తాగినోడికి తాగినంత‌.. స‌ర్కారుకు అప్పు మీద అప్పు ముట్టేంత‌!

90ml సీసాలు తీసుకొచ్చి మందుబాబుల‌కు బాగా కంఫర్ట్ క‌లిగిస్తోంది ఏపీ స‌ర్కారు. ఎంచ‌క్కా చాటుగా జేబులో పెట్టుకోవచ్చు. ఎవ‌రికీ క‌నిపించ‌దు. ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు. మొబైల్ కంటీ ఈజీగా జేబులో స‌ర్దేసుకోవ‌చ్చు. ఎక్క‌డ కావాలంటే అక్క‌డ గుటుక్కున మింగేయ‌వ‌చ్చు. ఒకేసారి నాలుగైదు చిన్న సీసాలు కొనేసుకొని.. జేబులోనో, బ్యాగులోనో పెట్టేసుకొని.. అప్పుడింత అప్పుడింత మందేసుకోని.. రోజంతా మ‌త్తులోనే జోగొచ్చు. ఇక టిన్ బీర్ల‌తో మ‌రింత మ‌జా. క్యాన్ ప‌ట్టుకొని స్టైల్‌గా ఫోజులు కొడుతూ బీర్ సిప్ చేయొచ్చు. ప‌బ్లిక్ ముందు ఫోజులు కొట్టేందుకు ఇది మ‌రింత చ‌క్క‌ని ఛాన్స్‌. అందుకే ఇంత మంచి స‌ర్కారు ఇంకెక్క‌డైనా ఉంటుందా అని తాగుబోతులు జ‌గ‌నన్న ఫోటోను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారట‌.  కాక‌పోతే మందుతాగుతున్న ప్ర‌తీసారీ అదేదో విషం తాగుతున్న‌ట్టు ఉంటోంద‌ట‌. ఊరూ-పేరు లేని ప‌నికిమాలిన స‌రుకంతా అమ్ముతుండ‌టంతో మందు గొంతు దిగ‌డం లేద‌ట‌. ఆ చెత్త మందు తాగ‌లేక‌.. తాగ‌కుండా ఉండ‌లేక‌.. సిప్పు సిప్పుకీ జ‌గ‌న‌న్న‌కి శాప‌నార్థాలు పెడుతున్నారు మందుబాబులు. అంతెందుకు, జ‌గ‌న్‌ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ సైతం మందు విష‌యానికి వ‌చ్చే స‌రికి మావోడు దెబ్బేశాడంటూ దొబ్బులు దొబ్బుతున్నారు. ఇలా మందు విష‌యంలో మ‌ద్యంప్రియుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల‌లో మ‌ద్య నిషేధం అని క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పి ఏపీ ప్ర‌జ‌ల‌నూ ద‌గా చేశార‌ని మండిప‌డుతున్నారు. షాపులు త‌గ్గించి.. ధ‌ర‌లు పెంచేసి.. కాసులు దండుకుంటున్నారే త‌ప్ప‌.. మ‌ద్య నిషేధం ఊసే ఎత్త‌డం లేద‌ని తిడుతున్నారు జ‌నాలు. ఈ మ‌ద్యం దందా చాల‌ద‌న్న‌ట్టు.. లిక్క‌ర్ బిజినెస్‌నే ష్యూరిటీగా చూపించి వేల కోట్లు అప్పులు తెస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్క‌టే. ఇక అప్పుల య‌వ్వారం ఎలా సాగుతోందంటే.... ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి దొడ్డిదారిన రూ.21,500 కోట్లు అప్పు తెచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. మళ్లీ మద్యం ఆదాయాన్నే నమ్ముకుని మరో 25 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 30 మద్యం డిపోలు ఉన్నాయి. ఇవన్నీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పరిధిలోనివే. మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం విధించిన ప్రభుత్వం... పది మద్యం డిపోల పరిధిలో వచ్చే ఆదాయాన్ని నేరుగా ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌’ (ఏపీఎస్‌డీసీ)కి మళ్లించి.. దానిని హామీగా చూపించి రూ.21,500 కోట్ల అప్పు తెచ్చింది. అలా తెచ్చిన అప్పుతోనే సంక్షేమ ప‌థ‌కాల బండి లాగిస్తోంది. ఇలా పన్ను ఆదాయాన్ని నేరుగా ‘ఎస్ర్కో’ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అస‌లు ఏపీఎస్‌డీసీ ఏర్పాటునే కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. అలా అప్పులు తేవ‌డం తప్పని తేల్చింది. అయినా స‌ర్కారు తీరు మార‌లేదు. ఇప్పటికే పది డిపోల పరిధిలో మద్యంపై వచ్చే అదనపు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన 20 డిపోల ఆదాయంపై కన్నేసింది. అయితే... గతంలో నేరుగా ‘ఎస్ర్కో’ చేసి ఇరుక్కుపోవడంతో, ఇప్పుడు కొత్త దారి వెతుక్కున్న‌ట్టు తెలుస్తోంది.  కొత్త ‘స్కీమ్‌’లో భాగంగా.. నేరుగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారానే అప్పు తెచ్చుకుంటారు. పైకి ఇందులో ఎక్కడా ప్రభుత్వ పాత్ర కనిపించదు. కానీ... అప్పు ద్వారా తెచ్చుకున్న డబ్బులు మాత్రం ప్రభుత్వానికే పోతాయని అనుమానాలున్నాయి. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ 20 డిపోల పరిధిలో మద్యంపై విధించే ఏఆర్‌ఈటీని హామీగా చూపిస్తుంది. ఈ ఖాతాలో రోజూ రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు తిరిగి చెల్లిస్తాం అనే హామీ ఇస్తూ రుణం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తీసుకునే అప్పు, అంతిమంగా సర్కారు ఖాతాలోకే వెళుతుందని చెబుతున్నారు.  గత ఏడాది మార్చిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తీసుకున్న రూ.1400 కోట్ల క్యాష్‌ క్రెడిట్‌ లోన్‌ చెల్లించడానికే ఆ కార్పొరేషన్‌ ఆపసోపాలు పడుతోంది. ఈ రుణం కాలపరిమితి ఆరు నెలలు. దీనిని కూడా చెల్లించలేని సంస్థ... గడువులోపు రూ.1400 కట్టేసి, మళ్లీ మరుసటి రోజునే అంతే మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. అలాంటిది దీనిని నమ్మి రూ.25 వేల కోట్లు అప్పు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు వస్తుందో? కేంద్రం షంటింగ్స్‌తో ఏపీకి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ‘ఓకే’ చెప్పగానే.. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చుకొనే ఏర్పాట్ల‌లో ఉంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఇలా మ‌ద్యం ఆదాయం మీద‌నే ప్ర‌భుత్వ మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉన్న‌ప్పుడు.. ఇక సంపూర్ణ మ‌ద్య నిషేధం హామీ బీరు పొంగులా కారి పోయిన‌ట్టేనా?  

స్కూల్ కు రావాలని బలవంతపెట్టొద్దు.. గురుకులాలు, హాస్టళ్లు తెరవొద్దు!

