ఇండియా ఎంబసీలో సోదాలు.. అప్ఘన్ లో తాలిబన్ల అరాచకాలు..
posted on Aug 20, 2021 @ 8:05PM
రక్తం చుక్క చిందకుండా కాబూల్ ను కైవసం చేసుకున్నామని, మాటల్లో శాంతి కపోతాలను ఎగరేసి, ఇక పై తమ పంధా అదే అని నమ్మబలికిన తాలిబాన్లు.. ఇంతలోనే రక్తం రుచి మరిగిన తమ పంధా మారదని నిరూపించుకున్నారు. ఇంతవరకు ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం అధికారికంగా ఏర్పడలేదు. కానీ, ఇంతలోనే అరాచకానికి తెరతీసారు. మర్డర్లు, మాన భంగాలు, బహిరంగ శిక్షలు మాములుగానే మొదలయ్యాయి.
మేము మారిపోయాం, మా మాట నమ్మండి, మా పాలను గుర్తించండి అని ప్రప్రంచ దేశాలను కోరుతున్న తాలిబాన్లు, భారత దేశం సహా వివిద దేశాల రాయబార కార్యాలయాలలోకి చొరబడి సోదాలు చేస్తున్నారు. తాలిబాన్లు అరాచకాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ముందుగానే ఉహించిన వివిద దేశాలలు తమా రాయబార కార్యాలయాలకు తాళాలు వేశాయి. రాయబార కార్యాలయాల సిబ్బంది, స్వదేశాలకు వెళ్ళిపోయారు. ఇదే అదనుగా, ఓ వంక శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్దంగా, భారత దేశం సహా పలు దేశాల రాయబార కార్యాలయాల తాళాలు పగలగొట్టి లోపల చొరబడి విద్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విద్వంస, ద్వంస రచనలో భాగంగా, కాందహార్, హెరాత్ నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాలలోకి చొరబడి, గంటల తరబడి సోదాలు చేశారు. తాలిబాన్ల ముట్టడికి ముందు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించింది. ఆదేశంలో పెద్ద ఎత్తున పెతుబడులు పెట్టింది. ఆ కారణంగా కావచ్చు, భారత రాయబార కార్యాలయాల్లో తాలిబాన్లు పెద్ద ఎత్తున సోదాలు చేసారు. ఆ తర్వాత బయట పార్క్ చేసి ఉన్నవాహనాలను ఎత్తుకెళ్లారు.దీంతో, తాలిబాన్లు, మారలేదు, మారరు అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. గతంలో నాటో దళాలతో కలిసి పని చేసిన వారో కోసం తాల్బాన్లు జల్లెడ పడుతునంరు. దొరికిన వారిని దొరికినట్లు, కిరాతకంగా ఉరికంబం ఎక్కిస్తున్నారని సమాచారం. శతృశేషం మిగలకుండా చేసేందుక ఇల్లిల్లీ గాలిస్తున్నారు. మహిళలు టార్గెట్’గానూ దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో ఆధారాలతో కూడిన కథనాలు వస్తున్నాయి.
మరోవైపు గురువారం ఆఫ్ఘాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాలిబాన్లు మారణహోమమే సృష్టించారు. అసదాబాద్ నగరంలో కొందరు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో రెచ్చిపోయిన తాలిబన్ మూకలు వారిపై తూటాల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. బుధవారం జలాలాబాద్ లో తమకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై కూడా తాలిబన్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో ముగ్గురు మరణించారు.
ఇదిలా ఉంటే మన దేశంలో అసదుద్దీన్ ఒవైసీ వంటి కొందరు, శాంతి కాముకులు మాత్రం భారత ప్రభుత్వం తాలిబాన్లతో చర్చలు జరపాలని సలహా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, మా దేశానికి తాలిబాన్ల కంటే, దేశీయ తాలిబాన్ల వల్లనే, ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, నెటిజన్లు శాంతి కముకులకు చురకలు అంటిస్తున్నారు