హే అన్న‌మ‌య్యా.. ఇంత వైఫ‌ల్య‌మా?

వాన కురిసింది. వ‌ర‌ద ముంచెత్తింది. ప్రాజెక్టు నిండింది. ఇంత వ‌ర‌కూ సాధార‌ణమే. ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. విప‌త్తా? వైఫ‌ల్య‌మా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. ఎగువ నుంచి అన్న‌మ‌య్య ప్రాజెక్టును వ‌ర‌ద ముంచెత్తుతున్నా కొద్దీ.. దిగువ‌కు అదే స్థాయిలో నీళ్లు వ‌ద‌లాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ప్రాజెక్టు నిండి డ్యాం కొట్టుకుపోయే వ‌ర‌కూ దోబూచులాడారు. గేట్లు ఎత్తాల‌నే చిన్న లాజిక్ అధికారులు ఎలా మిస్ అయ్యారు? పైనుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఇసుక లారీల కోస‌మే గేట్లు ఎత్త‌కుండా విల‌యానికి కార‌ణ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. కేంద్రం సైతం ఈ విష‌యంలో ఏపీని గ‌ట్టిగా నిల‌దీస్తుండ‌టంతో జ‌ల విషాదం.. వివాదంగా మారింది. ఇంత‌కీ అన్న‌మ‌య్య, పింఛ‌ ప్రాజెక్టులో ఆ రోజు అస‌లేం జ‌రిగింది...?   అన్న‌మ‌య్య ప్రాజెక్టు కొట్టుకుపోయి.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం జ‌రిగింద‌ని అధికారులు అంటున్నారు. సామర్థ్యానికి మించిన వరదతో డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే పెను ప్రమాదానికి కారణమని జ‌ల‌వ‌న‌రుల నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో వైఫ‌ల్య‌మే కార‌ణమ‌ని చెబుతున్నారు.  అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించింది. ప్రవాహాల తీరుపై రెవెన్యూ అధికారులకు వర్తమానం పంపామని, ముందస్తు అనుమతి లేకుండా జలాశయాలు ఖాళీ చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ అధికారుల అనుమతి కోసం ఎదురు చూశామని జ‌ల వ‌న‌రుల శాఖ అధికారులు అంటున్నారు. అందుకే, సకాలంలో ప్రాజెక్టు ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిందంటున్నారు.  అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. ఆ పాపం ఇప్పుడు శాపంగా మారిందని అనుమానిస్తున్నారు.  అన్నమయ్య జలాశయంలో నవంబరు 18 రాత్రి 8.30 సమయంలో 1.590 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఒక గేటు పని చేయకపోయినా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపవచ్చు. మూడు రోజులు అతిభారీ వర్షాలని ప్రభుత్వమే చెబుతోంది. 87,296 క్యూసెక్కుల ప్రవాహాలు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. మరి ఆ సమయంలో 1.20 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? అదేరోజు అర్ధరాత్రి ప్రాజెక్టులో నీటి నిల్వ 1.805 టీఎంసీలకు పెరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.71లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుంటే 1.46 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? భారీ వరద వస్తున్నప్పుడు జలాశయంలో నీటి నిల్వ పెంచేలా ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేయడం ఏమిటి? ఆ తర్వాత రెండు మూడు గంటలకు కట్ట కొట్టుకుపోతే దీన్ని ప్రకృతి విపత్తు అనాలా? ప్రాజెక్టు నిర్వహణలో లోపం అనాలా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారుల వాద‌న‌:  కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది.    నిపుణుల మాట‌:  మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి. ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది. అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేదన్నది జలవనరుల నిపుణుల ప్రశ్న. అనిల్ కుమార్ కు అన్నమయ్య సెగ.. కేంద్రం యాక్షన్ తప్పదా? 

