లేపేస్తే 50 లక్షలు.. క‌మ్మ కులంలో చీడ‌పురుగులు.. ప‌రిటాల బ‌తికుంటేనా..

కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాంబాబు. ఈ ముగ్గురు వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలుగుజాతి అంతా అస‌హ్యించుకుంటోంది. తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. నోటికొచ్చిన‌ట్టు కారుకూత‌లు కూసిన వారిపై.. ప్రాంతాలు, పార్టీల‌కు అతీతంగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా, మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిలర్ మల్లాది వాసు మ‌రింత‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కొడాలి నాని, వల్లభనేని వంశీలు కమ్మ కులంలో చీడపురుగుల్లా పుట్టారని మండిప‌డ్డారు. వాళ్లిద్దరితో పాటు మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబును భౌతికంగా లేకుండా చేసేందుకు తాను రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని మల్లాడి వాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.   కమ్మ కులానికి అండగా ఉన్న పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడానికి అప్పట్లో కొందరు మొద్ద శీనును వాడుకుని ఆపరేషన్ చేశారని చెప్పారు. పరిటాల బతికి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని మల్లాది వాసు అభిప్రాయ‌ప‌డ్డారు.

జగన్ సర్కార్ కు ఎన్టీఆర్ బాసట..

రాయ‌ల‌సీమ‌ను భారీ వ‌ర్షాలు కుదిపేశాయి. వ‌ర‌ద వెల్లువెత్తి ఊళ్ల‌కు ఊళ్ల‌ను నామ‌రూపాలు లేకుండా చేసింది. అన్న‌మ‌య్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. చెరువులకు గండ్లు ప‌డ్డాయి. ప్ర‌కృతి ప్ర‌కోపంతో పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేత‌గానిత‌నం వ‌ల్లే ఇంత‌టి న‌ష్టం వ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వ‌ర‌ద‌పై అధికారులు ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌లేద‌ని.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి క‌నీసం బాధితుల‌ను ఓదార్చ లేద‌ని అంతా మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వ‌మే కాదు.. ప్ర‌కృతి విప‌త్తుల్లో స్పందించే టాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం ఈసారి చేయూత అందించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం 25 ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించి.. అంద‌రికంటే ముందు వ‌రుస‌లో నిలిచారు.  వ‌ర‌ద బాధితుల‌కు ఎన్టీఆర్ 25 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించ‌డం అభినంద‌నీయ‌మే. కానీ, ఈ స‌మ‌యం, సంద‌ర్భం వ‌ల్లే రాజ‌కీయ కోణంలో చూడాల్సి వ‌స్తోందని అంటున్నారు. ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు భార్య‌పై వైసీపీ నేత‌లు అసంబ‌ద్ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది. నంద‌మూరి కుటుంబం మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీ నాయ‌కుల‌ను గ‌ట్టిగా హెచ్చ‌రించింది. కానీ, జూనియ‌ర్ మాత్రం స‌ప‌రేట్‌గా ఓ వీడియో రిలీజ్ చేయ‌డం.. అందులో ఎక్క‌డా నంద‌మూరి పేరు ఎత్త‌కుండా.. వైసీపీని గ‌ట్టిగా నిల‌దీయ‌కుండా.. ఉత్తుత్తి మాట‌ల‌తో లైట‌ర్ వే లో మ‌మ అనిపించారంటూ ఇటు టీడీపీ, అటు సోష‌ల్ మీడియా దుమ్మెత్తిపోసింది. కొడాలి, వంశీలు ఎన్టీఆర్‌కు స‌న్నిహితులు కావ‌డ‌మే ఈ ర‌చ్చ‌కు కార‌ణం. ఆ త‌ర్వాత మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీలు సైతం స్పందిస్తూ.. జూనియ‌ర్‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేదంటూ కాస్త క‌వ‌రింగ్ కూడా ఇచ్చుకున్నారు.  ఇలా ఎన్టీఆర్‌-వైసీపీ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతున్న స‌మ‌యంలోనే వ‌ర‌ద బాధితుల‌కు ఆస‌రాగా 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండ‌స్ట్రీలో ఇంకా పెద్ద వాళ్లు చాలామందే ఉన్నా.. జూనియ‌రే మొద‌ట‌గా ఇలా ముందుకు రావ‌డాన్ని అనుమానంగా చూస్తున్నారు. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీ నేత‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీకి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఇక జూనియ‌ర్ చాలాకాలంగా టీడీపీకి, నంద‌మూరి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. ఇటీవ‌లి వీడియోలో వైసీపీపై త‌మ‌ల‌పాకుల‌తో కొట్టిన‌ట్టు సుతిమెత్త‌గా మాట్లాడారు. తాజాగా, వ‌ర‌ద బాధితుల‌కు సాయంగా వైసీపీ ప్ర‌భుత్వానికి 25 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఇలా వ‌రుస ప‌రిణామాలన్నీ చూస్తుంటే.. జూనియ‌ర్ టీడీపీకి దూర‌మ‌వుతున్న‌ట్టు ఉంద‌ని అంటున్నారు.

సీఎస్‌కు ఉద్యోగ జేఏసీ నోటీస్.. వారం రోజుల డెడ్ లైన్! జగన్ సర్కార్ కు టెన్షన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి సీఎస్ సమీర్ శర్మకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు నోటీస్ ఇచ్చారు. జేఏసీ నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసు ఈ నోటీస్‌ను సీఎస్ కు అందించారు, 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌ వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.   పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని చెప్పారు. ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్‌కు అందించామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 7వ తేదీ నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారని, 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తామని, 13న తాలూకా, డివిజన్‌ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని బొప్పరాజు తెలిపారు.    సర్కార్ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  స్నేహపూర్వక గవర్నమెంట్‌ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నీటి మూటలే అయ్యాయని జేఏసీ నేతలు మండిపడ్డారు. జీపీఎఫ్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో  5వేల మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదని నిలదీశారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయన్న బొప్పరాజు.. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా? ఆయన అందుబాటులో ఉన్నదెప్పుడు అని జేఏసీ నేతలు నిలదీశారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని అర్ధమవుతోందన్నారు.  

బండి పోయి రెడ్డి వ‌చ్చే.. కేసీఆర్ టార్గెట్ షిఫ్ట్ అందుకేనా?

