కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ సేఫేనా? 

తమిళనాడులోని ఊటీ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన  హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, మరో ముగ్గురు ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు ఉన్నారు. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్టు సమాచారం.  ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని  తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియడం లేదు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ  ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే ఓ హోటల్‌ సమీపంలో కూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దూరదర్శన్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. 80శాతం కాలిన గాయాలతో ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం.

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. పక్కనున్నా, వెనుక ఉన్నా జైలు!

అర్థ‌రాత్రి వ‌ర‌కూ పార్టీ చేసుకుంటారు. ఫుల్లుగా తాగేసి వాహ‌నంలో రోడ్డు మీద‌కొస్తారు. తాగినోళ్లే కంట్రోల్‌లో ఉండ‌రు.. ఇక బండినేం కంట్రోల్ చేస్తారు? తాగిన మైకంలో స‌రిగ్గా న‌డ‌వ‌నే లేరు.. ఇక కారునేం న‌డుపుతారు? ఒక‌డు వెహికిల్ డ్రైవ్ చేస్తుంటే.. మిగ‌తా వారు ప‌క్క‌న చేరి ఎంజాయ్ చేస్తుంటారు. డ్రంకెన్ డ్రైవ్ చేయ‌కూడ‌ద‌ని తెలిసినా.. పోలీసులు ప‌ట్టుకుంటార‌నే భ‌య‌మే ఉండ‌టం లేదు. అంతా తాగి ఉండ‌టంతో.. ఎవ‌డో ఒక‌డు బండి న‌డ‌పాల్సిందే. కేసు అయితే డ్రైవింగ్ చేసిన‌వాడినే ప‌ట్టుకుంటారు..  త‌మ‌కేం కాద‌నే ధీమాతో మిగతా వారు సైతం డ్రంకెన్ డ్రైవ్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. అందుకే, ఇక‌పై ప‌క్క‌న‌.. వెన‌కాల ఉన్న వారిపైనా కేసులు పెట్టి.. జైలుకు పంపించాల‌ని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టికే అమ‌లు కూడా చేసి చూపించారు. కార్లు, బైకుల్లో మందుబాబులతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితులు, సన్నిహితులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు హైద‌రాబాద్ పోలీసులు. మద్యం తాగి కారులో వేగంగా వెళుతూ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 2లో ప్రమాదం చేసి ఇద్దరిని బలిగొన్న రోహిత్‌ గౌడ్‌తో పాటు అతడి పక్కన కూర్చున్న సోమన్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా, వాహనదారుల్లో భయం పెంచేందుకు ఇలా చేస్తున్నారు.    హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 2 నెలల్లో 48 మంది చనిపోయారు. వీరంతా మద్యం మత్తులో డ్రైవర్లు చేసిన ప్రమాదంతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా, తాగుబోతుల డ్రైవింగ్‌ వ‌ల్ల అమాయ‌కులు మృత్యువాత ప‌డుతుండ‌టాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు పోలీసులు. డ్రంకెన్ డ్రైవ్ ఘ‌ట‌న‌లు త‌గ్గించేలా.. వారిలో భ‌యం క‌లిగేలా.. క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మైన వారిపై పోలీసులు ఐపీసీ 304 పార్ట్‌-2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇకపై డ్రైవర్లతో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చ‌రిస్తున్నారు. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడుపుతుంటే పక్కన గానీ/ వెన‌కాల గానీ.. కూర్చోవడం కూడా తప్పే. త‌ప్పును ప్రోత్సహిస్తున్నట్టే. అందుకు శిక్ష అనుభవించాల్సిందే.   

అమరావతికి ఢిల్లీ మద్దతు.. రంగంలోకి అమిత్ షా.. అలా ముగిసింది.. టాప్ న్యూస్@1PM

అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఢిల్లీ రైతు ప్రతినిధులు మద్దతు తెలుపుతూ అమరావతి రైతులతో కలిసి నడిచారు. అమరావతి రైతుల పోరాటం ఫలిస్తుందని, వారి సమస్యను జాతీయ సమస్యగా గుర్తిస్తున్నామని తెలియజేశారు. మూడు రోజులు ఇక్కడే ఉండి పాదయాత్రలో పాల్గొంటామన్నారు ఢిల్లీ రైతు ప్రతినిధులు.  ------- పార్లమెంటు సాక్షిగా ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అవమానించిందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. సమస్యను ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగడం వైసీపీ ప్రభుత్వంలో రివాజుగా మారిందన్నారు. వరదల అంశాన్ని పక్కదారి పట్టించడానికే అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన వైసీపీ నేతలు... ఇప్పుడు ఈ జాడ్యాన్ని పార్లమెంటుకు కూడా అంటించారని ఆరోపించారు.  ------ ఏపీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు.  మండలి చైర్మన్‌ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. శివరామిరెడ్డి, అరుణ్‌, రఘురాం, ఉదయ్‌భాస్కర్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, రఘురాజు, కల్యాణి, మాధవరావు, కృష్ణరాఘవ జయేంద్ర భారత్‌, శ్రీనివాస్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.  ----- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి టౌన్‌లోని 19, 20, 24 వార్డుల్లో పర్యటిస్తున్న లోకేష్... అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు నారా లోకేష్.  ---- మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పిడుగురాళ్ల లో  రోశయ్య కాంస్య విగ్రహాన్ని  ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే మార్చి నాటికల్లా పిడుగురాళ్లలో రోశయ్య విగ్రహం పెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ తరుపున తామే కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ------ సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ  ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. భూములు పరిరక్షణ చేయాలని కోరుతూ తొలి పావంచా నుంచి సింహాచలం ఈవో కార్యాలయం పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఈవోకి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు.  ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు ---- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తో తెలంగాణ బిజేపి నాయకులు గురువారం భేటీ కానున్నారు. బండి సంజయ్‌ కు అందుబాటులో వుండమని అమిత్‌షా ఆఫీసు నుండి ఫోన్‌ వచ్చింది. రాష్ట్ర ఇన్‌చార్జు తరుణ్‌ చుగ్‌ కూడా ఆహ్వానం అందింది. రాష్ట్ర రాజకీయాలు,ముఖ్యంగా వరి విషయంలో రాష్ట్రప్రభుత్వం వైఖరిపై చరించే అవకాశం వుంది. 2023ఎన్నికల అజెండా కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. -- నల్గొండ జిల్లాలో  ఓ దళితుడిని చితకబాది గాయపర్చిన కేసులో నల్గొండ జిల్లా టూ టౌన్ ఎస్ఐ నర్శింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాపై సస్పెన్షన్ వేటు పడింది. రవీంద్ర నాయక్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రొయ్యల శ్రీనును గాయపర్చిన ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ------ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ  ముగిసింది. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ లభించింది. డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై ఈడీ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్‌కు చెందిన 12 మంది నటీనటులను ఈడీ విచారించింది. సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేతకు రంగం సిద్ధమైంది.  --- జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ జోన్ పోలీసులు  ట్వీట్ చేశారు.  