తెలంగాణలో స్కూళ్లను తెరవడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ కు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురుకులాలు, హాస్టళ్లను తెరవొద్దని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కేసులు తగ్గకపోయినా పాఠశాలలను రీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఆన్‌లైన్‌, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది.   గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోందని చెప్పింది. సెప్టెంబరు-అక్టోబరులో కొవిడ్‌ మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.   కోర్టులో వాదనల సందర్భంగా అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలో రోజుకి లక్ష కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్ తరపు లాయర్ చెప్పారు. భారతదేశంలో  వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుయని  పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరుపన వాదనలు వినిపించిన ఏజీ.. UNICEF పాఠశాల తప్పనిసరిగా ఓపెన్ చేయాలి అని చెప్పిందన్నారు. చాలా మంది స్కూల్లో న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని కోర్టుకు తెలిపారు. స్కూల్లో ఆహార సరఫరా పై డీఈఓ నేతృత్వంలో  పర్యవేక్షణలో చేస్తామన్నారు ఏజీ.  ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ అక్టోబర్ లో కోవిడ్ తీవ్రస్థాయిలో వినిపిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓకు ఎం చెపుతారని ప్రశ్నించింది.కోవిడ్ టీకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. అది డిసెంబర్లో పూర్తి చేస్తారని అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించింది. ఒకవేళ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అన్న హైకోర్టు.. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అలాంటప్పుడు అటువంటి పరిస్థితి లో పాఠశాలల మేనేజ్మెంట్ వారి భరిస్తుందా అని నిలదీసింది. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే తల్లిదండ్రుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్రశ్నించింది హైకోర్టు.   

బ్రేకింగ్ న్యూస్‌.. యువ‌తి గొంతు కోసిన ఉన్మాది..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్మాదుల ఆగ‌డాలు అస‌లేమాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. క‌ఠిన చ‌ట్టాలు, వేగంగా శిక్ష‌లు ప‌డ‌క‌పోవ‌డ‌మే ఈ బ‌రితెగింపున‌కు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మొన్న‌టికి మొన్న తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో యువ‌తిపై అత్యా*చారం జ‌రిగినా ఇప్ప‌టికీ మ‌రో నిందితుడిని ప‌ట్టుకోలేక పోయారు పోలీసులు. ఆ త‌ర్వాత గుంటూరు, విజ‌య‌న‌గ‌రం లాంటి మ‌రిన్ని దారుణ ఘ‌ట‌న‌లు ఏపీలో భ‌యాందోళ‌న‌లు రేపాయి. ఏపీతో పోటీనా అన్న‌ట్టు తెలంగాణ‌లోనూ దారుణం జ‌రిగింది. ఓ యువ‌తిపై ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు ఓ దుర్మార్గుడు.  కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పుర కాలనీలో ఉండే యువతి ఇంట్లోకి ఓ దుండ‌గుడు ప్ర‌వేశించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఆ ఇంట్లో ఉన్న యువ‌తి గొంతు కోసాడు. కుటుంబీకులు తెరుకునేలోగా ఆ ఉన్మాది అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ‌చ్చింది ఎవ‌రు? ఎందుకు ఆమెపై దాడి చేశాడు?  తెలిసిన వాడేనా? అఘంతుకుడా? అనే వివ‌రాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.   

కారు ప్ర‌మాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడ‌లు దుర్మ‌ర‌ణం..

బెంగళూరులో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. ఘ‌ట‌న‌లో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు, వెనుక సీట్ల‌లో ఉన్న‌వారంతా విఘ‌త‌జీవులుగా మారారు. ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు చ‌నిపోయారు. ఆరుగులు స్పాట్‌లోనే చ‌నిపోగా.. మ‌రొక‌రు హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   చ‌నిపోయిన వారిలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు చనిపోయారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో త‌మిళ‌నాట విషాదం నెల‌కొంది. 

ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్.. డ్రగ్స్ కేసులో ఏం జరగనుందో? 

తెలుగు రాష్ట్రాల్లో సంచనం స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు.. సిట్ విచారణ తర్వాత తుస్సుమంది. తాజాగా ఈడీ ఎంట్రీతో కేసులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణకు రావాలని ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు ఈడీ విచారణ కొనసాగనున్నది. తొలి రోజు మంగళవారం నాటి విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.  ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే  వచ్చేశారు పూరి జగన్నాథ్. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా... పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను మెట్లపై నుంచి పైకి తీసుకెళ్లారు. పూరి తో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  సీఏ ( చార్టెడ్ అకౌంటెట్ )లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ తో పాటు ఇతర విషయాలపై కూడా పూరీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాల పై ప్రశ్నించనున్నారు.  అక్టోబర్​ 2న చార్మీ కౌర్, 6న రకుల్​ప్రీత్​సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్​ క్లబ్​ జనరల్ మేనేజర్, 15న ముమైత్​ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులను అక్రమమార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్న మరో 50 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.  మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులకు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహించిన ఎక్సైజ్ అధికారి శీలం శ్రీనివాస్ రావు సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆయన ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. తమ విచారణకు హాజరుకావాలని మరికొందరు ఆబ్కారీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో భారీ ఎత్తున నల్లధనం చేతులు మారినట్లు వెల్లడైనా ఎందుకు నిర్లక్ష్యం వహించారన్న విషయంపై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో  ఎక్సైజ్ అధికారులు 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. అయితే అందులో ఎక్కడా గతంలో విచారణను ఎదుర్కొన్న సినీతారల పేర్లు లేవు. సినీ తారలతో పాటు మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్​ల్యాబ్ కు పంపినప్పటికీ పరిశీలనలో ఏమి తేలిందనే విషయాన్ని ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. డ్రగ్​ స్మగ్లర్లు కెల్విన్, రాఫెల్​ ఎలెక్స్​ముఠాలను అరెస్ట్​చేశారు. కానీ లోతైన దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారు. ఆ సమయంలో ఎక్త్సెజ్​ కమిషనర్ గా​ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత ‘ఫోరమ్ ​ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ’వంటి సంస్థల ఆందోళన,​ కోర్టు జోక్యంతో డ్రగ్స్​ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం ఆబ్కారీ శాఖకు సంకటంగా మారింది.   

కేసీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి తుమ్మల? 