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను కుమ్మేశారు. యాసంగిలో వ‌రి పండించాలంటూ బండి ఇచ్చిన పిలుపుపై ముఖ్య‌మంత్రి విరుచుకుప‌డ్డారు. దీక్ష కూడా చేశారు. క‌ట్‌చేస్తే, కేసీఆరే దీక్ష‌కు దిగొచ్చేలా చేసిన మొన‌గాడంటూ బండి సంజ‌య్‌కు ఒక్క‌సారిగా ఫుల్ క్రేజ్‌. బండి ఏ జిల్లాకు వెళితే అక్క‌డ గులాబీ నిర‌స‌న‌లు. బీజేపీ నేత‌ల ఎదురుదాడులు. ఇలా వ‌రి ఎపిసోడ్ అంతా కేసీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్ అన్న‌ట్టుగా మారి.. బండికి తెగ పొలిటిక‌ల్ మైలేజ్ వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత తెలిసింది కేసీఆర్‌కు తాను చేసిన చిన్న‌ త‌ప్పు ఏంటో. వ‌రిపై కేంద్రాన్ని, బీజేపీని దోషిగా చూపించ‌డంలో కేసీఆర్ కాస్త‌ స‌క్సెస్ అయ్యార‌నే అంటున్నారు. ప‌రోక్షంగా హుజురాబాద్ ఓట‌మి, ఈట‌ల గెలుపు, ద‌ళిత‌బంధు టాపిక్ అట‌కెక్కింది. ప్ర‌జ‌ల న‌జ‌ర్ అటు నుంచి ఇటు షిఫ్ట్ చేయ‌డంలో మాత్రం కేసీఆర్ ఫుల్ స‌క్సెస్‌. కానీ, వ‌రి ఎపిసోడ్‌లో కేసీఆర్‌కంటే సంజ‌య్‌కే ఎక్కువ‌ క్రెడిట్ వ‌చ్చింది. ఇదేదో తేడా కొట్టేలా ఉంద‌ని గులాబా బాస్ వెంట‌నే గెస్ చేశారు. ఆ వెనువెంట‌నే టార్గెట్ కాస్త డైవ‌ర్ట్ చేశారు. తుపాకీని బండి సంజ‌య్ నుంచి కిష‌న్‌రెడ్డి వైపు మ‌ళ్లించారు. బండి కంటే కేంద్ర‌మంత్రిపై మ‌రింత తిట్ల డోస్ పెంచారు. రండ అనే స్థాయి వ‌ర‌కూ వెళ్లిపోయారు. ఇక అంతే. టాపిక్ అంతా కేసీఆర్ వ‌ర్సెస్ కిష‌న్‌రెడ్డి అన్న‌ట్టుగా మారిపోయింది. బండి వెన‌క‌బ‌డింది.  కేసీఆర్ యాక్ష‌న్‌.. పీకే డైరెక్ష‌న్‌..! గులాబీబాస్ కోసం ఐ ప్యాక్‌? ఎంత కాద‌న్నా.. ఎంత‌గా వేరువేరు పార్టీలే అయినా.. కేసీఆర్‌-కిష‌న్‌రెడ్డిలు స‌న్నిహితులేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్‌. సౌమ్యుడిగా పేరున్న కిష‌న్‌రెడ్డి.. కేసీఆర్‌పై స్మూత్‌గానే అటాక్ చేస్తుంటారు. టీఆర్ఎస్ స‌ర్కారుపై సాఫ్ట్‌కార్న‌ర్‌తోనే ఉంటారంటారు. కేసీఆర్ సైతం కిష‌న్‌రెడ్డిని పెద్ద‌గా టార్గెట్ చేసింది లేదు. బండిలా దూకుడు రాజ‌కీయం చేయ‌డం కిష‌న్‌రెడ్డికి చేత‌కాదంటారు. ఆయ‌నదంతా వైట్ కాల‌ర్ పాలిటిక్స్‌. తాను నేష‌న‌ల్ లెవెల్ లీడ‌ర్ అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. స్టేట్ పాలిటిక్స్‌లో పార్ట్‌టైమర్ మాత్ర‌మే. ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం కిష‌న్‌రెడ్డికి అంత‌గా క్రేజ్ లేక‌పోవ‌డానికి ఇదే కార‌ణం. అందుకే అలాంటి కిష‌న్‌రెడ్డిని ఎంత‌గా పైకి లేపినా.. బీజేపీకి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించిన కేసీఆర్‌.. బండిని వ‌దిలేసి రెడ్డిని టార్గెట్ చేశార‌ని చెబుతున్నారు. కిష‌న్‌రెడ్డికి హైప్ వ‌చ్చినా.. రాక‌పోయినా.. కేసీఆర్‌కు ఉప‌యుక్త‌మే. బండి అంతటి మొండి మాత్రం కాదాయ‌న‌. కేసీఆర్‌కు కావ‌ల‌సింది ఇదే. టూ బ‌ర్డ్స్ ఎట్‌ వ‌న్ షాట్. పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?

కులం పోయి మ‌తం వ‌చ్చే.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌!.. పాద‌యాత్ర‌లో హైటెన్ష‌న్‌..

అమ‌రావ‌తి రైతుల ఉత్సాహం ఏమాత్రం త‌గ్గ‌ట్లే. మ‌హాపాద‌యాత్ర‌లో పాదం ఆగ‌ట్లే. 31 రోజులుగా అదే హోరు..అదే జోరు. ఊరూరా నీరాజ‌నం. గ్రామ‌గ్రామాన అమ‌రావ‌తి నినాదం. రాజ‌ధాని రైతుల‌కు ఏపీ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో.. పాల‌కుల్లో ప్ర‌కంప‌ణ‌లు. అందుకే, పోలీసుల‌ను పాద‌యాత్ర‌పైకి ఉసిగొల్పుతున్నారు. లేనిపోని కొర్రీలు పెట్టి యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. కానీ, సంక‌ల్పసిద్ధి అధికంగా ఉన్న రైతులు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. పోలీసుల ఆంక్ష‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ధీటుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా, నెల్లూరు జిల్లా మ‌రుపూరు ద‌గ్గ‌ర ఖాకీల తీరుతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. పోలీసుల వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.   న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం.. దేవ‌స్థానం పేరులో అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర చేస్తున్నారు. యాత్ర‌లో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ర‌థాన్ని ముందు నిలిపారు. ఆ వెన‌కాలే స‌ర్వ‌మ‌తాల‌కు సంబంధించిన వాహ‌నాలు ఉంటాయి. మ‌హాపాద‌యాత్ర మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఈ ర‌థాలు రైతుల‌తో పాటే ముందుకు సాగుతున్నాయి. 31 రోజుల త‌ర్వాత పోలీసుల‌కు ఈ విష‌యం గుర్తొచ్చిన‌ట్టుంది. పాద‌యాత్ర‌లో స‌ర్వ‌మ‌తాల‌కు చెందిన వాహ‌నాల‌కు అనుమతి లేదంటూ నెల్లూరు జిల్లా ఖాకీలు కిరికిరి పెట్టారు. ఆ వాహ‌నాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో, నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు ద‌గ్గ‌ర‌ రోడ్డుపై రైతులు, మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు, రైతుల మధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటుచేసుకుంది.    పాదయాత్ర ప్రారంభం నుంచి వస్తున్న వాహనాలకు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగించారు. రైతుల నిరసనతో కిలోమీట‌ర్ల మేర‌ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  యాత్రను ముందుకు సాగనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నినాదాలు చేశారు. గ‌తంలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కులాన్ని ఆపాదించార‌ని.. ఇప్పుడు మ‌తంను బూచిగా చూపిస్తూ.. యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టు అనుమ‌తులు ఉన్నా.. ఇలా వేధించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు రాజ‌ధాని రైతులు. అక్క‌డితో ఆగ‌లేదు పోలీసులు. రైతులకు భోజ‌నాలు త‌యారు చేసేందుకు, వారు భోజ‌నాలు చేసేందుకు వేసుకునే శిబిరాల‌కూ అనుమ‌తులు లేవంటూ ఆ ఏర్పాట్ల‌ను అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్ష‌ల‌తో వేళ‌కు భోజ‌నం చేయ‌లేక ప‌లువురు మ‌హిళా రైతులు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డం క‌లిచి వేసింది. బీపీ, షుగ‌ర్ ఉన్న రైతులు పోలీసుల తీరుతో బాగా ఇబ్బందులు ప‌డ్డారు. ఎలాగోలా వేరేచోట భోజ‌నాలు సిద్ధం చేసుకున్నా.. లంచ్ చేసేందుకు షామియానాలు వేసేందుకూ పోలీసులు ఒప్పుకోక‌పోవ‌డంతో.. రోడ్డు ప‌క్క‌నే.. ఎండ‌లో.. దుమ్ముధూళిలో భోజ‌నం చేయాల్సిన దుస్థితి దాపురించింది. అమ‌రావ‌తి కోసం భూములిచ్చిన రైతుల‌మ‌ని.. ఒక‌ప్పుడు ఎంతోమందికి ఆక‌లి తీర్చిన వార‌మ‌ని.. జ‌గ‌న్‌రెడ్డి వ‌ల్ల ఇప్పుడు త‌మ‌కు ఈ దుస్థితి ప‌ట్టింద‌నిన వాపోతున్న‌ రాజ‌ధాని రైతులు ఆవేద‌న‌, ఆక్రంద‌న చూసే వారితో క‌న్నీళ్లు పెట్టిస్తోంది. పాపం.. అమ‌రావ‌తి రైతులు.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌ధాని రాజ‌కీయంతో ఎంత అవ‌స్థ‌లు ప‌డుతున్నారో అనిపిస్తోంది