సోమవారం-బీరువారం!.. లిక్కర్‌ సేల్స్‌ కోసం క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు!

ఢిల్లీలో సివిల్ స‌ర్వెంట్ల ఎంపిక కోసం యూపీఎస్‌సీ ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతున్నాయి. ఏపీ నుంచి ఓ అభ్య‌ర్థి ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యారు. సెలెక్ట్ అయితే.. మొద‌ట‌ ఐఏఎస్.. ఆ త‌ర్వాత క‌లెక్ట‌ర్ అవుతాడు. ఇంట‌ర్వ్యూ ప్యానెల్ వ్య‌క్తి ఓ ప్ర‌శ్న అడిగాడు. క‌లెక్ట‌ర్ అయితే ఏం చేస్తావ‌ని ప్ర‌శ్నించాడు. మ‌నోడు ఏపీ నుంచి వ‌చ్చాడుగా.. అందుకే లిక్క‌ర్ సేల్స్‌మెన్‌గా మారి మ‌ద్యం అమ్మ‌కాలు పెంచుతాన‌ని ఆన్స‌ర్ ఇచ్చాడు. ఆ స‌మాధానం విని.. ఇంట‌ర్వ్యూ ప్యానెల్ అవాక్కైంది. అదేంటి, క‌లెక్ట‌ర్ ఏంటి..? లిక్క‌ర్ సేల్స్‌మెన్ కావ‌డ‌మేంట‌ని.. మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయింది. ఆ త‌ర్వాత విష‌యం తెలుసుకొని ముక్కున వేలేసుకుంది. ఆ అభ్య‌ర్థి చెప్పింది క‌రెక్ట్ ఆన్స‌రే.. ఎందుకంటే ఏపీలో జిల్లా క‌లెక్ట‌ర్లు చేస్తున్న‌ది.. చేయాల్సింది..అదే. ఇది పిట్ట‌క‌థ‌నే అయినా.. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న వాస్త‌వం. లిక్క‌ర్ సేల్స్ పెంచ‌డ‌మే. ప్ర‌తీ సోమవారం ఆ వివ‌రాలు చీఫ్ సెక్ర‌ట‌రీకి చెప్పాల్సిందే.    ఏపీ బ‌తుకు బండి ఎలా న‌డుస్తోందో తెలుసుగా. మ‌ద్యం అమ్ముడైతేనే.. పాల‌న ముందుకు సాగేది. లిక్క‌ర్ మిన‌హా ద‌మ్మిడీ ఆదాయం లేదాయే. మ‌ద్యం షాపులే జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు మెయిన్ ఇన్‌క‌మ్ సోర్స్‌. అందుకే, మునుపెన్న‌డూ లేన‌ట్టు ప్ర‌భుత్వ‌మే సొంతంగా లిక్క‌ర్ షాపులు తెరిచింది. భారీగా రేట్లు పెంచేసింది. ఊరూ పేరు లేని బ్రాండ్లు అమ్ముతోంది. అవి తాగ‌లేక‌.. వేరే స‌రుకు దొర‌క‌క‌.. పాపం మందుబాబులు ప‌డుతున్న‌ క‌ష్టం.. మింగుతున్న ఆ చేదు గ‌ర‌ళం గురించి ఆ ప‌ర‌మాత్మ‌కే తెలుసు.   ఇంత వ‌ర‌కూ ఓకే. తాజాగా మ‌రింత చోద్యం. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం.. సోమ‌వారాన్ని పోల‌వారంగా చేయ‌గా.. ఇప్ప‌టి వైసీపీ స‌ర్కారు సోమవారాన్ని బీరువారంగా మార్చేసిందంటున్నారు. న‌వ్విపోదురుగాక నాకేంటి అన్న‌ట్టు.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఆదేశాల‌తో స్వ‌యంగా చీఫ్ సెక్ర‌ట‌రీనే ప్ర‌తీ సోమ‌వారం మ‌ద్యం అమ్మ‌కాల‌పై క‌లెక్ట‌ర్ల‌తో రివ్యూలు చేస్తున్నారట‌. క‌లెక్ట‌ర్ల‌ను లిక్క‌ర్ సేల్స్‌మెన్‌గా మార్చేస్తున్నారంటున్నారు. సీఎస్ ఏంటి.. వారం వారం మ‌ద్యం అమ్మ‌కాల‌పై స‌మీక్ష ఏంట‌ని అనుకోన‌వ‌స‌రం లేదు. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇంత‌కంటే పెద్ద ప‌నే ముంది మ‌రి? వైన్ షాపులు ఎంత బాగా న‌డిస్తే.. ప్ర‌భుత్వ జ‌ట్కాబండి అంతా సాఫీగా ముందుకు సాగుతుంది. అందుకే, వాన‌లు, వ‌ర‌ద‌ల బీభ‌త్సం, రోడ్ల దుస్థితి కంటే కూడా.. లిక్క‌ర్ సేల్సే ముఖ్య‌మైంది మ‌న సీఎస్‌కి అంటూ అధికారులే విమ‌ర్శిస్తున్నారు.  మద్యం అమ్మకాలపై ప్ర‌తీ సోమ‌వారం సాయంత్రం ఐదు గంటలకు ఠంచనుగా సీఎస్‌ సమీక్షిస్తున్నారని స‌మాచారం. లిక్కర్‌ సేల్స్‌పై, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకోవాల్సిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ప‌నితీరుపై.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్‌ క్లాస్‌ తీసుకుంటున్నారట‌. ఈ వారం ఎన్ని కేసుల బీర్లు అమ్మారు? ఎంత మద్యం అమ్ముడుపోయింది? ఆ ప్రాంతంలో సేల్స్ ఎందుకు త‌గ్గాయి? గ‌తవారంతో పోలిస్తే ఆదాయం ఎందుకు త‌గ్గింది?  మీరంతా ఏం చేస్తున్నారు? అమ్మ‌కాలు పెంచాల్సిందే? అంటూ చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ.. కలెక్టర్లు, ఎస్పీలతో ప్ర‌తీ సోమ‌వారం రివ్యూ చేస్తుండ‌టంపై ఐఏఎస్‌ల సంఘం ఆగ్ర‌హంగా ఉంద‌ని తెలుస్తోంది.  జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప‌ర్య‌వేక్షించాల్సిన క‌లెక్ట‌ర్లుకు ఇలా వారం వారం మ‌ద్యం అమ్మ‌కాల‌పై సీఎస్‌ క్లాస్ ఇస్తుండ‌టం.. బీర్లు, బాటిళ్ల లెక్కలు చెప్పాల్సి రావ‌డం.. సిగ్గుగా భావిస్తున్నారు జిల్లా క‌లెక్ట‌ర్లు. ఆ రివ్యూ మీటింగ్‌లో జ‌రుగుతున్న‌ కొన్ని ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు కూడా బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ‘మీ జిల్లాలో ఫలానా ప్రాంతంలో సేల్స్‌ తగ్గాయి ఎందుకు’ అని ఓ క‌లెక్ట‌ర్‌ను సీఎస్‌ అడగ్గా... ‘‘సార్‌, బడ్‌వైజర్‌ బీర్‌కు బాగా డిమాండ్‌ ఉంది. అవి పంపితే సేల్స్‌ పెరుగుతాయి’ అని ఆయ‌న సెల‌విచ్చార‌ట‌. అలా కుద‌ర‌దు.. ఉన్న బ్రాండ్లతోనే అమ్మ‌కాలు పెంచాలంటూ సీఎస్ తేల్చి చెప్పార‌ని తెలుస్తోంది.  ఇక జిల్లా ఎస్పీల‌కు త‌ప్ప‌ట్లేదు సీఎస్ నుంచి షంటింగ్స్ అంటున్నారు. ప‌క్క రాష్ట్రాల నుంచి అక్ర‌మంగా వ‌స్తున్న‌ మ‌ద్యం అమ్మ‌కాల‌ను అడ్డుకోవ‌డంలో మ‌రింత క‌ఠినంగా ఉండాల‌ని.. నాటుసారా బ‌ట్టీలు లేకుండా చేయాల‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు సీఎస్ నుంచి సూచ‌న‌లు వ‌స్తున్నాయ‌ట‌. ఎక్సైజ్ శాఖ‌ నుంచి 70 శాతం మంది సిబ్బందిని తీసుకుని, ప్రతి మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక సెబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకుని, సెబ్‌ ద్వారా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు పెట్టి మరీ అక్ర‌మ మ‌ద్యాన్ని కట్టడి చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలి? శాంతి భద్రతలు వ‌దిలేసి.. మ‌ద్యం ర‌వాణాపైనే దృష్టి పెట్టాలా? అంటూ ఎస్పీలు ఆఫ్ ది రికార్డ్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇలా ప్ర‌తీ సోమ‌వారం సాయంత్రం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ద్యం అమ్మ‌కాల‌పై క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్ష నిర్వ‌హిస్తుండ‌టం.. చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయి అధికారికి చీప్‌గా లేదా అంటూ ఐఏఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. క‌లెక్ట‌ర్లు, ఎస్పీల బాధ్య‌త‌ల‌కు కొత్త నిర్వ‌చ‌నం చెబుతున్నార‌ని.. ఇదెక్క‌డి పాల‌న అని మండిప‌డుతున్నారు. అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంపై కేంద్ర హోంశాఖ‌కు ఫిర్యాదు చేయాలనే దిశ‌గానూ సివిల్ స‌ర్వెంట్లు ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మా.. మ‌జాకా..! గంటకు 10 కోట్ల తాగుడు.. ఆ నాలుగు జిల్లాలే టాప్‌.. స‌ర్కారు కొత్త టార్గెట్‌..

