సంక్షేమంతో సంక్షోభం.. సీఎం జగన్‌పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
posted on Aug 20, 2021 @ 8:34PM
ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది.. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం వచ్చాక రూ. 2.56 లక్షల కోట్లు అప్పు చేశారు.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచుతున్నారు.. రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేసి ప్రభుత్వం చేసే సంక్షేమం ఎల్లకాలం నిలబడదంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్‌కు హితవు పలికారు.
20వ తేదీ వచ్చినా ఇంకా 20శాతం మందికి వేతనాలు చెల్లించలేదన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ వేతనాల్లో కోత విధించి ఆ డబ్బులను వాడేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయకపోగా.. ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల్లో కోత విధిస్తోందని విమర్శించారు. ఆర్థికంగా ఏపీ అస్తమిస్తోందన్నారు. ఉన్న పరిశ్రమలనే వెళ్లగొడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరుగుతుందని రఘురామ నిలదీశారు. రఘురామ.
ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ సర్కారుపై మండిపడ్డారు.
సీఎం వస్తేనే సచివాలయానికి మంత్రులు వస్తున్నారని.. అందుకే, ముఖ్యమంత్రి జగన్ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరారు వైసీపీ ఎంపీ రఘురామ.