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణమాలు, అధికార పార్టీ నేతల కదలికలను బట్టి.. త్వరలో కారుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ ఆపరేషన్ అనుకున్నదానికంటే సక్సెస్ అవుతుందని, త్వరలోనే కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని గాంధీభవన్ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నారు.  విప్లవాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారట. రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లాను శాసించిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల మరింత బలహీనమయ్యారు. నియోజకవర్గంలో తుమ్మల ప్రాబల్యం తగ్గించేందుకు ఉపేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మంత్రి పువ్వాడ కూడా తుమ్మలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తీరుపై కొన్ని రోజులుగా తుమ్మల గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.  మరోవైపు జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో..  తుమ్మల నాగేశ్వరరావు  కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తుమ్మలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని, ఆయన కూడా అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా తుమ్మల తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పాలేరులో జరిగిన ఓ సభలో మాట్లాడిన తుమ్మల తనయుడు.. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే తుమ్మల తనయుడు ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.   టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మంలో పోటీ చేసిన తుమ్మల పువ్వాడ అజయ్ పై ఓడిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పట్టున్న తుమ్మలను టీఆర్ఎస్‌లోకి పిలిచి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని అప్పజెప్పారు. అనంతరం మంత్రిగా జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్రపోషిస్తూ జిల్లాకు సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులు తెచ్చిపెట్టారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కారు హవా వీచినా.. పాలేరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత పార్టీలో కూడా తన స్థాయికి తగ్గ గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తుమ్మల.  మళ్ళీ పాలేరు నుండి నిలబడ్డ ఆయన ఓటమి పాలవడం నాటినుంచి నేటి వరకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారుతారు అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మల కాంగ్రెస్ లో చేరితో ఖమ్మం జిల్లాలో కారు స్పీడ్ కు బ్రేకులు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

గద్దర్ కు దళిత బంధు బాధ్యతలు? టీఆర్ఎస్ నేతల మంతనాలు..

తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా వేడెక్కాయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరాలతో స్పీడ్ పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అధికార పార్టీ దళిత బంధు స్కీం తీసుకొచ్చింది. త్వరలో మరిన్ని బంధులు తెస్తామని చెబుతున్నారు సీఎం కేసీఆర్. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల కూడా జిల్లాలు చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల లక్ష్యం హుజురాబాద్ అసెంబ్లీ  ఉప ఎన్నిక చుట్టే సాగుతోంది.  తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల వలసలు కూడా జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేసే నేతలను తమ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే  ప్రజా గాయకుడు గద్దర్‌పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు. దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ నేతలు గద్దర్ చర్చలు జరిపారని తెలుస్తోంది.  హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. అంతేకాదు దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మాటగా గద్దర్ కు మంత్రి కొప్పుల ఆశ్వర్ చెప్పారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదనపై గద్దర్‌ ఇంకా  హామీ ఇవ్వలేదన చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనపై గద్దర్ సానుకూలంగా స్పందిస్తారనే ఆశతోనే ఉన్నారు.  గద్దర్ తో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపాడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా  తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్‌ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డితో రాజకీయాలపైనా గద్దర్ చర్చించారనే సమాచారం టీఆర్ఎస్ పెద్దలకు వచ్చిందట. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే అప్రమత్తమై.. గద్దర్‌ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సీఎం కేసీఆర్ పంపించారనే ప్రచారం జరుగుతోంది.  మొత్తానికి విప్లవ భావజాలమున్న గద్దర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం... టీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు సాగించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లీకులు వస్తున్నట్లుగా దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం కోరితే.. అందుకు గద్దర్ ఓకె చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలతో గద్దర్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది కూడా చర్చగా మారింది. 

వాళ్లను పాకిస్తాన్ పంపిస్తాం.. కమలం నేతల కామెంట్లతో కలకలం 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రాజకీయ కాక రాజేస్తోంది. ప్రజా సంగ్రామ్ యాత్రలో భాగంగా తొలి మూడు రోజులు హైదరాబాద్ లోనే పాదయాత్ర చేశారు సంజయ్. అది కూడా ఓల్జ్ సిటీలోనే ఆయన యాత్ర సాగింది. తొలి రోజు చార్మినార్ పరిధిలో సంజయ్ పర్యటించగా.. రెండవరోజు గోల్కోండలో సభ నిర్వహించారు. పాతబస్తీలో సాగిన బండి యాత్ర పోలీసులకు టెన్షన్ పుట్టించింది. ఇక పాతబస్తీలో జరిగిన పలు సభల్లో ప్రసంగించిన బండి సంజయ్ ఉద్వేగ ప్రసంగాలు చేశారు.  గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బండి సంజయ్. హైదరాబాద్ పేరును మారుస్తామని మరోసారి ప్రకటించారు బండి సంజయ్. అంతేకాదు నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందని బండి సంజయ్‌ మండిపడ్డారు.   బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఐఎం దొంగలను పాకిస్థాన్ కు పంపిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకు ఎంఐఎం నేతలు ఇప్పటికే జనగణమన పాడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని... అప్పుడు ఏం చేస్తారో ఎంఐఎం నేతలు ఇప్పుడే చెప్పాలని అన్నారు. పాతబస్తీలో చార్మినార్ వద్ద సభ పెట్టామని... ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజాసింగ్ అన్నారు.

పీకేకు పరిటాల గుండు కొట్టించారా? చేసిందెవ‌రు? చేయించిందెవ‌రు?