ఉచిత బియ్యం ఇక సగమే.. రాష్ట్రం వాటా లేనట్లే 

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపధ్యంగా 2021 ఏప్రిల్‌ నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం  ఐదు కిలోలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోలు, మొత్తం పది కిలోల వంతున బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. కానీ, రాష్ట్రంలోని  రేషన్ షాపుల్లో డిసెంబర్ లో 5 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని, ఆరా తీస్తే, కేంద్ర ప్రభుత్వం నవంబర్ తో ముగిసిన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను వచ్చే సంవత్సరం  మార్చి వరకు పొడిగించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అందుకే కేంద్ర ఇచ్చే ఐదు కిలోల ఉచిత బియ్యం మాత్రమే పేదలకు అందుతోంది. రాష్త్రం వాటా నిలిచి పోయింది.  ఇందుకు  సంబందించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని, బియ్యం కూడా విడుదల కాలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన కోటా మేరకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు చెపుతున్నట్లు సమాచారం. కిందటి నెల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో 5 కిలోలే పంపిణీ చేస్తున్నారు, దీంతో  పేద ప్రజలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.   ప్రస్తుత పరిస్థితులను బట్టి పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఉచిత రేషన్‌ అందిస్తుంటే.. దానికి భిన్నంగా రాష్ట్ర సర్కారు రేషన్‌లో కోత పెట్టింది. ఈ నెలలో కేంద్రం ఇచ్చిన 5 కిలోల బియ్యమే పంపిణీ చేయాలని సివిల్‌ సప్లయ్స్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నెల లబ్ధిదారులకు ఉచితంగా అందాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా 2.8 లక్షల టన్నుల ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయినట్లయింది. తెలంగాణలో మొత్తం 90,48,421 రేషన్ కార్డులుండగా.. అందులో 2,87,44,273 మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద ఇస్తున్న ఉచిత బియ్యానికి ప్రతి నెలా రూ. 110 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రం వాటాను ఆపేయడంతో నెలనెలా రూ.110 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పేదల కడుపు నింపే విషయంలో ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తున్నారు.

1,128 ఆస్తులు..  8,088 ఎకరాలు! టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం..

