జగన్ తో సి.ఎం కిరణ్ కుమ్మక్కు: వీహెచ్
posted on Jul 23, 2012 @ 5:57PM
రాజకీయ లబ్ధి కోసమే సిరిసిల్లలో విజయమ్మ దీక్ష చేపట్టారని వీహెచ్ విమర్శించారు. విజయమ్మ దీక్షను విజయవంతం చేయడానికి వైఎస్సార్‌సీపీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుమ్మక్కైరని ఆరోపించారు. చేనేత కార్మికుల సమస్యలు సిరిసిల్లలోనే కాదు తెలంగాణ అంతటా ఉన్నాయని తెలిపారు. తెలంగాణవాదులపై పోలీసుల దాడిని ఆయన తప్పుబట్టారు. తాను కూడా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం త్వరలోనే పులివెందులలో పర్యటిస్తానని పేర్కొన్నారు. విజయమ్మకు భద్రత కల్పించినట్టే తనకు పులివెందులలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.