అది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం. చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా జేజేలు అందుకుంటున్న రోజులు.. చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఇమేజ్ వస్తున్న కాలం.. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఓ రేంజ్ లో వెలిగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ డూపర్ సినిమాలతో టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. అప్పుడు చిరంజీవి ఎక్కడికెళ్లినా లక్షలాది మంది జనం వచ్చేవారు. రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేసేవారు.  ఆ సమయంలోనే  2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో ఓ బాంబ్ లాంటి వార్త వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, కీలక నేతగా ఉన్న ఓ నేతకు.. సినిమాల్లో సూపర్ హిట్లు కొడుతున్న మెగా ఫ్యామిలీకి  మధ్య గొడవ జరిగినట్లుగా వచ్చిందా వార్త. కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా ఉండే అప్పటి రాజ్యసభ సభ్యులు తిక్కవరపు వెంకట్రామిరెడ్డికి చెందిన  డెక్కన్ క్రానికల్ పత్రిక.. మంచి మసాలా దట్టించి ప్రచురించింది ఆ కథనాన్ని. మెగా కుటుంబానికి  చెందిన హీరో ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌న్న ఆ వార్త.. అప్పట్లో సంచలనమైంది.  పరిటాల రవి పేరు చెబితేనే అప్పుడు అంతా గజగజలాడేవారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు పరిటాల. పేదల పాలిట పెన్నిదిగా ఎదిగారు. పీపుల్స్ వార్ భావజాలంతో ఎదిగిన పరిటాల రవి.. పేదల కోసమే పని చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే ఆయనకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. జనాల గుండెల్లో పరిటాల ఎంతగా నిలిచిపోయారంటే.. ఆయన హత్యకు గురై 16 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికి ఆయన జయంతి, వర్థంతి రోజున వెంకటాపురంలోని ఆయన సమాధి వద్దకు లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పిస్తారు. రాబిన్ హుడ్ లా ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పరిటాల రవికి.. మెగా హీరో కుటుంబానికి గొడవ ఉందన్నట్లుగా వచ్చిన ఆ డెక్కన్ క్రానికల్ కథనం పెను సంచలనమైంది. రాజకీయాలను షేక్ చేసింది.  ఇంత‌కీ ఆనాడు అస‌లేం జ‌రిగింది? పీకేకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారా? ఎందుకు కొట్టించారు? వారిద్ద‌రికీ గొడ‌వ జ‌రిగిన మాట నిజ‌మేనా? అనుకోకుండా అలా ర‌చ్చ జ‌రిగిందా? లేక‌  కావాల‌నే వివాదం సృష్టించారా? ఇంత‌కీ ఆ ప్రొప‌గాండ చేసిన వారి టార్గెట్ ప‌వ‌న్‌క‌ల్యాణా? ప‌రిటాల ర‌వినా? లేక‌, చంద్ర‌బాబు నాయుడా? అప్ప‌టి ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్ లిటిగేష‌న్.. ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. మెగాస్టార్ చిరంజీవీతో పాటు 2003లో వ‌రుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. స‌డెన్‌గా ఓ రోజు టీవీల్లో థ‌మ్స్అప్ యాడ్‌లో గుండుతో క‌నిపించారు పీకే. అంతే ఒక్క‌సారిగా అంతా షాక్‌. అదేంటి.. ప‌వ‌ర్ స్టార్ ఏంటి.. గుండు చేయించుకోవ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌య్యారు. క‌ట్ చేస్తే.. ప‌రిటాల ర‌వితో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొడ‌వ ప‌డ్డార‌ని.. అందుకే ప‌రిటాల పీకేకి గొండు కొట్టించార‌ని.. ఆ గుండు ర‌వి చేయించిందేనంటూ డెక్కన్ క్రానికల్ లో  కొన్ని రోజుల తర్వాత వార్త వ‌చ్చింది. ప‌రిటాల‌-చిరంజీవి మ‌ధ్య ఓ ల్యాండ్ మేట‌ర్‌లో వివాదం నెల‌కొన‌గా.. పీకే జోక్యంతో విష‌యం గుండు వ‌ర‌కూ దారి తీసిందంటూ.. దిట్టంగా మ‌సాలా ద‌ట్టించి.. వండి వార్చింది. ఆ న్యూస్‌తో అంతా షేక్‌. పీకే గుండుకంటే.. క‌ల్యాణ్‌బాబును ప‌రిటాల ర‌వి కొట్టించాడ‌ని, గుండు కూడా చేయించాడ‌నే న్యూస్ తెగ వైర‌ల్ అయింది. యావ‌త్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ టాపిక్‌పై చ‌ర్చ..ర‌చ్చ‌ జ‌రిగింది.  ప‌వ‌న్‌క‌ల్యాణ్  ఆనాటి గుండు ఎపిసోడ్‌పై పరిటాల రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాని నిజం కంటే అబద్దాన్నే జనాలు తొందరకు నమ్మేస్తారన్నట్లుగా.. పీకే గుండు విషయంలోనూ అబద్దమే ఎక్కుగా ప్రచారమైంది. ఆ తర్వాత ఆ గుండు మేట‌ర్ వెనుక అస‌లు సూత్ర‌ధారి, పాత్ర‌ధారి వేరే ఉన్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదంతా అప్పటి కాంగ్రెస్ నేతలు.. పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ మీద, చంద్ర‌బాబు మీద చేయించిన‌ కుట్ర‌, కుతంత్ర‌మ‌న్న సంగ‌తి తేలింది.  పరిటాల రవీంద్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కమ్మ కులానికి చెందిన వారు కాగా.. పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారు. 1988లో జరిగిన వంగవీటి హత్య తర్వాత కాపులంతా టీడీపీకి దూరమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత కాపులంతా ఆయన వెంటే నిలిచారు. కాపుల సంపూర్ణ మద్దతు వల్లే 1983,85లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. అందుకే టీడీపీకి కాపులను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే వంగావీటి రంగా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కుట్రలో భాగంగానే 1988 తరహాలోనే  రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య కక్షలు భగ్గుమనేలా చేయాలనే కుట్రలో భాగంగానే .. ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌నే కథనాన్ని అప్పుడు కాంగ్రెస్ ఎంపీకగా ఉన్న వెంకట్రామిరెడ్డికి చెందిన డెక్కన్ క్రానికల్ లో ప్రచురించారు.   1988  టీడీపీకి దూర‌మైన కాపులు.. నిజం తెలుసుకున్న తర్వాత  1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి మద్దతుగా వచ్చారు. 1995లో చంద్ర‌బాబు సీఎం అయ్యాక..  సీబీఎన్ ప‌రిపాల‌న‌ ద‌క్ష‌త చూసి.. కాపు వ‌ర్గం టీడీపీకి బ‌ల‌మైన‌ మ‌ద్ద‌తుదారులుగా మారారు. ఆ అభిమానం అలా కొన‌సాగుతూనే వ‌చ్చింది. దీంతో టీడీపీకి ద‌న్నుగా ఉన్న కాపుల‌ను ఆ పార్టీ నుంచి దూరం చేయాల‌ని క‌న్నింగ్ స్కెచ్ వేశార‌ట అప్పటి కాంగ్రెస్ నేతలు. అందుకు పావుగా..  అప్పుడు సినిమాల్లో మంచి హిట్ లు కొడుతున్న.. కాపుల‌కు రోల్‌మోడ‌ల్‌గా ఉన్న మెగా ఫ్యామిలీని వారి ప్ర‌మేయం లేకుండానే వాడేసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ వారికి, మెగా బ్ర‌ద‌ర్స్‌కు గొడ‌వ‌లున్నాయ‌నే ప్ర‌చారం రేపి.. కాపులను తెలుగుదేశానికి దూరం చేయాల‌నే ప‌న్నాగం ప‌న్నార‌ట‌. అందులో భాగంగా.. గ‌తంలో ఎప్పుడో గుండుతో క‌నిపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కొత్తగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారట.  అప్పటి కాంగ్రెస్ పెద్దల పక్కా ప్లాన్ లో భాగంగానే పీకే గుండుకు మ‌సి పూసి మారేడు కాయ చేశారు. ఆనాటి పీకే గుండుకు.. ప‌రిటాల ర‌వినే కార‌ణ‌మ‌ని.. లేని వివాదాన్ని కొత్త‌గా సృష్టించారు. అప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌స్తావించ‌ని ఆ క‌థ‌ను.. వ్యూహాత్మ‌కంగా.. త‌న ప్ర‌ధాన అనుచ‌రుడి ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నంగా వ‌చ్చేలా చేశారు. అంతా కలిసి పీకే గుండుపై అగ్గిపుల్ల గీచి.. ప‌రిటాల ర‌విపై ప‌డేశారు. ఆ మంట‌పై  కాంగ్రెస్ నేత అనుచ‌ర‌వ‌ర్గ‌మంతా త‌లా ఇంత పెట్రోల్ చ‌ల్ల‌డంతో.. అది భ‌గ్గున మండి.. పెద్ద రాజ‌కీయ ర‌చ్చే రాజుకుంది. పవన్ కు అవమానం జరిగితే.. మెగా అభిమానులైన కాపులు తమకే అవమానం జరిగినట్లుగా ఫీలై.. టీడీపీపై ర‌గిలిపోయి, ఆ పార్టీకి దూర‌మ‌వ్వాల‌నేది ఆనాటి కాంగ్రెస్ పెద్దల స్కెచ్‌. పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ క‌ల్పిక అబాంఢానికి.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌ల‌న్నీ ఆనాటి కాంగ్రెస్ పెద్దలే వ‌హించార‌ని చెబుతారు. వైఎస్సాఆర్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ, మీడియాలో తెగ హడావుడి చేసే ఓ నేతే కనుసన్నల్లోనే ఇదంతా నడిచిందని అంటారు.  త‌న‌కు, ప‌రిటాల ర‌వితో ఎలాంటి గొడ‌వా లేద‌ని, త‌న గుండుకు ర‌వికి ఎలాంటి సంబంధం లేద‌ని..  2018లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వయంగా బ‌య‌ట‌పెట్టారు. ఆ విష‌యం ప‌రిటాల సునీత‌కు పీకేనే స్వ‌యంగా వివ‌రించార‌ు. ఆగ‌స్టు 30 ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఆనాటి పీకే గుండు వివాదం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది. రాజకీయ లబ్ది కోసమే నాయకులు.. కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ఎలాంటి కుట్రలు చేశారో తెలుసుకోవడానికి పరిటాల రవీంద్ర, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తోంది.. 