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ‘శ్వేతపత్రం విడుదలైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల కావడం ఇదే మొదటిసారి. శ్రీవారి ఆస్తులపై ఇంత వరకూ శ్వేతపత్రమూ విడుదల కాలేదు. శ్రీవారికి ఉన్న ఆస్తుల గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భావించింది. శ్రీనివాసుడికి భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ శ్వేతపత్రాన్ని టీటీడీ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. దీంతో శ్రీవారి ఆస్తులపై గతంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన వివాదానికి టీటీడీ పాలక మండలి చెక్ పెట్టినట్టయింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ శ్వేతపత్రం రూపొందించినట్లు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం 1,128 ఆస్తులు ఉన్నాయి. మొత్తం 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి శ్రీవారికి ఉంది. దీన్ని వ్యవసాయం, వ్యవసాయేతర భూములు స్థలాలుగా విభజించింది. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న ఆస్తుల సంఖ్య 233. వీటిలో 2,085 ఎకరాలు 41 సెంట్ల భూమి స్వామివారి పేరు మీద ఉంది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నట్లు టీటీడీ శ్వేతపత్రంలో పొందుపరిచింది. 1974 నుంచి 2014 వరకు మొత్తం శ్రీవారికి చెందిన 141 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ అధికారులు శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. మొత్తం 335 ఎకరాల 23 సెంట్ల స్థలాన్ని అమ్మినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ఆస్తుల సంఖ్య 61. వాటిలో మొత్తం 293 ఎకరాల 02 సెంట్లను అమ్మేశారు. 42 ఎకరాల 21 సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు. దీనివల్ల టీటీడీ పాలక మండలికి 6 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం వచ్చిట్లు శ్వేతపత్రం పేర్కొంది. కాగా.. గత ఏడాది నవంబర్ 28 వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య 987. వాటిలో 7,753 ఎకరాల 66 సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి ఉంది. మొత్తం 1,792 ఎకరాల 39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలక మండలి ఆధీనంలో ఉంది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శ్వేతపత్రాన్ని www.tirumala.orgలో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు

జగన్ సర్కార్ అప్పులు ఏ రేంజ్ లో ఉన్నాయో! ఏ బ్యాంక్ ను వదల్లే.. 

ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో .. గండం నుంచి గట్టెక్కడానికి ఎక్కడ దొరికితే అక్కడ రుణం తీసుకుంటొంది జగన్ సర్కార్. బ్యాంకులతో పాటు కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకుంది. గత రెండేండ్లలో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు.  కేంద్రమంత్రి చెప్పిన వివరాల ప్రకారం పది జాతీయ బ్యాంకుల నుంచి జగవ్ ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 నుంచి 2021 నవంబరు మధ్య తీసుకుంది.ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయి. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రంస్పష్టం చేసింది. అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి రూ.11,937 కోట్లు రుణాన్ని 9 సంస్థలు పొందాయి. బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి. అమిత్ షాను వైసీపీ ఎంపీలు ఎందుకు కలిశారో? బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలకు రూ.7 వేల కోట్ల రుణం లభించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ. 1,750కోట్ల రుణం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. ఏపీలో ఎక్కడా పెద్దగా కనిపించని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు ఖాతా పెట్టారు.  జగన్ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారని వాటిని బడ్దెట్ పద్దుల్లో చూపించడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి. ఇంకా పెద్ద ఎత్తున రహస్యంగా ఉంచిన అప్పుల వివరాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒక్క స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతోనే పాతిక వేల కోట్లు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. బ్యాంకులు కూడా కొన్ని వివరాలు రహస్యంగా ఉంచుతున్నాయని త్వరలో అన్నీ బయటకు రాక తప్పదంటున్నారు. 

అమిత్ షాను వైసీపీ ఎంపీలు ఎందుకు కలిశారో?

కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షాను కలిశారు వైసీపీ ఎంపీలు,  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డి.. అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు పలు విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని సమావేశం తర్వాత వైసీపీ ఎంపీలు చెప్పారు.  ప్రభుత్వం తరపున ఒక నివేదికను అందించామని తెలిపారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదముద్ర వేయాలని అమిత్ షాను వైసీపీ ఎంపీలు కోరారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని విన్నవించారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరామని వైసీపీ ఎంపీలు వెల్లడించారు.  సీఎం ఇంటి స‌మీపంలో దొంగ‌ల ముఠా.. క్రైం కేపిట‌ల్‌గా తాడేప‌ల్లి? అయితే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు అమిత్ షాను కలవడంపై మరో చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ కు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తోంది కేంద్రం. అప్పుల విషయంలో ఆరా తీస్తోంది. కేంద్రం నిధులను పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ నిధులను తరలింపును అడ్డుకుంది. కేంద్ర పథకాలను వైఎస్సార్, జగనన్న పేర్లు పెట్టొద్దని ఆదేశించింది. ఇలా వరుసగా జగన్ సర్కార్ కు షాకులు ఇస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఆదేశాలతోనే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి... అమిత్ షాను కలిశారని అంటున్నారు. కేంద్రానికి అండగా ఉంటామని, తమకు సహకరించాలని రాజీ బేరానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. తమకు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయాన్ని అమిత్ షా దృష్టికి మరోసారి వైసీపీ ముఖ్య నేతలు తీసుకెళ్లారని తెలుస్తోంది.  కొండెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీకి ఆధారాలు దొరకలేదట.. 

కొండెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీకి ఆధారాలు దొరకలేదట.. 

అనుకున్నట్లే జరిగింది. అనుమానాలే నిజమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్  కేసు నీరుగారి పోయింది. దోషులెవరో తెలకుండానే విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ దిగుమతి, నిధుల మళ్లింపు వంటి వాటిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులో సరైన ఆధారాలు లభించకపోవడంతో ఇప్పుడీ కేసుకు మంగళం పాడాలని ఈడీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పట్లో కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో పలువురు ప్రముఖ నటీనటులను విచారించారు. వీరిలో కొందరి నుంచి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపారు. కొందరు సాక్షులను కూడా విచారించారు. ఇన్నిచేసినా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కేసును ముగించింది.  ఆబ్కారీ దర్యాప్తు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు కొత్తగా మళ్లీ కేసు నమోదు చేయడంతో మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ, రానా, చార్మి, రకుల్‌ప్రీత్ సింగ్ తదితర 12 మందిని విచారించారు.  ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరికి కేసును మూసేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

పేరు మార్పుపై జగన్ కు మరో ఎదురుదెబ్బ.. 

ప్రభుత్వ పథకాలకు, విమానాశ్రయాలు, క్రీడా మైదానాలు, పార్కులు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలకు అధికార పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం,అనాదిగా వస్తున్న ఆచారమే.అయితే, ఆంధ్ర ప్రదేశ్'లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రయోజిత పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, లేదా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తగిలించి. సొంత పథకాలుగా ప్రచారం చేయడం ఎక్కువైంది. అయినా కేంద్ర ప్రభుత్వంపై అంత దృష్టి పెట్టలేదు. కానీ, ఇందుకు సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రాలు మీకు నచ్చిన పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడం సరికాదని కేంద్ర మాతృక. కేంద్ర ప్రయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అందించడానికి. ఎంపీ రఘురామ రాసిన సమాధానం చెప్పాలని, ఈ లేఖ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు. తాజాగా, కేంద్రం ప్రభుత్వం, 'ఐఐటీ తిరుపతి పేరును వైఎస్సార్ ఐఐటీ తిరుపతిగా మార్చేందుకు, జగన్ రెడ్డి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టింది. ఇందుకు సంబంధించి , వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ ఐఐటీ తిరుపతి పేరును వైఎస్సార్‌ ఐఐటీ తిరుపతిగా మార్చే దిశగా కేంద్రం ఆలోచిస్తోందా?' అని అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయక సుభాష్ సర్కార్. లాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు.