వరి వద్దు పత్తి ముద్దు..  తెరాస సర్కార్ కొత్త మంత్రం 

చివరాఖరుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డికుండ బద్దలు కొట్టారు. యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వం కొనదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఆఫ్కోర్సే ఇప్పటికే, ప్రభుత్వ పెద్దలు వరి వేస్తే ఉరే’ అని తేల్చి చెప్పారు అనుకోండి. అయినా, ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి మరో మారు మరింత ‘ఘట్టి’గా  అదే విషయం చెప్పారు. ఇంత చెప్పినా వినకుండా రైతులు వరి సాగు చేస్తే అందుకు రైతులే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పండిన పంటను ప్రభుత్వం కొనక పోతుందా, అనుకుంటే నష్టపోక తప్పదని హెచ్చరిక కూడా చేశారు. మిల్లర్లతో ముదస్తూ ఒప్పందం  ఉన్నరైతులు మాత్రమే వరి వేయాలన్నారు. రైతులు కేంద్రాన్ని నమ్మి యాసంగిలో వరి వేస్తే నిండుగా మునుగడం ఖాయమని, కేంద్రానిది తడిబట్టతో గొంతుకోసే విధానమని ఆరోపించారు.  బాగుంది. కేంద్రానికి తడిగుడ్డతో గొంతు కోసే విధానమే కావచ్చును. కేంద్రం మీద నమ్మకం లేకనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వరి వద్దన్నారని అనుకుందాం. మరి యాసంగిలో రైతులు ఏ పంటలు వేయాలి, ఏ పంటలు పండించాలి? అంటే దానికి కూడా, మంత్రి నిరంజన్ రెడ్డి ముచ్చటైన సమాధానమే ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఏ విధంగా అయితే,శాసన సభ సాక్షిగా లెక్కలు చెప్పి మరీ ,60 లక్షలు 80ల క్షలు కాదు కోటి ఎకరాల్లో వరి సాగు చేసినా ‘ఐ యామ్ హ్యాపీ.’ .చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని బల్ల గుద్దారో అంతకంటే గట్టిగా మంత్రి నిరంజన్ రెడ్డి 80 లక్షల నుంచి కోటి ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించారు. అంతే కాదు, అప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వరిసాగుకున్న ఉజ్వల భవిష్యత్, వరి రైతుల బంగారు భవిష్యత్ గురించి ఎలాగైతే బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చారో .. ఎంత చక్కటి భరోసా ఇచ్చారో, పత్తి రైతు బంగారు భవిష్యత్ గురించి వ్యవసాయ మంత్రి అంతే చక్కటి భరోసా ఇచ్చారు.  ఇప్పుడు  పత్తి  కనీస మద్దతు ధర కన్నా రూ.3వేల వరకు ఎక్కువ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పత్తిని కొంటోందన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పత్తికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని, ఎంత పంట వచ్చినా కొనే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. సీసీఐ కొనుగోలు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర ఇచ్చి పత్తిని కొంటుందని చెప్పారు. అయితే వరి (బియ్యం) కానీ, పత్తి కానీ, ఏదైనా చివరకు కొనవలసింది, కేంద్ర ప్రభుత్వం లేదా  కేంద్ర ప్రభుత్వ సంస్థలే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గా మాత్రమే పని చేస్తుంది. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కూడా,స్పష్టం చేశారు   “ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గానే వ్యవహరిస్తుంది” అని  చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం  కొనేది  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్-సీఐ అయితే,పట్టిని కొనేది కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ). అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే, రేపు సీసీఐ కూడా ఎఫ్సీఐ లానే చేతులు ఎత్తేస్తే , ఎవరిదీ భరోసా, కోటి ఎకరాలలో వరి పండిన కొంటామని ముఖ్యమంత్రి నిండుసభలో ఇచ్చిన హమీకే దిక్కులేనప్పుడు, మంత్రి నిరంజన్ రెడ్డి పత్తి విషయంలో ఇస్తున్న హామీని నమ్మేదేలా, అని రైతులు ప్రశ్నిస్తున్నారు.  మరో వంక పట్టి పంటకు సంబంధించి తెలంగాణ రైతులకు చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. పత్తి రైతులతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో అత్యధిక మంది పట్టి రైతులే ... అని గుర్తుచేస్తున్నారు రైతులు. 

ముంబై టెస్టులో భారత్ రికార్డ్ విజయం.. జయంత్, అశ్విన్ స్పిన్ కు కివీస్ విలవిల.. 

ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు  372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.  నాలుగవ రోజు ఆటవో గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. నాలుగవ రోజు ఆటలో జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోల్స్‌ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టెస్టుల్లో పరుగల పరంగా భారత్‌కిది అత్యంత భారీ విజయం.  ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన  తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది, కివీస్ బౌలర్ అజాజ్‌ పటేల్‌ 10/119 చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన చేసినా.. మయాంక్‌ అగర్వాల్‌ 150 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 52 పరులుగు చేయడంతో  భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.  అనంతరం న్యూజిలాండ్‌  తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే అలౌటైంది.  ఇది భారత్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్‌. హైదరాబాద్ పేరస్ సిరాజ్‌ 3 వికెట్లతో టాప్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టగా తర్వాత అశ్విన్‌ నాలుగు, అక్షర్‌ పటేల్ రెండు వికెట్లతో మిగతా ఆటగాళ్ల పనిపట్టారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.  రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే ఆలౌటై ఫాలో ఆన్‌లో పడినా.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపింది. మయాంక్‌  62 పరుగులతో మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడారు. పుజారా  47, శుభ్‌మన్‌ గిల్‌ 47, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 36 పరుగులతో రాణించారు.  చివర్లో అక్షర్‌ పటేల్‌  ధాటిగా ఆడి 41 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్‌ఇండియా. అనంతరం రెండో ఇన్నింగ్స్‌  మొదలుపెట్టిన న్యూజిలాండ్‌.. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. అశ్విన్‌ మరోసారి చెలరేగడంతో ఆదివారమే న్యూజిలాండ్‌ సగం పని అయిపోయింది. డారిల్‌ మిచెల్‌  60 పరుగులు, హెన్రీ నికోల్స్‌  44 పరుగులతో కాస్త ప్రతిఘటించడంతో ఆట నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ విజృంభించి గంటలోనే మ్యాచ్‌ను పూర్తి చేశాడు. 

ఎంపీలను పార్లమెంట్ కు వెళ్లొద్దన్న కేసీఆర్... ఎందుకో తెలుసా? 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగు చుట్టే తిరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణ పండిన వరి ధాన్యం కొనలేమంటూ కేంద్రం.. రాష్ట్రంపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కౌంటరిస్తున్నాయి. వరి ధాన్యం కొనలేని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  పార్లమెంట్ సమావేశాల్లో తొలి నాలుగు రోజులు టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలు హైలెట్ అయ్యాయి. వరి ధాన్యం కొనుగోలుపై చేయాల్సిన రచ్చ అంతా చేశారు. కేంద్రంపై కేసీఆర్ కూడా సీరియస్ గా ఉండటంతో రెండో వారం పార్లమెంట్ లో గులాబీ లీడర్లు మరింత దూకుడుగా ఉంటారని అంతా భావించారు. కాని సోమవారం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ఎంపీల్లో చాలా మంది పార్లమెంట్ కు డుమ్మా కొట్టారు. వరిసాగుపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకుంటామని కేసీఆర్ చెప్పగా.. పార్లమెంట్ కు టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ ఆదేశాలను టీఆర్ఎస్ ఎంపీలు లైట్ తీసుకుంటున్నారా లేక బియ్యంపై పోరాటంలో కేంద్రం పట్టించుకోవడం లేదని వాళ్లు డుమ్మా కొట్టారా అన్నది చర్చగా మారింది.  అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు హాజరుకాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లవద్దని కేసీఆరే సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంతో కేసీఆర్ రాజీకి వచ్చి ఇలా చేయలేదట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమట. ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారడటంతో  ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  దీంతో నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్‌లకు వెళ్లారు. ప్రతి ఓటు కీలకం కావడంతో క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ లో ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు గోవా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపులకు వెళ్లారు.  ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారని చెబుతున్నారు. పోలింగ్ కు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో పోలింగ్ ముగిసిన తర్వాతే ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.  

