మంత్రి పార్థసారథి పై వారెంట్ ను ఉపసంహరించుకున్నకోర్ట్
posted on Jul 24, 2012 @ 5:07PM
రాష్ట్ర మంత్రి పార్థసారథి కి నాంపల్లి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. 2002లో మంత్రి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2003లో మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు. ఆ జరిమానాను మంత్రి పార్థసారధి చెల్లించలేదు.అంతేకాకుండా కోర్టు వాయిదాలకు కూడా ఆయన హాజరుకాలేదు.దాంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.అయితే నిన్న రాష్ట్ర మంత్రి పార్థసారథి పై జారి చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఈరోజు నాంపల్లి ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు ఉపసంహరించుకుంది.