కేసీఆర్ యాక్ష‌న్‌.. పీకే డైరెక్ష‌న్‌..! గులాబీబాస్ కోసం ఐ ప్యాక్‌?

కేసీఆర్ ఇటీవలి ప్రశాంత్ కిశోర్‌ను తరుచూ కలుస్తున్నారు. పీకే సూచనల మేరకే భౌతిక దాడులు, ఆందోళనలకు కేసీఆర్ దిగుతున్నారు. ఈ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది మ‌రెవ‌రో కాదు. బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారాయి. రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.  నిజ‌మే. ఇటీవ‌ల కేసీఆర్ తీరు బాగా మారింది. మాట‌ల్లో ప‌దును పెరిగింది. చేత‌ల్లోనూ దూకుడు క‌నిపిస్తోంది. బీజేపీపై, కేంద్రంపై నాన్‌స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నారు. బండి సంజ‌య్‌ను సిక్స‌ర్లు కొడుతున్నారు. వ‌రుస ప్రెస్‌మీట్ల‌తో క‌మ‌ల‌నాథుల‌పై క‌స్సున లేస్తున్నారు. బండిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ధ‌ర్నా చౌక్‌లో కేసీఆర్‌తో స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేయ‌డం.. జిల్లాల్లో గులాబీ ద‌ళం ఆందోళ‌న‌లు.. ఇలాంటివి గ‌డిచిన ఏడేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని ప‌రిణామాలు. క‌ల‌బ‌డ‌ట‌మే తెలిసిన కేసీఆర్‌.. ఇలా దీక్ష‌ల‌తో దిగిరావ‌డం.. మాట‌ల‌తో తూట్లు పొడ‌వ‌డం.. ఆయ‌న స్టైల్ కానే కాదంటున్నారు. ఇక లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిపై తిట్ల దండ‌కం అందుకోవ‌డం.. ప్ర‌స్టేష‌న్ కాద‌ని.. అంతా ప‌క్కా ప్లాన్డ్ ఎపిసోడ్ అని అంటున్నారు. ఇంప్లిమెంట్ చేసింది కేసీఆరే అయినా.. ఆ ప్లాన్ చేసింది ప్ర‌శాంత్ కిశోర్ అనే అంటున్నారు.  ఏపీలోనూ పీకే డైరెక్ష‌న్‌లో జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్ ఇదే స్ట్రాట‌జీ ఫాలో అవుతోంది. చంద్ర‌బాబు ఇంటి ముట్ట‌డికి ప్ర‌య‌త్నించ‌డం, టీడీపీ కార్యాల‌యం విధ్వంసం, అసెంబ్లీలో చంద్ర‌బాబు భార్య‌ను కించ‌ప‌ర‌చ‌డం.. లాంటి చ‌ర్య‌లు ఆ దిక్కుమాలిన ఐ-ప్యాక్ ఇచ్చిన స‌ల‌హాలేన‌ని అంటున్నారు. పీకేకు చెందిన ఐ-ప్యాక్ సంస్థ‌ ఇలాంటి ప‌నికిమాలిన ఉద్రేకాలు రెచ్చ‌గొట్టడంలో ఎక్స్‌ప‌ర్ట్ అని చెబుతారు. గ‌తంలోనూ కాపు మీటింగ్ త‌ర్వాత తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ను త‌గ‌ల‌బెట్టడంలాంటి కుట్ర‌లు ఐ-ప్యాక్‌వే అంటారు. సేమ్ టూ సేమ్‌.. ఏపీ త‌ర‌హాలోనే తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ విప‌క్షంపై విరుచుకుప‌డుతుండ‌టం చూసి.. గులాబీ బాస్ వెన‌కాలా పీకేనే ఉన్నాడంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే.. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ త‌రుచూ ఢిల్లీ వెళుతుండ‌టం.. రోజుల‌కు రోజులు మ‌కాం వేయ‌డం.. ఎలాంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు లేకుండా కొన్ని రోజుల పాటు మాయం అవుతుండ‌టం.. పీకే టీమ్‌ను క‌లిసేందుకేన‌ని ఢిల్లీ వ‌ర్గాలతో మంచి లింకులున్న బీజేపీ నేత ర‌ఘునంద‌న్‌రావు అన‌డం నిజ‌మేన‌నిపిస్తోంది.  కేంద్ర‌మంతి కిషన్‌రెడ్డిని కేసీఆర్ అంత దారుణంగా తిట్టాల్సిన అవసరం లేదని.. కావాల‌నే, ర‌చ్చ జ‌ర‌గాల‌నే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు. ఇదంతా పీకే డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతోంద‌ని.. త‌న వైఫ‌ల్యాలు, హుజురాబాద్ ఓట‌మి, ద‌ళిత‌బంధు అమ‌లు కాక‌పోవ‌డం, రేవంత్‌రెడ్డి ఎమ‌ర్జ్ కావ‌డం.. నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే పీకే చెప్పిన‌ట్టు చేస్తూ.. కేసీఆర్ బాగా దిగజారిపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.

బస్సు చార్జీలు పెరుగుతున్నయ్? కిలోమీటర్ కు ఎంతో తెలుసా...

డీజిల్ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్రంగా పడింది. ఆర్టీసీకి గండంగా మారింది. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆ మేరకు సంస్థ నష్టాలు మూటగట్టుకుంది. కొవిడ్ తో కోలుకోలేని దెబ్బ తగలగా.. మూలిగే నక్కపై తాడి పండు పడ్డ చందంగా డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారంగా మారాయి. దీంతో బస్సు చార్జీలను పెంచాలని డిసైడ్ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. పల్లె వెలుగులో కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర సర్వీసుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది టీఎస్ ఆర్టీసీ.  డీజిల్ పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 2019 డిసెంబర్ 1న కిలోమీటర్ కు 20 పైసల చార్జీలు పెంచామన్నారు. ఛార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని, కోవిడ్ వల్ల నష్టపోయామని సజ్జనార్ వెల్లడించారు. గతంలో 68.29 పైసలు లీటర్ డీజిల్ ధర ఉంటే.. ప్రస్తుతం  87 రూపాయలుగా ఉందన్నారు. డిజిల్ వల్ల సంస్థకు 480 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఆర్టీసీకి ఈ సంవత్సరం 1440 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయన్నారు సజ్జనార్. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని చెప్పారు.  సంస్థకు రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని, ఛార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామని సజ్జనార్ చెప్పారు.  నెల రోజుల క్రితం ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి  అందించామని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇంకా కొత్త బస్సులు కొనాల్సి ఉందన్నారు. తొందరగా ఛార్జీల పెంపునకు అనుమతి ఇచ్చేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలన్నారు బాజిరెడ్డి. నష్టాన్ని పూరించే దశలో తాము లేమని, కానీ ఛార్జీల పెంపు వల్ల కొంత ఆదాయం పెరుగుతుందని చెప్పారు.  ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టిక్కెట్లేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్నారు. మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీకి పునర్ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చైర్మన్, ఎండీ చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ఎండి నిర్వహించిన సర్వేలో  4.3 శాతం మంది మాత్రమే ఛార్జీల పెంపు పై విముఖత చూపారన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మం, అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు పువ్వాడ అజయ్ కుమార్. 