సంక్రాంతి తర్వాత పెను గండమే! దేశాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్..  

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. డిసెంబర్ 5 నాటికే కొత్త వేరియంట్ దాదాపు 40 దేశాలకు పాకింది. ఒమిక్రాన్ ను మొదట గుర్తించిన సౌతాఫ్రికాలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్ కేసులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మిగిస్తోంది. ఇప్పటికే 21కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ఇందులో రాజస్థాన్ లో 9, మహారాష్ట్రలో 6, గుజరాత్, ఢిల్లీలో  ఒక్కో కేసు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ ఒమిక్రాన్  రిస్క్ దేశాల నుంచి వందలాది మంది వస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే 13 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే వాళ్ల శాంపిల్స్ ను జీనోమ్ టెస్టుకు పంపగా.. ఇక్కడ రిపోర్టులు రాలేదు. ఆ ఫలితాలు వస్తేకాని విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు సోకింది ఒమిక్రానా లేదా మరో వైరస్ అన్నది తేలనుంది.  ఒమిక్రాన్ కు సంబంధించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని తెలంగాణ డీహెచ్  శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయన్నారు. ఒకటి, రెండు నెలల్లో భారత్‌లోనూ ఒమైక్రాన్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్‌ గడల పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అర్హులంతా టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితా లోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారని తెలిపారు. విమానాశ్రయంలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామని చెప్పారు. ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు. ‘‘ఏ క్షణమైనా ఒమైక్రాన్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శ్రీనివాస రావు.  ఒమైక్రాన్‌ కేసులను దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు శ్రీనివాస రావు. తప్పుడు ప్రచారంతో వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.  ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నదని.. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైరస్‌ వ్యాప్తి పెరిగినా రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ విధించేంతటి ప్రభావం ఉండదని చెప్పారు.. ఒమైక్రాన్‌ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని.. ఈ లక్షణాలున్నవారు దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వేరియంట్‌ తీవ్రతపై అధ్యయనాలు జరుగుతున్నాయని, పూర్తి స్పష్టత వచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు. ఒమైక్రాన్‌ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతున్నాయన్నాయని.. కాని ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని శ్రీనివాసరావు చెప్పారు.

సరైన సమయంలో సరైన  సూచన.. అయినా జగన్  వింటారా? 