పూర్తి భిన్నంగా ఒమిక్రాన్ లక్షణాలు.. జాగ్రత్తగా లేకుంటే గండమే!

కరోనాతో అతలాకుతలమైన ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ గడగడలాడిస్తోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్. కోవిడ్ 19 వైరస్ తన రూపం మార్చుకుని ఒమిక్రాన్ వైరస్ గా మారి దాడి చేస్తోంది. ఒమిక్రాన్ వైరస్ 6 రెట్ల వేగంతో సంక్రమిస్తోందని వైద్య నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. డెల్టా వైరస్తో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తున్న లక్షణాలు తలనొప్పి, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, ఒళ్లు నొప్పులు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులకు సాధారణ జలుబు తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే మరింత ఎక్కువ మందికి ఒమిక్రాన్ విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈ లక్షణాల వల్ల బాధితుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు. ఈ లక్షణాల కారణంగా ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఒమిక్రాన్ లక్షణాలు కనిపించిన వారెవరైనా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రస్తుత పాండమిక్ సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. డెల్టా వేరియంట్ బాధితుల్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు, రుచి, వాసన కోల్పోయిన లక్షణాలు కనిపిస్తాయి. ఒమిక్రాన్ తీవ్రతపై ఇంకా పూర్తి అవగాహన ఇంకా రాని కారణంగా స్పష్టత లేందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచంపై అది ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు ఒమిక్రాన్ పాకిందనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు 941 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఒక్క దక్షిణాఫ్రికాలోనే 228 మందికి ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వేలో 50, అమెరికాలో 39 కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా తర్వాత అమెరికాలో కూడా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మాసాచుసెట్స్, వాషింగ్టన్ లో కూడా కొత్తగా ఒమిక్రాన్ కేసులు కనిపించాయి. అంతకు ముందే న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్, మిసోరి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరాడో, ఉటాలో కూడా ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో పక్కన భారతదేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా విస్తరిస్తోంది. తొలిరోజు బెంగళూరులో 2 కేసులు, మరుసటి రోజున మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్, ముంబై, ఢిల్లీలో ఒక్కో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి న్యూఢిల్లీ చేరిన వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకింది. కొద్ది రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ వచ్చిన 72 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. మరో పక్కన విదేశాల నుంచి ముంబై వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. భారత్ లో ఇప్పటి వరకు 21 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

మరో భారీ అప్పు.. బూతుల పార్టీ.. కేసీఆర్ కు ఈడీ నోటీస్.. టాప్ న్యూస్@7PM

సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ద్వారా మరో భారీ అప్పునకు జగన్ సర్కార్ ప్రయత్నాలు మమ్మరం చేసింది. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 5 వేల కోట్ల రుణం కోసం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్‌ను  ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 5 వేల కోట్లను రైతుల నుంచి 2021, 22 ఏడాదికి కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులకోసం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది ---- ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు‌కు రావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు స్టేషనరీ కిట్స్ సరఫరా చేసినా.. బిల్లులు చెల్లించలేదని నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్  తరపున న్యాయవాది తేజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  2019లో బిల్లులు అందించినప్పటికీ, నేటి వరకు ప్రభుత్వం నగదు చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ---- తెలుగు భాషను బూతులమయంగా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. శాసన సభను కౌరవ సభగా మార్చారన్నారు. ఈ దుష్ట సంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు తీసుకెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. సిగ్గుమాలిన చర్యలకు వైసీపీ ప్రతీకగా మారిందన్నారు. పార్లమెంట్‌లో బూతులు మాట్లాడిన వైసీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ------- కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడో పూర్తయ్యేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పోలవరానికి 90 శాతం అనుమతులు తెచ్చామని గుర్తుచేశారు. రూ.5,136 కోట్ల రాష్ట్ర నిధులు ఖర్చుచేసి 32 శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు బీజేపీ శనిగ్రహంలా టీడీపీ, వైసీపీలు రాహు, కేతువులుగా దాపురించాయని ఏపీ కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ------- జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిలబెట్టి అధికారులు లబ్ధిదారుల ఫొటోలు తీస్తున్నారని అంటున్నారు. లబ్ధిదారులు నిలదీయడంతో హౌసింగ్ అధికారులు పరారైయ్యారు.  ఖాళీ స్థలాలకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చిచెప్పిన్నాయి. వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లబ్ధిదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ------- టీఆర్ఎస్ ఎంపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లంటూ విషయాన్ని పక్కదారి పట్టించి పార్లమెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ సభ్యులు నిష్క్రమించారని ఆయన ఆరోపించారు. ఈడీ నోటీసుల క్రమంలో కేసీఆర్‌కు, కేంద్రానికి కొంత అంతరం ఏర్పడిందన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకోవడానికే పార్లమెంట్‌ను వేదికగా వాడుకుని టీఆర్‌ఎస్‌ డ్రామాలాడిందన్నారు. ఈడీ నోటీసులను కేంద్రం తాత్కలికంగా నిలిపివేసిందన్నారు. --- టీఆర్‌ఎస్‌ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని ఆయన విమర్శించారు. రైతుల శ్రమతో కేసీఆర్, కేటీఆర్, రైస్ మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజీనామా చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. --------- తెలంగాణ ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీ‌తో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుతూ మునిసిపల్ శాఖ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వెనక్కి తీసుకుంది.  ------ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేక్ వీసాల గుట్టురట్టయింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళలను ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ మహిళలను ఏజెంట్ మోసం చేశాడా? లేక వారే ఉద్దేశపూర్వకంగా నకిలీ వీసాలతో వెళుతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. --- సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ యూపీ అధికార పక్షం బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డుపై కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగిలిపోవడం పాత సంప్రదాయం అని, కానీ రోడ్డుపై కొబ్బరికాయ కొడితే రోడ్డే పగిలిపోవడం కొత్త సంప్రదాయం అని ఎద్దేవా చేశారు. ఇదే బీజేపీ సాధించిన అభివృద్ధి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఉద్యోగాలు, విద్యారంగం అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం తిరోగమనంలో వెళుతోందని విమర్శించారు. ---

పార్లమెంట్ బాయ్‌కాట్ నెక్స్ట్.. రాజీనామాలేనా?