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ప‌ని చేస్తాయా? మూడో డోస్ అవ‌స‌ర‌మా? వైరాల‌జిస్ట్ వివ‌ర‌ణ‌.. 

ఒమిక్రాన్‌. ఆఫ్రిక‌న్ కంట్రీస్‌తో పాటు ఇండియాను భ‌య‌పెడుతున్న‌ వైర‌స్ వేరియంట్‌. కొత్త వేరియంట్ అంటేనే ప‌వ‌ర్‌ఫుల్‌. మ్యూటేష‌న్ జ‌రిగిందంటేనే.. మ‌రింత డేంజ‌ర‌స్‌. వేగంగా విస్త‌రిస్తోందంటే.. ముప్పు పొంచి ఉన్న‌ట్టే. మ‌రి, ఒమిక్రాన్ వ‌ర్రీని ప్ర‌స్తుత‌మున్న వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోగ‌ల‌వా? ప్రాణాపాయాన్ని తగ్గించ‌గ‌ల‌వా? బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రం ఉంటుందా? త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఒమిక్రాన్‌ కానీ, మరేదైనా కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదని భరోసా ఇచ్చారు. అయితే, మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంతకీ ఆయ‌న ఏమ‌న్నారంటే.... ‘‘భారతదేశంలో కొవిడ్‌ రెండో దశలో డెల్టా వేరియంట్‌ చాలా ఎక్కువ మందికి సోకింది. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు జాతీయ సీరో సర్వే సూచించింది. దాదాపు 94 కోట్ల మంది భారతీయుల్లో యాంటీబాడీలు ఏర్పడ్డాయి. అయితే, దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ స్థాయి ప్ర‌జ‌ల్లో యాంటీబాడీలు ఉన్నాయంటే వారికి కొవిడ్ వ‌చ్చిపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని అని జమీల్‌ వివరించారు. ఇదే భారతీయులకు ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లను తట్టుకునే శక్తిని అందిస్తోందన్నారు. సో.. ఒమిక్రాన్‌ కానీ, మరే ఇతర వేరియంట్‌ కానీ తీవ్ర రోగ లక్షణాలు కలిగించలేవని జమీల్ అంటున్నారు.  ఒమిక్రాన్‌ రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అని ప్రపంచం ఆందోళన చెందుతోంది. దీనిపై పూర్తి సమాచారం రావడానికి ఇంకా ఒకటీ రెండు వారాలు పట్టవచ్చని జమీల్‌ చెప్పారు. ఒమిక్రాన్‌పై టీకాల సామర్థ్యం కొంత తగ్గినా, అవి పూర్తిగా పనిచేయకుండా పోయే ప్రసక్తి లేదని అన్నారు. వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కొవిడ్ ముప్పు ముగిసిందా? ఎండెమిక్‌లా మారిపోనుందా? ఒమిక్రాన్ అదేనా? ‘‘ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులకు మధ్య వ్యవధిని ఇప్పుడున్న 16 వారాల నుంచి 12 వారాలకు తగ్గించాలి. ముఖ్యంగా పెద్ద వయసువారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వైద్యులు, సహాయక సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలి’’ అని జ‌మీల్ తెలిపారు. వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసుల వల్ల ప్రయోజనం ఉన్నా, అత్యధిక భారతీయులకు వేగంగా రెండు డోసులు వేయడం అంతకన్నా ముఖ్యమని జమీల్ చెప్పారు. భారత్‌లో అందుబాటులో ఉన్న టీకాల్లో 90 శాతం కొవిషీల్డేననీ, దాన్ని బూస్టర్‌ డోసుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం పరిమితమేనని అన్నారు. బూస్టర్‌ డోసుగా ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, ప్రోటీన్‌ వ్యాక్సిన్లను ఇవ్వడం మంచిదని ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ సూచించారు.   

వాన దేవుడిపై కేసు పెడదాం.. ఏపీ మంత్రి కామెంట్లతో రచ్చ..

ఆంధ్రప్రదేశ్ లో వరదలు బీభత్సం స్పష్టించాయి. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు , ప్రకాశం జిల్లాలో అపార నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా.. వందలాది గ్రామాలు కొన్ని రోజుల పాటు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. వర్షాకాలం కంటే ముందే ఏపీలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలే కనిపించాయి. జగన్ సర్కార్ కనీసం మరమత్తులు కూడా చేయించలేకపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల పరిస్థితి భారీ వర్షాలతో మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి.  అధికార పార్టీ నేతలకు ఎక్కడికి వెళ్లినా జనాల నుంచి రోడ్లపై నిలదీతలు ఎదరవుతున్నాయి. రోడ్ల దుస్తితిపై  మంత్రులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ప్రజలు. రోడ్లకు ఎప్పుడు రిపేర్లు చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల గురించి అడిగిన జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేస్తే త్వరగా పాడవుతాయి. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు వేస్తామంటూ ప్రకటన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.  ఏపీ రోడ్లు ఏంటిలా అధ్వానంగా ఉన్నాయి సార్? అని ప్రశ్నించిన పాపానికి నారాయణస్వామి విచిత్రమైన రీతిలో రియాక్టు అయ్యారు. అంతేకాదు తప్పంతా దేవుడిపై వేశారు. దేవుడిపై కేసు పెడదామంటూ కామెంట్ చేశారు. ‘‘ఇదంతా ఆ వానదేవుడి తప్పు.. వర్షాలు బాగా కురుస్తున్నందునే రోడ్లు బాగా చెడిపోతున్నాయి. ఏదైనా కేసు పెట్టాలంటే ఆయనపైనే పెట్టటండి’’ అంటూ కామెంట్లు చేశారు నారాయణ స్వామి. అక్కడితో ఆగని ఆయన విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యత లేని రోడ్లు వేసి దోచుకుందని, వరుణ దేవుడు కూడా వారికి బుద్ధి రావటానికి రోడ్లను ఇలా పాడు చేశారన్నారు. అంతేకాదు చంద్రబాబు దుష్టపాలనకు చెక్ చెప్పేందుకే భగవంతుని స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు నారాయణ స్వామి. డబ్బులు కడతారా.. పింఛన్‌, రేష‌న్‌ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’ రోడ్లు బాగా లేకపోవటానికి కారణం కంటికి కనింపిచని వరుణదేవుడు.. కంటి ముందు ఉండే చంద్రబాబు తప్పించి.. జగన్ ప్రభుత్వ తప్పేమి లేదన్నట్లుగా నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా రాజకీయాల్లో అధినేతను పొగడ్తలతో ముంచెత్తటం మామూలే అయినా ఈ స్థాయిలో పొగడటం మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామికే చెల్లుతుందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన ఎక్కడ మాట్లాడినా జగన్ కు ఆకాశానికెత్తేస్తున్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. దీంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తన పదవి పోకుండా ఉండటానికే నారాయణ స్వామి ఇలా జగన్ భజన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

కొవిడ్ ముప్పు ముగిసిందా? ఎండెమిక్‌లా మారిపోనుందా? ఒమిక్రాన్ అదేనా?