‘ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో  పదిహేను, పదహారు మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవమున్న ఆర్థిక మంత్రి...కొణిజేటి రోశయ్య. నలుగురైదుగురు ముఖ్యమంత్రుల ఆర్థిక మంత్రిగా ఆయన చరిత్రను సృష్టించారు.  ఆర్థిక క్రమ శిక్షణకు మారు పేరుగా నిలిచారు. అంత సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఆయన ఎప్పుడూ ఆర్థిక క్రమశిక్షణ గీత ‘పెద్ద’గా  దాటలేదు. చివరకు చేతికి ఎముక లేదని అనిపించుకున్న వైఎస్సార్ ప్రభుత్వంలోనూ ఆయన, సంక్షేమం,అభివృద్ధి మధ్య సమతుల్యత తప్పకుండా, ఆర్థిక నావను బాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు. అప్పట్లో ఆయన తరచూ, ‘ఎట్లో వేసినా ఎంచి వేయాలి’ అనే సామెతను గుర్తు చేయడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.నిజం. సంక్షేమ పథకాలు ఎంత అవసరమో, సుస్థిర అభివృద్దికూడా అంతే అవసరం.  ఇది యాదృచ్చికమే అయినా, పెద్దాయన రోశయ్య కన్నుమూసిన రోజునే, ఉప రాష్ర్జపతి వెంకయ్య నాయుడు, ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్లమెంట్  పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పీఏసీ) శత వార్షికోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఓటర్లను ఆకర్షించేందుకు ముందు వెనకా చూసుకోకుండా కురిపిస్తున్న ‘ఉచిత’ వరాలు పై  జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరగవలసిన అవసరం ఉందని అన్నారు. ఇది కూడా చాలా నిజం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విషయాన్నే తీసుకుంటే,  ఉచిత వరాల వలన, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన వంటి అనేక ఆశించిన ఫలితాలు దక్కకే పోయినా  అనర్ధాలు మాత్రం జరుగు తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం అందిన కాడికి అప్పులు చేస్తోంది.  ఆ అప్పులు తీర్చడం కోసం, అంచెలవారీ మధ్య నిషేధం వంటి ప్రకటిత లక్ష్యాలు పక్కకు పోయాయి. భవిష్యత్’లో మద్యం విక్రయాల ద్వారా వస్తుందని ఆశిస్తున్న అఆదయం కుదువ పెట్టి, ప్రభుత్వం ప్పులు తెచ్చింది. మరో వంక రేపటి అప్పులు తీర్చడం కోసం కావచ్చు.హై స్కూల్ విధ్యార్ధులు, స్కూల్ ఆవరణలోనే మద్యం సేవింఛి స్థితికి చేరుకుంటున్నారు  నిజం, జగన్మోహన రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్’గా మారిన నేపధ్యంలో, ఏపీని ఓకే కేసు స్టడీగా తీసుకుని పరిమిత వనరులను సంర్ధవంతంగా వినియోగించుకోవలసిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే విధంగా, జాతీయ స్థాయిలో చర్చ అవసరం. అందులో మరో అభిప్రాయానికి తావు లేదు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించారు. నిజంగా అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి అవసరమైన సహాయం, చేయూత ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, అన్నారు. ..ఇందులోనూ మరో అభిప్రాయానికి తావు లేదు. అయితే, ప్రస్తుతం ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్’ లో జరుగుతున్నది, అందుకు పూర్తి విరుద్ధం. ఆర్ధిక క్రమశిక్షణ అడుగంటి పోయింది. ఓట్ల కోసం ఉచిత వరాలను పందారం మాత్రమే జరుగుతోంది. ఫలితంగా ఏమి జరుగుతోందో చూస్తున్నాం. ఆస్తులు – అప్పుల మధ్య అసమతుల్యత అదుపుతప్పి పోయింది.రాష్రం్ల అప్పులు పెరిగి పోతున్నాయి. చివరకు అప్పులు కూడా  పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. గడిచిన 8 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు బడ్జెట్‌లో చూపించిన దానికి కంటే 34 శాతం అదనంగా ఉండటంతో ఆర్థిక నిపుణుల సైతం ఆందోళన చెందుతున్నారు. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దిగజారుతూ సంక్షోభంలోకి వెళుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితికి ఇంతకంటే ఉదాహరణలు అక్కర్లేదని నిపుణులు అంటున్నారు.  నిజానికి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలను మాత్రమే దృష్టికో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలను రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణికి దృష్టిలో ఉంచుకునే, ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చును. కానీ,, వెంకయ్య నాయుడు చేసిన సూచనలు ఏపీకి  బాగా అతికినట్లు సరిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన రెండున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలై పోయింది. నిన్న, మొన్న వరకు ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాధారణ ఖర్చులకు కూడా అప్పుల కోసం వెతుక్కునే పరిస్థితికి దిగజారిన పరిస్థితి చూస్తున్నాం..అధికార పార్టీ సభ్యులే పార్లమెంట్’లో  ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించే పరిష్తితి లేదని వాపోతున్నారు. ఆదుకోండని   కేంద్రాన్ని వేడుకుంటున్నారు .ఈ నేపధ్యంలో ఉప రాష్ట్రపతి చేసిన సూచన ...సరైన సమయంలో ఇచ్చిన సరైన సూచన..కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం వింటుందా ... అంటే .. అదే జరిగితే పరిస్థితి అంతవరకు వచ్చేదే కాదుగా నేది నిపుణులు ఇస్తున్న సమాధానం.   

దేశంలో 21కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. డేంజర్ జోన్ లో మహారాష్ట్ర, రాజస్థాన్ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. రాజస్థాన్ లో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే రాజస్థాన్ రాజధాని జైపూర్ లో తొమ్మిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారంతా వారం క్రితం సౌతాఫ్రికా నుంచి వచ్చినట్లు గుర్తించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8 ఒమిక్రాన్ కేసులు  నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఆదివారం గుజరాత్, ఢిల్లీలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పాజిటివ్ రాగా... వాళ్ల శాంపిల్స్ ను జీనోమ్ ల్యాబ్ కు పంపించారు, ా రిపోర్టులు వస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింతగా పెగరవచ్చని భావిస్తున్నారు.  తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో కరోనా కలకలం రేగింది. చెలిమేడ మెడికల్ కాలేజీలో 35 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన విద్యార్థులకు సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు

ముంబయి టెస్టు మనదే! రికార్డ్ గెలుపు ముంగిట కోహ్లీ సేన...

న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పూర్తి పట్టు బిగించింది. ముంబై టెస్టులో కోహ్లీసేన గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాని ఉంచిన టీమిండియా.. విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కూడా కివీస్ కు శక్తికి మించిన పనే.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రిజులో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత రెండో ఇన్నింగ్స్ లోనూ మయూంక్ అగర్వార్ విజృంభించాడు. 62 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో మయూంక్ 150 రన్స్ చేశాడు .ఇక సెకండ్ ఇన్నింగ్స్ చివరలో అక్షర్ పటేల్ ధాటీగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. భారత్ తరపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధిస్తాడని అనుకుంటుండగా.. ఏడో వికెట్ గా జయంత్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. 

ప్రభుత్వాన్ని కూల్చేస్తం.. వైసీపీకీ షాక్.. కేటీఆర్ పనికిరాడట.. మనదే విజయం.. టాప్ న్యూస్@ 7PM

వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని అన్నారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు.  ------ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుంజుకుంటోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో వైసీపీకి షాకిచ్చారు. సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 వైసీపీ కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.  ------- కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నార ------- ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అంతేకాదు సముద్రపు అలల తాకిడికి భూమి బీటలు వారింది. అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడివరకు కోతకు గురైంది. అటు చిల్డ్రన్‌పార్క్‌లో అడుగు మేర భూమి కుంగింది. పార్క్‌ సమీపంలో కూడా పది అడుగులు కుంగింది. భూమి కుంగడంతో ప్రహారీగోడ కూలింది. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు చిల్డ్రన్‌పార్క్‌ వైపు రాకపోకలను నిలిపివేశారు ------- చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అతివేగంగాడివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు కారులో మంటలు చేలరేగాయి. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనమైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో మరో మహిళ, ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతున్నారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులుగా గుర్తించారు. చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘటనచోటుచేసుకుంది.  ------ సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు.  ------ కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు.. మున్సిపల్ మంత్రిగా పనికిరారని కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ విమర్శించారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే కేటీఆర్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 2 ఎమ్మెల్సీల కోసం ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ అవుతుందన్నారు.  -------- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు తరచుగా రాష్ట్రానికి వస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ఎదురుదాడికి దిగారు. ఢిల్లీలో సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట సిద్ధూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఇవాళ కాంట్రాక్టు టీచర్లు సీఎం  ఇంటివద్ద ధర్నాకు ఉపక్రమించారు. వారితో కలిసి సిద్ధూ కూడా నిరసన తెలిపారు. ---- నాగాలాండ్‌లో సైనిక సిబ్బంది కాల్పుల్లో పొరపాటు కారణంగా 14 మంది పౌరులు సహా జవాన్ మృతి చెందారు. నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారు. ----- ముంబయి టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాన్నుంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు.

కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ కు సీరియస్ 

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు తుపాకీ మిస్ ఫైర్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు తనకు తెలపాలని ఆదేశించారు. . ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు.

60 లక్షల ఓట్లు.. సర్కార్ ను కూల్చేస్తం! ఏపీఎన్‌జీవో నేత కామెంట్ల కలకలం.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. పీఆర్సీ సహా పెండింగ్ సమస్యలను పరిష్కారానికి ముందుకు రావడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. రెండున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇక ఊరుకునేది లేదంటూ ఉద్యమ బాట పడుతున్నారు. ఈనెల 1వ తేదిన సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇచ్చారు. అందులో తమ డిమాండ్ల పరిష్కారానికి వారం రోజుల గడువు ఇచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు ఏపీ ఉద్యోగులు. తమ సహకారం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని చెబుతున్నారు.  జగన్ సర్కార్ పై అన్ని వర్గాల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని ఆయన అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అటువంటిదే.. ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లని విమర్శించారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని బండి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవో నేత మాట్లాడిన మాటల ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీలో గుబులు రేపుతున్నాయి. బండి శ్రీనివాస రావు ఒక్కరే కాదు ఉద్యోగులందరి అభిప్రాయం ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఏం చేయబోతోంది, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

ప్రియుడిపై యాసిడ్ పోసి.. కత్తితి పొడిచి.. పెళ్లి చేసుకోలేదని ప్రియురాలు కిరాతకం

ప్రేమకు ఒప్పుకోవడం లేదని, పెళ్లికి నో చెబుతుందని  ప్రేమికులు. యువతులపై యాసిడ్ పోయడం తరుచూ జరుగుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్సైంది. తనతో సహజీవనం చేయడం లేదని ప్రియుడిపైనే ప్రియురాలికి దాడికి దిగింది. ఏకంగా  యాసిడ్ పోసింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదేమో... కత్తితో పొడిచేసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో పట్టపగలే జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడాడు ఓ యువకుడు. దీంతో కొపం పెంచుకున్న ప్రియురాలు మాట్లాడుకుందాం అని వచ్చి యాసిడ్‌ పోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పొడిచింది. ఆ తర్వాత తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంనకు చెందిన రాకేష్‌(30), కాంచీపురానికి చెందిన జయంతి (27) మూడేళ్లుగా దుబాయ్‌లోని ఓ మసాజ్ సెంటర్‌లో పనిచేశాడు. చెంగల్పట్టు జిల్లా మీనంబాక్కం తిరువల్లువర్ రోడ్డుకు చెందిన జయంతి (27) కూడా ఇదే మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. జయంతికి వివాహమై ఒక ఆడపిల్ల కూడా ఉంది. కానీ ఆమె భర్త నుండి విడిపోయి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. దుబాయ్‌లో ఒకే చోట పని చేస్తూ రాజేస్-జయంతి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సహాజీవనం కూడా చేశారు. ఈ స్థితిలో రాకేష్ తన సోదరి పెళ్లి కోసం కేరళ వెళ్తున్నట్లు జయంతికి చెప్పాడు. ఇలా ఇద్దరు అర్నెల్ల క్రితం దుబాయ్ నుంచి తమిళనాడుకు తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్‌ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రాకే‌ష్‌పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 

రోశయ్య చేసిన నేరం ఏమిటి? జగన్ పగకు అదే కారణమా? 