హుజూరాబాద్ ఓటమి తర్వాత, బీజేపీతో రాజకీయ ముప్పు తప్పదని నిర్ణయానికి వచ్చారో లేక ఇంకేదైనా కారణం వుందో ఏమో కానీ, తెరాస అధ్యక్షడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ టార్గెట్ కేంద్రంపై రాజకీయ యుద్దాన్ని ప్రకటించారు. అలాగే, ఇంతవరకు సమయానుకులంగా వ్యూహాన్ని మార్చుకుంటూ, విభిన్న రూపాల్లో  తెరాస నాయకత్వం యుద్దతంత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదటి రోజు నుంచే పార్లమెంట్ ఉభయ సభల్లో, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెరాస ఎంపీలు నిరసన తెలుపుతున్నారు.  అయితే కేంద్ర ఆహార శాఖ  మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఒకటికి రెండు సార్లు వివరంగా, విపులంగా సమాదానం  ఇచ్చారు.కానీ గోయల్ తెరాస సభ్యులు కోరుకున్నసమాధానం మాత్రం ఇవ్వలేదు. యాసంగి పంట విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలతో సంప్రదించి ఒకే సారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాదు  కేంద్ర గోయల్ తెలంగాణ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్న తెరాస ఎంపీల ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్న పీయూష్ గోయల్.. ఈ మేరకు సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడానని తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. అయినా దీంతో కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, తెరాస ఎంపీలు శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కే.కేశవరావు ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కేసేఆర్ కొత్తా ఆలోచనలకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి రాజకీయాలను మరోమారు ఉద్యమ పంథాలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కేకే రాజీనామాల అంశాన్ని చూచాయగా చేశారని అంటున్నారు. ఏమైనా కేకే వ్యాఖ్యలు అనుమానాలకు ఆస్కారం కలిపిస్తున్నాయని అంటున్నారు.   తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు. చట్టసభను బాయ్‌కాట్‌ చేయడం బాధకలిగించే విషయమేనని.. ఇలా చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు.అలాగే, 'కేంద్ర వైఖరి అర్థం చేసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నాం. రైతుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని మా పోరాటం కొనసాగుతుంది. తెరాస ప్రభుత్వం నూతన పంథాలో పోరాటం మొదలు పెడుతుంది” అన్నారు, అంతవరకు బానే వుంది, కానీ ఆవెంటనే కేకే, రైతుల కోసం రాజీనామా చేసే అంశాన్ని ఆలోచిస్తాం, అంటూ పేర్కొనారు. ఇలా కేకే తెరాస ప్రభుత్వం నూతన పంథాలో పోరాటం మొదలు పెడుతుందని,వెంటనే రాజీనామాల ప్రస్తావన తీసుకు రావడం, అలోచింప చేసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్, ఉద్యమ వేడి తగ్గిన పలు సందర్భాలలో ప్రజా ప్రతినిధుల రాజీనామాలను రాజకీయ అస్త్రంగా ప్రయోగించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ ఎదురు గాలులను తట్టుకునేందుకు కేసీఆర్ మరోమారు రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. 

సీఎం ఇంటి స‌మీపంలో దొంగ‌ల ముఠా.. క్రైం కేపిట‌ల్‌గా తాడేప‌ల్లి?

తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సేద తీరుతుంటారు. కృష్ణా న‌ది ప‌క్క‌నుంచే రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ముఖ్య‌మంత్రి హ‌డావుడి ఉండే ఏరియా అంటే భ‌ద్ర‌త‌ ఎంత క‌ట్టుదిట్టంగా ఉండాలి? సెక్యూరిటీ ఎంత ప‌క‌డ్బందీగా ఉండాలి? అనుమానాస్ప‌ద‌ క‌ద‌లిక‌ల‌పై ఎంత కీన్ అబ్జ‌ర్వేష‌న్ ఉండాలి? చీమ చిటుక్కుమ‌న్నా.. సెక్యూరిటీ వింగ్‌కు తెలిసేలా నెట్‌వ‌ర్క్ ఉండాలి. కానీ, తాడేప‌ల్లిలో ఏం జ‌రుగుతోంది?  క్రైం కేపిట‌ల్‌గా ఎందుకు మారుతోంది? అనే చ‌ర్చ కొన‌సాగుతోంది. గ‌తంలో కృష్ణాన‌ది తీరంలో ఓ యువ‌తిపై అత్యా-చారం జ‌రగ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికీ ఆ కేసులో నిందితుడిని ప‌ట్టుకోక‌పోవ‌డం ఎంతటి వైఫ‌ల్యం? ఇది చాల‌ద‌న్న‌ట్టు.. లేటెస్ట్‌గా సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్యాలెస్‌కు కిలోమీట‌ర్ దూరంలోని రెయిన్ బో విల్లాస్‌లో చెడ్డీ గ్యాంగ్ దోపీడీకి ప్ర‌య‌త్నించ‌డం మ‌రింత షాకింగ్ ప‌రిణామం అంటున్నారు. వ‌రుస ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. పోలీసుల చేత‌గాని త‌నానికి స‌వాల్‌గా నిలుస్తున్నాయ‌ని చెబుతున్నారు.  వీవీఐపీ జోన్ అంటేనే ఫుల్ సెక్యూరిటీ. అందులోనూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సమీప ప్రాంత‌మంటే ఎవ‌రిలోనైనా కాస్తంత అదురు..బెదురు ఉంటుంది. అలాంటిది.. క‌రుడుగ‌ట్టిన‌ చెడ్డీ గ్యాంగ్ మాత్రం ఎలాంటి భ‌యం లేకుండా.. జ‌గ‌న్ ప్యాలెస్‌కు జ‌స్ట్ కిలోమీట‌ర్ దూరంలోని రెయిన్ బో విల్లాల్లో దోపిడీకి తెగించారంటే మామూలు విష‌య‌మా? దొంగ‌ల‌కు ఇంత‌టి బరితెగింపు ఎలా వచ్చిందనేకంటే.. ఇంత జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఖాకీల‌ను దోషులుగా చూస్తున్నారు.  ఇక‌, చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించింది మామూలు ఇళ్ల‌ల్లో కాదు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ తో పాటు.. ఓ వ్యాపారికి చెందిన విల్లాల తలుపులు పగలగొట్టి లోపలకు చొరబ‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. విల్లాల్లో విలువైన వస్తువులు ఏవీ పోకున్నా.. దొంగ‌లు విరుచుకుప‌డిన ప్రాంతం హై సెక్యూరిటీ జోన్‌లో ఉండ‌ట‌మే క‌ల‌క‌లం రేపుతోంది.  సీఎం జ‌గ‌న్ ప్యాలెస్ స‌మీప ప్రాంతాల్లో నిఘా, భద్రత లోపాల‌ను చెడ్డీ గ్యాంగ్ ఘ‌ట‌న‌తో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. గ‌తంలో కృష్ణా న‌ది తీరంలో రే-ప్ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే ఈ ప్రాంతంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసుంటే.. ఇప్పుడిలా దొంగ‌ల ముఠా బ‌రితెగించి ఉండ‌క‌పోయేద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వ‌, పోలీసుల అస‌మ‌ర్థ‌త‌తోనే ఇలా జ‌రుగుతోంద‌ని.. తాడేప‌ల్లి క్రైం కేపిట‌ల్‌గా మారిపోతోందా అనే అనుమానం క‌లుగుతోంద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. 

