Read more!

తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

 

తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

 

 

 

 

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుగలు వైభవంగా జరుగుతున్నాయి. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను టిటిడి పాలకమండలి నిర్వహించి తిరుమాడ వీథులలో ఊరేగుతారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి ...
ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహన సేవ
ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు.
ఉదయం 11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగిస్తారు
మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై ఊరేగిస్తారు
మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు
మధ్యాహ్నం 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు
సాయంత్రం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు
సాయంత్రం 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.