Read more!

Ugadi Pacchadi & Special Recipes

 

ఉగాది పచ్చడి &

స్పెషల్ రెసిపీలు

Ugadi Special Recipes

 

ఉగాది వేడుక ఉగాది పచ్చడితోనే ప్రారంభమౌతుంది. కవిసమ్మేళనాలు, రాశిఫలాలు, పంచాంగ శ్రవణం, ఇతర పిండివంటలు ఏదయినా ఉగాది పచ్చడి తర్వాతే! ఉగాది పచ్చడిమీద వచ్చే జోకులు, కార్టూన్లు చూస్తే దిగులేస్తుంది. నిజానికి చేసే పద్ధతిలో చేస్తే ఉగాది పచ్చడి అంత రుచికరమైంది ఇంకోటి ఉండదు. కష్టనష్టాలకు సంకేతమైన వేపపూతను నామమాత్రంగా వేయాలి. అది కూడా మధ్యలో ఉండే మొగ్గ లేకుండా పూరేకలను మాత్రమే వేయాలి. అంతేమరి.. జీవితంలో చిన్నచిన్న చిక్కు సమస్యలు ఎదురైతే పరవాలేదు కానీ దుఖభాజనం అయితే భరించగలమా?! కనుక ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసినప్పటికీ ఎక్కువమంది చేసుకునే ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఉగాది పచ్చడి

Ugadi Pacchadi Preparation

కావలసిన పదార్థాలు

చింతపండు - 50 గ్రాములు

బెల్లం - 150 గ్రాములు

చిన్న సైజు మావిడికాయ - ఒకటి

మిరియాల పొడి, జీలకర్ర, వేపపూత, ఉప్పు - కొద్దిగా

అరటిపళ్ళు - రెండు

ద్రాక్ష పళ్ళు - 20

కొబ్బరికోరు - ఒక కప్పుడు

కమలాపండు - 1

తయారు చేసే పద్ధతి

కడిగి నానబెట్టుకున్న చింతపండును గుజ్జులా పిసికి, మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా కొన్ని నీళ్ళు పోసి కలపాలి. బెల్లం నూరి వేయాలి. ఉప్పు, జీలకర్ర, వేపపూత, మిరియాల పొడి, కొబ్బరికోరు వేయాలి. ద్రాక్ష, కమలా పళ్ళ గుజ్జు, అరటిపళ్ళ ముక్కలు కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి సిద్ధం కొన్ని ప్రాంతాల్లో మిరియాల పొడికి బదులు పచ్చి మిరపకాయలు, లేదా ఎండుకారం వేస్తారు. మొత్తానికి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి చాలా రుచిగా, ఇంకా తినాలనిపించేలా ఉంటుంది.

 

Ugadi Pacchadi Recipe, Srikhara Ugadi, Ugadi Pacchadi, Shadruchulu, Ugadi celebrations, Ugadi Recipe, Ugadi Greetings, Ugadi Rasi Phalalu, Ugadi Panchangam

 

అరటి ఆవడలు రెసిపీ

Arati Awada Recipe

కావలసిన పదార్థాలు

అరటికాయలు – 3

పెరుగు – అరకిలో

కరివేపాకు – 1 కట్ట

ఉప్పు – తగినంత

జీలకర్ర పొడి - 10 గ్రాములు

కారం – 10 గ్రాములు

పోపు దినుసులు – 10 గ్రాములు

రిఫైన్డ్ ఆయిల్ - తగినంత

తయారు చేసే పద్ధతి

వడ, ఆవడ మనకేం కొత్త కాదు. రకరకాల వడలు, ఆవడలు తింటూ ఉంటాం. వాటిల్లో అరటి ఆవడ రుచి మరింత ప్రత్యేకం. అందుకే అరటి ఆవడ రెసిపీ గురించి తెలుసుకుందాం. అరటికాయలు మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. ఉడికిన అరటికాయల తొక్కు తీసి, మెత్తగా మెదిపి దానికి తగినంత ఉప్పు , జీలకర్ర, కారంపొడి చేర్చివడలు వత్తి నూనెలో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పెరుగును బాగా కలియబెట్టి దానికి ఉప్పు చేర్చి, కరివేపాకు, పోపు దినుసులతో తాలింపు పెట్టి, కొంతసేపు నాననిస్తే సరి, రుచికరమైన అరటి ఆవడలు రెడీ!

 

andhra recipe avada preparation, ugadi special recipe arati awada, ugadi special recipes, andhra recipe arati awada, aratikaya awada, aratikaya avada preparation

 

కోవా కజ్జికాయ రెసిపీ

Kova Kajjikaya Recipe

కావలసిన పదార్థాలు

మైదా పిం డి – అరకిలో

పంచదార – కిలో

పాలకోవా - పావుకిలో 

జాపత్రి - 2 గ్రాములు

యాలకులు – 2 గ్రాములు

శనగపిండి – 50 గ్రాములు

వంట సోడా - పావు స్పూను

బేకింగ్ పౌడర్ – పావుస్పూను

నెయ్యి – 100 గ్రాములు

రిఫైన్డ్ ఆయిల్ - తగినంత

కోవా కజ్జికాయ రెసిపీ

ఇండియన్ స్వీట్లలో కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!

 

andhra recipe kajjikaya recipe, ugadi special kova kajjikaya, ugadi pratyeka vantalu, Indian sweet kajjikaya, ugadi festival special kajjikaya recipe