రాజకీయాలలో  ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల్లో అజాతశత్రువు అనే మాటకు అర్థం లేదు. అలాంటి  వారు ఎవరూ ఉండరు. ఎంత మంచి మనిషి అయినా, ఇంకెంత గొప్ప నాయకుడే అయినా, వారికి కూడా శతృవులు అనివార్యంగా ఉంటారు. కానీ, చావులోనూ, శతృమిత్ర భేదం చూపే కుసంస్కారం మాత్రం అందరిలో ఉండదు. కొందరిలోనే ఉంటుంది. అలాంటి వికృతిని ఇప్పుడే చూస్తున్నాం ... అది కూడా ఒక ముఖ్యంత్రి స్థాయిలోని వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఆయనకే కాదు, రాష్ట్రానికి కూడా అవమానం. మాయని మచ్చఅంటున్నారు.  సహజంగా  ఒక నాయకుడు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడం, కుటుంబ సబ్యులను సభ్యులను పరామర్శించి, నాలుగు మంచి మాటలు చెప్పి రావడం సంస్కారవంతులు  ఎవరైనా చేసే పని. ముఖ్యంగా, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరైనా ఈ పాటి సంస్కారం లేకుండా ఉండరు. చనిపోయిన వ్యక్తులు రాజకీయ ప్రత్యర్దులే అయినా, శవాన్ని కూడా ద్వేషించే సంస్కార హీనులు సహజంగా అయితే ఎవరూ ఉండరు. అలాని మనం  అనుకుంటాం.కానీ,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళ నాడు మాజీ గవర్నర్ అన్నిటినీ మించి తమ (వైఎస్) కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, కొణిజేటి రోశయ్య మరణం పట్ల  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించని తీరు చూస్తే, ఉంటారేమో అనుకోక  తప్పడం లేదు.  అందుకే అనేక మంది ముఖ్యమంత్రి ప్రవర్తన విచారం, విషాదం మాత్రమే కాదు రాష్ట్రానికి అవమానం అంటున్నారు. అంతే కాదు జగన్మోహన్ రెడ్డి, దివంగత మాజీ ముఖ్యమంత్రిని అవమానించి  తనను తాను అవమానించు కున్నారు. తక్కువచేసుకున్నారు. ఈయన వెళ్లి నివాళులు అర్పించక పోవడం వల్లనో, కుటుంబాన్ని పరామర్శించక పోవడం వల్లనో పెద్దాయన రోశయ్యకు ప్రజల్లో ఉన్న గౌరవ, మర్యాదలు తగ్గిపోవు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనమంత్రి వర్గ సహచరులు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఇంకా అనేక   మంది మాజే ముఖ్యమంతరులు, మంత్రులు, విభిన్నవర్గాలకు చెందిన ప్రముఖులు స్వయంగా రోశయ్య భౌతిక కాయన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించింది.  నిజమే రోశయ్య హైదరాబాద్ లో స్థిర పడ్డారు.అక్కడే కన్నుమూశారు. అయినా, ఆయన ఏపీకి చెందిన నేత..తెలుగు ప్రజల నాయకుడు. అయినా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దివంగత నేత రోశయ్య విషయంలో కనీసం ప్రోటోకాల్ నిబంధనలను కూడ పాటించలేదు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులను పంపి ఊరుకున్నారు. ఎందుకలా ప్రవర్తించారు, అందుకు జగన్రెడ్డి నిజమే అంత... రాజకీయాలకోసం తల్లినీ చెల్లినీ కూడా  దూరం చేసుకున్న ఆయన ముంచి ఇంతకు మించిన సంస్కారం ఆశించడం కూడా అన్యాయమే అనేవాళ్ళు ఉన్నారు. అలాగే,  వైఎస్ మరణం తర్వాత తనకు రావలిసిన ముఖ్యమంత్రి పదవి, రాకుండా రోశయ్య అడ్డుపడ్డారనే ఆక్రోశం, పగ ఆయనలో ఇంకా మిగిలే ఉన్నాయని, అనుకోవచ్చుననీ  అంటున్నారు. నిజానికి వైఎస్సార్ హెలికాప్టర్  ప్రమాదంలో చనిపోయినప్పుడు,జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా  ముఖ్యమంత్రి పదవి తనకు దక్కుతుందని ఆశించారు. ఆశించడమే కాదు,  వైఎస్ అంత్యక్రియలు అయినా పూర్తికాకముందే , తమకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం, సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని కాదని, రోశయ్యకు అవకాశం ఇచ్చారు. రోశయ్య అయిష్టంగానే, ముఖ్యమంత్రి పదవిని అంగీకరించారు..ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాలలో, ఇంటర్వ్యూ లలో స్పష్టం చేశారు.. అయినా .. జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఆ పగ ఇంకా అలాగే ఉండిలా ఉంది .. అందుకే, ఆయన మరణించిన రోశయ్యను అవమానించి అనడం పొందుతున్నారు అనుకోవచ్చును. అయితే ఇది ఆయన అజ్ఞానం, కాదంటే మూర్ఘత్వం అనిపించుకుంతుందే కానీ ఇంకొకటి కాదని, అంటున్నారు.

 అమరావతితోనే ఏపీ అభివృద్ధి.. రైతులకు జేడీ లక్ష్మినారాయణ మద్దతు

అమరావతి రైతులకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో సాగుతున్న మహా పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం రైతుల యాత్ర నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం బాలాయపల్లికి చేరుకున్న జేడ లక్ష్మినారాయణ.. అమరావతి రైతులను కలిశారు. వాళ్లతో కలిసి కొంత దూరం నడిచారు.  అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే  అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్బంగా జేడీ లక్ష్మినారాయణ అన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలలో ముగిసి వెంకటగిరి నియోజకవర్గంలోకి ఎంటరైంది. రైతుల మహా పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

డిసెంబర్7న బీజేపీలోకి తీన్మార్ మల్లన్న..

తెలంగాణలో సంచలనంగా నిలిచిన ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రాజకీయంగా మరో ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యారు.  కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన కమలం పార్టీలో చేరబోతున్నారు. డిసెంబర్ 7న  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నట్లు తీన్మార్ మల్లన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని. డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు. ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మల్లన్న.  జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ కేసు పెట్టడంతో తీన్నార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతనిపై మొత్తం 37 కేసులు నమోద్యయాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులు అరెస్ట్ చేశారు. 107 రోజుల జైలు జీవితం తర్వాత తీన్మార్ మల్లన్న జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే మల్లన్న జైలులో ఉన్న సమయంలో అతన్ని విడుదల చేసుకునేందుకు మల్లన్న భార్య చాలా ప్రయత్నాలు చేసింది.  బీజేపీ పెద్దలను కలిసి వినతి చేసుకుంది. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్షాకు మెయిల్ ద్వారా ఓ విన్నపం విన్నవించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన భర్త నిరంతరం పోరాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన సెక్షన్ల కింద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారని వివరించారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో ప్లేస్లో నిలిచారన్నారు. తన భర్త తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలనుకుంటు న్నారని తెలుపడం జరిగింది. అవసరమైతే బీజేపీ పార్టీలో చేరతామని, మా ఆయనకు బెయిల్ ఇప్పించాలని వేడుకుంది. దీంతో మల్లన్న బీజేపీ గూటిలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ ఆయన తొందరపడలేదు. డిసెంబర్ 7న బీజేపీలో చేరుతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. 

