జగన్ కి త్వరలో మంచి రోజులు వస్తాయి:మోహన్ బాబు
posted on Jul 24, 2012 @ 3:51PM
అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణువర్థన్ బాబు మంగళవారం ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. అదే సమయంలో జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే జగన్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని,కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలవల్లే కలిసినట్లు చెబుతున్నారు.
తాను జైలులో తన మేనల్లుడు జగన్‌ను,అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌లను కలిశానని చెప్పారు.వారిని చూసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు.జగన్‌కు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నట్లుగా ఉందన్నారు. జగన్ ని చూసి తన గుండె బరువెక్కిందని అన్నాడు. ఢిల్లీలో చాల మంది శకునులు ఉన్నారని అన్నారు. ఎందరు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు న్యాయం,ధర్మమే గెలుస్తుందని చెప్పారు. త్వరలో జగన్,నిమ్మగడ్డ బయటకు రావాలని తాను షిరిడీ సాయినాథుని కోరుకున్నానని అన్నారు.