ఆల్ఫా, బీటా, డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్‌. వేరియంట్‌లు మారుతున్నాయి. కేసుల సంఖ్య మారుతోంది. ముప్పు సైతం త‌గ్గుతోంది. ఆఫ్రిక‌న్ కంట్రీలో పురుడుపోసుకున్న ఒమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. క‌ల‌వ‌ర‌మైతే ఉంది కానీ, మునుప‌టిలా భ‌యం మాత్రం లేదు. టెస్టు చేస్తేనే కొవిడ్ పాజిటివ్ అని తేలుతోంది. లేదంటే లేదు. కొద్దిమందిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉంటున్నాయి. అంటే, క‌రోనాతో పోయిన‌ట్టేనా? వ్యాక్సినేష‌నే ఇందుకు కార‌ణ‌మా? లేక‌, స‌మాజంలో హ‌ర్డ్ ఇమ్యూనిటీ ఏర్ప‌డిందా?  సాధార‌ణ జ‌లుబు, ఫ్లూ మాదిరే.. కొవిడ్ సైతం ఎండెమిక్ స్థాయికి ప‌డిపోయిందా? అనే చ‌ర్చ మొద‌లైంది.   ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ప‌ని చేస్తాయా? మూడో డోస్ అవ‌స‌ర‌మా? వైరాల‌జిస్ట్ వివ‌ర‌ణ‌..  ఒమిక్రాన్‌ వేరియంట్‌ పుట్టుక.. ఎండెమిక్ ప్రక్రియ దిశగా మొదటి అడుగు కావొచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. తక్కువ లక్షణాలు ఉంటే విస్తృతి అధికం. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధారణ పరీక్షలకు ముందుకు రాకపోవచ్చు. తమకు కొవిడ్‌ సోకిందనే విషయాన్నే గుర్తించలేరు. అందువల్ల ఒమిక్రాన్‌ ఉద్ధృతి అధికంగా ఉంటోంది. అయితే, కొత్త వేరియంట్‌ ఏ జనాభాలో ఉత్పన్నమైందన్నది కూడా ముఖ్య‌మైన విష‌య‌మే. ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ రేటు 25 శాతంగానే ఉంది. అలాంటి చోట్ల ‘ఆర్ ఫ్యాక్ట‌ర్‌’ ఎక్కువగా ఉన్న రకాలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. విస్తృత స్థాయిలో టీకా పొందిన జనాభాలో.. వ్యాక్సిన్‌ను ఏమార్చే రకాలు పైచేయి సాధించొచ్చు.      డబ్బులు కడతారా.. పింఛన్‌, రేష‌న్‌ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’ మునుపటి రకాలతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని చాటే కొత్త వేరియంట్లు బాగా విస్తరిస్తాయని పరిణామక్రమ జీవశాస్త్రం చెబుతోంది. ‘ఆర్ ఫ్యాక్ట‌ర్‌’ (వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సరాసరి ఎంతమందికి ఆ వైరస్‌ వ్యాపిస్తుందో చెప్పే సంఖ్య) అధికంగా ఉన్న రకాలు.. తక్కువగా ఉన్న వేరియంట్ల స్థానాన్ని ఆక్రమిస్తాయి. ప్ర‌స్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను అడ్డుకోగ‌లిగితే.. ఇక ఎండెమిక్ స్థాయి త్వ‌ర‌లోనే ఆవిష్కృతం అవుతుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే, డేంజ‌ర‌స్ క‌రోనా వైర‌స్ అంత ఈజీగా త‌లొగ్గుతుందా? లేక‌, వ్యాక్సిన్‌ను ఏమార్చే శ‌క్తితో మ‌రింత బ‌లం పుంజుకుంటుందా? అనేది కాల‌మే డిసైడ్ చేయాలి. వైసీపీ వారికే వరద సాయం? కడప జిల్లాలో బాధితుల ఆందోళన..

సిరివెన్నెలకు కడ నివాళి.. జగనన్న ఓటీఎస్ రచ్చ.. ఉద్యోగుల నోటీస్.. టాప్ న్యూస్@ 1PM

ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించారు. సీతారామశాస్త్రి భౌతికకాయన్ని బుధవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్‌, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు ------ ఒక్కఛాన్స్ అంటే ఒక్కసారి జగన్‌కు ఓటు వేసినందుకు.. ఓటీఏస్ అంటూ రూ. 10 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఇంటింటికి తిరిగి మరి రాబందుల్లా పీక్కు తింటున్నారని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఎన్నికల ముందు పేదల ఇళ్లపై ఉన్న బకాయిలు రద్దు చేస్తామన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఓటీఏస్ కట్టని పేదల పథకాలు రద్దు అంటున్నారన్నారు. జగన్ పాలన మొదటి అర్థ భాగం అస్తవ్యస్థం, అగమ్యగోచరం, అయోమయం జగన్నాథంలా ఉందని ఎద్దేవా చేశారు --- ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు.. సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యచరణ నోటీసు ఇచ్చారు.  11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు అందులో ఉన్నాయి.డిసెంబర్ 7 నుండి ఉద్యమ కార్యాచరణను అమలులోకి తీసుకురానున్నారు.  ------ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూడరాదని సీబీఐ పేర్కొంది. విడివిడిగా చూస్తే నేరం జరిగినట్లు కనిపించదని తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. అక్రమాస్తుల వ్యవహారంలో భాగం గా తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వాన్‌పిక్‌ ప్రాజెక్టు, ఆ సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది.  ----- నెల్లూరు జిల్లా మరుపూరులో బుధవారం ఉదయం రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అయితే అన్ని వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. దీంతో రాజధాని రైతులు ధర్నాకు దిగారు. మహాపాదయాత్రకు వైసీపీ శ్రేణులు, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పొదలకూరులో భోజనాల తయారీకి స్థలాలు ఇవ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. భస చేసేందుకు వీలులేక రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లలో రైతులు నెల్లూరుకి వెళ్లారు.  --- ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి తెరపడాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని తెలిపారు. 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎంపీ కేకే డిమాండ్ చేశారు.  -------- ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎయిడ్స్ మరణాల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. గాలి ద్వారా, తాకడం ద్వారా ఎయిడ్స్ రాదన్నారు. ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదామని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ----- విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో గల ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది. కర్మాగారానికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందుకు నిరసనగా కార్మకులు ఆందోళనకు దిగారు. జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినందుకే లాకౌట్‌ ప్రకటించారంటూ నిరసన చేపట్టారు. రూ.6 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఇటీవలే నిరసన తెలిపారు.  --- సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతుల మరణాలకు సంబంధించిన రికార్డు లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు తెలిపారు. సుమారు ఓ సంవత్సరం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, వీరిలో కొందరు రైతులు మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది. దీనిపై నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ----- కోరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో.. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చిన వారి ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాకపోయినా.. వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 15 రోజుల్లో వందలాది మంది దేశంలో దిగినా.. దాంట్లో సగం మంది వారివారి పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో మాత్రం లేరు. దీంతో వారి ద్వారా కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ముప్పుంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి పరేషాన్? 

