Read more!

నిజమైన మూర్ఖులుగా ఎప్పుడు పరిగణించబడతాం?

 

నిజమైన మూర్ఖులుగా ఎప్పుడు పరిగణించబడతాం?

ఏప్రిల్ ఫూల్ రోజు ఎవరైనా ఫూల్ చెబితే అదేదో జీవితాంతం మూర్ఖుడిలా భ్రతికేస్తాం అనే భ్రమలో భయంలో ఉంటాం. ఏప్రిల్ ఫూల్ గురించి రామకృష్ణుల వారి ఓ గొప్ప అనుభవం గురించి తెలుసుకుంటే.. 

ఒక రోజున ఓ వ్యక్తి రామకృష్ణ మఠ స్వామీజీని కలిసి మీతో 'పర్సనల్'గా మాట్లాడాలని అనుమతి తీసుకొని తన కథను ఇలా చెప్పుకున్నాడు : "స్వామీజీ! నేను చాలా కష్టాల్లో ఉన్న సమయమది. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలియని స్థితిలో ఒక పెద్ద మనిషిని సలహా అడిగాను. ఆయన నన్ను ఆంజనేయస్వామి గుళ్ళో నలభై రోజుల పాటు, ప్రతిరోజూ 108 ప్రదక్షిణలు చేయమన్నారు. దాని వలన నాలో పట్టుదల, ఆత్మవిశ్వాసం కలుగుతాయన్నారు. నేను ప్రతిరోజూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టాను. కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఆ గుడి పూజారి నాతో ఇలా అన్నారు: 'చూడు బాబు! వట్టి ప్రదక్షిణాలతో హనుమంతుణ్ణి తృప్తి పరచలేవు. ఆయనకు 'వడమాల’ వేసి ఘనంగా పూజచేయాలి. దానితో నీ గ్రహ దశ మారుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. నువ్వు పట్టిందంతా బంగారమవుతుంది. ఇలా ఉగ్రరూపం దాలుస్తాడు. లంకలో జరిగిన కథ నీకు తెలిసిందే కదా! పూజకు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. బాగా ఆలోచించుకో. నువ్వు ఊ అంటే అన్నీ నేనే స్వయంగా జరిపిస్తాను' అన్నాడు.

పూజారి మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. రెండు వేల రూపాయలు నాశక్తికి మించిన ఖర్చు. అయినా ఏదో అప్పోసప్పో చేసి, హనుమంతుణ్ణి పూజిస్తే నా దశ తిరిగి ధనవంతుణ్ణి అవుతానేమో! కానీ ఆరోగ్యం సంగతే అంతు పట్టడం లేదు. నా రక్తంలో 'కొలెస్ట్రాల్' శాతం బాగా ఎక్కువగా ఉన్నదని, నూనె పదార్థాలు తింటే నా ఆరోగ్యానికి ముప్పు రావచ్చని మా డాక్టరుగారు చెప్పారు. పూజానంతరం ఆంజనేయుడి మెడలో వేసిన 'వడమాల' లోని 'ప్రసాదం వడలు' నేను తినవలసి ఉంటుంది. అవి తిన్నట్లయితే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రసాదాన్ని తినకపోతే ఆంజనేయుడికి నా మీద కోపం రావచ్చు. ఆ కోపంలో ఆయన ఏమి చేసినా చేయవచ్చు. దేవుళ్ళకు కోపం వస్తే వారు ఎంతకైనా తెగిస్తారని సినిమాల్లో చూశాను. నేను అప్పుల పాలై దుర్దశకు గురికావచ్చు. మనసంతా అయోమయంగా ఉంది. దీనికంతా కారణం!? ఇప్పుడు అర్ధమయింది. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రదక్షిణాలు చేయడం. మానేశాను.

కానీ నా కష్టాలు తీరలేదు. ఇంకా ఎక్కువయ్యాయి. ఎప్పుడూ ఒకటే 'టెన్షన్', బద్ధకం, అలసట. ఓపిక సన్నగిల్లింది. చీటికీ 1. మాటికీ చిరాకు. చేసే పని మీద ధ్యాస ఉండడం లేదు. సమస్యలు ఒకదాని తరువాత ఒకటి పోటీపడి పుట్టుకొస్తున్నాయి. 'ముద్దు 4. ముద్దు గుమ్మడి పండు వీరి పేరేమి?' అన్నట్లు నా ఈ స్థితికి 'బ్లడ్ ప్రెషర్' మరియు 'డయాబెటిస్' అని నామకరణం చేశారు మా డాక్టరుగారు."

భోరున ఏడుస్తూ తన కథ చెప్పడం ముగించిన ఆ వ్యక్తితో, • స్వామి ఇలా అన్నారు: “నాయనా! నేను చెప్పేది సావధానంగా విను. ఒక్కసారి శ్రీరామపట్టాభిషేకం గుర్తుకు తెచ్చుకో. సీతారాములు సభలో సింహాసనం మీద ఆసీనులయ్యారు. ఎక్కడ చూసినా ఆనంద కోలాహలం. సీతమ్మవారు హనుమంతుణ్ణి పిలిచి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, తనకు ప్రియమైన, తన మెడలో ఉన్న ముత్యాలహారాన్ని కానుకగా ఇస్తారు. కొద్ది

సేపు అయిన తరువాత అమ్మవారి దృష్టి ఆంజనేయుడిపై పడుతుంది. ఆయన రాయితో హారంలోని ముత్యాలను ఒకటొకటిగా పగులకొట్టడం చూసి సహించలేక పోతారు అమ్మవారు. "ఆష్ట్రాల్ ఒక కోతి కోతే.." అనుకుంటున్న అమ్మవారి మనస్సును కనిపెట్టిన మర్యాద రామన్న చిరు నవ్వుతో, "సీతా! ఆంజనేయుడి ప్రవర్తనకి కారణం ఉండి ఉంటుంది.
అడిగి నువ్వే తెలుసుకో” అంటారు. అమ్మ అడగగానే ఆంజనేయుడు "సీతమ్మ తల్లీ! ఆ రాముడే నాకు సర్వస్వం. మీరిచ్చిన హారంలోని ఏ ఒక్క ముత్యంలోను నా రాముడు కనబడలేదు. కాబట్టి ఆ హారంతో నాకు పని లేదు, అది తుచ్ఛం" అని అంటాడు.

ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం! సంవత్సరానికి ఒక్కసారి అయినప్పటికీ మనల్ని ఎవరైనా 'ఏప్రిల్ ఫూల్' చేస్తే దానిని మనం సహించలేం! కానీ నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతున్న మన మూర్ఖత్వాన్ని గ్రహించలేకపోతున్నాం! ఏ 'ఫూల్' ఏమి చెప్పినా ఫుల్ ఫ్రూఫ్'గా నమ్ముతున్నాం! భగవంతుడికి ' 'నైవేద్యం', మన ఆత్మనివేదనమే అని మరచిపోతున్నాం! 

ఇదీ ఏప్రిల్ ఫూల్ గురించి రామకృష్ణుల వారు చెప్పిన అభిప్రాయం. కాబట్టి ఏప్రిల్ ఫూల్ అంటే ఆరోజు మాత్రమే అన్ని నమ్మకుండా జాగ్రత్తగా ఉండటం కాదు, మూర్ఖత్వాన్ని వదిలి జీవితాన్ని గడపటం.

                                  ◆నిశ్శబ్ద.