బుర్ర లేని సచ్చు వెదవల సలహాలు.. దిక్కుమాలిన సూత్రాలన్న వైసీపీ ఎంపీ..

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట‌లు అగ్గి రాజేస్తున్నారు. ఓవైపు అమ‌రావ‌తి కోసం 600 రోజులుగా రాజ‌ధాని రైతులు ఉద్య‌మిస్తుంటే.. అక్క‌డి ద‌ళిత రైతుల‌పై బొత్స చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత క‌ల‌క‌లం రేపుతున్నాయి. స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమ‌రావ‌తి రైతులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. తక్షణం తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మాటలతో ఆవేదన చెందామని రాజధాని దళిత రైతులు అంటున్నారు. బొత్సపై ఎస్సీ, ఎస్టీ, చీటింగ్‌ కేసు నమోదు చేయాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది. ఇక‌, మంత్రి బొత్స సత్యన్నారాయణ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. రాజధాని అంశంలో మంత్రి బుద్ధిలేని, మతిలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. బుర్ర లేని సచ్చు వెదవల సలహాలతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయన్నారు. పనికిమాలిన, దిక్కుమాలిన సూత్రాలు చెప్పవద్దని మంత్రి బొత్సాకు సూచించారు. మంత్రి అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ల‌డం అయ్యే పని కాదన్నారు. రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని రఘురామ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ స్ప‌ష్టం చేశారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరారు. సీఎం జగన్ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా మంత్రి ఇలానే మాట్లాడుతుంటారని అన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి గేదెల కోసం స్విమ్మింగ్ పూల్స్ కట్టినట్లు ఉందని ఎంపీ ర‌ఘురామ‌ ఎద్దేవా చేశారు. 25 కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం రూ. 12 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం మరో రూ. 6 నుంచి 7 వేల కోట్లు మార్జిన్ మనీ కలిపి ఇవ్వాలని, ఆ డబ్బుల కోసం ఎస్‌బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయడం ఎఫ్‌ఆర్‌బిఎం నిభందనలు ఉల్లంగించడమేనన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కార్పొరేషన్‌లకు నిధులు మళ్లించి ఖర్చు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, ఢిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయంటూ మండిప‌డ్డారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.   

డబ్బుల భోజనం.. కల్యాణ మండపాల లీజు! వివాదాలకు కేరాఫ్ గా టీటీడీ బోర్డు 

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వరుని నిలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలను అతి పవిత్రంగా భావిస్తుంటారు. అయితే తిరుమల ఆలయ వ్యవహారాలు చూసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆలయానికి మచ్చ తెస్తోంది.  వైసీపీ ప్రభుత్వం వచ్చాకా గత రెండేండ్లుగా టీటీడీ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్యమత ప్రచారం మొదలుకుని ఆలయ ప్రసాదాల వరకు అన్నింటా విమర్శలే ఎదుర్కొంది టీటీడీ బోర్డు. శ్రీవారి సన్నిధిలో వెలుగుచూస్తున్న ఘటనలపై భక్తులు ఆవేదన చెందుతున్నా టీటీడీ తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే టీటీడీ ప్రవేశపెట్టిన సంపద్రాయ భోజనంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా శ్రీవారి కల్యాణ మండపాల లీజు విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలలోని 177 కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 299 కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించింది. గతంలో కల్యాణ మండపాల పరిస్థితులపై విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఓ కమిటీని నియమించింది. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా చోట్ల కల్యాణ మండపాలు నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు నివేదిక అందింది. కొన్ని ప్రాంతాల్లో కల్యాణ మండపాలో గేదలను మేపుతున్నట్లు ఫోటోలోతో విజిలెన్స్ సమాచారం ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఇకపై కల్యాణ మండపాలను నిర్మించకూడదని పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని గత పాలకమండలి నిర్ణయం తీసుకుంది.  అయితే  వైసీపీ ప్రభుత్వం వచ్చాక  తిరిగి కల్యాణ మండపాల నిర్మాణానికివైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితితో కల్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ…. మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కల్యాణ మండపాల నిర్మాణంపై నిర్దిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. ఇటీవల సంప్రదాయ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ వెనక్కి తగ్గింది.  డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలనే నిర్ణయంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్న ప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని ఆయన అన్నారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని  చెప్పారు. తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారని, వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారని చెప్పింది.  

బండి సంజయ్ కాలికి గాయం... పాదయాత్ర ఆగిపోనుందా? 

తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గాయపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రో భాగంగా  మూడవరోజు లంగర్ హౌస్ ప్రాంతంలో పాదయాత్రను కొనసాగిస్తుండగా... ఆయనను కలిసేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా రావడంతో అదుపుతప్పి కిందపడిపోయారు బండి సంజయ్. దీంతో ఆయన కుడికాలికి గాయమైంది. నడవడం ఇబ్బందిగా మారడంతో పాదయాత్రను ఆపేశారు సంజయ్. వైద్యులు ఆయనను పరీక్షింతారు. చికిత్స అందించిన వైద్యులు, కాలికి ప్లాస్టర్ వేశారు. ప్రస్తుతం బండి సంజయ్ రెస్ట్ తీసుకుంటున్నారు.  ఈనెల 28న పాతబస్తిలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు బండి సంజయ్. రెండవరోజు ఆదివారం కూడా ఓల్డ్ సిటీలోనే ఆయన యాత్ర సాగింది. టోలిచౌకి, గోల్కోండలో ఆయనకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. గోల్కోండ కోట దగ్గర నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.మూడవ రోజు సోమవారం గోల్కోండ నుంచి అప్పా జంక్షన్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయమే యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ ఒక సభలో మాట్లాడారు. తర్వాతే ఇబ్బంది పెరగడంతో యాత్రకు విరామం ఇచ్చారు. కాలికి గాయమైనా సంజయ్ పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. తెలంగాణలో ప్రధాని ఆవాస్‌ యోజన పథకం పేరు మార్చారని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లంటూ పేరు మార్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని మోడీకి పేరు వస్తుందనే పథకం పేరు మార్చారని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నాణ్యత లేదని, కాంట్రాక్టర్ల కోసమే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు కడుతున్నారని విమర్శించారు. పేదల గురించి ప్రభుత్వం ఆలోచించడంలేదని, ఇప్పటివరకు కేంద్రానికి లబ్ధిదారుల జాబితా అందించలేదన్నారు. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం ఇళ్లు కట్టకపోవడం వల్లే జాబితా పంపట్లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం ప్రభుత్వం చక్కగా వాడుకుంటోందన్నారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం మూర్ఖపు పాలన సాగుతోందని, తెలంగాణలో ఎక్కడికి వెళ్లిన ప్రజలు సమస్యలు చెబుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ మెడలు వంచేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

కాబుల్‌ ఎయిర్‌పోర్టుపై రాకెట్ల‌తో దాడి.. అమెరికా ఏం చేసిందంటే...