వారానికి నాలుగున్నర రోజులే పని.. అక్కడి ఉద్యోగులకు పండగే!  

ఉద్యోగులకు మన దేశంలో ప్రస్తుతం వారానికి ఆరు రోజుల పని ఉంది. కొన్ని సంస్థల్లో మాత్రం ఐదు రోజుల పని దినాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఆరు రోజులు, ఐదు రోజుల పని దినాలు అమలవుతున్నాయి. ఐటీ సెక్టార్ లో ఐదు రోజులు మాత్రమే ఉద్యోగులు వర్క్ చేస్తారు. శని, ఆది వారాలు సెలవు. తాజాగా ఉద్యోగుల పనిదినాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని ప్రకటించింది.  ఇప్పటిదాకా యూఏఈలో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి.  శని, ఆదివారాలు సెలవు. అయితే ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారాంతపు సెలవులు మొదలవుతాయి. ఇకపై అక్కడి ఉద్యోగులకు వారానికి రెండున్నర రోజులు సెలవులుగా లభిస్తాయి. ఈ నూతన విధానం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ పాలకవర్గం ప్రకటించింది. 

రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం.. పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు జంప్

పార్లమెంట్ వింటర్ సెషన్ లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. పార్లమెంట్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ ఉభయసభల్లో నిరసనకు దిగారు. పార్లమెంట్ వెలుపల కూడా గులాబీ ఎంపీలు ధర్నా చేశారు. అయితే టీఆర్ఎస్ ఎంపీల పోరాటంపై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారని, మంగళవారం తర్వాత పార్లమెంట్ లో వాళ్లు ఉండరని చెప్పారు. రైతు సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యమని, సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే ఢిల్లీలో డ్రామా నడుస్తుందని ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం చెప్పినట్లే మంగళవారం జరిగింది. బుధవారం నుంచి పార్లమెంట్ కు వెళ్లడం లేదు టీఆర్ఎస్ ఎంపీలు. తాము సమావేశాలను బహిష్కరిస్తున్నామని  అధికారికంగానే ప్రకటించేశారు. మంగళవారం ఉదయం నల్లచొక్కాలతో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంట్‌కు వచ్చారు. కాసేపు నినాదాలు చేసి బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర తెలంగాణ రైతులను మోసం చేస్తోందని.. అందుకు నిరసనగానే శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ను బహిష్కరించింది రైతు సమస్యలపై కాదని రాజకీయ కారణాలతోనేనని తెలుస్తోంది. డిసెంబర్ 10న తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఐదు జిల్లాల పరిధిలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల జరుగుతున్న ఐదు జిల్లాల్లోనూ అధికార పార్టీకే మెజార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అయినా అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో విపక్షాలతో పాటు స్వంతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలవాలని కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాథ్యలను సీఎం కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా అందరూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దీంతో ఎంపీలంతా ఢిల్లీ నుంచి క్యాంపులకు చేరుకున్నారు. ఈ మేరకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్‌ను బహిష్కరించిందని చెబుతున్నారు.    

కర్నూల్ కు వక్ఫ్‌ ట్రిబ్యునల్‌.. స్టే ఉన్నా ఆగని కార్యాలయాల తరలింపు.. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం గందరగోళం కొనసాగిస్తోంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టుకు ఆ విషయాన్ని చెప్పింది. అయినా తెర వెనుక మాత్రం చేయాల్సిందంతా చేసేస్తోంది. కార్యాలయాల తరలింపును మాత్రం ఆపడం లేదు జగన్ సర్కార్.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గెజిట్ జారీ చేసింది.  వక్ఫ్‌ భూముల పరిరక్షణకు సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకూ ఈ ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో ఉంది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈ స్టేను ఎత్తి వేయలేదు. అమరావతిలో అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న ఉత్తర్వులు మాత్రం హైకోర్టు ఎత్తివేసింది.  కార్యాలయాల తరలింపుపై స్టే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను తరలించడం లేదని.. ఏర్పాటు చేయడమే కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది.  ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. అలాగే లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ తరహాలోనే వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్‌నూ కర్నూలులో ఏర్పాటు చేశారు. న్యాయరాజధానిగా చేస్తున్నామని వైసీపీ చెప్పుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ధనిక రాష్ట్రం కాదు.. ఇది ఇంకో బీమార్ స్టేట్

