అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? వైసీపీ నేతలను చీల్చి చెండాడిన రఘురామ.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి విరుచుకుపడ్డారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు దిగజారి వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? రాస్కెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అసలు బీజేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని ఆరోపించారు. ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పారని ఎంపీ రఘురామ  గుర్తు చేశారు. ప్రభుత్వ  అరాచకాల మీద పోరాటం చేస్తున్నందుకు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అన్నారు. పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. దౌర్జన్యపు సైన్యంలా వలంటీర్ వ్యవస్థ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆరోపించారు.రైతులు అమరావతి కోసం భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. అమరావతి నుంచి ఒక్కొక్క కార్యాలయాన్ని తరలిస్తున్నారని మండిపడ్డారు.   స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామ అన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెబితే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారని, ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు.. అంతా గుర్తున్నా వారి వారి చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారన్నారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్, జార్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో గుర్తుండిపోతారనే తన బాధంతా అని ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు.

తుస్సుమ‌న్న‌ ఉద్యోగ సంఘాలు!.. వార్నింగ్‌లు ఇచ్చిన నేత‌లే వేడుకోలు..

ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌న్నా మేమే.. నిల‌బెట్టాల‌న్నీ మేమే.. పీఆర్సీపై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మోసం చేసింది. వైసీపీ ప్ర‌భుత్వంపై మాకు న‌మ్మ‌కం లేదు. మంగ‌ళ‌వారం నుంచి తొలిద‌శ ఉద్యమం. అయినా, ముఖ్య‌మంత్రి దిగిరాక‌పోతే.. రెండో ద‌శ ఉద్య‌మంతో స‌త్తా చాటుతాం. ఇదీ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమ‌రావ‌తి.. ఇన్నాళ్లూ చేసిన హెచ్చ‌రిక‌లు. క‌ట్ చేస్తే.. మంగ‌ళ‌వారం రానే వ‌చ్చింది. తొలిద‌శ ఉద్య‌మం మొద‌లైంది. ఉద్యోగులు న‌ల్ల‌బ్యాడ్జీల‌తో విధుల‌కు హాజ‌ర‌య్యారు. భోజ‌న విరామ స‌మ‌యంలో ర్యాలీలు తీశారు. అయితే, ఉద్యోగుల్లో ఐక్య‌త లేదు. ఉద్యోగ సంఘ నేత‌ల్లో మునుప‌లి వాడి-వేడి క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వంతో తేల్చుకుంటామన్న నేత‌లే.. ఇప్పుడు కాళ్ల‌బేరానికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. పైనుంచి బాగా ఒత్తిడి వ‌చ్చిన‌ట్టుంది. బెదిరింపులూ గ‌ట్టిగానే ఇచ్చిన‌ట్టున్నారు. దెబ్బ‌కు మాట‌ మారిపోయింది. గొంతులో గాంభీర్యం త‌గ్గిపోయింది.  ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడంలేదని నమ్ముతున్నామని చెప్పారు. పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యమాన్ని విరమించి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తామని చెప్పారు. తామంతా ముఖ్యమంత్రి బిడ్డలమని, కోపం వస్తే అలగడం సహజమని బండి శ్రీనివాసరావు అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అందులో భాగమేనన్నారు. ప్రభుత్వం మొండిగా ఉండేటట్లు అయితే తిరుపతిలో పీఆర్సీ ఇస్తామని చెప్పరని శ్రీనివాసరావు అన్నారు. రెండు రోజుల క్రితం ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేది మేమేనంటూ వార్నింగ్ ఇచ్చిన బండి.. తాజాగా సీఎంకు పాలాభిషేకం, పుష్పాభిషేకం అంటూ కాకా ప‌డుతుండ‌టం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు.  మ‌రో సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సైతం స‌ర్కారుపై సాఫ్ట్ కార్న‌ర్ వ‌హించారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేదని చెప్పారు. ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఉద్యోగుల్లో ఉందన్నారు. మ‌రీ, బండి శ్రీనివాస‌రావులా కాళ్ల‌బేరానికి రాకుండా.. బొప్ప‌రాజు ప్ర‌భుత్వంపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ‘‘ప్రభుత్వం మొక్కుబడిగా ఒకట్రెండు సమావేశాలు నిర్వహించింది. దీనివల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. పీఆర్సీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదు. కనీసం దానికి సంబంధించిన నివేదిక బయటపెట్టలేదు. దానికి కూడా ఎందుకు జంకుతున్నారు. నివేదిక బహిర్గతం చేయనివాళ్లు పీఆర్సీ ప్రకటిస్తారని ఎలా అనుకుంటాం?’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇలా.. రెండు ప్ర‌ముఖ ఉద్యోగ సంఘాల నేత‌లు తొలి ద‌శ ఉద్య‌మం ప్రారంభ‌మైన తొలినాడే.. ఇలా మెత‌క మెత‌క మాట‌లు మాట్లాడ‌టం చూస్తుంటే.. ఉద్యోగ సంఘ నాయ‌కులు మొద‌ట్లోనే చేతులెత్తేశాయ‌ని.. తెర వెనుక ఏదో జ‌రిగింద‌ని.. మిగ‌తా ఉద్యోగులు మండిప‌డుతున్నారు. 

ఎంపీని ఆహ్వానించకుండా అవమానం.. గుంటూరు వైసీపీలో ముసలం

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. గుంటూరు వైసీపీలో ముసలం పుట్టింది. కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలు, ఎంపీలపై నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మంత్రుల పర్యటనకు తనకు ఆహ్వానం లేకపోవడంపై అధిష్టానానికి ఎంపీ లావు కృష్ణదేవరాయ ఫిర్యాదు చేశారు.  చిలకలూరిపేట మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి  మంత్రులు బాలినేని, రంగనాథరాజు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి  ఎంపీ కృష్ణదేవరాయకు ఆహ్వానం అందలేదు. ఎంపీని  సొంతపార్టీ నేతలు, మంత్రులు పట్టించుకోలేదు. దీనిపై ఎంపీ కృష్ణదేవరాయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొందరు నేతలు కావాలనే తనకు ఆహ్వానం అందకుండా చేశారని ఎంపీ కృష్ణదేవరాయ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రజనీ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా  ఉప్పూ నిప్పుగా ఉంటున్నారు  నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ. ఈ రెండు వర్గాలు చాలా సార్లు బహిరంగ రచ్చకు దిగాయి. గత సంవత్సరం  చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని స్ధానిక వైసీపీ నేతలు ఎంపీని ప్రశ్నించారు. తాను పరామర్శ కోసమే వచ్చానని ఎంపీ చెప్పినా వారు వినిపించుకోలేదు. ఎంపీ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. తర్వాత కూడా పలు సార్లు ఎమ్మెల్యే, ఎంపీలు ఓపెన్ గానే విమర్శలు చేసుకున్నారు. 

ఒమిక్రాన్‌తో భారీగా మూడో ముప్పు!.. కేంద్రానికి ఐఎంఏ హెచ్చ‌రింపు..

ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌-ఐఎంఏ. కొవిడ్ గురించి, ఒమిక్రాన్ గురించి, థ‌ర్డ్ వేవ్ గురించి.. వారికంటే ఎక్కువ అవ‌గాహ‌న‌ ఇంకెవ‌రికీ ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి ఐఎంఏ.. తాజాగా ఒమిక్రాన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్రానికి కీల‌క‌ సూచ‌న‌లు చేసింది. బూస్ట‌ర్ డోస్‌.. థ‌ర్డ్ వేవ్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 23కి చేరిన సంద‌ర్భంగా ఐఎంఏ వ్యాఖ్య‌లు అప్ర‌మ‌త్త‌త‌ను సూచిస్తోంది. ఇంత‌కీ ఐఎంఏ ఏం చెప్పిందంటే..... ‘దేశంలోని కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ వెలుగుచూడ‌టం పెద్ద ఎదురుదెబ్బ. దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీ స్థాయిలో మూడో వేవ్‌ను చవిచూడాల్సి రావొచ్చు’ అని హెచ్చరికలు చేసింది. ‘ఈ సమయంలో మనం వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ వహిస్తే.. భారత్ ఒమిక్రాన్ ప్రభావాన్ని తప్పకుండా అధిగమించగలదు. అర్హులంతా  టీకా తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. ఇప్పటివరకు టీకాలు చేరుకోనివారికి అవి అందేలా చూడాలి. రెండో డోసు తీసుకోవాల్సిన వారిపై శ్రద్ధ పెట్టాలి. ఈ క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వడంపై అధికారికంగా ప్రకటన చేయాలని కోరుతున్నాం’ అని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.   ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో తీవ్రత తక్కువే ఉందని, డెల్టాతో పోలిస్తే మాత్రం 5 నుంచి 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ఐఎంఏ తెలిపింది. ప్ర‌జ‌ల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అంటువ్యాధిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రయాణాలపై ఆంక్షలను తాము సమర్థించనప్పటికీ.. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది.  ఆఫ్రికన్ దేశాల్లో అమిక్రాన్‌ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత.. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య స‌డెన్‌గా పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు వేసే ప్రతిపాదనపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది ఐఎంఏ.    

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ పై సంచలనం..

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వలసల జోరు కొనసాగుతోంది. ఉద్యమ నేతలంతా ఒక్కొక్కరుగా బీజేపీ గూటికి చేరుతున్నారు. సోమవారం ఉద్యోగ సంఘం నేత విఠల్ కాషాయ కండువా కప్పుకోగా.. మంగళవారం జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  సమక్షంలో  కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి  బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.  బీజేపీలో చేరిన తర్వాత మీడియా సమావేశంలో  మాట్లాడిన తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్ అన్నారు. ఆయన భరతం పట్టడమే తన లక్ష్యమని చెప్పారు. ‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా అంటూ కామెంట్ చేశారు మల్లన్న.   ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే..ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి.. తాడు తీసుకొచ్చేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు.  తనపై 38 కేసులు పెట్టారు. అయినా ఏం సాధించారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారని, ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతామని తీన్మార్ మల్లన్న తెలిపారు.  దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే అన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారని చెప్పారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారని తెలిపారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోంది. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని తరుణ్ చుగ్ మండిపడ్డారు.    

ఎంపీల బూతు పురాణం.. పార్లమెంట్ లో పరువు గోవిందా ! 

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నడుస్తోంది. తెలుగు ప్రజల పరువు తీసే విధంగా ఉభయ రాష్ట్రాల అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన అసభ్యంగా ఉంటోంది.ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు బూతులు చల్లుకున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రుల మధ్య కూడా తిట్ల పురాణం సాగింది. ఇక ఇప్పుదు ఏకంగా దేశ రాజదాని ఢిల్లీలో, అది కూడా  ప్రజాస్వామ్య దేవాలయం అనుకునే పార్లమెంట్’లో ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల సభ్యుల ప్రవర్తన తెలుగు ప్రజల పరువు తీసేలా ఉందని, పార్లమెంట్ లో జరుగతున్న పరిణామాలను గమనిస్తున్న ప్రజలు, పరిశీలకులు విచారం వ్యక్త పరుస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, మంత్రులు,ఎమ్మెల్యేలు చివరకు అధికార పార్టీ సాధరణ కార్యకర్త వరకు ప్రతి  ఒక్కరూ కూడా,భాష విషయంలో వైసీపీ తయారు చేసుకున్న బూటు వ్యాకరణ సహిత ‘కొత్త నిఘంటువు’నే ఫాలో అవుతున్నారు.  మొన్నటికి మొన్న రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడి శ్రీమతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఏవిధంగా అవమానించింది. ఎంతలా బాధించింది చూశాం.. చివరకు అంతటి నాయకుడు,జీవితంలో మొదటి సారి మీడియా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కాదు, బోరుబోరున విలపించారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత చట్ట సభల దుస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు.ఇంకా విషాదం, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన, వారి భాషను, సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సమర్ధించారు. ఆయన తమ స్థాయిని  మరిచి మాజీ ముఖ్యమంత్రి బాధను, ‘డ్రామా’ అంటూ మరింత గాయ పరిచారు. చివరకు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సభలో అసలేమీ జరగలేదు, ఎవరూ గీత దాటలేదని బూతు బాబులకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు.ఈ వ్యవహారం వైసీపీ కుసంస్కారాన్ని, స్త్రీలపై ఆపార్టీకి ఉన్న నీచమైన అభిప్రాయాలను బయట పెట్టింది.  శాసనసభలో కానీ, పార్లమెంట్ లో కానీ, రాష్ట్రంలో జరుగతున్న అవినీతిని, హత్యా రాజకీయాలను, అధికార దుర్వినియోగాన్ని అసమర్థ నిర్ణయాలను, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఎవరైనా విమర్శిస్తే వారిపై భౌతికంగా కాకపోతే సంస్కారహీనమైన భాషతో దాడులు చేయడాన్ని వైసీపీ ‘ప్రవర్తనా నియమావళి’ గామార్చుకుందా, అనుకునేలా సభ్యుల ప్రవర్తన ఉంటోంది.చివరకు, పార్టీతో విభేదించిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై కూడా అధికార పార్టీ సభ్యులు అదే విధంగా ప్రవర్తించారు. రాయకూడని దుర్భాషలాడారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణిని అవమానిస్తే, లోక్ సభలో సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు తల్లిని ... అవమానించే విధంగా .. దూషించారు.   రాష్ట్రంలో  భారీ వరదల భీభత్సం జరిగితే ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరించి, కేంద్రం ముందు చులకనయ్యారు.ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో ప్రకృతి విలయంతో అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోయిన విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ పార్లమెంట్‌లో ప్రకటించి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని జాతీయ స్థాయిలో బహిర్గతం చేశారు. తమ తప్పు ఒప్పుకునే బదులు వైసీపీ సభ్యులు కొందరు కేంద్రమంత్రిపైనే దాడికి రాష్ట్ర ప్రజల పరువును మరింత దిగజార్చారు. ఇంకొక అధికార పార్టీ ఎంపీ అయితే, ఉద్యుగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడ లేదని, రాష్ట్ర అర్థిక పరిస్థితి దయనీయ స్థితిని పార్లమెంట్ వేదికగా ప్రపంచానికి రాష్ట్ర పరువును దిగజార్చారు.  ఇక తెలంగాణ ఎంపీల విషయానికి వస్తే  వరి విషయంలో అనవసర వివాదాన్ని సృష్టించి, రోజుకో వేషం వేస్తూ రాష్ట్ర పరువు తీసుకుంటున్నారు. కారణాలు కొంత భిన్నంగా ఉన్నా, తెలు ప్రజల పరువును పలచన చేయడంలో తెరాస సభ్యులు ఏమాత్రం తీసిపోలేదు. ఏపీ ఎంపీలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ వాతలు పెడితే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్, సహాయమంత్రి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ సాక్షిగా వరి ధాన్యం సేకరణకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుంచడం ద్వారా టిఆర్‌ఎస్ నేతలకు చురకలు అంటించారు.  మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల సభ్యులు తెలుగు వారి పరువును పార్లమెంట్ సాక్షిగా దిగజార్చారు.