అది కాబుల్ ఎయిర్‌పోర్ట్‌. ఎప్ప‌టిలానే దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది అఫ్గ‌నిస్తానీలు అక్క‌డ గుమ్మికూడి ఉన్నారు. పౌరుల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో అమెరిక‌న్ సైనికులు బిజీగా ఉన్నారు. కాబుల్ విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర బాంబు దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు ఇప్ప‌టికే హెచ్చ‌రించ‌డంతో అంతా హైఅల‌ర్ట్‌గా ఉన్నారు. ఇటీవ‌ల ముష్క‌రులు వాహ‌నంలో బాంబులతో వ‌చ్చి ఆత్మాహుతి దాడి జ‌రిపి 100 మందికి పైగా పొట్ట‌న‌పెట్టుకున్న ఘ‌ట‌నతో యూఎస్ ఆర్మీ మ‌రింత అల‌ర్ట్‌గా ఉంది. కానీ, ఉగ్ర‌వాదులు ఈసారి అనూహ్యంగా విరుచుకుప‌డ్డారు. వాహ‌నంతో కాకుండా రాకెట్ లాంఛ‌ర్ల‌తో ఎయిర్‌పోర్ట్‌పై అటాక్ చేశారు. ఒక‌టి రెండు కాదు 5 రాకెట్ల‌ను విమానాశ్ర‌యంపైకి ప్ర‌యోగించారు. ఊహించ‌ని ఈ అటాక్‌ను అమెరికా చాలా ఈజీగా ఫేస్ చేసింది. నేరుగా ఎదుర్కొంటే యూఎస్ ఆర్మీని ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు. ఆత్మాహుతి దాడిలాంటి దొంగ దెబ్బ తీస్తేనే ప్రాబ్ల‌మ్‌. ఉగ్ర‌వాదులు రాకెట్లు ప్ర‌యోగించ‌గానే.. కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న ఆమెరికాకు చెందిన క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఆటోమెటిక్‌గా యాక్టివ్ అయింది. ముష్క‌రులు ప్ర‌యోగించిన రాకెట్లు విమానాశ్ర‌యం వ‌ర‌కు రాకుండానే.. చాలా దూరంలోనే వాటిని కూల్చేయ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. కాబుల్ ఎయిర్‌పోర్టుకు దూరంగా ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర‌ ఉన్న అఫ్గాన్‌ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.  కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు కిలోమీట‌ర్ దూరంలో ఆదివారం ఇలానే ఓ రాకెట్ దాడి జ‌రిగింది. ఆ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు కాబుల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా ఆర్మీ భగ్నం చేసింది. ఆదివారం ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా బలగాలు.. డ్రోన్‌ దాడితో వారిని మట్టుబెట్టారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ మంగ‌ళ‌వారంతో ముగియ‌నుండ‌టంతో.. ఇక మ‌ళ్లీ వాళ్లు త‌మ‌కు దొర‌క‌రు అన్న‌ట్టు.. యూఎస్ ఆర్మీ టార్గెట్‌గా ఉగ్ర‌వాదులు వ‌రుస దాడుల‌తో విరుచుకుప‌డుతున్నారు. దీంతో.. అమెరికా సైన్యం ప్ర‌తీక్ష‌ణం ఫుల్ అల‌ర్ట్‌తో ఉంటోంది.  

ఏపీలో ప్రశ్నించడమే పాపమా? చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్ట్.. 

మూడు కేసులు.. ఆరు అరెస్టులు.. ఏపీలో గత రెండేడ్లుగా ఇదే సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. జగన్ రెడ్డి పాలనలో ప్రశ్నించడమే పాపం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వాళ్లపై, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలతో  ప్రతి పక్ష టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇదీ మరీ ఎక్కవైంది. మాజీ మంత్రులను కూడా వదలడం లేదు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవి నేని ఉమ, సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను జైలుకు పంపించారు.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గతంలో చాలా సార్లు అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా మరోసారి అదుపులోనికి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,  గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్,  ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు విశాఖ జిల్లా నుంచి దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం కోర్టుకు సెలవు కావడంతో ఏలూరులో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్ళి,  న్యాయమూర్తి  ఎదుట చింతమనేని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనపై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు ముందుగా ఇక్కడే అరెస్టు చూపించనున్నారు.  చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను టీడీపీ తీవ్రంగా ఖండించింది. పోలీసుల తీరుపై తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఉదాహరణ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.ఆయనను ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకి పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారిందని విమర్శించారు. చింతమనేని తక్షణమే  విడుదల చెయ్యాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు. చింతమనేనిని తక్షణమే విడుదల చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిని వేధించి అక్రమంగా జైలు పాలుజేయడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం.. ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. పౌరస్వేచ్ఛను ఎంతకాలం తొక్కిపెడతారని నిలదీశారు. విశాఖపట్నంలో వివాహ వేడుకకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌ను అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో జగన్ పాదయాత్రను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుని ఉంటే మీ పరిస్థితి ఏంటని చిన రాజప్ప మండిపడ్డారు.  

ఏపీలో పోలీస్ రాజ్‌.. డీజీపీపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు..

ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీస్‌ రాజ్‌ కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు తగవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. విశాఖ జిల్లాలో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్ర‌బాబు ఘాటు లేఖ రాశారు.  "టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు సరికాదు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు మంచిది కాదు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయం. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై ప్రభాకర్‌ నిరసన వ్యక్తం చేశారు. దెందులూరు తహశీల్దార్‌కు వినతి పత్రమిస్తే తప్పుడు కేసులా? విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే అశాస్త్రీయంగా అరెస్టు చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా? నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా?" అంటూ డీజీపీని నిల‌దీశారు చంద్ర‌బాబు. "టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారు. రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత తీరు బ్లాక్‌ మార్క్‌గా ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోండి. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి" అని లేఖలో డీజీపీని డిమాండ్ చేశారు చంద్రబాబు. 

చదువు కోసమా ‘బరువు’ కోసమా? స్కూల్స్ తెరుస్తోంది ఎందుకోసం..?