అమరావతికి జేడీ జై.. రోశయ్యకు నివాళి.. కొవిడ్ పంజా.. జనాలను చంపేశారు.. టాప్ న్యూస్@1PM

అమరావతి రైతుల మహాపాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు.  ------ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామన్నారు. రోశయ్య ఆర్థిక నిపుణుడు, అద్భుత మేధావి అని కొనియాడారు. తాను శాశనసభ చూడాలనుకున్నపుడు మొదట రోశయ్యనే చూశానన్నారు. రామారావు, రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ఎంతో నేర్చుకున్నానన్నారు. ------- కర్నూలు జిల్లా సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా గండి ద్వారా నీరు లీకేజీ అవుతోంది. దీంతో నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు అలుగు కొట్టి ఫారెస్టులోకి నీరు వదులుతున్నారు. సిద్దాపురం చెరువులో ప్రస్తుతం 19 అడుగుల మేర నీరు ఉంది. కాగా చెరువులోని నీరు వృధాగా బయటకు వదులుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ---------- దర్శి మోడల్ స్కూల్ వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. పాఠశాల భవనం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఫుడ్ మెనూ సక్రమంగా పాటించటం లేదంటూ బాలికలు నినాదాలు చేశారు. తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు --------- కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతూ పోలి స్వర్గానికి పంపించారు. మహిళలు అరటి డోప్పల్లో 31 వత్తులు వెలిగించి ఓం నమ:శివాయ అంటూ కార్తీక దీపాలను వదిలారు. అలాగే శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అటు నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ----------- రెండు వారాల క్రితం హైదరాబాద్ లో స్వల్పంగా ఉన్న కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బహదూర్‌పల్లిలో ఓ యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడ్డారు. తాజాగా బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ టౌన్‌షి‌ప్‌లో పది మందికి కరోనా సోకింది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 66 ఉన్న సంఖ్య ఈ నెల 3కు 82కు చేరింది. -------- జమ్మూ-కశ్మీరులో కొత్తగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను  సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని చెప్పారు. ------ ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది పౌరులు చనిపోయారని తెలుస్తోంది.మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.  మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  --------- యాంకర్ అనసూయ ఇంట విషాదం నెలకొంది. ఆవిడ తండ్రి సుధాకర్ రావు ఖస్బా మృతి చెందారు.  ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్న ఆయన తార్నాకలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉండే కాలంలో సుధాకర్ రావు యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకి భార్య,  అనసూయ, వైష్ణవి కుమార్తెలు.  సుధాకర్ రావు మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. -------- ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సౌతాఫ్రికాలో మొదటగా వెలుగుచూసిన మాయదారి ఒమిక్రాన్‌ వైరస్ ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. అయితే ఒమిక్రాన్ తో ఇంతవరకు ఎవరూ చనిపోలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన సౌతాఫ్రికాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలు అయ్యింది. 

ఉగ్రవాదులుగా పొరబడి పౌరులపై జవాన్లు కాల్పులు.. 14 మంది మృతి! నాగాలాండ్ లో ఘోరం..

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది పౌరులు చనిపోయారని తెలుస్తోంది.మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారని, నిన్న సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. వారికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని వాపోయారు. తప్పుడు సమాచారంతో వారిని చంపేశారని విలపిస్తున్నారు.   కాల్పుల తర్వాత గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు హింసకు పాల్పడ్డారు.NSCN మిలిటెంట్లుగా పొరపాటుపడి అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆందోళనకు దిగారు.  భద్రతా సిబ్బందికి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ కాల్పుల్లో మరికొందరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో టిరు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. జవాన్లు కాల్పుల ఘటనపై నాగాలాండ్ సీఎం నైపూ రియో స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అని అన్నారు. అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులపై అత్యుతన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుందని.. బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు నాగాలాండ్ సీఎం. దయచేసి ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అనిల్ కుమార్ కు అన్నమయ్య సెగ.. కేంద్రం యాక్షన్ తప్పదా? 