శిల్పాచౌద‌రి క‌న్నింగ్ క‌హానీలు.. పోలీసుల‌కు చుక్క‌లు..

ఆమె మామూలు కిలేడీ కాదు. ఖ‌త‌ర్నార్ క్రిమిన‌ల్‌. 10 రూపాయ‌లు అప్పు పుట్ట‌డ‌మే క‌ష్ట‌మైన ఈ రోజుల్లో.. కోట్లకు కోట్లు అప్పులు చేయ‌డ‌మంటే మాట‌లా? అందులోనూ, సంప‌న్నుల‌ను బుట్ట‌లో వేసుకోవ‌డం మామూలు విష‌య‌మా? అది శిల్పాచౌద‌రి లాంటి క‌న్నింగ్ లేడీల‌కే సాధ్యం అనేలా ఆమె నేరాల చిట్టా పోలీస్ విచార‌ణ‌లో బ‌య‌ట‌కువ‌స్తోంది. ఫిర్యాదు చేసింది ముగ్గురే అయినా.. ఆమె బాధితులు ప‌దుల సంఖ్య‌లో ఉంటారంటున్నారు. స్టేష‌న్ వ‌ర‌కూ వ‌చ్చింది 10 కోట్ల లోపు య‌వ్వార‌మే అయినా.. శిల్పాచౌద‌రి దోచుకుంది 200 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని తెలుస్తోంది. కానీ, రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి పెద్ద‌గా ఎలాంటి స‌మాచారమూ రాబ‌ట్ట‌లేక‌పోయారంటే శిల్పా ఎంత ప‌ర్‌ఫెక్ట్ క్రిమిన‌లో అర్థం అవుతోంది. ఖాకీల‌నే క‌న్ఫ్యూజ్ చేసేలా పొంత‌న‌లేని ఆన్స‌ర్లు చెప్పింద‌ట‌. ఎవ‌రికీ డ‌బ్బులిచ్చేది లేద‌ని.. ఇప్ప‌టికే అంద‌రికీ ఇచ్చేశాన‌ని.. త‌న‌నే ఓ ముగ్గురు మోసం చేశార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల మాట‌లు చెబుతూ.. చేతులెత్తేస్తోంది శిల్పా చౌద‌రి. అప్పుల్లేవ్‌.. గిప్పుల్లేవ్‌.. ఎవ‌రికీ ఏమీ ఇచ్చేది లేవ్‌.. నా పై కేసు పెట్టిన ఆ ముగ్గురికి మాత్రం అప్పు తిరిగి ఇచ్చేస్తా.. ఇదీ శిల్పాచౌద‌రి వ‌ర్ష‌న్‌. మ‌రి, ఆ డ‌బ్బుల‌న్నీ ఎక్క‌డ దాచావ్ అని పోలీసులు అడిగితే.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ చెప్పింద‌ట‌. ‘‘రాధికారెడ్డి, మల్లారెడ్డి, ప్రతాప్‌రెడ్డి ద‌గ్గ‌ర‌ నేను డబ్బు పెట్టాను. వారు నన్ను మోసం చేశారు’’ అని వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సో.. తానే మోస‌పోయాన‌ని.. త‌న‌ డ‌బ్బే వాళ్లు ఎగ్గొట్టార‌ని చెబుతోంది. విష‌యం తెలిసి రాధికారెడ్డి వెంట‌నే పోలీసుల ద‌గ్గ‌రికి వ‌చ్చారు. మాదాపూర్‌ ఏసీపీ, డీసీపీలను కలిశారు. శిల్పాచౌదరి తన ద‌గ్గ‌ర‌ తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడానికి ముప్పుతిప్పులు పెడుతోందని, ఆమె తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేద‌ని స్పష్టం చేశారు. అదే నిజ‌మైతే.. శిల్పాచౌద‌రి ఆ ముగ్గురి పేర్లు చెప్పి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అనుమానిస్తున్నారు.  మరోవైపు.. తనపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ శిల్పా చెబుతోంది. ఇది మ‌రో ఎత్తుగ‌డ‌. చాలా మంది సంప‌న్నులు బ్లాక్‌మ‌నీని వైట్ చేసుకునేందుకు.. శిల్పాచౌద‌రికీ పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇచ్చారు. ఆ న‌గ‌దుకు ఎలాంటి లెక్కాప‌త్రాలు లేవు. అందుకే, వారెవ‌రూ కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. డ‌బ్బులు పోయినా ల‌బోదిబో మ‌న‌టం లేదు. కార‌ణం అదంతా బ్లాక్‌మ‌నీ కావ‌డం. ఆ విష‌యం తెలిసే.. శిల్పా చౌద‌రి త‌న‌పై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డ‌బ్బులు తిరిగి ఇస్తాన‌ని పోలీసుల‌కు చెప్పిందంటున్నారు.  మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘వారికి అధిక వడ్డీ చెల్లించాను. మొత్తం లెక్కగడితే.. అసలు కంటే వడ్డీలే ఎక్కువగా ముట్టాయి’’ అని శిల్పా తెలివిగా స‌మాధానం చెప్పింద‌ని తెలుస్తోంది. ఇలా.. శిల్పాచౌదరి రెండు రోజుల కస్టడీలో పెద్ద‌గా ఎలాంటి స‌మాచారం రాబ‌ట్ట‌లేక‌పోయారు పోలీసులు. అందుకే, మిగతా రెండు కేసుల్లో ఐదు రోజుల కస్టడీ కోసం కోరారు. 