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని, అందుకే ప్రత్యక్ష బోధన అని వివరణ ఇచ్చారు. నిజమే, ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదనడంలో నిజముంది. సరైన సదుపాయాలు,గాడ్గేట్స్ లేక ఇతర సాకేతిక సదుపాయాలు అందుబాటులో లేక కొందరు, అన్నీ ఉన్నా సరైనా అజామాయిషి లేక ఇంకోదరు పిల్లలు చదువుకు కొంత దూరం అవుతున్న మాట నిజమే. అయితే, ఏ ప్రమాణాల మీద ఆధారపడి మంత్రిగారు, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమనే  నిర్ణయానికి వచ్చారో మాత్రం అర్థం కావడం లేదని తల్లి తండ్రులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  ఓ వంక కరోనా థర్డ్ వేవ్ తప్పదన్న వార్తలొస్తున్నాయి, కేంద్ర  ప్రభుత్వం కూడా రాష్ట్రాలను హెచ్చరించింది. కొవిడ్ మార్గదర్శకాలను సెప్టెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది. రాష్ట్రంలోనూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పే పరిస్థితి లేదు. వాక్సినేషన్ కార్యక్రమం కూడా అంత జోరుగా ఏమీ సాగడం లేదు. అసలు పిల్లల వాక్సిన్ రానేలేదు. థర్డ్ వేవ్ వస్తే, పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చాలా వేగంగా విస్తరిస్తుందని అన్ని వైపులా నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.ఇలా ఏ కోణం నుంచి చూసినా రెడ్ మార్కే కనిపిస్తోంది. అయినా, విద్యాశాఖ మంత్రి  పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఎందుకోసం, ఏమి ఆశించి విద్యాశాఖ  ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికే తెలియాలని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. చివరకు విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం పెద్ద ప్రమాదాన్ని స్వాగతిస్తోందా, అనే  ఆందోళనలోనే ఉన్నారు.  అలాగే, ప్రైవేటు యాజమాన్యాలు చూపెట్టిన ‘బరువు’కు ప్రభుత్వం తలొగ్గిందనే  అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.  విద్యా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాత్రం ఇంట్లో మాదిరిగానే, విద్యా సంస్థలలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. హామీ ఇస్తున్నారు. అదే సమయంలో పిల్లలను స్కూల్స్’కు పంపి తీరాలనే, నియమం ఏదీ లేదని, తల్లి తండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు. అంటే, పరోక్షంగా రేపు ఏదైనా జరగరానిది జరిగితే, బాధ్యతను తల్లి తండ్రుల మీద నెట్టి, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందా, అనే అనుమానం వ్యక్తమవుతోంది.   అయితే వాస్తవ పరిస్థితిని గమనిస్తే, చాలా వరకు పాఠశాలలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి. టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేని పాఠశాలలో, కొవిడ్ నిబంధనలను పాటిస్తామని చెప్పడం అంటే, అది ఆత్మ వంచన అనిపించుకుంతుందే తప్ప మరొకటి కాదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే అంటున్నారు.అన్ని క్లాసులు ఒకే సారి కాకుండా  అంచెల వారీగా ప్రారంభిస్తే కొంతవరకు బాగుండేదనే మాట కూడా ఉపాధ్యాయుల నుంచి వినవస్తోంది.  మరోవంక  మరి కొద్ది గంటల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నా, కొవిడ్ నిబంధనలు, శానిటేషన్’కు సంబంధించి ఆదేశాలు జరేచేసినా,   స్కూళ్ల నిర్వహణ గురించి మాత్రం సర్కారు ఇంకా ఆదేశాలివ్వలేదు. వారంలో ఎన్ని రోజులు స్కూల్ నడపాలి, క్లాస్‌‌కు ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, బెంచ్‌‌కు ఎంత మందిని కూర్చోబెట్టాలి, రోజు విడిచి రోజు క్లాసులా, రోజూ నడపాలా, ప్రైమరీ పిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి ప్రశ్నలు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కారు గైడ్ లైన్స్ లేకపోవడంతో కొన్ని స్కూళ్లు పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  అయితే తల్లి తండ్రులు మాత్రం ఇంకా చాలావరకు డోలాయమాన స్థితిలోనే ఉన్నారు. రిస్క్ తీసుకోలేమని కొందరు అంటుంటే, స్కూల్స్’కు తెరిచినా, భౌతిక తరగతులకు సమాంతరంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని, అలా చేయడం వలన తక్కువ మంది పిల్లలతో పాఠశాలల నిర్వహణ కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని..కొందరు పేరెంట్స్ అంటున్నారు. అలాగే, ముందు కాలేజీ తరగతులు ప్రారంభించి పరిస్థితిని బట్టి కింది తరగతులు ప్రారంభించడం ఉత్తమం అని కూడా కొందరు సూచిస్తున్నారు. ఇదలా ఉంటే ప్రైవేటు స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్ధులకు భౌతిక తరగతులు నిర్వహించడం వలన ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందని, పేర్కొంటూ రాష్ట్ర హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ పై ఆగష్టు 31న రాష్ట్ర హై కోర్టు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామ చంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. ఈ నేపధ్యంలో, తల్లితండ్రులు, విద్యాశాఖ అధికారులు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొవిడ్ టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడికి అస్వస్థత! పిల్లలకు డేంజరేనా?

దేశంలో ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. కొవిడ్ కట్టడికి టీకాలు తీసుకోవడమే ప్రధానమని వైద్య నిపుణులు చెబుతుండటంతో ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కొవిడ్ టీకాలు వేస్తున్నారు. 18 ఏండ్ల లోపు వాళ్లకు టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశీయ టీకా సంస్థ కొవాగ్జిన్ కూడా పిల్లల టీకాకు సంబంధించి ట్రయల్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ లో వెలుగుచూసిన ఘటన ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.  మధ్యప్రదేశ్ లో కరోనా టీకా తీసుకున్న 16 ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ  ఘటన మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో చోటుచేసుకుంది. అంబా తాలూకాలోని బాగ్‌కాపూర్‌కు చెందిన కమలేశ్ కుష్వాహా కుమారుడు పిల్లూకు శనివారం ఓ కేంద్రంలో టీకా వేశారు. ఆ వెంటనే బాలుడికి తలతిరుగుతున్నట్టు అనిపించి నోటి నుంచి నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్ తరలించారు. కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.  మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు వేస్తుండగా, ఆ వయసు లోపు వారికి ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా వేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏడీ శర్మ తెలిపారు. 16 ఏండ్ల బాలుడు కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే అస్వస్థతకు గురి కావడంతో.. పిల్లల టీకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ టీకాలు పిల్లలకు సురక్షితమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.   