తెలంగాణలో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. మొదటి నుంచి అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత  స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జనలకు మంచి స్పందన వచ్చింది. రేవంత్ రెడ్డి దూకుడుతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. రోజురోజుకు అది మరింతగా పెరుగుతూనే ఉంది. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, ఆయన విసురుతున్న సవాళ్లు జనాల్లోకి వెళుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకతకను భారీగా పెంచేస్తున్నాయి.  రేవంత్ రెడ్డితో తమకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనలో గులాబీ లీడర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు హాజరయ్యారు. రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఎంపీల్ని బహిష్కరించడంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతల భేటీని నిర్వహించింది. దీనికి టీఆర్ఎస్ నుంచి కేశవరావు హాజరయ్యారు. ఆయన రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతూ కనిపించారు.  తాము బీజేపీకి ఎప్పుడూ దూరమేనని.. దేశానికి ఉపయోగపడే బిల్లులకు మాత్రమే మద్దతిచ్చామని కేకే చెప్పుకొచ్చారు.  తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కేశవరావు సమావేశం టీ కాంగ్రెస్ నేతల్ని  ఆందోళనకు గురి చేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్‌కే దగ్గర అన్నట్లుగా ఓ ఫోటో రిలీజ్ కావడం టీ కాంగ్రెస్‌ను గందరగోళానికి గురి చేసింది. అందుకే రేవంత్ రెడ్డి వెంటనే మీడియాతో మాట్లాడి.. టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో తమ పోరాటం కొనసాగుతుందనే సంకేతం ఇచ్చారు. అయితే కేడర్ లో మాత్రం కాంగ్రెస్ తో టీఆర్ఎస్ దగ్గరయితే తమ పరిస్థితి ఏంటీ అన్న ఆందోళన కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వర్గీయుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకవేళ కలిస్తే.. తన పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ రేవంత్ రెడ్డిలోనూ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండకపోవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా? నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడే కొందరికి ఈ డౌట్ వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ కు ధీటుగా ఎదుర్కొనే నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాంటిది రాజకీయ సమీకరణల్లోభాగంగా టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసి పని చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. అయితే తెలంగాణలో కారుకు కాంగ్రెసే ప్రత్యామ్నాయమని, ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉండదని రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మారిపోయాయి, బీజేపీ బలపడింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని కమలనాధులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలంటే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.  రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి పరేషాన్?  ఇటీవల కాలంలో మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. ఇంతటి దరిద్రతపు ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. బీజేపీతో దేశానికి నష్టమని, ఆ పార్టీని బొంద పెట్టాలని అన్నారు. ఇది  జరిగిన తర్వాత రోజే రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్ ఎల్పీ కేశవరావు హాజరయ్యారు. ఈ పరిణామాలతో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ దగ్గరవుతుందనే అభిప్రాయం వస్తోంది. అదే జరిగితే రాష్రంలో కాంగ్రెస్ కు గడ్డు కాలమేనని,  ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.   

డబ్బులు కడతారా.. పింఛన్‌, రేష‌న్‌ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’

న‌వ‌ర‌త్నాలు కాదు న‌వ‌రంధ్రాలుగా మారుతోంది. జ‌గ‌న‌న్న పాల‌న దోపిడీ రాజ్యంగా నిలుస్తోంది. పేరుకే కొత్త ప‌థ‌కాలు.. ల‌బ్దిదారుల సంఖ్య‌కు భారీగా కోత‌లు. ఇక ఆదాయం కోసం ప‌న్నుల బాదుడు. అయినా, ప్ర‌భుత్వం న‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. ద‌మ్మిడి రాబ‌డి లేక‌, కొత్త‌గా అప్పు ముట్ట‌క నానా తిప్ప‌లు ప‌డుతోంది. స‌ర్కారు నావ‌ను క‌ష్టాల క‌డ‌లి దాటించేందుకు.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం కొత్త‌గా.. పాత ప‌థ‌కం నుంచి కాసులు పిండుకునే ప‌నికిమాలిన ప‌నికి పూనుకుంది. వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్‌- ఓటీఎస్ పేరుతో పాత ఇళ్ల నుంచి కొత్త‌గా డ‌బ్బులు వ‌సూలు చేస్తోంది. ‘డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా’ అంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పేద‌ల‌ను టార్చ‌ర్ చేస్తోంది. ఉద్యోగుల‌కు టార్గెట్లు పెట్టి మ‌రీ.. పైసా వ‌సూల్‌కు పాల్ప‌డుతోంది.  చంద్ర‌బాబు మీద కోపంతో ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు క‌ట్టించిన టిడ్కో ఇళ్ల‌ను అర్థాంత‌రంగా ఆపేసి.. పేద‌ల గూడు చెద‌ర‌గొట్టారు. ఇక‌, జ‌గ‌న‌న్న హ‌యాంలో కొత్త‌గా ఒక్క ఇల్లు కూడా క‌ట్టించ‌లేదు. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో పేద‌ల‌కు క‌ట్టించిన ఇళ్ల బ‌కాయిల‌ను ఇప్పుడు బ‌ల‌వంతంగా వ‌సూలు చేస్తోంది వైసీపీ స‌ర్కారు. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పేరుతో.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌-  ఓటీఎస్‌ కింద 10వేల నుంచి 15వేలు పేద‌ల నుంచి రాబ‌డుతోంది. ఓటీఎస్‌ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే డిసెంబరు పెన్షన్‌ ఇవ్వొద్దని.. రేష‌న్ క‌ట్ చేయాల‌ని.. అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లను ప్ర‌భుత్వం ఆదేశించింది. ల‌బ్దిదారుల ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవంటే.. డ్వాక్రా సంఘాల నుంచి రుణం ఇప్పించైనా.. ఓటీఎస్ వ‌సూలు చేయాల‌ని.. లేదంటే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచి రాబడతామని హెచ్చ‌రిస్తున్నారు ఉన్న‌తాధికారులు. ప్రతి డివిజన్‌కు రోజుకు రూ.కోటి చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయాలని టార్గెట్లు పెట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా వారి ఇళ్లకున్న బకాయిలను మాఫీ చేసి... రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.10 వేలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు, వడ్డీ వ్యాపారస్తుల తరహాలో బెదిరిస్తుండటంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. ‘మాకు ఓటీఎస్‌ వద్దు’ అంటూ మహిళలు తిరగబడుతున్నారు. అయినా, జ‌గ‌న‌న్న పైసా వ‌సూల్ కార్య‌క్ర‌మాన్ని ఆప‌డం లేదు.

వైసీపీ వారికే వరద సాయం? కడప జిల్లాలో బాధితుల ఆందోళన..