కర్నూల్ షిప్టింగ్.. వన్ ఛాన్స్ సీఎం.. పోరు బాట.. బలి తీసుకున్న మాఫియా.. టాప్ న్యూస్@1PM

మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ రాజధానిపై అందరి అనుమానాలు నిజం చేస్తూ.. తాము చేయాలనుకున్నపని చేస్తునే ఉన్నారు. అమరావతిలోని సంస్థలను ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కర్నూలుకు లోకాయుక్త, హెచ్చార్సీ సంస్థలను తరలించింది  జగన్ ప్రభుత్వం. ---- వన్ ఛాన్స్ అంటూ వచ్చి, కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలి పోబోతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో పేదల ఇళ్ల పైన రుణాలు రద్దు చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని రద్దు చేశారన్నారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ పాలన తీరు ఉందన్నారు. -- రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం ఉదయం తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. నల్లబ్యాడ్జీలతో  ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.  పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10 వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపనున్నారు. ఉమ్మడి జేఏసీలు తలపెట్టిన నిరసనలో భాగంగా ఉద్యోగులు స్వచ్ఛందగా ప్రభుత్వ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలుపుతున్నారు. ------- తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది. వరదల వల్ల పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద ఎక్కువైందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. దోమల బెడదతో తిరుపతి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ నేతలు నిరసనకు దిగారు.  ------ తూర్పు గోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీవో కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్.పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంఖరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులుపై కేసు నమోదు చేశారు. ----- తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో చోరీకి పాల్పడిన  ఆర్‌.భాస్కర్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సి్‌పకోర్టు న్యాయమూర్తి పి.కోటీశ్వరరావు తీర్పు చెప్పారు. 2019డిసెంబరు 29న శ్రీవారి దర్శనానికి వెళ్లిన భాస్కర్‌ హుండీలో దొంగతనానికి పాల్పడడంతో ఏవీఎస్వో చిరంజీవులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించాడు. ----- రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే ప్రభాస్.. మరోసారి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.  ---- ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చాకే ఒమిక్రావ్ వచ్చింది లేనిది నిర్దారణ కానుంది. ------ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చి పోయిన ఇసుక మాఫియా... వీఆర్‌ఏపై దాడి చేసింది. దీంతో వీఆర్‌ఏ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వీఆర్‌ఏ మృతి చెందాడు. ఈ ఘటనపై వీఆర్ఏ సంఘాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ------ కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో మారు కస్టడికి ఇవ్వాలని కోరుతూ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇతర నిందితుల పాత్రపై విచారణ జరపాల్సివుందని, నాలుగు రోజుల కస్టడి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కిడ్డీ పార్టీల పేరుతో కాజేసిన డబ్బు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం.. 

రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే ప్రభాస్.. మరోసారి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వచ్చిన వరదలకు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా నష్టం జరిగింది. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. సర్కార్ కు అండగా పలువురు విరాళాలు ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ప్రభాస్ భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. 

విజయసాయి పీఏ.. పైసా వ‌సూల్‌.. పోలీసులే ప‌రేషాన్‌..

విజ‌యసాయిరెడ్డి. జ‌గ‌న్‌రెడ్డి కేసుల్లో ఏ2నే కాదు వైసీపీలో నెం-2 కూడా. ఉత్త‌రాంధ్ర‌కు సామంత రాజు. ఆ మూడు జిల్లాల్లో ఆయ‌నదే రాజ్యం. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా విజ‌య‌సాయి క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంది. రియ‌ల్ ఎస్టేట్ దందాలు, అక్ర‌మాలు పెద్దఎత్తున చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌. మ‌రి, అంత ప‌వ‌ర్‌ఫుల్ అయిన విజ‌య‌సాయిరెడ్డికి పీఏ అంటే.. ఎంతోకొంత ఆయ‌న‌కూ ప‌వ‌ర్ ఉంటుందిగా. స‌రిగ్గా ఇదే పాయింట్ మీద భారీగా మోస‌పోయారు ఓ వైసీపీ నేత‌. ఆ డీటైల్స్ య‌మ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అది విశాఖలోని విజ‌య‌సాయిరెడ్డి ఆఫీస్‌. సార్‌ని క‌లుద్దామ‌ని గుంటూరుకు చెందిన వైసీపీ నేత నాగం వెంక‌ట‌మోహ‌న్ వెళ్లాడు. సార్ బిజీగా ఉన్నారు. ఆ ఆఫీసులో ఓ వ్య‌క్తి తెగ హ‌డావుడి చేస్తున్నాడు. ఎవ‌రా అని ప‌రిచ‌యం చేసుకుంటే.. తాను విజ‌య‌సాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబున‌ని చెప్పాడు. ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్రోగ్రామ‌ర్‌గా కార్య‌క‌లాపాలు ప‌ర్య‌వేక్షిస్తుంటాన‌ని చెప్పాడు. ఎందుకైనా మంచిద‌ని.. ఏదైనా ప‌ని ఉంటుంద‌ని.. పీఏ నాగేంద్ర‌బాబు ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడు గుంటూరు వైసీపీ నేత మోహ‌న్‌.  క‌ట్ చేస్తే, వ‌న్‌ఫైన్ డే పీఏ నాగేంద్ర‌బాబు నుంచి వెంక‌ట‌మోహ‌న్‌కు ఫోన్ వ‌చ్చింది. ‘బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఇప్పిస్తా.. తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి’ అని నాగేంద్రబాబు.. మోహ‌న్‌కు ఆశ క‌ల్పించాడు. త‌న‌కు తెలిసిన ఓ ఇద్ద‌రికి జాబ్స్ కావాలంటూ.. మోహ‌న్‌.. విజ‌యసాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబును అడిగాడు. అత‌ను స‌రేన‌ని.. 2 ల‌క్ష‌ల‌కు డీల్ కుదుర్చుకున్నారు. ఆ మొత్తం చెల్లించేశారు.   విజ‌య‌సాయిరెడ్డి పీఏ నాగేంద్ర‌బాబుకు డ‌బ్బులిచ్చినా.. రోజులు గ‌డుస్తున్నాయే కానీ, జాబ్ అపాయింట్‌మెంట్ మాత్రం ఇవ్వ‌ట్లేదు. నాగేంద్ర‌కు త‌రుచూ ఫోన్ చేస్తున్నాడు మోహ‌న్‌. మీ ప‌ని మీదే ఉన్నా.. విజ‌యసాయిరెడ్డి సార్‌తో మాట్లాడా.. క‌లెక్ట‌ర్‌తో మాట్లాడుతున్నా.. త్వ‌ర‌లోనే ప‌ని అయిపోతుందంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కాల‌యాప‌న చేస్తున్నాడే కానీ.. ఉద్యోగం మాత్రం రావ‌ట్లేదు. మొద‌ట్లో ఇలా ఏదో ఒక ఆన్స‌ర్ చెప్పేవాడు. ఆ త‌ర్వాత ఫోన్ లిఫ్ట్ చేయ‌డం మానేశాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ మాట్లాడ‌క‌పోవ‌డంతో.. డౌట్ వ‌చ్చిన గుంటూరు వైసీపీ నేత మోహ‌న్‌.. విశాఖ‌లోని విజ‌యసాయిరెడ్డి ఆఫీసుకు మ‌రోసారి వెళ్లాడు. అక్క‌డ విజ‌య‌సాయి పీఏ నాగేంద్ర‌బాబు క‌నిపించ‌లేదు. ఆయ‌న కోసం ఆరా తీస్తే.. అస‌లు అక్క‌డ నాగేంద్ర‌బాబు పేరుతో ఎవ‌రూ లేర‌ని తెలిసింది. దీంతో.. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించాడు ఆ వైసీపీ నేత‌.  మోహ‌న్ విశాఖ విజ‌య‌సాయి ఆఫీసులో త‌న‌కోసం ఎంక్వైరీ చేసిన విష‌యం నాగేంద్ర‌బాబుకు తెలిసింది. దీంతో.. నాగేంద్ర‌నే మోహ‌న్‌కు ఫోన్ చేసి.. ‘నా గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. నీ నుంచి తీసుకున్నది లక్షే. కొంచెం టైమ్‌ ఇస్తే ఆ మొత్తం ఇచ్చేస్తా. నా గురించి విచారించినా, ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటా’ అని బెదిరించాడు.  ఇదేదో తేడాగా ఉంద‌ని అల‌ర్ట్ అయిన వైసీపీ నేత వెంక‌ట‌మోహ‌న్.. స్పందన కార్యక్రమంలో గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. నాగేంద్రబాబు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాలకు ప్రొఫైల్‌ పిక్‌గా పోలీసు యూనిఫాంలతో ఉన్న ఫొటోలు ఉండ‌టం కొస‌మెరుపు. ఆ పిక్స్ చూసి ఖాకీలే అవాక్క‌వుతున్నారు.  

