వాడుకోవాల‌న్న దానిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.  ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని, ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడా తప్పుతుందన్నారు.ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ ఏర్పాటులో తెలంగాణ స‌హ‌కారం మ‌రువ‌లేమ‌న్నారు.  ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు అయితే అంత‌ర్జాతీయ ఆర్బిట్రేట‌ర్లు ఇక్క‌డ‌కు వ‌స్తార‌న్నారు జస్టిస్ ఎన్వీ రమణ. పెట్టుబుడిదారులు వివాదాలు లేని వాణిజ్యాన్ని కోరుకుంటున్నార‌ని, అలాంటి వాళ్ల‌కు ఈ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సీజే తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు చీఫ్ జ‌స్టిస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సెంట‌ర్ ఫంక్ష‌నింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ స‌క్సెస్ కావాల‌ని ఆయ‌న కోరుకున్నారు. కేవ‌లం అంత‌ర్జాతీయ ఇన్వెస్టెర్లే కాదు, స్థానిక పెట్టుబ‌డిదారుల వివాదాల‌ను కూడా ఇక్క‌డ ప‌రిష్క‌రిస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

తాలిబన్ మద్దతుదారులకు టీఆర్ఎస్ సపోర్ట్! బీజేపీ జాతీయ నేత సంచలనం..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పోరాటంలో దూకుడు పెంచింది బీజేపీ. కేసీఆర్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు కమలం నేతలు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్ పాతబస్తిలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలు కాబోతోంది బండి యాత్ర. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తన పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళతానంటున్నారు బండి సంజయ్. బండి సంజయ్ పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ సర్కార్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని మురళీధర్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే విధానం, కేటాయించే సమయాలు తగ్గిపోతున్నాయని దీని వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రాజకీయ అవకాశాలు తగ్గి కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా కాని భర్తీ చేయడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో  లేని దుస్థితికి రాష్ట్రం దిగజారిందని చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో... ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉందని... అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని తెలిపారు యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని... 2019 నాటికి 2.70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని... కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారని... టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నాయకులు తాలిబన్‌లకు సపోర్ట్ చేసేలా ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు.  ఆగస్ట్ 10 వరకు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. 2019 వరకు 2లక్షల ఇండ్లు నిర్మాణం కావలసి ఉండగా ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారని మురళీధర్ రావు చెప్పారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్, నల్గొండ లో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అవినీతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ అని ఆరోపించారు. మూసినది లో ఉన్న కాలుష్యం లా టీఆరెస్ లో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఓడించగలదన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని చెప్పారు. బీజేపీ బలోపేతమై తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు.

వైసీపీకి ఆడ‌పిల్ల‌ల ఉసురు!.. జ‌గ‌న్ స‌ర్కారుపై లోకేశ్ మండిపాటు..

ఏపీలో మ‌హిళ‌ల‌పై వ‌రుస‌గా జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యం వ‌ల్లే రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళలపై అరాచ‌కాల‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. గుంటూరులో ర‌మ్య నేల‌కొరిగితే..  అదే గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి అఘాయిత్యానికి గురైందన్నారు. తాజాగా, విజ‌య‌న‌గ‌రం జిల్లా చౌడ‌వాడ‌లో ఉన్మాది పెట్రోల్ పోసి యువ‌తిని త‌గుల‌బెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేశ్‌.  లేని దిశ చ‌ట్టం.. రక్షించ‌లేని దిశ యాప్ పేరుతో ప్ర‌భుత్వం ఆర్బాటంగా ప్రచారం చేయడం సిగ్గు చేటని విమర్శించారు లోకేశ్‌. నిందితుల్ని ప‌ట్టుకుని శిక్షించ‌డంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆడ‌పిల్లల ఉసురు త‌గిలితే వైసీపీకి, ఈ రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్‌ హితవు పలికారు.    ఏపీలో వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్‌ మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్నవారూ అత్యాచారానికి గుర‌య్యారని ఆరోపించారు. వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భ‌ద్రత లేదని, అంతా భయం భయంగా బతుకుతున్నారని మండిప‌డ్డారు నారా లోకేశ్‌.