ఈ రాశులు అంటే ఆంజనేయస్వామికి చాలా ఇష్టమట..!
ఈ రాశులు అంటే ఆంజనేయస్వామికి చాలా ఇష్టమట..!
ఆంజనేయస్వామి భారతీయ హిందూ మతంలో పూజించబడే దేవుడు. ఈయనను హనుమంతుడు, అంజనీపుత్రుడు, రామ బంటు, మారుకి అని చాలా విధాలుగా పిలుస్తారు. హిందూ పురాణాలను బాగా పరిశీలిస్తే ఆంజనేయస్వామిని ఒక సూపర్ పవర్ గా చెప్పవచ్చు. ఆంజనేయస్వామిని ఆరాధిస్తే భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. వాక్చాతుర్యం మెరుగవుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. అయితే ఆంజనేయస్వామికి స్వతహాగా కొన్ని రాశులు అంటే చాలా ఇష్టమట. ఆ రాశులు ఏంటో.. ఆ రాశులకు కలిగే శుభాలు ఏంటో తెలుసుకుంటే..
హనుమంతుడిని నిజంగా పూజించే ఎవరికి అయినా ఆయన శక్తి, ఆయన బలం ఏంటో అర్థం అవుతాయి. మనస్ఫూర్తిగా హనుమంతుడిని ఆరాధిస్తే హనుమంతుడు అనుగ్రహిస్తాడు. హనుమాన్ ఉపాసకులకు హనుమంతుడి శక్తి గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది. అయితే హనుమంతుడికి రాశులలో కొన్ని రాశులు అంటే స్వతహాగా చాలా ఇష్టమట. ఈ రాశుల వారికి హనుమంతుడి కృప వల్ల ఆర్థిక లాభం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా మూడు రాశులు ఉన్నాయి. వీరికి జీవితంలో సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయట.
మేష రాశి..
మేషరాశి వారికి హనుమంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందట. ఈ కారణంగా వారి జీవితంలో సమస్యలు తక్కువగా ఉంటాయట. ముఖ్యంగా మేష రాశి వారికి సంకల్ప శక్తి చాలా బలంగా ఉంటుందట. ఈ కారణంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని అంటున్నారు.
సింహ రాశి..
జ్యోతిష నమ్మకాల ప్రకారం హనుమంతుడి ఆశీస్సులు సింహ రాశి వారి మీద కూడా బాగా బలంగా ఉంటాయి. సింహ రాశి వారు ఏ పని తలపెట్టినా వారు చేసే పనిలో త్వరగా విజయాన్ని సాధించుకుంటారట. అంతే కాదు.. సింహ రాశి వారికి డబ్బు కొరత తక్కువగానే ఉంటుందని చెబుతారు.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయట. హనుమంతుని అనుగ్రహం వల్ల కుంభ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అంట. ప్రతి మంగళ వారం హనుమంతుడిని పూజించడం, హనుమంతుని స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల కుంభ రాశి వారి జీవితంలో ఆనందం మరింత పెరుగుతుంది.
పరిష్కారాలు..
హనుమంతుడికి కొన్ని పరిష్కారాలు చేయడం ద్వారా జీవితంలో చాలా సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఉంటారని అంటారు.
ప్రతి మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి దీపం వెలిగించాలి. తరువాత హనుమంతుడి విగ్రహం లేదా పటం ముందే కూర్చుని భక్తితో హనుమంతుడి మంత్రాన్ని పఠించాలి.
మంగళవారం రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. సింధూరం అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. సింధూరం సమర్పించి మల్లె పువ్వుల నూనెను కూడా సమర్పించాలి. ఇవి రెండూ హనుమంతుడికి చాలా ఇష్టం.
మంగళవారం రోజు హనుమంతుడి ఆలయంలో ఎర్ర జెండాను సమర్పించాలి. ఎరుపు రంగు జెండా, దాని మీద హనుమంతుని చిత్రం ఉండాలి. ఇది హనుమంతుడికి చాలా ఇష్టమైనది. సంపద పెరిగేలా చేస్తుంది.
మంగళవారం రోజు హనుమంతుడికి బూందీ లడ్డును నైవేద్యంగా సమర్పించాలి. బూందీ లడ్డూ అంటే హనుమంతుడికి చాలా ఇష్టం.
*రూపశ్రీ.