ఐర్లాండ్ వ్యక్తికి పాజిటివ్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం! 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చాకే ఒమిక్రావ్ వచ్చింది లేనిది నిర్దారణ కానుంది. ఐర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో శృంగవరపు కోటలో ఆందోళన నెలకొంది.  విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడ కొవిడ్ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఎస్‌.కోట మండలంలోని అత్తవారింటికి వచ్చాడు.  ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వడంతో మూడు రోజుల కిందట వైద్య సిబ్బంది వచ్చి ఆ వ్యక్తితోపాటు, ఆయన భార్య, అత్త నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్షించగా ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు రిపోర్టు వచ్చింది. ఒమైక్రాన్‌ అనుమానంతో శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించారు.  కొవిడ్ పాజిటివ్ రావడంతో  ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన గ్రామంలో తిరిగారని, చాలా మందిని కలిశారాని చెబుతున్నారు. మరోవైపు హోం క్వారెంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. ఆయన పట్టించుకోకుండా వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం మధురువాడ వెళినట్లు సమాచారం. దీంతో ఆయన తిరిగిన ప్రాంత ప్రజలంతా ఇప్పుడు కలవరపడుతున్నారు.  

బియ్యం స్మగ్లింగ్ జరిగిందా? కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోందా? 

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో పడ్డారా? ఆయన చుట్టు ఉచ్చు బిగిస్తొందా? అంటే రాష్ట్ర బీజేపీ నేతల దూకుడు చూస్తుంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. కేటీఆర్ టార్గెట్ గా భారీ స్కాం బయటపెట్టేందుకు కమలం నేతలు స్కెచ్ వేశారని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్ని వరి సాగు చుట్టూనే జరుగుతున్నాయి. తెలంగాణలో పండిన వరి పంటను మొత్తం కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఏకంగా సీఎం కేసీఆరే ధర్నా చేశారు. మోడీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లో గులాబీ ఎంపీలు రచ్చ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తమను టార్గెట్ చేయడానికి సాధనంగా ఉపయోగించుకుంటున్న వరి విషయంలోనే కేటీఆర్ కు ఉచ్చు బిగించేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.  వరి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణలో భారీగా అక్రమాలు జరిగాయని కొంత కాలంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లు మిల్లర్లతో కుమ్మక్కై వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెబుతున్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే విషయం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇచ్చిన టార్గెట్ ప్రకారం బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వలేదని, ఇచ్చినదంతా తీసుకుంటామని గోయెల్ స్పష్టం చేశారు. తెలంగాణలోని బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర బృందాలను పంపితే.. నిల్వల విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని గుర్తించాయని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు కర్ణాటక నుంచి తక్కువ మొత్తానికి బియ్యం కొనుక్కొచ్చి ఎక్కువ మొత్తానికి రైతుల రూపంలో ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. అర్వింద్ ఆరోపణలకు దగ్గరగానే కేంద్రమంత్రి గోయెల్ ప్రకటన ఉండటంతో.. టీఆర్ఎస్ టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతోందని అర్దమవుతోంది. పార్లమెంట్‌లో  గోయల్ఇచ్చిన సమాధానంతో టీఆర్ఎస్ లో కలవరం రేగిందని చెబుతున్నారు. అందుకే  ఎంపీలంతా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీనిపై కేసీఆర్ వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేసి పంపించారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మరో సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌ తనయుడి కేటీఆర్ కనుసన్నల్లో బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం స్మగ్లింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్టర్లలో ఎక్కువ సేకరించినట్టు నమోదు చేసేవారని..బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఎక్కువ చూపించినదంతా కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ నేతలు స్మగ్లింగ్ చేసి తీసుకు వచ్చి ఎఫ్‌సీఐకి అమ్మి కోట్లు గడించారని ఆరోపిస్తున్నారు. ఇది వ్యవస్థీకృతంగా జరిగిందని.. దీనిపై విచారణ చేయాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నారు.  సోమవారం లోక్‌సభలో మాట్లాడిన అర్వింద్.. రాష్ట్రంలో ఇతర పంటలను నిర్లక్ష్యం చేయడం వెనుక పెద్ద స్మగ్లింగ్‌ ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. పాతకాలపు, ఆధునిక రైస్‌ మిల్లులకు క్వింటా ధాన్యాన్ని రూ.1,600 చొప్పున విక్రయిస్తున్నాయని అర్వింద్ తెలిపారు. ఆధునిక రైస్‌ మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి కిలో బియ్యాన్ని రూ.40 చొప్పున దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయని చెప్పారు.  పాత రైస్‌ మిల్లు లు రీసైకిల్‌ చేసిన బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేసి, 100 కిలోల ధాన్యానికి 67 కిలోల రీసైకిల్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందిస్తున్నాయని తెలిపారు. ఇలా కిలోకు రూ.18 చొప్పున 67 కిలోలకు ఈ మిల్లర్లు రూ.1,206 వెచ్చించి క్వింటా ధాన్యంపై  400 రూపాయలు ఆర్జిస్తున్నారని అర్వింద్ లోక్ సభలో తెలిపారు. ఈ వేల కోట్ల కుంభకోణం కేసీఆర్‌ కుమారుడి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు.  వరి కొనుగోళ్లలో పక్కాగా అక్రమాలు జరిగాయని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు విచారణ చేయించడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో కేసుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తే త్వరలో తెలంగాణలో బియ్యం కొనుగోళ్ల స్కాం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. 

