మకర రాశి
మకర రాశి:- (బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గ, గీ)
ఆదాయం : 5, వ్యయం : 2 - రాజపూజ్యం : 2, అవమానం : 4
వీరికి ఈ సంవత్సరమంతయూ శని జన్మ, ద్వితీయ రాశులలో సంచరించును కావున మిక్కిలి శ్రమకరమగు కాలము. ఏ కార్యము సానుకూలము | కాదు. వృథా కార్యములందు అలసట, భార్యాపుత్రాది స్వజన విరోధము, ఆరోగ్య | లోపములు బాధించును. తేజోహాని, మతిభ్రంశము, భయము కలుగును. ధనవ్యయము, అకారణ కలహములు కూడా కలుగును. జనన సమయమున శని బలము బాగున్నచో అంతగా బాధించదు. సంవత్సర ప్రారంభమున గురు | అనుకూలతచే కొంత సానుకూలముగనున్ననూ, చైత్ర ఉత్తరార్ధము నుండి తృతీయ | గురువు అగుటచే శ్రమ అధికము. ఉద్యోగ భంగము, జగడములు కలుగును. బంధు విరోధము ఒకప్పుడు కలుగును. సంవత్సరారంభమున ఏకాదశ కేతువు | కనుక కొంత అనుకూలముగనుండిననూ, చైత్ర ఉత్తరార్ధము నుండి చతుర్ధ రాహువు, | దశమ కేతువు అయినందున వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల యందు చిక్కులు, ఆస్తి | నష్టం, గృహమందు అశాంతి కలుగును. మాతృవర్గ బంధు జనులతో వైరము, చిత్త | చాంచల్యము, ప్రయాణాదుల యందు విఘ్నము, వాతరోగములు కలుగును. మధ్య | మధ్య సుఖము, ఇష్ట భోజనము, శరీరదార్థము, కలుగును. వైశాఖ, జ్యేష్ఠ | మాసములందు కుజ అనుకూలత వలన కొన్ని కార్యముల యందు జయమగును. ఆషాఢ, శ్రావణములందు జాగ్రత్త అవసరము. ఉత్తరాషాఢ వారికి జ్యేష్ఠ శుక్లం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. ఆశ్వయుజ శుక్లం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు రాహువేధ కలదు. శ్రవణ వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు జన్మతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి | కార్తిక శుక్లం వరకు జన్మతార యందు శని, ఫాల్గునమందు నైధనతార యందు రాహువు సంచరించుదురు. జ్యేష్ఠ శుక్లం వరకు రాహువేధ కలదు. ధనిష్ఠ వారికి ఆశ్వయుజ శుక్లం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు జన్మతార | యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి | కార్తిక కార్తిక బహుళం నుండి జన్మతార యందు శని, జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు నైధనతార యందు రాహువు సంచరించుదురు. సంవత్సరారంభము | నుండి ఆశ్వయుజ బహుళం వరకు కేతుధ కలదు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతి యొనర్చిన మేలు. నవగ్రహ శాంతి యొనర్చిన మేలు కలుగును. గురుసేవ, సుందరకాండ పారాయణము, ఆదిత్యహృదయ పారాయణము చేయుట వలన, ప్రతి మాసమున తమ జన్మనక్షత్రము నాడు పరమేశ్వర ప్రీతిగా అభిషేకము చేయించిన దోషములు తొలగును.