బీజేపీ, వైసీపీలు దగ్గరవుతున్నాయా? రాజధానిపై రాజీకొచ్చాయా? 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ దురాన్ని తగ్గించుకుని  దగ్గరవుతున్నాయా? ఇంతకాలం చాటు మాటుగా సాగిన స్నేహ బంధం తెరలు తొలిగిపోతున్నాయా? అంటే అనుననే సంకటాలే వస్తున్నాయి. ఓ వంక రాష్ట్ర  బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేస్తామని, చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. ఈ,\ మధ్య కాలంలో గోసంరక్షణ, ఆలయ పరిరక్షణ విషయంగా  ఉద్యమాలు కూడా చేశారు.  అదే సమయంలో, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన రెడ్డి వంటి కొందరు నాయకులూ వైసీపీ అనుకూల ధోరణి అవలంబిస్తున్నారని పార్టీనాయకులు, కార్యకర్తలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఏపీ బీజేపీ మొదటి నుంచి కూడా, రెండుగా చీలి పోయింది. ఒక వర్గం ఒక ప్రాంతీయ పార్టీకి కొమ్ముకాస్తే, మరో వర్గం మరో ప్రాతీయ పార్టీకి అనుకూల వర్గంగా చెలామణి అవుతోంది. ఒక విధంగా  ఏపీలో బీజేపీ ఎదుగుబొదుగు లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలి పోవడానికి, పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలి పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వమే వైసేపీకి దగ్గర అవుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు నుంచి రెండు పార్టీల మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగుతోందనేది బహిరంగ రహస్యమే. రాజ్యసభలో బిల్లుల, రాష్ట్ర్ర పతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కానీ, వైసీపీ నాయకత్వం, ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్’ అన్న విధంగా కేంద్ర ప్రభుత్వానికి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తూనే ఉంది. అలాగే, అటు నుంచి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎక్కడ ఆదుకోవాలో అక్కడ ఆదుకుంటోంది. అయినా, ఇంతవరకు రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబందాలు సమయానుకూలంగా మారుతున్నాయి.   ఇక  ప్రస్తుతానికి వస్తే బీజీపీ కేంద్ర నాయకత్వం వైసీపీకి ఇంకా ఇంకా దగ్గరవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకే గుంటూరులో ఒక మహిళ హత్య కేసులో విచారణ కోసం వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృదం, జగన్ రెడ్డి చేతుల మీదుగా శాలు కప్పించుకుని, సర్కార్ కు క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళిపోయింది. బీజేపీ రాష్ట్ర్ర పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చిన కమిషన్ సభ్యులు, కమల దళానికి జెల్ల కొట్టి, వైసీపీకి జై కొట్టి పోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వైసీపీకి దగ్గరవుతోందనే వాదనకు మరిత్న్ బలాన్ని చేకురుస్తోంది.  తాజగా ఏపీ రాజధాని విషయంలో  కేంద్రం ప్రభుత్వం మాట మాట మార్చింది. జగన్ రెడ్డి మాటలనే మరో భాషలో పలికింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ... ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని చెప్పిన కేంద్ర ఇలా నాలుక మడతేయడం  ఏమిటని, జనం ప్రశ్నిస్తున్నారు.  అయితే ఇది పొరపాటున దొర్లిన తప్పిదమా లేక  బీజేపీ, వైసీపీల  మధ్య పెరుగుతున్న స్నేహ బంధానికి మరో సంకేతమా.. అనేది తేలాల్సి వుంది. అయితే జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల  నేపధ్యంలో బీజేపీ, ప్రాంతీయ పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి అనేది మాత్రం నిజం. ఇది అందులో భాగమా .. మరో వ్యుహమా అనేది ప్రస్తుతానికి అయితే ప్రశ్న..

ఒకరి అవసరం.. ఇంకొకరి అదృష్టం! కొందరు లీడర్లకు అనుకోని పదవులు.

రాజకీయాలలో కొందరి అవసరాలు, ఇంకొందరికి  అదృష్టంగా మారతాయి. అవకాశాలకు తలుపులు తీస్తాయి. అలా, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియని మాజీలు అనేక మందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక, మంచి రోజులు మోసుకొచ్చింది. మాజీలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది.  ఎల్. రమణ, పెద్ది రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇలా చాలామందికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కొద్దిగా ఎక్కువతక్కువగా అదృష్టాన్ని పంచిందనే చెప్ప వచ్చును. అయితే, ఇచ్చిన వరాలు నిజంగా నిజం అవుతాయా, దళిత ముఖ్యమంత్రి జాబితాలో చేరిపోతాయా, అనేది పక్కన పెడితే, ఇంతవరకు  ముట్ట వలసినవి ఏవో ముట్టే ఉంటాయి కాబట్టి, అంతవరకు అయినా వారు  అదృష్టవంతుతే అవుతారు.  ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సరుభి వాణీ దేవి, నిజంగా మహాజాతకురాలనే చెప్పవచ్చును. అలాగని, ఆమెకు ఎమ్మెల్సీ అయ్యేదుకు అర్హతలు లేవని కాదు. ఆమెకు ఎమ్మెల్సీ కావడానికి ఉండవలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు, ‘పీవీ గారమ్మాయి’ అనే ప్రత్యేక అర్హత కూడా ఉంది. అయితే, ఆమెకు ఈ అర్హతలు ఎప్పటినుంచో ఉన్నా, ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్’ ఆమెకు అవకాశం ఇచ్చింది మాత్రం ఆయన అవసరం కోసమే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ వరస దెబ్బల  తర్వాత, వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టే, పీవీ పేరు, కుల సమీకరణలు అనీ బెరేజు వేసుకునే కేసీఆర్ ఆమెను ఆఖరి క్షణంలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తంగా రంగంలోకి  దిగి ఆమెను గెలిపించుకున్నారు.  కేవలం రాజకీయ నాయకులకే కాదు, రాజకీయ పార్టీల అవసరాలు జనాలకు కూడా అనుకోని, ఆశించని మేళ్ళు చేస్తాయి, అందుకు, వేరే ఉదాహరణ అవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక్కటి చాలు. ఎంత మందికి ఇస్తారు, ఎంత కాలం అమలు చేస్తారు, అనే విషయన్ని పక్కన పెడితే, ఫ్యామిలీ’కి పదిలక్షల రూపాయలు ఇచ్చే దలిత బంధు పథకం వచ్చిందంటే, అందుకు ఆ నియోజక వర్గంలో గెలుపు, అధికార తెరాసకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి అత్యవసరం, కావడమే కారణం. దళిత బంధుతో పాటుగా ఇంకా చాలా చాలా పథకాలు పరుగులు పెడుతున్నాయి. దళితులకు దళిత బంధు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి, గెలలు శ్రీవాస యాడవ్’కు ఏకంగా పార్టీ టికెట్, ఇచ్చిన కేసీఆర్, అదే క్రమంలో 26 వేలకు పైగా ఓట్లున్న పద్మశాలీ వర్గానికి రేపో మాపో చేనేత బీమా పధకాన్ని ప్రకటిస్తారని సమాచారం. నిజానికి, హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటందో ఏమో కానీ, అధికార పార్టీ గెలుపు ఆరాటంలో అటు పేడవుట్ అయిన రాజకీయ నాయకులకు, ఇటు ప్రజలకు కూడా మేలు జరిగింది.   అదలా ఉంటె, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ వాణీ దేవీ,ప్రజాసేవ చేయడానికి పదవే అవసరం లేదన్న తలతిక్క తనకు ఉండేదని, కానీ కొన్ని పనులు చేయాలంటే పదవి ఉండాలని గ్రహించానని చెప్పారు. నిజమేల, అధికారం లేని ఆదర్శాల వలన ప్రయోజనం ఉండదు. మార్చిలో జరిగిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె విజేతగా నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.