ఫైవ్ పర్సెంట్ కచ్చితంగా ఇవ్వాల్సిందే! జగనన్న పాలనలో కొత్త రూల్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా స్పెషలే. జీవోలను రహస్యంగా ఉంచడం నుంచి కొత్త కొత్త పన్నులు వేయడం వరకు అంతా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అమలవుతోంది. జగన్ పాలన అంతా రివర్స్ అనే విమర్శలు ఉన్నాయి. ఖజానా ఖాళీ కావడం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలు లేకపోవడంతో.. కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది జగన్ సర్కార్. ఏదో రకంగా జనాల నుంచి డబ్బులు పిండుకోవాలని చూస్తోంది. రోజుకో పన్ను విధిస్తూ జీవోలు ఇస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ జీవోనే  విచిత్రంగా ఉందనే టాక్ వస్తోంది.  జగన్ సర్కార్ ఇచ్చిన కొత్త జీవో ప్రకారం ఇక నుంచి ఏపీలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా ఐదు శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల్సిందే. అది స్థలం రూపంలో కాని డబ్బు రూపంలో అయినా ఇవ్వొచ్చు. అది ఇచ్చే వాళ్ల ఇష్టం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేటు వెంచర్లలో ఐదు శాతం జగనన్న కాలనీలకు ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. అయితే ఆ వెంచర్లలోనే ఇవ్వాలనేం లేదు. కాస్త దూరంగా అయినా ఇవ్వొచ్చు.. లేదా డబ్బులు కూడా కట్టొచ్చు.  ఏపీ సర్కార్ తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఏపీలో రియల్ వ్యాపారం కుదేలైంది. జగనన్న మూడు రాజధానుల ప్రతిపాదనతో రియల్ రిస్టేట్ రంగం ఢమాల్ అయింది. రాజధాని ఎక్కడో తెలియని గందగగోళంలో రియల్ వ్యాపారులు సైలెంటుగా ఉండిపోయారు. అటు అమరావతిలో వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు శాతం ఇవ్వాలన్న జగన్ సర్కార్ నిర్ణయం రియల్ వ్యాపారులకు షాకింగ్ గా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే రోడ్లకు.. ఇతర అవసరాలకు స్థలం వదిలేయడమే కాకుండా  పది శాతం సామాజిక అవసరాలకు వదిలి పెడతారు. ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అంటే.. ఇక ఎకరం స్థలంలో వెంచర్ వేస్తే అర ఎకరం కూడా అమ్ముకోవడానికి ఉండదని చెబుతున్నారు.   ఇక ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో ప్రభుత్వ పథకానికి కొంత ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారం న్యాయబద్ధమో ఎవరికీ తెలియడం లేదు. తమకు అధికారం ఉంది కాబట్టి ఉత్తర్వులు ఇస్తాం.. చెల్లింపులు చేయాల్సిందే అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ప్రజల సంపాదనలో ప్రభుత్వ పథకాలకు కొంత మొత్తం ఇవ్వాలన్న నిబంధనలు కూడా తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఓటు బ్యాంక్‌కు పథకాలు అమలు చేయడానికి నిధుల కోసం ఇలా ఇతర వర్గాల మీద దాడి జరుగుతోందన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.  ఇలాంటి వింత పోకడలతో ఏపీ ప్రభుత్వం.. చట్టాలను, రాజ్యాంగాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 

తన మాట వినకపోతే చీరేస్తా..వైసీపీ నేత వార్నింగ్ తో ఎంపీడీవో కన్నీళ్లు...

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ నేతలు. అధికారులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారు. తమ మాట వినడం లేదని, తాము చెప్పినట్లు చేయడం లేదంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. ఏకంగా ఎంపీడీవో కార్యాలయంలోనే వీరంగం వేశాడు. ఎంపీడీవో చాంభర్ లోనే ఎంపీడీవోనూ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశాడు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తన మాట వినకుంటే చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరించాడు మాజీ సర్పంచ్. నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన నల్లల చెరువు మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. వెళ్తూవెళ్తూనే అక్కడున్న ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. మహిళా అని కూడా చూడకుండా దౌర్జన్యంగా  వ్యవహరించాడు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తామని హెచ్చరించాడు.  ఆ సమయంలో అక్కడే ఉన్న కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు సరికదా, అసభ్య పదజాలంతో దూషించారు. తాను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే ఎక్కడికైనా పంపించి వేయాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు. వైసీపీ నేత దుర్బషలాడంతో ఎంపీడీవో కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో తాము పని చేసుకోలేకపోతున్నామని, నేతల మధ్య నలిగిపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అమలాపురం ఆర్డీవో వసంతరాయుడికి ఫిర్యాదు చేసిన విజయ తనకు రక్షణ కల్పించాలని కోరారు.

కలెక్టర్ కాదు టీఆర్ఎస్ వర్కర్! కేసు పెడతామని ఈటల వార్నింగ్

మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్  భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించడం దుమారం రేపుతోంది. కలెక్టర్ ప్రకటనపై ఈటల రాజేందర్ సతీమణి, జమునా హెచరీస్ ఎండీ జమునా రెడ్డి తీవ్రంగా స్పందించారు. 70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని జమున హెచ్చరించారు. కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.  తాము కొన్నదే ఏడు ఎకరాలు అయితే 70 ఎకరాలు అని కలెక్టర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. దరణి వెబ్ సైట్ లో ఉన్న భూములనే తాము కొన్నామని, దరణి వెబ్ సైట్ తప్పులు చూపిస్తుందా అని జమునా రెడ్డి నిలదీశారు. ‘‘మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి? ’’ అని జమున ప్రశ్నించారు.  మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని జమునా రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని జమున ఆరోపించారు. 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని చెప్పారు. తమ గెలుపును ఓర్వలేక ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున మండిపడ్డారు

బీజేపీలోకి ఉద్యమ నేతలు.. విఠల్, మల్లన్న దారిలో ఇంకెందరో? 

తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్‌  విఠల్‌ బీజేపీ చేరారు. తీన్మార్ మల్లన్న కూడా  బీజేపీలో చేరుతున్నారు. ఇక ఆ తర్వాత ఎవరి వంతో , ఎవరు  కమలం గూటికి చేరతారో ఏమో కానీ, తెరాస వ్యతిరేక శక్తులకు ముఖ్యంగా ఉద్యమ నాయకులకు బీజీపీ వేదిక అవుతోంది. నిజానికి దుబ్బాక, జీహెచ్ ఎంసీ కంటే ముందు నుంచి ఈ ట్రెండ్ మొదలైనా, కాంగ్రెస్ సహా అనేక పార్టీల నాయకులు బీజేపీలో చేరినా, ఈటల రాజేందర్ ఎంట్రీ, హుజూరాబాద్ ఉప  ఎన్నిక విజయం తర్వాత ఈ జోరు ఇంకొంచెం ఎక్కువైంది. తెలంగాణలో తెరాస తర్వాత బలమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే,అందులో మరో అభిప్రాయానికి తావులేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు విషయంలో అయినా, రాష్ట్రంలో  హస్తం గుర్తుకు పోలైన ఓట్ల లెక్కన చూసినా కాంగ్రెస్ పార్టీదే, సెకండ్ ప్లేస్. మరో వంక రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో జోష్ పెరిగింది.దళిత గిరిజన దండోరా పేరిట రేవంత్ రెడ్డి సారధ్యంలో నిర్వహించి భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ ఇమేజిని మరింతగా పెంచాయి. అలాగే, విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ఫోకస్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయినా, ఈటల మొదలు తీన్మార్ మల్లన్న వరకు, భావజాల పరంగా కాంగ్రెస్ పార్టీకే దగ్గరైనా, కాంగ్రెస్ కంటే కమల దళం వైపు మొగ్గు చూపుతున్నారు.  నిజానికి పార్టీ మారే నాయకులు ఎవరైనా, అది వారి స్వార్ధం అనుకున్నా మరొకటి అనుకున్నా  తమ స్వీయ రాజకీయ భవిష్యత్’కు తొలి ప్రాధాన్యత ఇస్తారు. సిద్ధాంతమైనా మరొకటి అయినా ఆ తర్వాతనే. స్వీయ రాజకీయ భవిష్యత్’తో పాటుగా ప్రధాన శత్రువును ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రుడు అనే థియరీ ప్రకారం కూడా కొందరు నేతలు పార్టీలు మారడం, చేరడం జరగవచ్చును.తెలంగాణ విషయాన్నే తీసుకుంటే ఉధ్యమకారుల ఉమ్మడి రాజకీయ శత్రువు తెరాస.ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ ఆధిపత్యం. మరో వంక ఉద్యమ కారులు బలమైన కాంగ్రెస్ పార్టీని, కాకుండా, బెజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, బీజీపే, తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులి కూడా తిరిగి సొంత గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. కొన్ని పేర్లు కూడా వినిపించాయి. అందులో కీలక నేతలు కూడా ఉన్నారు. అయినా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనుకున్న కొండా విశ్వేశ్వర రెడ్డి సహా ఏ ఒక్కరూ గాంధీ భవన్ గడప తొక్కలేదు.  ఎందుకు కాంగ్రెస్ ను కాదని ఉదయం కారులు, తెరాస, కేసీఆర్ వ్యతిరేక శక్తులు బీజీపే వైపు చూస్తున్నాయి.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లుగా నిజమైన ఉద్యమకారులకు బీజేపీ సరైన వేదిక అని ఉద్యమకారులు కూడా భావిస్తున్నారా?ఇది ఇప్పురాజకీయ వ్రగ్ల్లో జోరుగ సాగుతున్న చర్చ. కాగా, ఈరోజు (సోమవారం) ఢిల్లీలో బీజేపీలో చేరిన, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్‌. విఠల్‌’ను కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ, తెలంగాణ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసలైన ఉద్యమకారులకు తమ పార్టీ వేదికగా మారుతోందన్నారు. నిజమైన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ ఆశయాన్ని పక్కనపెట్టి కుటుంబం, సొంతవారి ఆస్తులు పెంచడానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తరుణ్‌చుగ్‌ విమర్శించారు. విఠల్‌ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల ఆత్మబలిదానాలు ఆగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 

బీజేపీ, జేడీఎస్ మధ్య  మళ్ళీ పొత్తు?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు..శాశ్వత శతృవులు ఉండరు. ఇది వందల వేలసార్లు రుజువైన వాస్తవం. ముఖ్యంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల శతృమిత్ర సంబంధాల విషయంలో అయితే, ఇది తరచూ సాగే క్రతువుగానే జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో తెలుగు దేశం, బీజేపీ మధ్య ఎన్ని సార్లు పొత్తు పొడిచిందో అన్ని సార్లు ... తెగతెంపులు కూడా  జరిగాయి.. రెండు పార్టీలు మళ్ళీ మరోసారి కలుస్తాయా అంటే ..ఏమో..రాజకీయాలలో  ప్రేమలో ఏదైనా జరగ వచ్చును.   అయితే  ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ బంధంలానే, కర్ణాటకలో  బీజేపీ, జేడీ (ఎస్)  బంధం కూడా పునరపి జననం, పునరపి మరణం అన్న రీతిలోనే సాగుతోంది. ఇప్పుడు, అక్కడ, రెండు పార్టీల మధ్య మరో మారు బంధం ఏర్పడుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.కర్ణాటక అసెంబ్లీక  2018లో ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపధ్యంలో,జేడీఎస్ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే, జులై 2019లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పెద్ద ఎత్తున బీజేపీలోకి ఫిరాయించడంతో జేడీఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఇక అప్పటి  నుంచి  కర్ణాటకలో బిజెపి – జేడీఎస్ ల మధ్య రాజకీయ వైరుధ్యం పతాక స్థాయికి చేరుకొంది. నిజానికి ముందు బీజీపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా అంతర్గత కలహాల కారణంగానే అర్థాంతరంగా కూలిపోయింది.  అయితే, ఇప్పుడు రెండు పార్టీలు గతం గతః’ అని గతాన్ని పక్కన పెట్టి 2023లో జరిగే శాసన సభ ఎన్నికల నాటికి, ఒకటయ్యే దారిలో అడుగులు వేస్తున్నాయి. నవంబరు 30న పార్లమెంటరీ భవన్‌లో జరిగిన  “సహృద్భావ సమావేశం”కు ప్రధాని నరేంద్ర మోదీ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ చేతిలో చెయ్యేసి తీసుకు నడిచిన ఫోటోలు కొత్త పొత్తుకు తొలి సంకేతంగా భావిస్తున్నారు.  అదలా ఉంటే డిసెంబర్ 10న ఒకే సారి 25 శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికలను  రెండు పార్టీల సమోధ్యకు అవకాశంగా మలచుకున్నాయి. ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం అంటూ వచ్చిన జేడీఎస్ అధికార బిజెపితో  అవగాహనకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నది. దేవెగౌడ- మోదీ  సమావేశం ముగిసిన వెంటనే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ , దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి,  బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మండలి ఎన్నికల ఉమ్మడి వ్యూహం సిద్ధం చేస్తున్నారని ప్రకటించారు. అంతకు ముందు, నవంబర్ 4న, జేడీఎస్ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి-జేడీఎస్ పొత్తు అవసరమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. మొత్తం 75 మంది సభ్యులున్న పెద్దల  సభలో బిజెపికి 32 స్థానాలు, కాంగ్రెస్‌కు 29,  జెడిఎస్ 12 స్థానాలు ఉన్నాయి. వీరుగాక ఒక స్వతంత్ర సభ్యుడు, జేడీఎస్ కు చెందిన మండలి చైర్మన్ ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఎన్నికలు  జరుగతున్న 25 స్థానల్లో 15 కాంగ్రెస్ సిట్టింగ్ స్థనాలు .కాగా, 6 బీజేపీ,  4 జెడిఎస్ సిట్టింగ్ స్థానాలు. ఎన్నికలు జరుగుతున్న 25 సీట్లలో జేడీఎస్ ఆరుచోట్ల మాత్రమే పోటీ చేస్తుండడంతో బిజెపి - జేడీఎస్ అనధికారికంగా పొత్తు  పెట్టుకున్నాయి. నిజానికి, బీజేపీ, జేడీఎస్ మధ్య గత కొంతకాలంగా సంబందాలు మెరుగవుతున్నాయి.గత ఫిబ్రవరిలో, కాంగ్రెస్‌కు చెందిన మండలి చైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిని తొలగించే విషయంలో బిజెపి,  జెడిఎస్ కలసి వ్యూహాత్మకంగా పనిచేశాయి. ఆ స్థానంలో జెడిఎస్ అభ్యర్థి బసవరాజ్ హొరట్టి ఎన్నిక కాగా, బిజెపికి చెందిన ఎంకె ప్రాణేష్‌ను డిప్యూటీ చైర్మన్‌గా  ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి  పదవి చేపట్టిన కొద్దీ రోజులకు బొమ్మై దేవెగౌడ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బొమ్మై రాజకీయ నేపధ్యం మాజీ జనతా పరివార్ కావడంతో జేడీఎస్ బిజెపికి దగ్గరవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాలలో చెలరేగుతున్నాయి.  గత డిసెంబర్ లో జేడీఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నట్లు వెలువడిన కథనాలను కొట్టిపారవేస్తూ,  అంశాల ఆధారంగా తమ రెండు పార్టీలు కలసి పనిచేసే అవకాశం ఉన్నట్లు ఎడ్డియూరప్ప, కుమారస్వామి ప్రకటించారు. 2018లో తాను కాంగ్రెస్ తో కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన్నట్లయితే తాను ఇప్పుడు మెరుగైన రాజకీయ పరిస్థితులలో ఉండేవాడినని ఈ మధ్య ఒకసారి కుమారస్వామి పేర్కొన్నారు. జేడీఎస్ కు కీలక మద్దతు దక్షిణ కర్ణాటకలో ఉండడం, బిజేపికి ఉత్తర కర్ణాటకలో ఉండడం రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో రాజకీయంగా విరుద్ధ ప్రయోజనాలు ఏర్పడే అవకాశం లేదు. అయితే దక్షిణ కర్ణాటకలో జేడీఎస్ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సవాల్ చేస్తూ ఉండడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా అశనిపాతంగా మారింది. తమ పార్టీకి గల కీలక మద్దతును కాపాడుకోవడం కోసం విశేషంగా ప్రయత్నిస్తున్న కుమారస్వామి అందుకు కాంగ్రెస్ కన్నా బిజెపి అండ మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే, కుమార స్వామితోనూ కమలదళానికి చెడు అనుభవాలున్నాయి. సో .. చివరకు ఏమవుతుంది అనే విషయంలో  మండలి ఎన్నికల తర్వాత మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