జగనన్న పాలనలో అంతా రివర్సే. గత రెండున్నర ఏండ్లుగా ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలే అలా ఉంటున్నాయని అంటున్నారు. పార్టీలకతీతంగా అందించాల్సిన పథకాల అమలులో వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లు కట్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా వాలంటీర్లుగా ఉండటంతో... గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చెప్పినట్లే అంతా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వరద సాయంలోనూ రాజకీయ వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరదలతో నరకయాతన పడిన బాధితులకు సాయం అందించాల్సిన ప్రభుత్వం.. అందులోనూ టీడీపీ వాళ్లను టార్గెట్ చేసిందని తెలుస్తోంది.  వరదలతో తీవ్ర నష్టం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.  రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెను వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజుల వరకు గ్రామస్తులు నీటిలోనే ఉన్నారు. అయితే ఆ గ్రామంలో వరద సాయం బాధితులందరికి ఇవ్వలేదు. ఆ గ్రామంలో వైసీపీ సర్పంచ్ లేకపోవడం వల్లే ప్రభుత్వం వివక్ష చూపిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా గరుగుపల్లెలో  కొందరు బాధితులు ఆందోళనకు దిగారు. ఏకంగా ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్ రెడ్డిని నిలదీశారు వరద బాధితులు. వరద సాయం వైసీపీ వర్గీయులకే పంపిణీ చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించిన ఐదుగురు వరద బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  వివరాల్లోకి వెళితే ..ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గరుగుపల్లెలో వరద సాయం పంపిణీ చేపట్టారు. అర్హులందరికీ ఇవ్వలేదని, వైసీపీ వర్గీయులను మాత్రమే వలంటీర్‌ నమోదు చేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ని పిలవకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ పంపిణీ చేయాలని అధికారులను శ్రీకాంత్‌రెడ్డి ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, అడ్డుకున్నవారిలో ఐదుగురిపై రాయచోటి అర్బన్‌ పోలీసులు సాయంత్రం కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకూ ఆటంకం కల్పించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 353, 341, 506 రెడ్‌ విత్‌ 34 కింద కేసు(క్రైం నంబరు 448/2021) నమోదు చేశారు. అర్హులందరికీ ఇవ్వాలని అడిగిన ప్రజలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ తప్పుడు కేసులు పెట్టించడం దారుణమని టీడీపీ నాయకుడు మండిపల్లె రాం ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. 

జగన్ సర్కార్ పై ఉద్యోగుల జంగ్ సైరన్.. సీఎస్ కు జేఏసీ నోటీస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు... మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇవ్వనున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను ఇవ్వనున్నారు. 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌పై ఐక్య వేదిక నోటీస్ ఇవ్వనుంది. డిసెంబర్ 7 నుండి ఉద్యమ కార్యాచరణను అమలులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.  

వరి సాగు చేయండి.. కొనుగోలు బాధ్యత నాదే! కేసీఆర్ కు షాకిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగుపైనే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య యుద్ధమే సాగుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని ఎఫ్ సీఐ చెప్పిందంటున్న టీఆర్ఎస్.. కేంద్రంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు యాసంగిలో వరి సాగు చేయవద్దని అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. యాసంగిలో రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనదని, రైతులెవరు వరి సాగు చేయవద్దని చెబుతున్నారు. కాని సీఎం కేసీఆర్ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. సీఎం వరి సాగు చేయవద్దని చెబుతుంటే.. అతను మాత్రం వరి సాగు చేయాలని రైతులకు బహిరంగంగానే చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్యలు రాజకీయంగా సంచలనం రేపుతుండగా.. గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారాయి.  యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గ రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు ఏం చెప్పినా రైతులు అయోమయానికి గురి కావద్దన్నారు. వరి సాగు చేసేందుకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లర్లతో చర్చించానని, మెట్టపంటలు వేసుకునే అవకాశం ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు.  కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని భాస్కర్ రావు ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయ డం చూశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊరికే రాద్ధాంతం చేస్తే సమస్య సమసిపోదన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి ధాన్యం బస్తా రూ.1,480కే మిర్యాలగూడ మిల్లులకు డెలివరీ చేస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు సరికాదని భాస్కర్‌రావు అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కాకుండా మిల్లర్లతో కొనుగోలు చేయిస్తానని చెబుతున్నారు. 

పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?

రాజ్యసభకు కేసీఆర్ .. ఏంటి అవాక్కయ్యారా? అయినా మీరు వింటున్నది నిజమే.ఢిల్లీకి మకాం మార్చక తప్పని అనివార్య పరిస్థితులు లేదా అర్జెంటుగా ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పని వత్తిళ్ళ నేపధ్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. జాతీయ రాజేకీయాల్లో తెరాస కీలక భూమిక పోషిస్తుందని గత కొంత కాలంగా ముఖ్యమంత్రి పదే పడే ప్రస్తావిస్తున్న నేపధ్యంలో, రాష్ట్ర బాధ్యతలను వారసుడు కేటీఆర్’కు అప్పగించి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు షిఫ్ట్’అవుతారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెరాస వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అందుకు ఇప్పుడు పరిస్థితుల ప్రభావం కూడా తోడైందని అందుకే కేసీఆర్ ఢిల్లీకి  మకాం మార్చేందుకు మానసికంగా సిద్డమయ్యారని, అందులో రాజ్యసభకు  వెళ్ళే అలోచన చేస్తునారని అంటున్నారు.      ఎవరు అవునన్నా,ఎవరు కాదన్నా గత కొంత కాలంగా ముఖ్యంగా తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరో వంక , అంతర్గత కుమ్ములాటలు ఇతరేతర కారణాలవలన  పరిపాలన కోడా పట్టాలు తప్పింది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ..ఈ అన్నిటినీ మించి పార్టీలో, అంతకంటే ఎక్కువగ్ ఫామిలీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఇంటి ఆడబిడ్డ గడప తొక్కలేని స్థితికి  పరిస్థితి చేజారిపోయింది. ఒక విధంగా చూస్తే ఇప్పటికే పార్టీ మీద, ప్రభుత్వ వ్యవహారాల్లో, కుటుంబ రాజకీయ వ్యవహరాల్లో పెద్దాయన పట్టు తప్పిందని అంటున్నారు.ఇతరుల విషయం ఎలా ఉన్నా, ముఖ్యమంత్రిని ఏదో తెలియని భయం వెంట్డుతోందని ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోందనే భావన బలపడుతోందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.   అదలా వుంటే మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట కూడా రోజు రోజుకు దిగజారుతోందని అంటున్నారు. వరిసాగు, ధాన్యం సేకరణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ఎంతగా విరుచుకు పడినా, బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులను ఎంతగా తిట్టిపోసినా,పడిపోయిన ప్రతిష్ట పైకిలేవడం లేదు. కోటి ఎకరాల్లో వరి వేసినా, ఐ యాం హ్యాపీ’ కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని శాసన సభలో చెప్పి ఇప్పుడు అందుకు అందుకు విరుద్ధంగా మాట్లాడడం వంటి ద్వంద వైఖరితో ముఖ్యమంత్రి వ్యక్తిగత  ప్రతిష్ట దిగజారుతోందని,  ప్రజల్లో ఆయన పట్ల  విశ్వాసం సన్నగిల్లుతోందని  అంటున్నారు.  మరో వంక అయన గురిచూసి వేసిన ప్రతి బాణం తిరిగొచ్చి  ఆయనకే గుచ్చుకుంటోంది. పాత వీడియోలు ప్రూఫ్ గా సోషల్ మీడియాలో ఆయన్ని ఆయనే ఆయన నోటితోనే దూషించుకోవడం చూసి, నెట్టింట అందరూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు ఆయన్నీ, చేరుతున్నాయి, ఆయన్ను ఇంకాస్త, ఫ్రస్ట్రేషన్’లోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. నిజాలు ఎలా ఉన్నా, హుజూరాబాద్ ఓటమి మొదలు ఒకదాని వెంట ఒకటిగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయనే అనే అభిప్రాయం అయితే, అంతటా వినవస్తోంది.    అంతకు మించి, హుజూరాబాద్ ఓటమి పక్కలో బల్లెంలా, కదిలినా మెదిలినా కడుపులో గుచ్చుకుంటోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చి నిండా నెలరోజులు అయినా, ఈటల చేసిన గాయం మాత్రం మానడం లేదు. ఇన్ని రోజుల్లో, ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చినా ఒక్క సారైనా ముఖ్యమంత్రి హుజూరాబాద్ ప్రస్తావన చేయలేదు.ఈటల పేరు కూడా  ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఈటల చేసిన గాయం ఆయన్ని ఎంతలా సలుపుతోందో అర్థం చేసుకోవచ్చని, వేరే చెప్పనక్కరలేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, అసెంబ్లీలో తనను చూడడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి తనను ఓడించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈటల పదేపడే చేసిన వ్యాఖ్య నిజమే కావచ్చని ఆ కారణంగానూ , పెద్దల సభకు వెళ్ళే ఆలోచన చేస్తునారని కొందరు అంటున్నారు.  మరో వంక, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా, ముహూర్తం దాక వచ్చి ముడిపడని కేటీఆర్ పట్టాభిషేకం ఆలస్యమయ్యే కొద్దీ, పట్టుతప్పుతున్న కుటుంబ కలహాలు, ఫ్యామిలీలో సాగుతున్న ‘కుర్చీ’ పట్లు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏదో వంకన మకాం ఢిల్లీకి మార్చి, ఆ వంకన కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.ఈ వ్యూహంలో భాగాంగానే ... మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్’ను తెరపైకి తెచ్చారు.బీజేపీ, మోడీ వ్యతిరేకతను పావుగా మలచుకునే ప్రయత్నం సాగిస్తున్నారు.అయితే అక్కడ ఢిల్లీలో బీజేపీ మోడీ ప్రత్యాన్మాయ స్థానం కోసం గట్టిపోటీ నడుస్తోంది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ ... ఈ అందరినీ ఆడించే పొలిటికల్ రింగ్ మాస్టర్ ప్రశాంత్ కిశోర్ ఇలా ... చాలామంది ఎవరి ప్రయత్నాలలో వారున్నారు.   అయినా, ఇతర విషయాలు ఎలాఉన్నా, ఉద్యమ వాసనలు లేని కొత్తతరం రాజకీయ వ్యూహంలో రాష్ట్రాన్ని వారసునుకి అప్పగించే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. ఇటు పార్టీ పగ్గాలు, అటు ప్రభుత్వ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెడితే, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్ధుల కంటే కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒక మెట్టు పైన నిలపాలని, అందుకోసం అయినా కేటీఆర్’ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అందుకోసమే మకాం దేల్హికి మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, అన్నీ అనుకున్నట్లు జరుగుతయ్యా ... కేటీఅర్ పట్టాభిషేకానికి వినాయకుడు ఈసారైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడవలసి వుందని అంటున్నారు.