కడప జిల్లాలో వరద బీభత్సానికి కారణమైన అన్నమ్మయ్య ప్రాజెక్టు జగన్ సర్కార్ కు చెమటలు పట్టిస్తోంది. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు టెన్షన్ పెట్టిస్టోంది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఘోరానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇప్పటివరకు తమ బాధ్యతేమీ లేదని.. అంతా ప్రకృతి తప్పేనని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే షెకావత్ ప్రకటనతో విపక్షాలు చెబుతున్నదే నిజమైంది. గ్రీజు పెట్టడానికి కూడా జగన్ సర్కార్ దగ్గర నిధులు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేయడంతో రాష్ట్ర సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదిలా ఉండగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి నిర్వహణ లోపమే కారణమని చెప్పిన కేంద్రమంత్రి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అయితే ఎప్పటిమాదిరిగానే ఎదురుదాడికి దిగాడు. ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి అలవాటైన పద్దతిలో టీడీపీకి అంటు కట్టేశారు. కేంద్రమంత్రి పక్కన  అక్కడ సీఎంరమేష్ ఉన్నాడు.. సుజనా చౌదరి ఉన్నాడు.. వాళ్లే ఈ పిట్ట కథ చెప్పించి ఉంటారని సెటైర్లు వేశారు అనిల్ కుమార్ యాదవ్.షెకావత్ ప్రకటన చేస్తున్న సమయంలో సీఎం రమెష్ టీవీ స్క్రీన్లలో రెండు వరుసల వెనుక ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారుతోంది.  సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు కావడంతో సభలోనే ఉంటారు. అంతదానికి ఆయనకు అంటకట్టడం విచిత్రంగా కనిపిస్తోంది.  ఏపీ మంత్రి అనిల్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతలు ఎవరు ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా ఉండే బీజేపీ నేతలు ఒక్క సారిగా రెచ్చిపోయారు. సమస్య ఏదైనా టీడీపీతో లింక్ పెట్టి విమర్శలు చేసే జీవీఎల్ నరసింహారావు వెంటనే స్పందించారు. అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. నిజాలు చెబుతూంటే అంత ఉలుకెందుకని మండిపడ్డారు. మూడు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. వాన,వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర జలవనరుల శాఖా మంత్రి షెకావత్ రాజ్యసభలో ప్రకటన చేశారని అంటున్నారు.ఇప్పుడు ఆ నివేదికను బయట పెట్టి కేంద్రం విచారణ జరిపితే ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుపోతుందని, అనిల్‌కుమార్‌కూ ఇక్కట్లు తప్పవని అంటున్నారు. జగన్ సర్కార్ బండారం కూడా బయటపడుతుందని భావిస్తున్నారు.

సౌతాఫ్రికాలో చిన్నారులకు వైరస్.. ఒమిక్రాన్ పంజా విసురుతోందా? 

ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒమిక్రాన్‌ 38 దేశాలకు వ్యాపించిందని.. ఎవరూ చనిపోలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన సౌతాఫ్రికాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలు అయ్యింది. ఒమైక్రాన్‌ వెలుగుచూశాక.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 16,055 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో 800 కేసులు ఒమైక్రాన్‌ జన్మస్థానం గౌటెంగ్‌ ప్రావిన్సువేలోనే నమోదయ్యాయి. అయితే, కొత్త కేసుల్లో ఐదేళ్లలోపు పిల్లలు అధికంగా ఉండడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ ‘ఒకటో, రెండో వేవ్‌లో పిల్లలు పెద్దగా కొవిడ్‌కు గురికాలేదు. ఆస్పత్రుల పాలవలేదు. మూడో వేవ్‌లో ఐదేళ్లలోపు పిల్లలతో పాటు 15-19 ఏళ్ల మధ్య వయసు వారు కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఇప్పుడు నాలుగో వేవ్‌లో ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు భారీగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మేం అంచనా వేసిన దానికంటే ఇది తక్కువే. అయితే, 60 ఏళ్లు దాటిన రోగుల తర్వాత ఐదేళ్లలోపు పిల్లల చేరికే ఎక్కువగా ఉంది’’ అని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్‌ వాసిలా జస్సాత్‌ తెలిపారు. నాలుగో వేవ్‌ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉండడంపై మరింత పరిశీలన అవసరమని మరో నిపుణుడు డాక్టర్‌ మైకేల్‌ గ్రూమ్‌ పేర్కొన్నారు.  ఇక మన దేశంలో మరో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన వృద్ధుడి(72)కి, మహారాష్ట్రలోని ముంబై శివారు కల్యాణ్‌ డోంబివ్లి వాసి, మెరైన్‌ ఇంజనీర్‌ అయిన యువకుడి (33)కి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఈ వేరియంట్‌ బారినపడిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. జామ్‌నగర్‌ వృద్ధుడు కొన్నేళ్ల నుంచి జింబాబ్వేలో ఉంటున్నారు. బంధువులను కలిసేందుకు నవంబరు 28న భారత్‌ వచ్చారు. జ్వరంగా ఉండడంతో పరీక్ష చేయించుకున్నారు. గురువారం పాజిటివ్‌ అని తేలింది. జన్యు విశ్లేషణ ఫలితాల్లో ఒమిక్రాన్‌ ఉన్నట్లు స్పష్టమైంది. ముంబై యువకుడు దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా గత నెల 23న ఢిల్లీ వచ్చాడు. టెస్టులకు నమూనా ఇచ్చి, ముంబై చేరుకున్నాడు. తాజాగా ఇతడికీ ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది.  మరోవైప ుముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారు కొవిడ్‌ టెస్టులను తప్పించుకుంటుండటం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. యూపీలోని మేరఠ్‌కు విదేశాల నుంచి వచ్చిన 300 మందిలో 13 మంది తప్పుడు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. వీరిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు  ఓ మహిళపై కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరులో ఇప్పటికీ 10 మంది ఆచూకీ తెలియడం లేదు. రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల, మరణాల రేటు ఎక్కువగా ఉంటుండడంతో కేంద్ర ప్రభుత్వం శనివారం తమిళనాడు, కేరళ, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చేవారిపై పర్యవేక్షణ పెంచాలని, పెద్దఎత్తున కేసులు వస్తున్న ప్రాంతాల్లోని నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని సూచించారు.  గత వారం కశ్మీర్‌లోని కథువా జిల్లాలో కేసులు 727 శాతం, కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో 152 శాతం, తమిళనాడులోని మూడు జిల్లాల్లోనూ కేసులు పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. కేరళలో మరణాలు అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఒక డోసు టీకా కూడా వేయించుకోని వారికి హోటళ్లు, మార్కెట్లలోకి ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ తమిళనాడు మదురై కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ నగరంలో 3 లక్షల మంది ఇంకా తొలి డోసు కూడా పొందలేదు.