రావాలి జగన్.. ఓటీఎస్ కాదు ఉరి తాడు.. పోలవరం బాంబ్.. టాప్ న్యూస్@8PM

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్  వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని ఆయన కోరారు. పిటిషన్ పై వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.  ------ ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటైందని.. తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భ‌య‌పెడుతున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  -------- పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.  ------- ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించేవారే లేకుండా పోయారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 13 లక్షల మందికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనలేదని తెలిపారు.11వ పీఆర్సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని బొప్పరాజు స్పష్టం చేశారు.  --------- ఎంపీ విజయసాయిరెడ్డి పీఏ పేరుతో మోసానికి పాల్పడ్డారు. నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి నగదు వసూలు చేశారు. ఉద్యోగం రాక డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు మోసపోయమని గ్రహించారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు మోహన్ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.  ----- తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఏడున్నరేళ్ల కాలంలో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేశారని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ వచ్చామని... తొలుత విద్యుత్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. ----- తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని, ఫొటోలకు పోజులు తప్ప చేసిందేమీలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  --- ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రోడ్డుపై ధర్నాకి దిగారు.  జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తొలగించిన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన జాతీయ రహదారిపై బైఠాయించారు.  --- నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన ఘటనపై 'సిట్' దర్యాప్తునకు ఆదేశించామని, 30 రోజుల్లోగా దర్యాప్తును 'సిట్' పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. నాగాలాండ్ దుర్ఘటనపై  లోక్‌సభలో అమిత్‌షా ప్రకటన చేశారు. 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తోందని అన్నారు. ------ వివాదాస్పద ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత తనను ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నాడు.

ఇక రెండో దశ ఉద్యమం.. సీఎం జ‌గ‌న్‌కి ఉద్యోగ సంఘాల వార్నింగ్‌..

ఉద్యోగులు పీఆర్సీ అడుగుతున్నారు. ప్ర‌భుత్వం ఇస్తామంటోంది కానీ ఇవ్వ‌ట్లేదు. అదిగ‌దిగో అంటూ ఆశ చూపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌డువు దాటేస్తోంది. లేటెస్ట్‌గా 10 రోజుల్లో పీఆర్సీ అని స్వ‌యంగా సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అందులో ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా మూడు రోజులు ముగిశాయి. క‌నీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా బ‌హిర్గతం చేయ‌ట్లేదంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో, ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదంటున్నారు ఉద్యోగులు. అందుకే, ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌న్నా మేమే.. నిల‌బెట్టాల‌న్నా తామే నంటూ ఇప్ప‌టికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా, ముఖ్య‌మంత్రి సొంత ఇలాఖా క‌డ‌ప‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమ‌రావ‌తి నేత‌లు స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఇంత‌కీ ఉద్యోగ సంఘ నేత‌లు ఏమ‌న్నాయంటే.... "రెండు జేఏసీల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. 11వ  పీఆర్‌సీ అమలు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. ఎప్పటికప్పుడు ఇస్తామంటూనే 7 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్‌లోనే ఉంది. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి రావాల్సి వచ్చింది." అంటూ ఉద్యోగులు స్ప‌ష్టం చేశారు.  "మేము దాచుకున్న రూ.1,600 కోట్లు కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే ఇంత వరకు ఇవ్వలేదు. ఉద్యోగుల బిడ్డల వివాహం కూడా వాయిదా వేసుకుంటున్నాం. చివరికి జీపీఎఫ్‌ డబ్బులు కూడా ప్రభుత్వం ద‌గ్గ‌ర‌ దాచుకోలేని భయం ఉద్యోగుల్లో కలిగింది. ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మంగ‌ళ‌వారం నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తాం. ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతాం. ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం దిగిరాకుంటే రెండో దశలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం" అని ఉద్యోగ సంఘాల నేత‌లు తేల్చి చెప్పారు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.