“ఇంటి పేరు శొంటి వారు.. ఇంట్లో గబ్బిలాల కంపు” ఈ సామేత ఎంతమంది విన్నారో ఏమో కానీ, ధనిక రాష్ట్రం తెలంగాణలో ఆర్ధిక పరిస్థితి అదే దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్’ ఓపెన్ చేస్తే, రాష్ట్రంలో ఎటు చూస్తే అటు అభివృద్ధి వెలుగులే కనిపిస్తాయి. కానీ, స్వయంగా ఆయన సారధ్యంలోని , మున్సిప్ల శాఖలోమాత్రం అన్ని దిక్కులా చీకట్లే.. జీహెచ్ఎంసీలోనే  కాంట్రక్టర్లకు నెలల తరబడి, చెల్లిపులు లేవు. ఏపీలో లాగా ఇంకా కాంట్రాక్టర్లు వీధుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చినట్లు లేదు గానీ, కాంట్రాక్టర్ల ఆకలి కేకలు, ఆత్మహత్యలు అయితే వార్తల్లో కనిపిస్తున్నాయి.  గత(2021) మార్చి నుంచి ఇంతవరకు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన పనులకు, అరకొర చెల్లింపులే గానీ, పూర్తి స్థాయి చెల్లింపులు జరగడం లేదు.అది కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు మాత్రమే అంతో ఇంతో చెల్లింపులు చేస్తున్నారు. మిగిలిన వరికి చెల్లింపులు జరగడం లేదని అంటున్నారు. చెల్లింపులు జరగక పోవడంతో  కాంట్రాక్టర్లు ముఖ్యంగా. చిన్న కాంట్రాక్టర్లు ఆర్ధికంగా చితికిపోయి, బ్యాంకులకు ఈఎంఐలు, ప్రైవేటు వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక ఉన్న ఆస్తులు తెగనమ్ముకోవలసిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. గత మార్చి(2021)మార్చి నుంచి ఇప్పటివరకూ సుమారు రూ 500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సిన గ్రేటర్ కార్పొరేషన్, రేపు మాపు అంటూ చేల్లిపులు వాయిదాల మీద వాయిదాలు వేస్తోందని కాంట్రాక్టర్లు,అటున్నారు. అంటే కాదు బకాయిలు చెల్లిస్తేనే జీహెచ్ఎంసీ పనులు ఇక చేసేది లేదని తెగేసి చెపుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కొవిడ్ వాక్సిన్, ప్రజలకు ఇచ్చేందుకు నియమించిన వ్యాక్సినేషన్ సిబ్బంది జీతాల సంగతి దేవుడెరుగు,  వారికి  పెట్టిన భోజనాల బిల్లులు కూడా, మూడు నెలల నుంచి చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో  మున్సిపల్ శాఖ ఖజానా వట్టి పోయిందని అధికారులే అంగీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్నా,ఇంత వరకు ఒక్కసారి కూడా మేయర్ గద్వాల్ విజయలక్షి సర్వసభ్య సమావేశం జరప లేదని, అభివృద్ధి పనులు అసలే జరగడం లేదని, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ  బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా చేశారు. అయినా ఫలితం లేక పోగా బీజేపీ కార్పొరేటర్లఫై పోలీసులు కేసులు పెట్టారు.హైదరాబాద్ పరిథిలోని 6 మున్సిపల్ సర్కిళ్లలో దాదాపు 2 వేలమంది చిన్నా, పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు చేసిన పనులకు, ఇప్పటివరకూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ , సుమారు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెపుతున్నారు.  ఇవి కాక, భోజనాల ఏర్పాటు వంటి అనధికారికంగా చేసిన పనులకు మరో రూ.50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.కాగా బిల్లుల కోసం గ్రేటర్ హెడ్డాఫీసు చుట్టూ తిరుగుతున్నా, ఫలితం ఉండటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కమిషనర్‌ను కలిసినా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనో, ప్రాపర్టీ టాక్సులు వసూలయిన తర్వాత ఇస్తామనో చెబుతున్నారని కాంట్రాక్టర్లు వెల్లడించారు.  నిజానికి ఒక్క మున్సిపల్ శాఖలోనే కాదు, చాలా వరకు ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనేందుకు కూడా నిధులు లేకనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నెపాన్ని కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. అందుకే తెలంగాణ పేరుకే ధనిక రాష్ట్రం ..వాస్తవంలో మాత్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలలానే ఇదీ ఇంకొక బీమార్  స్టేట్  అంటున్నారు .

ఏటీఎమ్‌లో 17 ల‌క్ష‌లు లూటీ.. యూట్యూబ్ చూసి దోపిడీ?

ఏటీఎమ్ చోరీ. ఈ మ‌ధ్య చాలా రేర్‌గా వినిపిస్తోందీ మాట‌. ఒక‌ప్పుడు ఏటీఎమ్‌లు కొల్ల‌గొట్టే కేసులు బాగా జ‌రిగేవి. కానీ, చాలా వ‌ర‌కూ విఫ‌ల‌మ‌య్యేవి. ప‌క‌డ్బందీ సిస్ట‌మ్ ఉండ‌టంతో.. ఏటీఎమ్‌ను దోచుకోవ‌డం అంత ఈజీ కాద‌ని దొంగ‌ల‌కు తెలిసిపోయింది. అందుకే, ఏటీఎమ్‌ను కాకుండా.. అందులో డ‌బ్బులు పెట్టే ముందు లూటీల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ, లేటెస్ట్‌గా క‌డ‌ప‌లో క‌రుడుగ‌ట్టిన దొంగ‌లు ఏకంగా ఏటీఎంనే దోచుకున్నారు. మిష‌న్ బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ.. అందులోని న‌గ‌దు ఎత్తుకెళ్లారు. ఇంత‌కీ, ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఏటీఎమ్ మిష‌న్‌ను ఎలా ప‌గ‌ల‌గొట్టారు? యూట్యూబ్ వీడియోస్ చూసే ఆ ప‌ని చేశారా? అనే డౌట్‌. ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎలా జ‌రిగిందంటే..... కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంలోని రూ.17 లక్షల నగదును అపహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు దొంగ‌లు ఏటీఎం రూమ్‌లోని ఎంట్రీ ఇచ్చారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి.. అందులోని 17 ల‌క్ష‌ల‌తో ఉడాయించారు.  ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు స్పాట్‌ను పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఏటీఎంలోని క్యాష్‌ను ఏమాత్రం డ్యామేజ్ జ‌ర‌క్కుండా.. గ్యాస్ క‌ట్ట‌ర్‌ల‌తో అంత జాగ్ర‌త్త‌గా క‌ట్ చేశారంటే.. వాళ్లెవ‌రో ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ క్రిమిన‌ల్స్ అయి ఉంటార‌ని భావిస్తున్నారు. అయితే, ఇంజినీరింగ్ కాలేజ్ ప‌క్క‌నే ఉన్న ఏటీఎంలో చోరీ జ‌ర‌గ‌డం.. ఆ ఏటీఎంను కొల్ల‌గొట్టిన విధానం చూస్తుంటే.. యూట్యూబ్ వీడియోస్ చూసో.. ఏ హాలీవుడ్ సినిమానో ఫాలో అయ్యో.. ఈ ఏటీఎంను లూటీ చేశార‌ని అంటున్నారు. బీటెక్ స్టూడెంట్సే ఈ దోపిడీ చేసుంటారా? అనే అనుమాన‌మూ వ్య‌క్తం చేస్తున్నారు. పోలీస్ విచార‌ణ‌లోనే ఆ వివ‌రాలు తెలియాలి.