సిరివెన్నెలకు నివాళి.. హోదా లేదట.. జగనన్న బాదుడు..టాప్ న్యూస్@8PM

ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధ పడుతున్నారు. ఈనెల 24న హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు నిపుణులైన వైద్య బృందం చికిత్సను అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.  సాయంత్రం 4.07 గంటలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ---- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని చెప్పారు.  ----- ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని అన్నారు. ---- ఏపీ ప్రభుత్వం కన్ను  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై పడిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎన్టీఆర్ వర్సిటీ డబ్బును రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మళ్లించేందుకు దుష్ట ఆలోచన చేసిందని విమర్శించారు.కెనరా బ్యాంకులో దాచిన డబ్బును ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ----- జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే  రాజోలు నియోజకవర్గంలో రోడ్లకు ప్రతి రెండున్నర అడుగులకు ఒక గొయ్యి ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అంధకారంలో కూరుకు పోయిందన్నారు నాదెండ్ల మనోహర్.  ---- రాష్ట్రంలోని ప్రజలపై మరో పన్ను బాదుడు మొదలు కానుంది. ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ---- సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో వరి వేయద్దని చెప్పినపుడు.. మరి  ఏ పంట వేయాలో చెప్పాలని కేసీఆర్‌‌ను ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. వాటిని రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు.  ----- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ------- మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.  ---  భారత సైన్యం నిఘా సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లను లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుండటంతో చైనా కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సేకరణ నిబంధన క్రింద ఈ డ్రోన్లను మన దేశం కొనుగోలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీటిని మన దేశానికి అప్పగించడంలో కొన్ని నెలలు జాప్యం జరిగింది.

హోదాపై కేంద్రం పాత పాట.. జగనన్న మౌనమే శాపమా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వనందునే...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజికి అంగీకారం తెలిపింది.. ఇదే  పాత పాటను కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ లో పాడి వినిపించింది. తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతే కాదు, విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి దీర్ఘకాల సమయం ఉందన్నారు.విభజన అంశాల పూర్తి కోసం చట్టంలోనే పదేళ్ల గడువు ఉందని వివరించారు. చట్టంలో పేర్కొన్న అన్ని పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు.. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమీక్ష చేస్తోందని వెల్లడించారు. ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగయాని, ద్వైపాక్షిక సమస్యల సామరస్యపూర్వక పరిష్కారం కోసం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారు.14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన వ్యవహారమని ఉద్ఘాటించారు.  కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచి ఉంటే.. ఏపీకి 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అదనపు సాయం లభించేదో.. ఆ మొత్తాన్ని ప్రత్యేక సాయం కింద అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కేంద్రమే చెల్లించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని లోకసభకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు.మొత్తానికి, కేంద్ర మంత్రి ఏపీకి ఇంకేమీ చేసేది లేదని, చేయవలసిందీ లేదని నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారు. అయినా 22 మంది వైసేపీ ఎంపీల్లో ఎవరు నోరు విప్పలేదు. ఇదెక్కడి అన్యాయమని అడిగే సాహసమే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం,  మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే అసలు కేంద్రం చేసిన అవమానాన్ని అసలు గుర్తించినట్లే లేదు.  అయితే తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ప్రత్యేక హోదా కోసం అంతులేని పోరాటం చేసింది. చివరకు కేంద్రం మొండి వైఖరి మారక పోవడంతో, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రంలో మంత్రి పదవువులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. కేంద్రం తలపెట్టిన అన్యాయయానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి డెల్లి వరకు  ధర్మ పోరాటం సాగించింది.కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మద్దతుతో,ఇదే ఇష్యూ ఫై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెచ్చి, ఆంద్ర ప్రదేశ్ హోదా విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో అధికారంతో పాటుగా లోక్ సభలో 25 కు 22 సీట్లు వైసీపీకి కట్టబెట్టినా, అధికారం అప్పగిస్తే కేంద్రంతో కోట్లాది అయినా ప్రత్యేక హోదా సాధిస్తానని మాటిచ్చిన జగన్మోహన రెడ్డి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే కాడి వదిలేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి , హోదా అడిగే పరిస్థితే లేదని ముందుగానే సరండరై పోయారు. అయినా అడుగుతూనే ఉంటాం.. ఆ తర్వాత కేంద్రం దయ మన ప్రాప్తం, అంటూ యుద్ధానికి ముందే సంధి మంత్రం జపించారు. తెల్ల జెండా ఎగరేశారు. పార్లమెంట్ లోపలగానీ, బయట గానీ వైసేపీ ఎంపీలు ఏనాడు, ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదు.  అయితే తెలుగు దేశం పార్టీ మాత్రం, ఉన్నది ముగ్గేరే ఎంపీలు అయినా లోక్ సభలో ఇంచు మించుగా ప్రతి సెషన్ లోనూ ఏదో ఒక రూపంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెచ్చి, హోదా ఇష్యూ ను సజీవంగా ఉంచుతోంది.