రోజా @ చంద్రముఖి-3
posted on May 25, 2024 @ 2:46PM
మనందకీ ఒక పదం బాగా తెలుసు... ‘‘పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ’. ఈ పదాన్ని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితులతో ముడివేసి ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారబోతున్న రోజా’ అని మార్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి ‘లక లక లక’ అనబోతున్నారు.
రోజా అంటే ఒక చంద్రముఖి కాదు.. మొత్తం ముగ్గురు చంద్రముఖులూ రోజాలోనే కొలువై వున్నారు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు రోజా చంద్రముఖి-1లా వుండేవారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఆమె చంద్రముఖి-2లా మారారు. ఈ దశలో ఆమె ఏ రేంజ్‌లో విశ్వరూపం చూపారో అందరికీ తెలిసిందే. రోజా చంద్రముఖి-2 వెర్షన్ ముగియబోతోంది. త్వరలో ఆమె చంద్రముఖి-3లా మారనున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, మాంఛి ఓటమి చవిచూసిన తర్వాత రోజా చంద్రముఖి-3లా మారి బీజేపీలోకి ప్రవేశించబోతున్నారు.
తనతోపాటు వైసీపీ కూడా ఓడిపోబోతోందన్న క్లారిటీకి వచ్చిన రోజా, తన రాజకీయ మనుగడ కొనసాగాలంటే, తాను ఇంతకాలం వేసిన వెర్రి వేషాలకు పడే శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం తప్ప మరో గత్యంతరం లేదని ఫిక్సయినట్టు తెలుస్తోంది. రోగికి కావల్సింది అదే, వైద్యుడు చెప్పిందీ అదే అన్నట్టుగా... బీజేపీకి కూడా కావలసింది వైసీపీ నుంచి ఇలాంటి నాయకులే. అందువల్ల రోజాకి చంద్రముఖి-3 హోదా ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం సుముఖంగా వున్నట్టు సమాచారం. రోజా బీజేపీలో చేరే విషయమై కేంద్రంలోని అగ్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అతి త్వరలో ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారిన రోజా’ని చూడబోతున్నామన్నమాట!