మీన రాశి

 

మీన రాశి:-  (ది, దు, శం, ఝ, ధ, డె, డొ, చ, చి) 

ఆదాయం : 2, వ్యయం : 8 - రాజపూజ్యం : 1, అవమానం : 7

వీరికి ఈ సంవత్సరము శని వైశాఖ, జ్యేష్ఠ, మాఘ, ఫాల్గునములందు ద్వాదశమందు సంచరించును కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు, బంధు వైరములు, గృహచ్ఛిదములు బాధించును. వృథా వ్యయములు కలుగును. వ్యవసాయమందు నషమెక్కువ. మానశాంతి తక్కువయగును. మిగిలిన సమయమంతయూ ఏకాదశ శని అగుటచే సకల కార్యముల యందు లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజన లాభము కలుగును. గురువు ద్వాదశ జన్మరాశులలో సంచరించుటచే అపనిందలు, ధనవ్యయము కలుగును. స్థానచలనము కలుగును. పరిస్థితులు శ్రమకరముగనుండగలవు. శుభమూలక ధన వ్యయము, రాజాగ్రహమునకు గురియగుట, కీర్తిహాని కలుగును. చైత్ర బహుళం నుండి ద్వితీయ రాహువు, అష్టమ కేతువు కావున వృథా వైరములు, వ్యయములు, అధిక ప్రయాస కలుగును. శ్రమకరమయిన కాలము. వైశాఖ బహుళం నుండి శ్రావణ బహుళం వరకు కుజుడు అనుకూలుడు కానందున ఆరోగ్య విషయంలో జాగ్రత్తగనుండవలయును. పూర్వాభాద్ర వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు | నైధనతార యందు శని, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. ఉత్తరాభాద్ర వారికి ఆశ్వయుజ శు క్లం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు నైధనతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి నైధనతార యందు శని సంచరించుదురు. రేవతి వారికి ఆశ్వయుజ బహుళం నుండి నైధనతార యందు కేతు సంచారము కలదు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతి యొనర్చిన మేలు. ముఖ్యముగా గురు, రాహు, కేతువులకు శాంతి యొనర్చిన మేలు. హనుమత్పూజా ప్రదక్షిణములు, సుందరకాండ పారాయణము, సప్తశతీ పారాయణమొనర్చుట ద్వారా దోషములు తొలగి శ్రేయస్సునందగలరు.