ఏదో లక్కీగా ఎమ్మెల్యే అయ్యారు...మంత్రి కీలక వ్యాఖ్యలు
posted on Sep 14, 2025 @ 3:00PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ఓ సిటీలో గ్యాస్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్ట కలిసి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నారు. ఆయన నాకంటే చిన్నవాడు నాకంటే ముందు నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు అని వాఖ్యనించాడు.
ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడారూ. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నేను భద్రకాళి గుడిలో ధర్మకర్తలను నియమించుకునే అధికారం లేదా అని అన్నారు. అధిష్టానం చెప్పిన వారికి భద్రకాళి దేవాలయం ధర్మకర్తగా నియమించామని అన్నారు. నాపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్లాడారు. భద్రకాళి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది అని మంత్రి కొండ సురేఖ మాట్లాడారు.
మంత్రి కొండ సురేఖ వాక్యాల పైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. పుటోకో పార్టీ మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యే వాడిని అని ఘాటుగా విమర్శించారు. కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను కాబట్టి ప్రజలు గెలిపించాలని అన్నారు. పుటకో పార్టీ తిరిగే ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు..మంత్రి కొండ సురేఖకు ఇస్తున్న గౌరవంని కాపాడుకోవాలని అన్నారు. ఆమె మహిళా కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నాను అని విమర్శించారు. నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని తీవ్రంగా మండి పడ్డారు.
15 ఏళ్లుగా వరంగల్ ఈస్ట్ కు రెండు డైరెక్టర్లు పదవులు ఇచ్చి మిగతావి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చారు. అలాగే నేను కూడా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి రెండు వెస్ట్ నియోజకవర్గానికి 5 పరకాల,వర్ధన్నపేట, హుస్నాబాద్ కు ఒక్కొక్క డైరెక్టర్ల చొప్పున ఇవ్వాలని సూచించాను తప్ప అని అన్నారు. నా నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.